అటవీ ప్రాంతంలో వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు
మహాముత్తారం: సమాచార వ్యవస్థ విసృతంగా వ్యాపించిన నేపథ్యంలో మావోయిస్టులను టార్గెట్ చేయడం పోలీసులకు సులువుగా మారింది. మావోయిస్టుల్లో అత్యంత ముఖ్యడు గెరిల్లా పోరాటంతోపాటు ఆకస్మిక దాడుల్లో వ్యూహరచన చేసే హిడ్మా కోసం పోలీసులు ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల అగ్రనేత ఆర్కే మృతిచెందడం అంత్యక్రియలను తెలంగాణ సరిహద్దులో నిర్వహించినట్లు పోలీసులు ధ్రువీకరించుకున్నారు.
హిడ్మా సైతం అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఏఓబీ అటవీ ప్రాంతంలో సరైన వైద్య పరీక్షలు లేకపోవడం తెలంగాణ వైపు వచ్చారనే సమాచారం పోలీసులకు అందినట్లు తెలిసింది. దీంతో తెలంగాణ గోదావరి సరిహద్దు ప్రాంతాలపై నిఘా కొనసాగిస్తున్నారు. అటవీప్రాంతంలో డ్రోన్ కెమెరా సహాయంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో మహాముత్తారం పోలీసులు మంగళవారం మండలంలోని నిమ్మగూడెం, పెగడపల్లి, బోర్లగూడెం, కనుకునూర్, రెడ్డిపల్లి ప్రధాన రహాదారుల్లో వాహనాలను తనిఖీ చేపట్టారు. అనంతరం తండాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చివెళ్తున్నారా అనే సమాచారాన్ని నిత్యం సేకరిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో అకస్మాత్తుగా పోలీసులు మోహరించడం ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ అటవీ గ్రామాల వాసులు భయంభయంగా గడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment