నోటిఫికేషన్ తర్వాతే వేతనాలు | Wages to employees gives after revenue notification | Sakshi
Sakshi News home page

నోటిఫికేషన్ తర్వాతే వేతనాలు

Published Tue, Jul 22 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

నోటిఫికేషన్ తర్వాతే వేతనాలు

నోటిఫికేషన్ తర్వాతే వేతనాలు

 ట్రెజరీ డైరక్టర్ విజయ్‌కుమార్

ఖమ్మం జెడ్పీసెంటర్: రెవెన్యూ నోటిఫికేషన్ తరువాతే ముంపు మండలాల ఉద్యోగులకు వేతనాలు మంజూరు చేస్తామని ట్రెజరీ డెరైక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. సొమవారం జిల్లాలో పర్యటించిన ఆయనను జిల్లా ఖజానా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని పలు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ బిల్లు ఆమోదించారని, దీంతో రెవెన్యూ నోటిఫికేషన్ వెలువడితేనే వేతనాలు చెల్లింపు తెలంగాణ ట్రెజరీ నుంచా, ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ నుంచా అనే విషయం తేలుతుందన్నారు.

జిల్లాలో పలు సబ్‌ట్రెజరీ కార్యాలయాలు శిథిలావస్ధల్లో ఉన్నాయని, కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్‌తో చర్చించి వాటి మరమ్మతులకు తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగులు సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో ట్రెజరీ డీడీ కె.నీలిమ, ఎస్టీవో ఖాజామియా, వెంకటేశ్వర్లు, కృష్ణారావు, వేలాద్రి,దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement