car registration
-
భారీ షాక్: పాత కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు భారీగా పెంపు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లకు మించి పాతబడిన కార్ల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవడానికి భారీగా చార్జీలు చెల్లించుకోవాల్సి రానుంది. ప్రస్తుత స్థాయికి ఎనిమిది రెట్లు అధికంగా కట్టాల్సి వస్తుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం 15 ఏళ్లు పైబడిన కార్ల రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 600గా ఉంది. ఇక పాత బైక్‌ల రెన్యువల్ కోసం రూ. 1,000 కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతమిది రూ. 300గా ఉంది. మరోవైపు, 15 ఏళ్లు పైబడిన బస్సు లేదా ట్రక్కు ఫిట్నెస్ రెన్యువల్ సర్టిఫికెట్ కోసం రూ. 12,500 (ప్రస్తుతం రూ. 1,500), మధ్యస్థాయి గూడ్స్ లేదా ప్యాసింజర్ వాహనానికి రూ. 10,000 చార్జీలు వర్తిస్తాయి. దిగుమతి చేసుకున్న బైక్‌లకు రూ. 10,000, కార్లకు రూ.40,000 కట్టాల్సి ఉంటుంది. అదనం.. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోవడంలో జాప్యం జరిగితే రోజుకు రూ. 50 చొప్పున అదనంగా ఫీజు వసూలు చేస్తారు. ఒకవేళ స్మార్ట్ కార్డ్ తరహా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావాలంటే అదనంగా రూ. 200 కట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేసుకోవడంలో జాప్యం జరిగితే ప్రతి నెలకు రూ. 300 చొప్పున అదనంగా ఫీజు చెల్లించాలి. అదే వాణిజ్య వాహనాలకైతే ఇది రూ. 500. చదవండి: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు! -
ఆర్టీఏ కార్యాలయంలో మహేష్ బాబు
సాక్షి, హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం ఖైరతాబాదులోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఆయన తన కారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్వయంగా వాహనాన్ని డ్రైవ్ చేసుకుని వచ్చారు. అనంతరం మహేష్ బాబు వేలిముద్ర పెట్టి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కాగా ప్రిన్స్ ఆర్టీఏ కార్యాలయానికి రావడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. మరోవైపు మహేష్ బాబు ఆర్టీఏ ఆఫీస్‌కు వచ్చాడని తెలుసుకొని పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఇక ఆర్టీఏ ఉద్యోగులు కూడా మహేష్‌తో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. -
ఆర్టీఏ కార్యాలయంలో మహేష్ బాబు
-
ఆ కారు రిజిస్ట్రేషన్‌కే రూ. 1.6 కోట్లు!!
-
ఆ కారు రిజిస్ట్రేషన్‌కే రూ. 1.6 కోట్లు!!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ముంబైలో ఓ కారు రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ కారు రిజిస్ట్రేషన్ ఫీజుగానే ఆయన చెల్లించిన మొత్తం అక్షరాలా.. రూ. 1.6 కోట్లు!! బీఎండబ్ల్యు 7 సిరీస్ కారును ఆయన ఇటీవలే కొనుగోలు చేశారు. సాధారణంగా తాము నిబంధనల ప్రకారం వాహనం విలువలో 20 శాతం మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేస్తామని ఆ శాఖ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఆ లెక్కన ఆ కారు విలువ దాదాపు 8 కోట్ల రూపాయలు. అయితే అది కేవలం కారు ఖర్చు మాత్రమే కాకపోవచ్చని, దానికి చేసిన ఇతర హంగుల వల్ల కూడా ఆ ఖరీదు పెరిగి ఉండొచ్చని అంటున్నారు. ఈ బీఎండబ్ల్యు కారు పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్. దాని ఛాసిస్‌తో పాటు అద్దాల మీద కూడా ఎలాంటి ఆయుధాల దాడి ప్రభావం ఏమాత్రం ఉండబోదు. వాస్తవానికి అంబానీ కొన్న బీఎండబ్ల్యు 760ఐ కారు ఖరీదు రూ. 1.9 కోట్లు మాత్రమే. కానీ దానికి జర్మనీలో చేయించిన బుల్లెట్‌ప్రూఫ్.. ఇతర సదుపాయాలు అన్నీ కలిపి దాని విలువ రూ. 8.5 కోట్లు అయ్యిందని, అందుకే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పెరిగిందని చెబుతున్నారు. ఈ కారును ప్రత్యేకంగా జర్మనీలో ఆర్డర్ చేసి తయారుచేయించారు.