Cancel large notes
-
మళ్లీ నగదు కష్టాలు
⇒బ్యాంకుల్లో నగదు కొరత ⇒విత్‌డ్రాలపై పరిమితి ⇒ఆర్బీఐ నుంచి వచ్చే నిధుల్లో కోత ⇒ మందగించిన లావాదేవీలు ⇒మూతపడిన ఏటీఎం కేంద్రాలు జిల్లాలో మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. గతేడాది చివరిలో పెద్ద నోట్ల రద్దు తర్వాత జనం చాలా యాతన పడ్డారు. జనవరి తర్వాత క్రమేపీ నగదు నిల్వలు పెంచడంతో అవస్థలు తప్పాయి. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. కానీ మార్చి చివరి వారంలో తిరిగి నోట్ల కొరత ఎదురయింది. ఏ ఏటీఎంకు వెళ్లినా నగదు ఉండటం లేదు. బ్యాంకులకు వెళ్లి క్యూలో నిల్చుంటే విత్‌డ్రాపై పరిమితి విధించడం నిరాశకు గురిచేస్తోంది. జిల్లా ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్బీఐ నుంచి నిధులు రాకపోవడమే దీనికి కారణమని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. తిరుపతి (అలిపిరి) : బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడింది. తాజాగా విత్‌డ్రాలపై పరిమితి విధిస్తున్నాయి. జిల్లా అవసరాలకు వారానికి రూ.300 కోట్లు అవసరం. కానీ రిజర్వుబ్యాంకు నుంచి రూ.75 కోట్ల నుంచి రూ.125 కోట్లు మాత్రమే వస్తోందని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు నెలలుగా జాతీయ బ్యాంకు శాఖల లావాదేవీలు మందగించాయి. జిల్లా వ్యాప్తంగా 40 జాతీయ బ్యాంకులకు చెందిన 595 బ్యాంకు శాఖలు వున్నాయి. నగదు రహిత లావాదేవీలంటూ ఆర్బీఐ కోత విధించడంతో ఎస్బీఐ కూడా విత్‌డ్రాలపై పరిమితి విధించింది. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకర్లు లావాదేవీలు కొనసాగించలేక తల పట్టుకుంటున్నారు. డిపాజిట్లపై ఆధారపడి బ్యాంకు శాఖలు ఏరోజుకారోజు లావాదేవీలు కొనసాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నగదు లేక కొద్ది రోజులుగా ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. ఒకటో తారీఖు మొదటి వారంలో.. ప్రతి నెల ఒకటో తారీఖు, మొదటి వారంలో బ్యాంకులకు భారీగా నగదు అవసరమవుతుంది. 38వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రూ.400 కోట్లు, 26వేల మంది విశ్రాంత ఉద్యోగుల పింఛన్లకు రూ.250 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 3,90,720 మందికి రూ.47 కోట్లు అవసరం. సామాన్య ఖాతాదారుల లావాదేవీల కోసం మరో రూ.300 కోట్లు అవసరం. అంటే జిల్లా అవసరాలకు వెయ్యి కోట్ల మేర నగదు అవసరం. గడచిన నెలలో ఆర్బీఐ నుంచి రూ.125 కోట్లు మాత్రమే చేరింది. ఈనెల మొదటి వారం ముగుస్తున్నా ఇంత వరకు జిల్లాకు చిల్లిగవ్వకూడా రాలేదు. దీంతో జాతీయ బ్యాంకుల లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. గురువారం ఎస్బీఐ పలు శాఖల్లో నగదు విత్‌డ్రా పరిమితిని రూ.5వేలకు కుదించారు. ఏటీఎంలలో నో క్యాష్ జిల్లాలోని 709 ఏటీఎం కేంద్రాల్లో 10 శాతం కూడా పనిచేయడం లేదు. జిల్లాకు చేరుతున్న అరకొర నగదు బ్యాంకు లావాదేవీలకే సరిపోవడం లేదు. బ్యాంకర్లు ఏటీఎంల నిర్వహణ జోలికి వెళ్లడం లేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పలు ఏటీఎం కేంద్రాలు మూతబడి ఉన్నాయి. అత్యవసరాలకూ చేతికి సొమ్ము రాకపోవడంతో జనం ఆందోళనచెందుతున్నారు. డబ్బులు ఎకౌంటులో ఉన్నా అప్పు తెచ్చానని పద్మావతీపురానికి చెందిన రామారావు వాపోయాడు. ఆర్బీఐ నుంచి అధిక మొత్తంలో నగదు అందే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. -
ఫ్యాన్సీ..నో క్రేజీ!
లక్కీ నెంబర్లపై తగ్గిన మోజు 40 శాతం తగ్గిన ఆర్టీఏ ఆదాయం ఆల్ నైన్స్ నెంబర్‌కు..గతేడాది రూ.10 లక్షలు..ఈసారి రూ.2.35 లక్షలే.. ‘అదృష్టానికి’ అడ్డంకిగా పెద్ద నోట్ల రద్దు తగ్గిన హై ఎండ్ వాహనాల అమ్మకాలు సిటీబ్యూరో : 9, 1, 999, 9999, 786, 6,666, 1111 ..... ఇలాంటి ఫ్యాన్సీ, లక్కీ నెంబర్లపై వాహనదారులకు ఉండే క్రేజ్ మాటల్లో చెప్పలేం. పెద్దఎత్తున పోటీకి దిగుతారు. వేలంలో రూ.లక్షలు చెల్లించేందుకు సిద్ధమవుతారు. ఆ సీరీస్‌లో కోరుకున్న నెంబర్ రాలేదంటే మరో సీరీస్ కోసం ఎదురు చూస్తారు. ఏడాదైనా సరే నచ్చిన నెంబర్ చేతికి వచ్చేదాకా ఆగుతారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. గత రెండు నెలలుగా ఫ్యాన్సీ నెంబర్లపై ఆసక్తి తగ్గింది. రూ.లక్షలు వెచ్చించేందుకు వాహన యజమానులు వెనుకడుగు వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. నెంబర్లపై ఎక్కువ మొత్తం ఖర్చు చేసేందుకు సాహసించడం లేదు. దీంతో రవాణాశాఖ ఆదాయంపై కూడా గణనీయమైన ప్రభావం పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాహనాల నెంబర్లపైన వచ్చే ఆదాయం 40 శాతం వరకు పడిపోయినట్లు అంచనా. సంపన్న వర్గాలు ఎక్కువ కొనుగోలు చేసే హై ఎండ్ వాహనాల అమ్మకాలు కూడా తగ్గడం ఇందుకు మరో కారణం. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా... ∙గత సంవత్సరం ఏప్రిల్ నెలలో ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటల్లో ‘టీఎస్ 09 ఈఎల్ 9999’ అనే నెంబర్ కోసం సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.10.50 లక్షలు. సోమవారం నిర్వహించిన వేలం పాటల్లో అదే నెంబర్ ‘టీఎస్ 09 ఈఆర్ 9999’ కోసం ఆర్ఎస్ బ్రదర్స్ వేలంలో చెల్లించిన మొత్తం కేవలం రూ.2.35 లక్షలు. ► ఒక్క ఖైరతాబాద్‌లోనే కాదు. అత్తాపూర్, మలక్‌పేట్, సికింద్రాబాద్ తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో గతేడాది ఇలాంటి నెంబర్ల కోసం వాహనదారులు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు చెల్లించారు. కానీ ఇప్పుడు డిమాండ్ బాగా పడిపోయింది. గత సంవత్సరం రూ.15 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చే నెంబర్ల సీరీస్‌పై రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చేది. తాజాగా నిర్వహించిన వేలం పాటల్లో రూ.11.66 లక్షల ఆదాయం మాత్రమే లభించింది. మొత్తంగా ఈ ఏడాది కాలంలో వాహనాల ఫ్యాన్సీ నెంబర్లపైన ఆదాయం 40 శాతం వరకు పడిపోయినట్లు రవాణావర్గాలు అంచనా వేస్తున్నాయి. అదృష్ట సంఖ్యలు, రైజింగ్ నెంబర్లపై ఇష్టం ఉన్నా...వేలంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ‘హైఎండ్’ అమ్మకాలు కూడా తగ్గుముఖం... ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో విక్రయాలు జరిగే బీఎండబ్ల్యూ, ల్యాండ్‌రోవర్, ల్యాండ్‌క్రూజర్, ఆడి వంటి ఖరీదైన కార్ల అమ్మకాలు ఈసారి సగానికి సగం పడిపోయాయి. స్పోర్ట్స్ బైక్‌లు కూడా తగ్గాయి. ఒకవైపు నోట్ల రద్దు, మరోవైపు ఏడాది చివరి రోజులు కావడంతో అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్క హై ఎండ్ మాత్రమే కాకుండా మధ్యతరగతి, వేతన జీవులు కొనుగోలు చేసే స్విఫ్ట్ డిజైర్ వంటి వాహనాల అమ్మకాలు కూడా తగ్గాయి. నగరంలోని అన్ని ఆటోమోబైల్ షోరూమ్‌లలో ప్రతి నెలా సుమారు 25 వేల నుంచి 27 వేల వరకు వాహన విక్రయాలు జరుగుతాయి. నోట్ల రద్దు కారణంగా ఈ సంఖ్య ఏకంగా 15 వేలకు పడిపోయింది. వీటిలో హై ఎండ్, మధ్యతరగతి వర్గాలు విరివిగా కొనుగోలు చేసే వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. సాధారణ వినియోగదారులు కొనుగోలు చేసే బైక్‌ల అమ్మకాలు మాత్రం పెద్దగా తగ్గుముఖం పట్టకపోవడం గమనార్హం. ఇలా వాహన విక్రయాలు తగ్గడం కూడా ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్లపైన ప్రతికూల ప్రభావం చూపింది. హోదా కోసం... అదృష్ట సంఖ్యలుగా భావించే నెంబర్ల కోసం కొందరు పోటీకి దిగితే, సామాజిక హోదా కోసం, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నెంబర్ల కోసం పోటీ పడుతున్నారు. ► ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరీస్ ప్రారంభమవుతుంది. మొత్తం నెంబర్లలో 2500 వరకు ఫ్యాన్సీ నెంబర్లు ఉంటాయి. ఈ నెంబర్ల కోసం అనూహ్యమైన పోటీ ఉంటుంది. గతంలో ఒక నెంబర్ కోసం సగటున 10 మంది పోటీ పడితే ఇప్పుడు ఆ సంఖ్య 6 కు పడిపోయింది. సోమవారం నిర్వహించిన వేలంలో పలికిన ధరలు ఇలా... ► టీఎస్ 09 ఈఆర్ 9999 – రూ.2.35 లక్షలు ► టీఎస్ 09 ఈఎస్ 0007 – రూ.1.47 లక్షలు ► టీఎస్09 ఈఎస్ 005 – రూ.1.35 లక్షలు -
‘క్యాబేజా’ర్
ధరలేక నిండా మునిగిన క్యాబేజీ రైతు కొనేవారు లేక తోటల్లోనే పంట పెద్దనోట్ల రద్దుతో పడిపోయిన వ్యాపారం ఈ ఒక్క సీజన్లోనే రూ.2 కోట్లదాకా నష్టం పంట ఏపుగా పెరిగిందని మురిసిపోయారు. దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చిందని సంబరపడ్డారు. ఇక కష్టాలు తీరినట్టేనని కాలరెగరేశారు. కానీ పెద్దనోట్ల రద్దు ప్రభావం వారి జీవితాలను సర్వనాశనం చేసింది. క్యాబేజీ వ్యాపారాన్ని కోలుకోనీయకుండా చేసింది. పంట కోతకొచ్చినా కొనేవాళ్లు కరువవ్వడంతో పొలాల్లోనే వదిలేశారు. పెట్టుబడి రాక.. అప్పులు తీరక రైతులు పుట్టెడు కష్టాల్లో కూరుకుపోయారు. పలమనేరు : జిల్లాలోని పడమటి మండలాల్లో గత ఏడాది క్యాబేజీ సాగుచేసిన రైతులు లక్షాధికారులయ్యారు. ఈ దఫా పంట సాగు విస్తీర్ణం పెరిగినా.. ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా కోలుకోలేకపోతున్నారు. గత నవంబర్‌లో పెద్దనోట్ల రద్దుతో మొదలైన కష్టాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా పంట సాగువిస్తీర్ణం జిల్లాలో క్యాబేజీసాగు మదనపల్లె డివిజన్లో ఎక్కువ. ఇక్కడి శీతలవాతావరణం పంటసాగుకు అనుకూలం. పంట కొనేదిక్కు లేదు గత ఏడాది ధరలు చూసి ఈదఫా రెండున్నరెకరాల్లో క్యాబేజీ వేశా. మొత్తం రూ.1.20 లక్షలదాకా ఖర్చుపెట్టా. పంట దిగుబడి పెరిగింది. ధరతోపాటు కొనేవారు లేరు. పంట మొత్తం పొలంలోనే వదిలేశా. – ఉమాశంకర్‌రెడ్డి, రైతు, నక్కపల్లె, పలమనేరు మండలంపుంగనూరు, రామసముద్రం, పలమనేరు, గంగవరం, వీకోట, బైరెడ్డిపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పంట ఎక్కువగా సాగవుతోంది. పలమనేరు డివిజన్ పరిధిలో ఏటా సాధారణ పంట సాగు విస్తీర్ణం వెయ్యి ఎకరాలు కాగా ఈదఫా 1,625 ఎకరాల్లో సాగైంది. వాతావరణం అనుకూలించడంతో ఎకరాకు 30 టన్నులదాకా దిగుబడి వచ్చింది. రూ.రెండు కోట్లదాకా నష్టం ఎకరా విస్తీర్ణంలో పంట సాగుచేయాలంటే రూ.60 వేలదాకా ఖర్చవతుంది. ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తే ప్రస్తుత ధర ప్రకారం (టన్ను రూ.1,600) రూ.48 వేలు దక్కుతుంది. ఆ లెక్కన ఎకరాకు రూ.12వేలు నష్టం. డివిజన్ పరిధిలోని 1,625 ఎకరాలకు రూ.2కోట్ల దాకా నష్టం వాటిల్లింది. కొనుగోలుకు ముందుకురాని వ్యాపారులు స్థానికంగా పండే క్యాబేజీకి కోల్కత్తా, భువనేశ్వర్, ఢిల్లీ, కటక్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడి నుంచి ఏటా వ్యాపారులు వచ్చి పొలాలవద్దే పంటను కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది నోట్ల ఎఫెక్ట్‌తో బ్యాంకుల నుంచి నగదుపై ఆంక్షలుండడంతో వ్యాపారులు రావడం మానేశారు. రైతులకు చెక్కులిచ్చి పంట కొన్నా ఇక్కడి నుంచి సరుకును రవాణా చేయడానికి వీలు కావడం లేదు. కోల్‌కత్తాకు లారీ లోడ్డు వెళ్లాలంటే డీజల్‌కు రూ.40 వేలు, డ్రైవర్ బత్తా, టోల్గేట్లు ఇతరత్రాలకు రూ.60 వేలు ఖర్చవుతోంది. నోట్ల రద్దు కారణంగా వ్యాపారులు ఈ మొత్తాన్ని సమకూర్చలేకపోతున్నారు. ఫలితంగా రవాణా పూర్తిగా ఆగిపోయింది. చేలల్లోనే పంట క్యాబేజీని కొనేవారులేరు. పంట చేలల్లోనే వదిలేశారు. ఒబ్బిడి గడువుమీరి చాలా తోటల్లో పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. స్థానికంగా కొంతవరకు అమ్ముడైనా సరుకు మొత్తం కొనేవారు లేరు. -
క్యాష్‌లెస్ కాదు.. లెస్ క్యాష్
లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలి ట్రెయినీ కలెక్టర్ రాహుల్‌రాజ్ డిచ్పల్లి : క్యాష్‌లెస్ కాదు.. లెస్‌క్యాష్ లావాదేవీలు అలవర్చుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ట్రెయినీ కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం సాయంత్రం డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు, బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్ష్యరాస్యులు అధికంగా ఉన్నారని అన్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో వంద శాతం క్యాష్‌లెస్ లావాదేవీలు ఆచరణ సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత ఉందని, ప్రజలు డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లలో పేటీఎం, ఫ్రీచార్జ్, ఎస్బీఐ బడ్డీ, ఇతర యాప్‌లు డౌన్లోడ్ చేయగానే సరిపోదని, వాటిని సురక్షితంగా ఏ విధంగా వాడాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 15 వరకు డిచ్పల్లి మండలంలోని బర్ధిపూర్, అమృతాపూర్, నర్సింగ్‌పూర్, సుద్దులం గ్రామాలతో పాటు ఇందల్వాయి మండలంలోని తిర్మన్‌పల్లి, చంద్రాయన్పల్లి గ్రామాలను లెస్‌క్యాష్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో ఎంపిక చేసిన తొమ్మిది గ్రామాలలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి చేసి, ఈ నెల 20 లోగా బహిరంగ మలవిసర్జన లేని (ఓడీఎఫ్) గ్రామాలుగా ప్రకటించాలని రాహుల్‌రాజ్ అన్నారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ భరత్, ఎంపీడీవో మర్రి సురేందర్, ఈవోపీఆర్డీ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ గణేశ్, పీఆర్ ఏఈ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
బెల్లం మార్కెట్‌కు సంక్రాంతి కళ
ఈ సీజన్లో అధిక లావాదేవీలు లోటును పూడ్చుకునే యత్నం అనకాపల్లి: బెల్లం మార్కెట్లో సోమవారం సంక్రాంతి పండుగ సందడి కనిపించింది. ఈ సీజన్‌కు రికార్డు స్థాయిలో బెల్లం దిమ్మలు వచ్చాయి. మార్కెట్లో 38 వేల 222 దిమ్మల లావాదేవీలు జరిగాయి. సంక్రాం తి ముందు బెల్లం తయారీ ఊపందుకుంటుంది. సంక్రాంతి పండుగకు సంబంధించిన ఆర్థిక అవసరాల కోసం బెల్లం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వినియోగిస్తారు. వాస్తవానికి జనవరి నెలలో గతంలో 50 వేల నుంచి 80 వేల దిమ్మల వరకు వచ్చిన సందర్భాలు వున్నాయి. అయితే ఈ సీజ బెల్లం వ్యాపారానికి ఎదురవుతున్న ప్రతిబంధకాల ప్రభావం తయారీపై కూడా పడింది. పెద్దనోట్ల రద్దు కారణంగా ఆర్థికపరమైన లావాదేవీలకు ఇబ్బందులు ఎదురవడంతో కొద్దిరోజులపాటు మార్కెట్లో లావాదేవీలు సైతం నిలిపివేశారు. చెరకు రైతుల భవితవ్యాన్ని దష్టిలో పెట్టుకొని వర్తకులు తప్పనిసరి పరిస్థితుల్లో కూడా వ్యాపారాలు ప్రారంభించారు. అయితే ఏరోజుకారోజు బెల్లం అమ్మకాలు జరపగా వచ్చిన సొమ్మును పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేకపోయారు. గోరుచుట్టుపై రోకటిపోటు చందంగా అప్పటికీ అంతంతమాత్రంగా జరుగుతున్న బెల్లం వ్యాపారంపై ఫుడ్ కంట్రోల్ అధికారులు మరింత ప్రభావాన్ని చూపారు. తెల్లబెల్లం తయారీలో హైడ్రాస్ వాడుతున్నట్లు వచ్చిన ప్రచారంపై ఫుడ్‌కంట్రోల్ అధికారులు అనకాపల్లి బెల్లం మార్కెట్లో గత నెలలో దాడులు జరిపారు. ఈ కారణంగా కూడా రైతులు బెల్లం తయారీకి కాస్త వెనుకంజ వేశారు. అయితే ఆ రెండు రకాల చేదు అనుభవాల నుంచి బయటపడిన బెల్లం రైతులు ఇపుడు బెల్లం వంటకాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించారు. భోగి, సంక్రాంతి, కనుమతోపాటు తదుపరి కొద్ది రోజులు బెల్లం వంటకాలను రైతులు నిలిపివేస్తారు. భోగికి ముందు వండిన బెల్లాన్ని విక్రయించడం ద్వారా పండుగకు అవసరమైన సొమ్మును పొందేందుకు రైతులు బెల్లం తయారీ జోరు పెంచారు. ఈ క్రమంలోనే 2016–17 సీజన్‌కు సంబంధించి సోమవారం బెల్లం లావాదేవీలు రికార్డుగా నిలిచాయి. ఇదే నెల రెండో తేదీన మార్కెట్‌కు 30,915 దిమ్మలు వచ్చాయి. అయితే ధరలు మాత్రం రైతులను తీవ్రంగా నిరాశపరిచాయి. మొదటి రకం క్వింటాల్‌కు గరిష్టంగా 3,740 రూపాయలు పలకగా మూడో రకం కనిష్టంగా 2,300 రూపాయలు పలికింది. గత వారంతో పోల్చితే క్విం టాల్‌కు మొదటి రకం 110 రూపాయలు తగ్గగా మూడో రకం 100 రూపాయలు తగ్గింది. నిరాశతో రైతులు వున్నప్పటికీ బెల్లం అమ్మకాలపై మాత్రం పూర్తిస్థాయిలోనే ఉత్సాహం చూపించారు. -
మా పెళ్లికి దారేది?
శుభలేఖ చూపించినా డబ్బు లేదంటున్న బ్యాంకర్లు దాచుకున్న నగదు తీసుకునేందుకూ కష్టాలే ఇలా అయితే వివాహం ఎలా చేసుకోవాలి అని ప్రశ్నిస్తున్న వధూవరులు తంబళ్లపల్లె: వారికి ఈనెల 9వ తేదీ వివాహం జరగాల్సి ఉంది. దానికోసం కూడబెట్టుకున్న డబ్బును పెద్దనోట్ల రద్దు కారణంగా బ్యాంకులో డిపాజిట్ చేశారు. విత్‌డ్రా విషయంలో రిజర్వ్ బ్యాంకు పెట్టిన ఆంక్షలతో అవసరానికి డబ్బు అందడం లేదు. వివాహ కార్యక్రమాలను ప్రత్యేకంగా తీసుకుని రూ.50వేల వరకు డ్రా చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థారుులో పరిస్థితి భిన్నంగా ఉంది. బ్యాంకులో డబ్బు లేదని, రూ.5వేలకు మించి ఇవ్వలేదని మేనేజర్ చెప్పడంతో ఏమి చేయాలో తోచక ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని ఎర్రసానిపల్లె పంచాయతీ మూలపల్లెకు చెందిన రాధమ్మ కుమార్తె సి.మాధవికి, కోటకొండ పంచాయతీ మద్దిరాళ్లపల్లెకు చెందిన గాలి చిన్నరెడ్డెప్ప, నాగమణెమ్మ కుమారుడు గంగులప్పకు డిసెంబర్ 9వ తేదీన పెళ్లి జరిపించేందుకు పెద్దలు నిశ్చ రుుంచారు. బుధవారం వారు తంబళ్లపల్లె ఇండియన్ బ్యాంకుకు డబ్బు కోసం వచ్చారు. పెళ్లి పత్రిక చూపి బ్యాంకు మేనేజర్‌ను రూ.20వేలు ఇవ్వాలని కోరారు. రూ.5వేలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో ‘పెళ్లి ఎలా చేసుకోవాలిరా దేవుడా’ అంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. -
చాయ్‌కీ పైసల్లేవ్...
బ్యాంకులో క్యూలో నిల్చోలేక.. ఓ పక్కన కూర్చొని ఆగ్రహంతో చూస్తున్న ఈ వృద్ధురాలి పేరు హనుమమ్మ. వయసు 75 సంవత్సరాలు. బంజారాహిల్స్ నందినగర్‌లో ఉంటోంది. నెలవారీగా తీసుకునే రూ.వెరుు్య పింఛన్ డబ్బుల కోసం ఆమె గత ఐదురోజులుగా స్థానిక ఆంధ్రా బ్యాంకు చుట్టూ తిరుగుతోంది. కానీ నగదు లేదంటూ బ్యాంకు సిబ్బంది పింఛన్ డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో మంగళవారం ఉదయం దిక్కుతోచక బ్యాంకులోనే కూర్చుండి పోరుుంది. ‘ఇంట్లో బియ్యం లేవు. సరుకుల్లేవ్. కనీసం చాయ్ తాగేందుకు కూడ పైసల్లేవ్ బిడ్డా... ఎట్ల బతకాలే’ అంటూ వాపోరుుంది... ఇది హనుమమ్మ ఒక్కరి సమస్యే కాదు.. పెద్ద నోట్ల రద్దు కారణంగా నగరంలో లక్షలాది మంది నిరుపేదలు ఇలాంటి ఇక్కట్లే ఎదుర్కొంటున్నారు. -
రియల్‌కు ‘పెద్ద’ షాక్!
30 శాతం పడిపోరుున ధరలు పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపని ప్రజలు రిజిస్ట్రేషన్లకు వ్యాపారుల ఒత్తిడి యాచారం: రియల్ వ్యాపారానికి ‘పెద్ద’ షాక్ తగిలింది. ప్లాట్ల ధరలు నెల క్రితంతో పోలిస్తే 30 శాతానికి పైగా పడిపోయారుు. స్థానికంగా ఫార్మాసిటీ ఏర్పాటు కావడం.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తున్న మండలంలోని వివిధ గ్రామాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటారుు. యాచారం, మాల్, గునుగల్, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు చేశారు. దీనికోసం రూ.కోట్లలో ఖర్చు చేశారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యాచారం, మాల్ కేంద్రాల్లోని ప్లాట్లు రోజుకు 50 నుంచి 100 వరకు రిజిస్ట్రేషన్ చేసేవారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో నాలుగు రోజులుగా పూర్తిగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయారుు. డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలూ మూత పడ్డారుు. పడిపోరుున ధరలు యాచారం, మాల్ కేంద్రాల్లో 60కి పైగా వెంచర్లను ఏర్పాటు చేశారు. యాచారంలో గజం ధర రూ. 2 వేల నుంచి రూ.10 వేలకు పైగా ఉండగా... మాల్లో గజం ధర రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. యాచారం, మాల్, నందివనపర్తి, గునుగల్, తక్కళ్లపల్లి, నల్లవెల్లి, తమ్మలోనిగూడ, చౌదర్పల్లి తదితర గ్రామాల్లో వందలాది ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు భారీగా అడ్వాన్సలు ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు.. భవిష్యత్తులో ధరలు మరింత పతనమవుతాయనే బెంగతో వ్యాపారులు అడ్వాన్సులు ఇచ్చిన వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు. కానీ అటు నుంచి స్పందన ఉండడం లేదు. యాచారం, మాల్ కేంద్రాల్లోనే ప్రజలు రూ.15 కోట్లకు పైగా అడ్వాన్సలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రిజిస్ట్రేషన్లకు సిద్ధమవుతున్న వారు పెద్ద నోట్లు ఇస్తామని చెబుతుండడంతో వ్యాపారులు కంగుతింటున్నారు. వ్యాపారం పడిపోరుుంది పెద్ద నోట్ల రద్దుతో రియల్ వ్యాపారం పూర్తిగా పడిపోరుుంది. గత పదేళ్లుగా మాల్ పరిసరాల్లో భూములు, ప్లాట్లు ధరలు పెరగడమే కానీ తగ్గడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో నాలుగు రోజులుగా ప్లాట్లు, భూముల ధరలు అమాంతం పడిపోయారుు. మరింత పడిపోతాయనే భయంతో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. కొనుగోలుదారులు తమకు సమయం కావాలని...లేదంటే అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయాలని కోరుతున్నారు. - పడకంటి శేఖర్‌గౌడ్, మాల్