Caved areas
-
అవును.. అది నిజంగా మృత్యుగుహే!
ఇది చూడటానికి మిగిలిన కొండగుహల మాదిరిగానే కనిపిస్తుంది గాని, నిజానికిది మృత్యుగుహ. ఈ గుహలోకి అడుగుపెడితే మృత్యువు తప్పదు. కోస్టారికాలోని పోవాస్ అగ్నిపర్వత శిఖరం వద్ద ఉన్న ఈ కొండగుహ మృత్యుగుహగా పేరుమోసింది.రెండు మీటర్ల లోతు, మూడు మీటర్ల పొడవు ఉన్న ఈ గుహ చిన్నా చితకా జంతువులు, పక్షులు తలదాచుకోవడానికి అనువైన ప్రదేశంలా కనిపించినా, ఇందులోకి జంతువులు, పక్షులు ఏవీ వెళ్లవు. పొరపాటున వెళితే, క్షణాల్లోనే అవి ఊపిరాడక మరణిస్తాయి. కంటికి కనిపించని, కనీసం ముక్కుపుటాలకు వాసనైనా తెలియని కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వాయువులు ఈ గుహ నిండా వ్యాపించి ఉండటం వల్లనే ఈ గుహలో ఎలాంటి జీవులైనా ప్రాణాలతో ఉండలేవు.వెలిగించిన కాగడాను ఈ గుహలోపల పెడితే అది క్షణాల్లోనే ఆరిపోతుంది. ఊపిరి పీల్చుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ బొత్తిగా లేకపోవడం, లోపల అంతా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వాయువులు వ్యాపించి ఉండటం వల్ల ఇది మృత్యుగుహగా తయారైంది.ఈ గుహ లోపల ప్రతి గంటకు కనీసం ముప్పయి కిలోల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. ఈ ప్రాంతంలో రిక్రియో వెర్డే కాంప్లెక్స్ నిర్మాణం జరుపుతున్నప్పుడు ఇంజినీర్లు ఈ గుహకు గల ప్రాణాంతక లక్షణాన్ని తొలిసారిగా గుర్తించారు. వారు దీనికి ‘కేవా డి లా మ్యూర్టె’ (మృత్యుగుహ)గా పేరుపెట్టారు.ఇవి చదవండి: ఈ సరికొత్త టెక్నాలజీ గురించి విన్నారా! వీటి పనేంటో తెలుసా!! -
ఆ గుహ ఇక మ్యూజియం
మే సాయ్: వైల్డ్‌బోర్స్ సాకర్ జట్టుకు చెందిన 12 మంది పిల్లలు, కోచ్ చిక్కుకుపోయిన తామ్ లువాంగ్ గుహలో సహాయక చర్యలు చేపట్టిన ప్రాంతాన్ని మ్యూజియంగా మార్చనున్నట్లు చియాంగ్‌రాయ్ ప్రావిన్సు గవర్నర్ నరోంగ్‌సక్ తెలిపారు. ఈ ప్రాంతం త్వరలోనే థాయ్‌లాండ్‌లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సహాయక చర్యల్లో భాగంగా నిపుణులు వాడిన పరికరాలు, డైవింగ్ సూట్లు, యంత్రాలను సందర్శనకు ఉంచనున్నట్లు నరోంగ్‌సక్ తెలిపారు. ఇక్కడ అమర్చిన భారీ పైపుల్ని, యంత్రాలను దాదాపు 50 మంది సిబ్బంది తొలగిస్తున్నారని, ఈ పనులు ఆదివారం వరకూ కొనసాగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం గుహలో నీటి ప్రవాహం పెరుగుతున్నందున లోపల యంత్రాలు ఉన్నప్పటికీ ఎవ్వరినీ అనుమతించడం లేదన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన డైవర్, అనస్థీషియా నిపుణుడు రిచర్డ్ హారిస్ లేకుంటే ఈ మిషన్ విజయవంతం అయ్యేది కాదన్నారు. గుహలో 13 మంది సజీవంగా ఉన్నట్లు మొట్టమొదట గుర్తించిన బ్రిటిష్ డైవర్ జాన్ వాలంథెన్కు థాయ్ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. స్వదేశానికి వెళ్లేందుకు జాన్ బుధవారం సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడి ప్రజలందరూ లేచినిల్చుని కరతాళ ధ్వనులతో ఆయన్ను సాగనంపారు. సహాయక చర్యల్లో పాల్గొన్న డైవర్లు, నిపుణుల్ని కీర్తిస్తూ పలు స్థానిక పత్రికలు కథనాలను ప్రచురించాయి. జూన్ 23న తామ్ లువాంగ్ గుహలోకి వెళ్లిన 13 మంది నీటి ప్రవాహం కారణంగా లోపల చిక్కుకున్నారు. చివర్లో తప్పిన పెనుముప్పు.. తామ్ లువాంగ్ గుహలో సహాయక చర్యల్లో పాల్గొన్న డైవర్లు చివరి నిమిషంలో పెనుప్రమాదాన్ని ఎదుర్కొన్నారని థాయ్ నేవీ సీల్స్ సీనియర్ కమాండర్ ఒకరు తెలిపారు. గుహలో చివరి విద్యార్థి, కోచ్‌లను బయటకు తీసుకురాగానే నీటిని బయటకు పంపింగ్ చేసే యంత్రాలు ఆగిపోయాయి. ఆ సమయంలో గుహలో దాదాపు 20 మంది డైవర్లున్నారు. చివరికి పరిస్థితి చేయిదాటకముందే డైవర్లందరూ సురక్షితంగా బయటకు రాగలిగారని పేర్కొన్నారు. తామ్ లువాంగ్ ఘటన ఆధారంగా సినిమా తీస్తామని ‘ప్యూర్ ఫ్లిక్స్’ సంస్థ భాగస్వామి మైఖేల్ స్కాట్ ఇప్పటికే ప్రకటించారు. -
'ఆ నిధులను ఏపీ ప్రభుత్వ విడుదల చేయాలి'
హైదరాబాద్:ముంపు ప్రాంతాలకు ఇవ్వాల్సిన కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం పులిచింతల ముంపు ప్రాంతాలు, నిర్వాసితుల సమస్యలపై హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాలకు ఇవ్వాలని నిధులను ఏపీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్వార్టర్స్ ఆక్రమణకు గురైయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే వృథాగా ఉన్న క్వార్టర్స్ ను బహిరంగంగా వేలం వేస్తామని హరీష్ తెలిపారు. మైనర్ ఇరిగేషన్ ఇద్దరు చీఫ్ ఇంజనీర్లను నియమిస్తామన్నారు. అధికారుల విభజనపై బీజేపీ నేతల విమర్శల కంటే ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తే మంచిదని హరీష్ రావు సూచించారు. -
నోటిఫికేషన్ తర్వాతే వేతనాలు
ట్రెజరీ డైరక్టర్ విజయ్‌కుమార్ ఖమ్మం జెడ్పీసెంటర్: రెవెన్యూ నోటిఫికేషన్ తరువాతే ముంపు మండలాల ఉద్యోగులకు వేతనాలు మంజూరు చేస్తామని ట్రెజరీ డెరైక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. సొమవారం జిల్లాలో పర్యటించిన ఆయనను జిల్లా ఖజానా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని పలు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ బిల్లు ఆమోదించారని, దీంతో రెవెన్యూ నోటిఫికేషన్ వెలువడితేనే వేతనాలు చెల్లింపు తెలంగాణ ట్రెజరీ నుంచా, ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ నుంచా అనే విషయం తేలుతుందన్నారు. జిల్లాలో పలు సబ్‌ట్రెజరీ కార్యాలయాలు శిథిలావస్ధల్లో ఉన్నాయని, కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్‌తో చర్చించి వాటి మరమ్మతులకు తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగులు సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో ట్రెజరీ డీడీ కె.నీలిమ, ఎస్టీవో ఖాజామియా, వెంకటేశ్వర్లు, కృష్ణారావు, వేలాద్రి,దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
రైతులకు విలీనం ముప్పు
కుకునూరు : ‘అమ్మ పెట్టదు..అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా మారింది ఆంధ్రాలో విలీనమైన ముంపు మండలాల రైతుల పరిస్థితి. ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చడంతో తెలంగాణ నుంచి ఏడు మండలాల్లోని (పీఏసీఎస్) ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఎరువులు అందని దుస్థితి ఏర్పడింది. జూలై నెల గడుస్తున్నా ఇప్పటికీ ఎరువులను సరఫరా చేయని జిల్లా మార్క్‌ఫెడ్ విలీనం సాకును చూపుతోంది. దీంతో ఆయా మండలాల రైతులు ఎరువుల కోసం దిక్కులు చూస్తున్నారు. పది సంఘాలకు పోటు జిల్లా పరిధిలో 105 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘా లు ఉండగా, ముంపు మండలాల్లో పది ఉన్నాయి. వాటిలో కుకునూరు, వింజరం సహకార సంఘం పరిధిలో ఉన్న నాలుగు వేలకు మందికి పైగా రైతులకు నేటికీ ఒక్క ఎరువుల బస్తాకూడా అందలేదు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, చెరుకు, ఆయిల్‌పామ్ సాగుకు యూరియా, 20-20, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులన్నీ కలిపి సుమారు 3 వేల టన్నులు అవసరం ఉంటుంది. ఇప్పటికే వర్షాలు ఆలస్యంగా కురవడంతో సాగుపై నిరాశగా ఉన్న రైతులు, ఇప్పుడు ఎరువులు కూడా లభించకపోవడంతో మరింత కుంగిపోతున్నారు. ఎరువుల కోసం వ్యయ ప్రయాసాల కోర్చి తెలంగాణలో ఉన్న భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి వంటి ప్రాంతాలకు వెళ్లక తప్పడం లేదు. అక్కడ అధిక ధరలను భరించి ఎరువులను కొనుగోలు చేయాల్సి వస్తోంది. సరఫరా లేదు గతేడాది రైతులకు దాదాపుగా 3 వేల టన్నుల ఎరువులు అవసరంకాగా, జిల్లా మార్క్‌ఫెడ్ కేవలం వెయ్యి టన్నులను మాత్రమే సరఫరా చేసింది. వాటిలో యూరియా పూర్తిగా విక్రయించగా, 20-20, పొటాష్ వంటి ఎరువులు కొద్ది మోతాదులో గిడ్డంగుల్లోనే పడి ఉన్నాయి. బ్యాంకు గ్యారంటీ ఇచ్చాం కదా...ఎరువులను పంపండి అని పీఏసీఎస్ సంఘాల పాలకవర్గం సభ్యులు ప్రాధేయపడినా జిల్లా మార్క్‌ఫెడ్ అధికారులు ససేమిరా అంటున్నారు. మీ మండలాలు ఆంధ్రాలోకి వెళ్లాయి.. ముందుగా నగదును చెల్లించి.. ఎరువులను తీసుకెళ్లండంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. కాగా రూ.లక్షల నగదును ముందుగా చెల్లించే స్థోమత ముంపు మండలాల పరపతి సంఘాలకు లేదు. ఈ మండలాలను ఆంధ్రాలో కలపడం వల్ల మార్క్‌ఫెడ్ ఎరువులను సరఫరా చేయడంలేదని, మేము ఏమీ చేయలేమని ఆ సంఘాలు చేతులెత్తేస్తున్నాయి. -
ముంపు అటే..!
భద్రాచలం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లు క్లైమాక్స్‌కు చేరుకున్న దశలోనూ భద్రాచలమే హాట్‌టాపిక్‌గా మారింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం సీమాంధ్రలో ఉంటే ముంపు ప్రాంతం తెలంగాణలో ఉండటమే దీనికి కారణం. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి సమావేశమైన కేంద్ర కేబినెట్ బిల్లుకు కీలక సవరణలు చేస్తూ తుదిరూపు ఇచ్చింది. పోలవరం ముంపు కింద వచ్చే జిల్లాలోని 134 రెవెన్యూ గ్రామాలను సీమాంధ్రలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి నుంచి భద్రాచలం డివిజన్ ఎటువైపు అనేది తీవ్ర చర్చనీయాంశంగానే మారింది. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపంపై పూర్తి స్థాయిలో సమీక్ష లేకుండానే కేంద్ర కేబినెట్ హడావిడి నిర్ణయాలు తీసుకోవటమే ఈ గందరగోళానికి కారణమని వాదన వినిపిస్తోంది. పోలవరం ముంపు ప్రాంతాలివే.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భద్రాచలం డివిజన్లోని వీఆర్‌పురం, కూనవరం మండలాలు పూర్తిగానూ, చింతూరు, భద్రాచలం మండలాలు పాక్షికంగానూ ముంపునకు గురవుతాయి. ఈ నాలుగు మండలాల్లో మొత్తం 98 రెవెన్యూ గ్రామాలు ముంపు పరిధిలోకి వస్తాయి. ఈ మండలాలకు ఎదురుగా గోదావరి నదికి అవతల ఒడ్డున ఉన్న పాల్వంచ డివిజన్ పరిధిలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగానూ, బూర్గంపాడు మండలం పాక్షికంగా ముంపు పరిధిలోకి వస్తుంది. మొత్తంగా పాల్వంచ రెవెన్యూ డివిజన్లో 36 రెవెన్యూ గ్రామాలు పోలవరం ముంపు కిందకు వస్తాయి. వీటి పరిధిలో మొత్తం 205 గ్రామాలు (హ్యాబిటేషన్)ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ బిల్లులో చేసిన సవరణల ప్రకారం పై గ్రామాలన్నీ సీమాంధ్రకు చెందుతాయి. గతంలో ఏం చేప్పారంటే.. తెలంగాణ బిల్లు ఢిల్లీకి వెళ్లిన సమయంలో సమావేశమైన జీవోఎం రాష్ట్ర అసెంబ్లీ నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు సవరణలు చేపట్టింది. దీనినే కేంద్ర కేబినెట్ యథాతథంగా ఆమోదించింది. దీని ప్రకారం భద్రాచలం రెవెన్యూ డివిజన్, పాల్వంచ డివిజన్లోని 37 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రలో కలుపేందుకు నిర్ణయించారు. భద్రాచలం టెంపుల్ టౌన్( అంటే భద్రాచలం పట్టణం)ను మాత్రం తెలంగాణలోనే కొనసాగించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏం నిర్ణయం తీసుకున్నారంటే బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లుపై చర్చించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ముంపు గ్రామాలనే సీమాంధ్రలో విలీనం చేస్తారు. ఈ లెక్కన ఏడు మండలాల్లోని ముంపు ప్రాంతాలు మాత్రమే సీమాంధ్రకు వెళ్తాయి. ముంపు పరిధిలో లేని గ్రామాలన్నీ యథాతథంగా తెలంగాణలోనే ఉంటాయి. ఈ రకంగానే బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఆదివాసీలకు ఒరిగిందేంటి? పోలవరం నిర్మాణమంటూ జరిగితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా...తెలంగాణలో ఉన్నా ఎప్పటికైనా ముంపు గ్రామాలను ఖాళీ చేయాల్సిందే. ఆదివాసీలు రాష్ట్ర విభజన అంశం పక్కన పెట్టి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన లేకుంటే ఏదో రీతిన దీన్ని అడ్డుకోవచ్చని ఇప్పటి వరకు ఆదివాసీలు భావించారు. దీనిపై కోర్టులలో కేసులు కూడా వేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని బహుళార్థక సాధ క ప్రాజెక్టుగా గుర్తించింది. దీన్ని నిర్మించేందుకు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపేందుకు నిర్ణయించింది.ఇది ఆదివాసీలకు గొడ్డల పెట్టులా మారింది. భౌగోళికంగా ఇబ్బందులే భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్లు ముక్కలు చేసి ముంపు ప్రాంతాలను సీమాంధ్రకు, మిగతా గ్రామాలు తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు భావిస్తున్న నిర్ణయం భౌగోళిక ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. చింతూరు, భద్రాచలం, బూర్గంపాడు మండలాలతో పాటు పూర్తిగా ముంపునకు గురయ్యే మండలాల్లో కూడా ఇళ్లు ఒక రాష్ట్రంలో ఉంటే వారి భూములు మరో రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తైబ్యాక్ వాటర్ వచ్చేంత వరకు ఇక్కడనే ఉంటూ వారి భూములను అనుభవించ వచ్చనేది రైతులు ఆశ. కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో డివిజన్లు ముక్కలు అవుతుండటం వారికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఇక రహదారుల పరిస్థితి కూడా ఇదే రీతిన ఉంటుంది. ఉదాహరణకు భద్రాచలం మండలంలోని విస్సాపురం, చలంపాలెం పరిసర గ్రామాలు వారు ప్రస్తుతం నందిగామ మీదగా భద్రాచలం రావాల్సి ఉంటుంది. కానీ విభజనలో నందిగామ సీమాంధ్ర రాష్ట్రంనకు వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విస్సాపురం వాసులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గ్రామాల మీదగా మళ్లీ తెలంగాణలోని భద్రాచలానికి రావాల్సి ఉంటుంది. వీటి న్నింటి పై సరైన స్పష్టత లేకుండా భౌగోళికంగా సరైన సరిహద్దులు చూపకుండా విభజిస్తే తమ పరిస్థితి ఏంటని ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. -
తప్పదా...?!
భద్రాచలం, న్యూస్‌లైన్ : ‘భద్రాచలం తెలంగాణలోనే ఉంటుంది...ముంపు ప్రాంతాలు ఆంధ్రాకు వెళ్తాయి’....అనే వార్తలు గట్టిగా వస్తుండడంతో భద్రాచలం ప్రాంతంలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన నే పథ్యంలో భద్రాచలం మాదంటే...మాదని ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర ప్రాంత నాయకులు ప్రకటనలు చేయటం, హైదరాబాద్ తర్వాత కీలకాంశంగా మారిన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో విలీనం చేస్తారని ప్రచారం జోరుగా సాగటంతో దీనికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణలోనే ఉంటామని భద్రాచలం డివిజన్ వాసులు కూడా ఉద్యమ బాట పట్టడంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఇరు ప్రాంతాల నాయకులకు ఊరటనిచ్చే విధంగా భద్రాచలం రామాలయంతో పాటు డివిజన్లోని కొన్ని మండలాలను తెలంగాణలో ఉంచేలా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే గ్రామాలన్నింటినీ సీమాంధ్రలో కలిపేం దుకు దాదాపు నిర్ణయం జరిగిపోయినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. జీవోఎం పొందుపరిచిన 11 అంశాల్లో నదీ జలాల సమస్య ప్రధానం కావటంతో భద్రాచలం ప్రాంతం తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తెలంగాణలో అంతర్భాగంగా ఉన్న ఖమ్మం జిల్లాలోని 205 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని ఆ ప్రాంత నాయకులు కేంద్ర ప్రభుత్వానికి నివే దికలు ఇచ్చారు. 1956కు ముందు భద్రాచలం తూర్పుగోదావరి జిల్లా పరిధిలో భాగంగా ఆంధ్రలోనే ఉండేద నే వాదనలు లేవనెత్తారు. అయితే పరిపాలన సౌలభ్యం కోసం అప్పట్లో భద్రాచలం డివిజన్‌ను కాకినాడ నుంచి వేరు చేశారని, పోలవరం ప్రాజెక్టు కోసమని మళ్లీ ఆంధ్రలో కలిపితే డివిజన్ అన్ని రంగాల్లోనూ తీవ్రంగా వెనుకబడిపోయే ప్రమాదముందని భావించిన ఈ ప్రాంత వాసులు ఆంధ్ర నాయకుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణలోనే ఉంటామంటూ చేపట్టిన టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ద్వారా తమ ఆకాంక్షను ఢిల్లీ స్థాయిలో వినిపించారు. ముంపు ప్రాంతం ఆంధ్రలోకి వెళితే.... పోలవరం ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే గ్రామాలన్నీ ఆంధ్రలోనే కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే జిల్లాలోని 7 మండలాల్లో గల 205 గ్రామాలు తెలంగాణ నుంచి వేరు చేయబడతాయి. భద్రాచలం, పాల్వంచ డివిజన్ల పరిధిలో గల 60 పంచాయతీలు ముంపు ప్రాంతంలోకి వస్తాయి. భద్రాచలం డివిజన్లోని వీఆర్‌పురం, కూనవరం, పాల్వంచ డివిజన్లోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ముంపు ప్రభావం పూర్తిగా ఉంటుంది. అదే విధంగా చింతూరు, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయి. వేలేరుపాడు మండలంలో 38 గ్రామాలు, కుక్కునూరులో 35, బూర్గంపాడులో 9, భద్రాచలంలో 13, కూనవరంలో 48, వీఆర్ పురంలో 45, చింతూరులో 17 గ్రామాలు ముంపు కింద వస్తాయి. ప్రస్తుతం జీవోఎం నిర్ణయించినట్లుగా వస్తున్న ప్రచారం నిజమైతే ఈ గ్రామాలన్నీ తెలంగాణ నుంచి వేరు చేయబడి ఆంధ్రలో కలుస్తాయి. దీన్ని తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలోని ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదులుకోబోమని చెబుతున్నారు. దీనిపై ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల ద్వారా జీవోఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. సరిహద్దులతో ఇబ్బందులే : ముంపు గ్రామాలు ఆంధ్రలో కలిపితే సరిహద్దు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. అంతేకాకుండా ఆంధ్రలో కలిపే ముంపు గ్రామాలకు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో ఉండదని వారి వాదన. భద్రాచలం మండలం వరకూ చూస్తే ముంపు కింద ఎన్టీఆర్ కాలనీ ఉంది. అదే విధంగా టీపీ వీడు ముంపు పరిధిలోనే ఉంటుంది. కానీ ఈ రెండు గ్రామాల మధ్యన ఉన్న తోటపల్లి మాత్రం ముంపు పరిధిలోకి రాదు. ఒక వేళ ముంపు ప్రాంతాన్ని ప్రాతిపదికగా తీసుకొని సరిహద్దులు విభజిస్తే రెండు వైపులా ఆంధ్రకు చెందిన గ్రామాలు ఉంటే మధ్యలో తెలంగాణకు చెందిన గ్రామం ఉంటుంది. భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే రహదారిలో ఉన్న తోటపల్లికి టీపీవీడు గ్రామాన్ని దాటుకొనే వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు చాలా గ్రామాలకు ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో సరిహద్దు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. ఇదే విషయమై రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు ఇక్కడి టీజేఏసీ తగు ఆధారాలతో నివేదిక సిద్ధం చేస్తోంది.