car trouble
-
వైరల్ వీడియో: ‘మోర్బీ’ విషాదం చూశాకైనా మీరు మారరా?
-
‘మోర్బీ’ విషాదం చూశాకైనా మీరు మారరా?
బెంగళూరు: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిపోయి 130 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జిల సామర్థ్యం, నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు.. మోర్బీ విషాదం చూసైనా కొందరు మారటం లేదు. మోర్బీ ఘటన జరిగిన మరుసటి రోజునే కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి అత్యుత్సాహంతో కేబుల్ బ్రిడ్జిపైకి ఏకంగా కారునే తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యెల్లపురా నగరంలోని నదిపై ఉన్న తీగల వంతెనపైకి ఓ వ్యక్తి కారును తీసుకొచ్చాడు. అయితే, ముందుకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడ్డాడు. దీంతో స్థానికులు అతడికి సాయం చేసి కారును వెనక్కి తీసుకెళ్లి ప్రమాదం నుంచి తప్పించారు. ఈ వంతెనను కేవలం ద్విచక్రవాహనాలు, నడక కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ, ఏకంగా కారునే తీసుకురావటం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు ఈ అంశంపై అధికారులకు సమాచారం అందించి అలర్ట్ చేశారు. అయితే, బ్రిడ్జిపై బైక్‌లు వెళ్లటాన్ని చూసి.. కారు సైతం వెళ్తుందని భావించినట్లు డ్రైవర్ తెలిపాడు. తాను స్థానికుడిని కాదని, ఫోర్వీలర్స్కు బ్రిడ్జి సరికాదని తెలియదని చెప్పాడు. ఇదీ చదవండి: మోర్బీలో ప్రధాని మోదీ.. కేబుల్ బ్రిడ్జి ప్రమాద బాధితులకు పరామర్శ -
యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి కిడ్నాప్.. ట్విస్ట్ ఏంటంటే..
సాక్షి, ధర్మపురి(కరీంనగర్): యువతిని ఇంట్లో నుంచి లాక్కెళ్లి, కిడ్నాప్‌కు యత్నించిన ఘటన ధర్మపురిలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన ఓ యువతి(23)కి వెల్గటూర్ మండలంలోని కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో సోమవారం పెళ్లి నిశ్చయమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. ఇది చూసిన వెంటనే సారంగాపూర్ మండలంలోని రేచపెల్లికి చెందిన మంగళారపు రాజేందర్ అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి మంగళవారం ఆ యువతి ఇంటికి వెళ్లాడు. లోపల ఉన్న ఆమెను లాక్కొచ్చి, కారులో ఎక్కించారు. జాతీయ రహదారి పక్కనున్న దుర్గమ్మ కాలనీ నుంచి కమలాపూర్ రూట్లో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో కారు ఆగిపోయింది. బాధితురాలు రోదిస్తూ కేకలు వేయడంతో రాజేందర్ కోపోద్రిక్తుడై కత్తితో ఆమెను గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావం జరగగా యువతి అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు, సమయానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ నలుగురు పారిపోయారు. పోలీసులు కారును ఠాణాకు తరలించారు. యువతితోపాటు ఆమె తల్లిదండ్రులు పోలీస్‌స్టేషను చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు. ఇద్దరూ డిగ్రీ క్లాస్మేట్స్.. రాజేందర్, బాధిత యువతి డిగ్రీ క్లాస్మేట్స్. ఈ క్రమంలో రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుంటానని రాజేందర్ ఆమె తల్లిదండ్రులతో చెప్పినట్లు తెలిసింది. కులాలు వేరు కావడంతో వారు నిరాకరించారని సమాచారం. రెండు రోజుల కిందట కాంపెల్లికి చెందిన ఓ యువకుడితో యువతికి పెళ్లి నిశ్చయించారు. ఇది తెలుసుకున్న రాజేందర్ తన స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి, విఫలమయ్యాడు. చదవండి: పక్కింటి వారి వేధింపులు.. ఆటోడ్రైవర్ ఆత్మహత్య -
వరదల్లో చిక్కుకున్న సింగర్ కారు.. కదిలి వచ్చిన అభిమానులు
ముంబై: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు దేశ ఆర్థిక రాజధాని ముంబైని అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ వరద నీరు చేరుకుని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పని మీద బయటకు వచ్చిన జనం ఇంటికి చేరాలంటే గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో సింగర్, ర్యాపర్ మికా సింగ్ కారు ముంబై వర్షాల్లో చిక్కుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సింగర్ కారు ఇలా వరద నీటిలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో ఆయనతో పాటు ఆకాంక్ష పూరి కూడా ఉన్నారు. వీరిద్దరు ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి వస్తుండగా ఇలా వరద నీటిలో చిక్కుకుపోయారు. ఇక మికా కారు ఆగిపోయిందన్న విషయం తెలిసిన వెంటనే ఆయన అభిమానులు పదుల సంఖ్యలో రోడ్డు మీదకు వచ్చి.. సాయం చేసేందుకు ప్రయత్నించారు. వారంతా వర్షంలో తడుస్తూ.. సింగర్‌కు సాయం చేశారు. ఈ సందర్భంగా మికా మాట్లాడుతూ.. ‘‘దగర్గ దగ్గర 200 మంది వరకు జనాలు నాకు సాయం చేయడానికి వచ్చారు. వారందరికి నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ఇప్పుడు సమయం తెల్లవారుజామున 3 గంటలవుతుందన్నారు. అభిమానుల సాయంతో మికా సింగ్ అక్కడ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మికా సింగ్, ఆకాంక్ష పూరి డేటింగ్ చేస్తున్నట్లు గతకొంత కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వారు నిశ్చితార్థం కూడా చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై ఆకాంక్ష పూరి స్పందిస్తూ.. "మికా, నేను 12 సంవత్సరాలుగా ఒకరికొకరం తెలుసు. అతను నా కుటుంబ సభ్యుడిలాంటివాడు. అతను నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మా మాధ్య చాలా బలమైన బంధం ఉంది. అయితే మేం నిశ్చితార్థం చేసుకున్నామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. మాకు అలాంటి ప్రణాళికలు లేవు. అభిమానులు మేం కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ క్షమించండి.. అలా జరగదు’’ అని స్పష్టం చేశారు. -
సుష్మాజీ.. నా కారులో పొగ ఎక్కువైంది!
విదేశాల్లో తమవాళ్లు చిక్కుకుపోయారనో, ఫారిన్ ట్రిప్‌లో ఉండగా పాస్‌పోర్టు పోయిందనో చెబితే వెంటనే ఆ సమస్యను పరిష్కరించడానికి ఎవరున్నారంటే.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గుర్తుకొస్తారు. ఆమెకు ట్వీట్ చేస్తే చాలు, సమస్యలు పరిష్కారం అయిపోతాయన్న ధైర్యం చాలామందికి ఉంది. అయితే, సమస్య ఎలాంటిదైనా కూడా ఆమెకే ట్వీట్ చేయాలన్న ఆలోచన కొందరికి ఎందుకు వస్తుందో మాత్రం అర్థం కాదు. కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తి తన ఫ్రిజ్ పనిచేయడం లేదని చెబితే.. తాజాగా ఓ వ్యక్తి తన కారు గురించిన సమస్యను సుష్మాకు ట్వీట్ చేశాడు. తన కొత్త కారు ఫొటోలను కూడా పోస్ట్ చేసిన సదరు వ్యక్తి.. తన సమస్యను వివరించాడు. తాను కొత్తగా కొన్న ఫోక్స్‌వాగన్ జెట్టా కారు నుంచి విపరీతంగా తెల్లటి పొగ వస్తోందని, దాన్ని ఏం చేయాలో తెలియట్లేదని అతగాడు అన్నాడు. తర్వాత దానికి ఆమె సమాధానం కూడా ఇచ్చారు. ''అయాం సారీ, మీ కారును వర్క్‌షాపునకు తీసుకెళ్లంది'' అని ఆమె చెప్పారు. ట్విట్టర్ జనాలు చాలామంది ఆమె సమాధానాన్ని మెచ్చుకున్నారు. పని పాట లేనివాళ్లంతా ఏది పడితే అది ట్వీట్ చేసి, దానికి సుష్మా స్వరాజ్ సమాధానం చెప్పాలంటే ఎలాగని ప్రశ్నలు గుప్పించారు. సుష్మా ట్వీట్‌ను చాలామంది రీట్వీట్ చేయగా కొన్ని వేల మంది దాన్ని లైక్ చేశారు.