Cardon and search
-
పోలీసుల మోహరింపు, తనిఖీలు.. హిడ్మా కోసమేనా..?
మహాముత్తారం: సమాచార వ్యవస్థ విసృతంగా వ్యాపించిన నేపథ్యంలో మావోయిస్టులను టార్గెట్ చేయడం పోలీసులకు సులువుగా మారింది. మావోయిస్టుల్లో అత్యంత ముఖ్యడు గెరిల్లా పోరాటంతోపాటు ఆకస్మిక దాడుల్లో వ్యూహరచన చేసే హిడ్మా కోసం పోలీసులు ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల అగ్రనేత ఆర్కే మృతిచెందడం అంత్యక్రియలను తెలంగాణ సరిహద్దులో నిర్వహించినట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. హిడ్మా సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఏఓబీ అటవీ ప్రాంతంలో సరైన వైద్య పరీక్షలు లేకపోవడం తెలంగాణ వైపు వచ్చారనే సమాచారం పోలీసులకు అందినట్లు తెలిసింది. దీంతో తెలంగాణ గోదావరి సరిహద్దు ప్రాంతాలపై నిఘా కొనసాగిస్తున్నారు. అటవీప్రాంతంలో డ్రోన్ కెమెరా సహాయంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మహాముత్తారం పోలీసులు మంగళవారం మండలంలోని నిమ్మగూడెం, పెగడపల్లి, బోర్లగూడెం, కనుకునూర్, రెడ్డిపల్లి ప్రధాన రహాదారుల్లో వాహనాలను తనిఖీ చేపట్టారు. అనంతరం తండాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చివెళ్తున్నారా అనే సమాచారాన్ని నిత్యం సేకరిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో అకస్మాత్తుగా పోలీసులు మోహరించడం ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ అటవీ గ్రామాల వాసులు భయంభయంగా గడుపుతున్నారు. -
హైదరాబాద్‌లో పోలీసులు కార్డన్‌సెర్చ్
-
‘పోలీస్’ వనం
నందనవనం జల్లెడ అర్ధరాత్రి సోదాలు పోలీసుల అదుపులో 110 మంది అనుమానితులు 48 ఆటోలు, 56 బైక్‌లు స్వాధీనం 20 క్వింటాళ్ల రేషన్ గోధుమల పట్టివేత సరూర్‌నగర్ : నాలుగు వందల మంది పోలీసులు.. పది బృందాలుగా ఏర్పడి ఆదివారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందనవనం, పరిసర కాలనీల్లో ‘కార్డన్ అండ్ సెర్చ్’ పేరిట విస్తృత తనిఖీలు నిర్వహించారు. క్రైమ్ అడిషనల్ డీసీపీ జానకీషర్మిల, ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో ఒక్కమారుగా పోలీసు బృందాలు బస్తీలోని ఇళ్ల మీదకి రావటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై సోదాలు ఉదయం 7 గంటల వరకు కొనసాగాయి. ఈ సోదాల్లో పలువురు అనుమానితులను, కొత్త,పాతనేరస్తులను తమ అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పది అవుట్ పాయింట్లు, పది ఇన్నర్ పాయింట్లతో కూంబింగ్ నిర్వహించారు. జెఎన్ఎన్యూఆర్ఎం, వాంబే కాలనీ, దేవినగర్, నందనవనంలోని 1044 బ్లాక్‌లను అంగుళం కూడా వదలకుండా తనిఖీలు చేశారు. 110 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బస్‌లలో పిక్‌పాకెటింగ్ చేసే రమాదేవి, 16 మంది పాతనేరస్తులు, రౌడీషీటర్ బంగారు శ్రీను, కరుడు గట్టిన హౌస్‌బ్రేకర్ కరీంనగర్‌కు చెందిన ఉస్మాన్, హబీబ్‌లు చిక్కారు. వీరందరిపై పలు జిల్లాల్లో నాన్‌బెయిలబుల్ కేసులున్నాయి. 20 క్వింటాళ్ల రేషన్ గోధుమల స్టాక్‌తో కూడిన, టాటా ఏస్ వాహనం పట్టుబడింది. 9 ఎల్పీజీ సిలిండర్లు, 48 ఆటోలు, 56 బైక్‌లతోపాటు 2 బెల్ట్ షాప్‌లపై దాడి చేసి బీర్లు, వైన్ బాటిళ్లు, గుట్కాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ పద్మవ్యూహం ముగిసిన తర్వాత డీసీపీలు విశ్వప్రసాద్, జానకీషర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కార్డన్ అండ్ సెర్చ్ ఇప్పటి వరకు ఐదుసార్లు నిర్వహించామని, అందులో నందనవనంలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. ఇక నుంచి జోన్ల వారీగా ఈ సోదాలు చేస్తామన్నారు.. ఈ ఆపరేషన్‌లో నలుగురు ఏసీపీలు, 60 మంది ఇన్స్పెక్టర్లు, 80 మంది ఎస్ఐలు, 300 మంది కానిస్టేబుళ్లు, 2 స్పెషల్ టీమ్‌లు, జోనల్టాస్క్ఫోర్స్ బృందాలుగా పాల్గొన్నాయి. -
పోలీసు పద్మవ్యూహం
- నందనవనంలో అర్ధరాత్రి సోదాలు - పోలీసుల అదుపులో 110 మంది అనుమానితులు సరూర్‌నగర్ : నాలుగు వందల మంది పోలీసులు.. పది బృందాలుగా ఏర్పడి ఆదివారం మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందనవనం, పరిసర కాలనీల్లో ‘కార్డన్ అండ్ సెర్చ్’ పేరిట విస్తృత తనిఖీలు నిర్వహించారు. క్రైమ్ అడిషనల్ డీసీపీ జానకీషర్మిల, ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో ఒక్కమారుగా పోలీసు బృందాలు బస్తీలోని ఇళ్ల మీదకి రావటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమై సోదాలు ఉదయం 7 గంటల వరకు కొనసాగాయి. ఈ సోదాల్లో పలువురు అనుమానితులను, కొత్త,పాతనేరస్తులను తమ అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పది అవుట్ పాయింట్లు, పది ఇన్నర్ పాయింట్లతో కూంబింగ్ నిర్వహించారు. జెఎన్ఎన్యూఆర్ఎం, వాంబే కాలనీ, దేవినగర్, నందనవనంలోని 1044 బ్లాక్‌లను అంగుళం కూడా వదలకుండా తనిఖీలు చేశారు. 110 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బస్‌లలో పిక్‌పాకెటింగ్ చేసే రమాదేవి, 16 మంది పాతనేరస్తులు, రౌడీషీటర్ బంగారు శ్రీను, కరుడు గట్టిన హౌస్‌బ్రేకర్ కరీంనగర్‌కు చెందిన ఉస్మాన్, హబీబ్‌లు చిక్కారు. వీరందరిపై పలు జిల్లాల్లో నాన్‌బెయిలబుల్ కేసులున్నాయి. 20 క్వింటాళ్ల రేషన్ గోధుమల స్టాక్‌తో కూడిన, టాటా ఏస్ వాహనం పట్టుబడింది. 9 ఎల్పీజీ సిలిండర్లు, 48 ఆటోలు, 56 బైక్‌లతోపాటు 2 బెల్ట్ షాప్‌లపై దాడి చేసి బీర్లు, వైన్ బాటిళ్లు, గుట్కాలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ పద్మవ్యూహం ముగిసిన తర్వాత డీసీపీలు విశ్వప్రసాద్, జానకీషర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కార్డన్ అండ్ సెర్చ్ ఇప్పటి వరకు ఐదుసార్లు నిర్వహించామని, అందులో నందనవనంలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. ఇక నుంచి జోన్ల వారీగా ఈ సో దాలు చేస్తామన్నారు.. ఈ ఆపరేషన్‌లో నలుగురు ఏసీపీలు, 60 మంది ఇన్స్పెక్టర్లు, 80 మంది ఎస్ఐలు, 300 మంది కానిస్టేబుళ్లు, 2 స్పెషల్ టీమ్‌లు, జోనల్టాస్క్ఫోర్స్ బృందాలుగా పాల్గొన్నాయి. -
బేగంబజార్‌లో సోదాలు
అనువణువూ పోలీసుల జల్లెడ అసాంఘికశక్తుల సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి అబిడ్స్/అఫ్జల్‌గంజ్: ‘కార్డన్ అండ్ సెర్చ్’ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ జోన్ పోలీసులు బుధవారం సాయంత్రం బేగంబజార్‌ను జల్లెడ పట్టారు. బేగంబజార్‌కు వెళ్తే అన్ని ద్వారాలను మూసివేసి ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. సెంట్రల్ జోన్ డీసీ పీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు ఫీల్‌ఖానా, తోఫ్ఖానాలకు దారి తీసే 20 రహదారులను బారికేడ్లతో పూ ర్తిగా మూసివేసి సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి ఒక్కరినీ సోదా చేశారు. అబిడ్స్, అసెంబ్లీ, సెక్రటేరియట్ల ఏసీపీలు జైపాల్, సంజీవ, వీరన్నల నేతృత్వంలో బేగంబజార్, అబిడ్స్, నారాయణగూడ ఇన్స్పెక్టర్లు గంగసాని శ్రీధర్, ఉమామహేశ్వరరావు, భీమ్‌రెడ్డిలు, ఎస్ఐలు తమ సిబ్బందితో కలిసి బృందాలుగా విడిపోయి ప్రతి వీధిలోనూ తనిఖీలు నిర్వహించారు. విధ్వంసకర చర్యలను సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు తమ కు సహకరించాలని ఈ సందర్భంగా పోలీసు లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అసాంఘిక శక్తుల వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అసాంఘిక శక్తులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నో సత్ఫలితాలు: డీసీపీ కమలాసన్‌రెడ్డి ఈ తనిఖీల ద్వారా ప్రజలకు ఎన్నో సత్ఫలితాలు కలుగుతున్నాయని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. తనిఖీల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం కూడా తా ము ఇలాంటి తనిఖీలు చేశామన్నారు. ప్రతీ వ్యాపారి తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించి తీరాల్సిందేనన్నారు. సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు అమర్చుకోని వ్యాపారులకు ముందుగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అయినా వా రు భద్రతా ప్రమాణాలు పాటించకపోతే నోటీసులు ఇచ్చి 2013 పోలీస్చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు తీసుకొని పోలీస్ శాఖకు సహకరించాలని డీసీపీ కోరారు.