capital acquisition
-
వైజాగ్ స్టీల్‌కు రూ.1,650 కోట్లు.. ఎల్ అండ్ టీకి ప్రాజెక్ట్‌లు
నిర్వహణ, ఆర్థికపరమైన సవాళ్లతో సతమతమవుతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు (వైజాగ్ స్టీల్) రూ.1,650 కోట్లు సమకూర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ తెలిపింది. సంస్థ కార్యకలాపాలు యథావిధంగా కొనసాగేలా తోడ్పాటు అందించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న రూ.500 కోట్లు ఈక్విటీ కింద, సెప్టెంబర్ 27న రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద అందించినట్లు పేర్కొంది. సంస్థ సుస్థిరంగా నిలదొక్కుకోవడంపై ఎస్‌బీఐక్యాప్స్ ఒక నివేదికను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఇదీ చదవండి: పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!ఎల్అండ్టీకి భారీ ప్రాజెక్టులుఅధిక వోల్టేజీ విద్యుత్ గ్రిడ్లను విస్తరించడం, బలోపేతం చేయడం కోసం మధ్యప్రాచ్య, ఆఫ్రికాలో ప్రధాన ప్రాజెక్టులను దక్కించుకున్నట్టు మౌలిక రంగ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ విభాగం ఈ ఆర్డర్లను పొందినట్లు కంపెనీ తెలిపింది. రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల శ్రేణిలో ఆర్డర్లు ప్రధానమైనవిగా కంపెనీ వర్గీకరించింది. కాగా, కెన్యా కోసం కొత్త నేషనల్ సిస్టమ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తారు. ప్రముఖ ఒరిజినల్ పరికరాల తయారీ కంపెనీ భాగస్వామ్యంలోని కన్సార్షియం ఈ ఆర్డర్‌ను అందుకుంది. మధ్యప్రాచ్యంలోని సౌదీ అరేబియాలో అధిక వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ల టర్న్‌కీ నిర్మాణం చేపడతారు. ఖతార్‌లో కొనసాగుతున్న విద్యుత్ వ్యవస్థ విస్తరణ ప్రాజెక్ట్‌లో అదనపు గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు. -
ఈ కంపెనీలు 60 సెకన్లకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా?
ఓ ఉద్యోగి నెల సంపాదన ఎంత ఉండొచ్చు. మహా అయితే నెలకు 20 నుంచి 30 వేలు ఉంటే..మరి మన దేశంలో దిగ్గజ కంపెనీలు నెలకు కాదు గంటకు ఎంత సంపాదిస్తున్నాయో తెలుసా? ఇటీవల ఆయా కంపెనీలు, ప్రముఖుల ఆదాయాలపై సర్వే నిర్వహించే ఫైన్ షాట్స్ సంస్థ..ఈ సారి మనదేశంలో పలు దిగ్గజ సంస్థలు నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాయో తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించింది. స్టాక్ మార్కెట్లో కంపెనీల వ్యాల్యూ ఆధారంగా రిపోర్ట్‌ను విడుదల చేసింది. అందులో మనదేశానికి పలు కంపెనీలు నిమిషానికి సుమారు రూ.10లక్షలు అర్జించడం గమనార్హం. వాటిలో భారత్ పెట్రోలియం నిమిషానికి రూ.3.7లక్షల్ని సంపాదిస్తుంది. ఓఎన్జీసీ నిమిషానికి రూ.3.9లక్షల్ని అర్జిస్తుంది ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ నిమిషానికి రూ.3.9లక్షల్ని సంపాదిస్తుంది. హెచ్డీఎఫ్సీ నిమిషానికి రూ.3.56లక్షల్ని సంపాదిస్తుంది. ఇన్ఫోసిస్ నిమిషానికి రూ.3.68లక్షల్ని సంపాదిస్తుంది. ఇండియన్ ఆయిల్ కంపెనీ నిమిషానికి రూ.4.14లక్షలు సంపాదిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిమిషానికి రూ.4.24లక్షల్ని సంపాదిస్తుంది హెచ్డీఎఫ్సీ నిమిషానికి రూ.6.5లక్షల్ని సంపాదిస్తుంది టీసీఎస్ కంపెనీ నిమిషానికి రూ.6.17లక్షల్ని సంపాదిస్తుంది. రిలయన్స్ సంస్థ నిమిషానికి రూ.9.34లక్షల్ని సంపాదిస్తూ ప్రదమ స్థానంలో నిలిచింది. -
రాజధాని గ్రామాల్లో భూసేకరణపై త్వరలో నిర్ణయం
మంత్రి ప్రత్తిపాటి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూసేకరణ ఉంటుందా? ఉండదా? అనే అంశాన్ని 15 రోజుల్లో తేలుస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. ఇప్పటివరకూ సమీకరించిన 33 వేల ఎకరాలతో పాటు మరో 1,000 ఎకరాలు అవసరమని తెలిపారు. అయితే దీనికి భూసేకరణ ఉండబోదని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆదివారం మంత్రి ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు. రైతులతో ఒప్పందం చేసుకునే విషయంలో అఫిడవిట్లలో గందరగోళం లేకుండా ఏకపత్రం (సింగిల్ పేపరు) విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. త్వరలో వ్యవసాయ పోస్టుల భర్తీ రాష్ట్రంలో త్వరలో వ్యవసాయశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయనున్ననట్లు మంత్రి ప్రకటించారు. ఇవి వ్యవసాయ, ఉద్యానవన శాఖల్లో ఉన్నాయన్నారు. వాటిని వచ్చే మార్చిలోగా భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు. వ్యవసాయపరంగా ఐదు లక్షల ఎకరాల్లో బిందు, తుంపర సేద్యం అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యాన పంటల రైతుల సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబరును మంత్రి ప్రారంభించారు. 1800-425-2960 నెంబరుకు ఫోన్ చేసి రైతులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవ చ్చన్నారు. ఉద్యానవన రైతులకు ‘మాఫీ’ రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయిన ఉద్యానవన పంటల రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణ మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపల్ శాఖ అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ ఆమోదానికి పంపింది. ఇది రుణ మాఫీ పథకం కిందకు రాదంటూ ఆర్థిక శాఖ తిరస్కరించింది. మున్సిపల్ శాఖ నిధులనుంచే మాఫీ చేసుకోవాలని సూచించింది. రాజధానిలో భూములు కోల్పోయిన రైతులకు 5,000 ఎకరాల్లో ఉద్యానవన పంటలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. వారికి మాఫీ వర్తించనుంది. 25 లోగా అమలు: నారాయణ తాడికొండ: రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన గుంటూరు జిల్లాలోని 29 గ్రామాల రైతులందరికీ ఈనెల 25వ తేదీలోగా ఒకేసారి రూ.1.5 లక్షల రుణమాఫీ చేస్తామని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. సోమవారం తుళ్లూరులో బ్యాంకు అధికారులతో ఆయన మాట్లాడారు. 3,450 ఎకరాలకు గాను 2,616 మంది రైతులకు రూ.9.35కోట్లకు కౌలు డీడీలను ఇచ్చామన్నారు. ‘సీఆర్డీఏ’పై విచారణ వాయిదా సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. సీఆర్డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధమే కాకుండా, ఏపీ విభజన చట్టానికి కూడా వ్యతిరేకమంటూ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాల్‌రావు, జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, సీనియర్ న్యాయవాది సి.సదాశివరెడ్డి గత వారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. వ్యాజ్యంపై వాదనలు వినిపించేందుకు వీలుగా విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి కోరడంతో, ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.