CBIT college
-
సీఎం జగన్ ఆశయం.. పార్టీ లక్ష్యం తప్పక నెరవేరుతాయి
సాక్షి, వైఎస్సార్: ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదవాలన్నది సీఎం జగన్ ఆశయమని, రాష్ట్రంలో నిరుద్యోగి ఉండకూడదన్నది వైఎస్సార్సీపీ లక్ష్యమని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లాలోని ప్రొద్దుటూరు సీబీఐటీలో శనివారం ఉదయం పార్టీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్య ప్రతి ఒక్కరి అవసరం. ఉద్యోగాల కోసం ప్రతీ ఒక్కరూ పోటీ పడుతున్న పరిస్థితుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యోగం పొందితేనే కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి. రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పారాయన. అలాగే.. ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కొవాలని, ఇప్పుడు రానంత మాత్రాన మళ్లీ అవకాశం ఉంటుందని, బాబ్ మేళా నిరంతర ప్రక్రియ అని విజయసాయిరెడ్డి యువతకు భరోసా ఇచ్చారు. జాబ్ మేళాలో వందకు పైగా కంపెనీలు పాల్గొనగా.. ఉద్యోగాల కోసం 13 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో.. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ఆధర్వ్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలకు అపూర్వ స్పందన లభిస్తోందని డిప్యూటీ సీఎం అమ్జాద్ బాషా పేర్కొనగా.. జగన్ ఆశయ సాధనకు అనుగుణంగా జాబ్ మేళా నిర్వహిస్తామని, నిరుద్యోగిరహిత లక్ష్య సాధన కోసం పార్టీ కృషి చేస్తుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. -
నాలుగో రోజుకి చేరిన సిబీఐటీ విద్యార్థుల ఆందోళన
-
ఫీజులు పెంచొద్దు
మణికొండ: కళాశాలలో చేరే సమయంలో పేర్కొన్న ఫీజులనే చెల్లిస్తాం తప్ప పెంచిన ఫీజులను చెల్లించే ప్రసక్తే లేదని విద్యార్థులు మూడు రోజులుగా ఆందోళన బాటపట్టారు. రెండు రోజుల పాటు తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నా యాజమాన్యం దిగిరాకపోవటంతో గురువారం ఏకంగా పరీక్షలను సైతం బహిష్కరించి రోడ్డెక్కారు. గండిపేట మండల కేంద్రంలో ఉన్న చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి రూ.1.20 లక్షల ఫీజు తీసుకుంటామని యాజమాన్యం అప్పట్లో పేర్కొంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల విషయంపై తీసుకున్న చర్యలను వ్యతిరేకిస్తూ కొన్ని కళాశాలల వారు కోర్టును ఆశ్రయించారు. దాంతో రాష్ట్ర హైకోర్టు కళాశాలల్లో అదనపు సౌకర్యాలు ఉన్న పలు కళాశాలలకు అదనపు ఫీజు వసూలు చేసుకునే వీలు కల్పించింది. దాంతో గత సంవత్సరం నుంచి విద్యార్థుల వద్ద రూ.1.20 లక్షలకు బదులుగా కోర్టు సూచించిన విదంగా రూ.2లక్షలు వసూలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఫీజు రీయింబర్స్మెంట్ కోటాలో సీట్లు పొందిన ఎ కేటగిరీ విద్యార్థుల నుంచి యథావిధిగానే ఫీజు వసూలు చేస్తామని సర్క్యులర్ జారీచేయడంతో అప్పట్లో విద్యార్థులు శాంతించారు. ఈ సంవత్సరం నుంచి యాజమాన్యం, ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు పొందిన బి కేటగిరీ విద్యార్థుల నుంచి పెంచిన ఫీజలు చెల్లించాలని నిర్ణయించారు. ఆ విషయం తెలుసుకున్న విద్యార్థులు రెండు రోజులుగా ఆందోళన బాటపట్టారు. కళాశాల ప్రాంగణంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫీజుల చెల్లింపు విషయంలో ప్రశ్నించిన ఒక విద్యార్థిని ప్రిన్సిపాల్ కొట్టడంతో పాటు మరో నలుగురు విద్యార్థుల దుస్తులు విప్పి బంధించారని విద్యార్థులు ఆరోపించారు. -
సీబీఐటీ కళాశాలలో రగడ
-
‘శృతి–2018’
-
దిగివచ్చిన సీబీఐటీ యాజమాన్యం
సాక్షి, మణికొండ: గండిపేటలోని చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల( సీబీఐటీ) విద్యార్థులు వారం రోజుల పాటు చేపట్టిన ఆందోళనలతో యాజమాన్యం దిగి వచ్చింది. మొదటి, రెండో సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు గతంలో ఉన్న ఫీజు రూ. 1,13,500 నుంచి ఏకంగా రూ. 2లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. ఫీజులను పెంచుతూ కళాశాల యాజమాన్యం నిర్ణయం తీసుకున్న మరుసటిరోజు నుంచే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పలు విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థుల ఆం దోళనకు మద్దతు ప్రకటించి విద్యార్థులతో పాటు ఆందోళనలో పాల్గొన్నాయి. ఆందోళన మరింత ఉధ్రుతం అవుతుండడంతో కళాశాలకు సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చింది. తల్లితండ్రులతో జరిగిన సమావేశంలోను పెంచిన ఫీజులను చెల్లించేందుకు వారు ససేమిరా అన్నారు. బోర్డు కమిటీ శనివారం సాయంత్రం మరో మారు సమావేశ మైంది. పేద విద్యార్థులపై పడుతున్న ఫీజు భారాన్ని ఉపసంహరించుకుంటున్నట్టుగా అధ్యక్షుడు డాక్టర్ వి.మాలకొండారెడ్డి ప్రకటించారు. కన్వీనర్ కోటాలో ఏ క్యాటగిరీ కింద సీట్లు పొందిన విద్యార్థులు మాత్రం పూర్తి ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు. ఇదే కన్వీనర్‌కోటాలో చేరిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాలకు చెందిన విద్యార్థులపైన ఈ భారం పడదని, వారు చెల్లించాల్సిన ఫీజులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకుంటామన్నారు. ఇక మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందిన వారిలోను ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వారికి స్కాలర్షిప్లను అందజేస్తామని తెలిపారు. మిగతా ఎన్ఆర్ఐ కోటా వారి ఫీజులో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. దీంతో రెండో సంవత్సరం విద్యార్థులు సోమవారం నుంచి తరగతులకు హాజరుకావాలని, మొదటి సంవత్సరం విద్యార్థులు ఈనెల 21 నుంచి ఉన్న సెమిస్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీందర్‌రెడ్డి తెలిపారు. -
ఉధృతమైన సీబీఐటీ విద్యార్థుల ఆందోళన..!
సాక్షి, హైదరాబాద్: ఫీజుల పెంపును నిరసిస్తూ గండిపేట్ సీబీఐటీ కాలేజీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన సోమవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఐదురోజులుగా ఆందోళన చేస్తున్నా.. సీబీఐటీ యాజమాన్యం తమ గోడును పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన ఏబీవీపీ కార్యకర్తలు.. పిన్సిపల్ రూమ్‌లోకి చొచ్చుకెళ్లి బైఠాయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపుటాల చోటుచేసుకుంది. విద్యార్థులు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ప్రిన్సిపాల్ చాంబర్లోనే ఏబీవీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో సీబీఐటీ కాలేజీ వారం రోజులు సెలవు ప్రకటించింది. మేనేజ్మెంట్తో మాట్లాడి ఫీజుల పెంపు సమస్యను పరిష్కరిస్తామని ప్రిన్సిపాల్ ప్రకటించారు. ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు కొనసాగిస్తున్న ఆందోళనకు ఏబీవీపీతోపాటు పలు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున గుమిగూడిన విద్యార్థులు గండిపేట్ నుంచి కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు. సీబీఐటీ యాజమాన్యం పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. శంకర్పల్లి చౌరస్తాలో సీబీఐటీ కాలేజీ బస్సులను ఏబీవీపీ అడ్డుకుంది. దీంతో ఏబీవీపీ కార్యకర్తలను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. -
సీబీఐటీ ప్రతిపాదన.. తిరస్కరించిన విద్యార్థులు!
సాక్షి, హైదరాబాద్: అధిక ఫీజులను నిరసిస్తూ నగరంలోని సీబీఐటీ కాలేజీ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళన నాలుగోరోజుకు చేరుకుంది. శనివారం కూడా విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనపై సీబీఐటీ యాజమాన్యం స్పందించింది. ఒక్కసారిగా పెంచిన అధిక ఫీజులు చెల్లించలేమంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. వారి ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఫీజు కట్టని విద్యార్థులపై ఒత్తిడి చేయబోమని, ఫీజులకు పరీక్షలకు సబంధం లేదని, ఫీజు కట్టకపోయిన పరీక్షలకు అనుమతిస్తామని యాజమాన్యం అంటోంది. ఈ నెల 22 తర్వాత పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. నిర్వహణ భారం అధికమైన నేపథ్యంలో పెంచిన ఫీజుల విషయంలో అందరికీ సడలింపు ఇవ్వలేమంటోంది. అయితే, యాజమాన్యం ప్రతిపాదనను విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు తిరస్కరించారు. ఇటీవల అదనంగా పెంచిన రూ. 86వేల ఫీజును తగ్గించాల్సిందేనని, ఫీజుల తగ్గింపు విషయంలో యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు అంటున్నారు. -
సీబీఐటీ ప్రతిపాదన.. తిరస్కరించిన విద్యార్థులు!
-
ఫీజులు తగ్గించాలని సీబీఐటీ విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: ఫీజు పెంపును నిరసిస్తూ నగర శివారు గండి పేటలోని చైతన్యభారతి ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. గతంలో నిర్ధారించిన ఫీజు కన్నా సంవత్సరానికి రూ.86 వేలను అధికంగా చెల్లిం చాలని యాజమాన్యం మంగళవారం మొద టి, రెండో సంవత్సరం విద్యార్థులకు నోటీసులిచ్చింది. పెంచిన ఫీజులను తగ్గిం చాలని, గతంలో పేర్కొన్న విధంగానే ఫీజులు వసూలు చేయాలని బుధవారం కళాశాల ఎదురుగా హైదరాబాద్– శంకర్పల్లి రోడ్డుపై బైఠాయించారు. నార్సింగి సీఐ రమణగౌడ్ విజ్ఞప్తి మేరకు విద్యార్థులు కళాశాల ఆవరణలోకి వచ్చారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాదా పూర్ ఏసీపీ శివప్రసాద్‌రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీందర్‌రెడ్డి సమక్షంలో విద్యార్థుల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ నెల 9న జరిగే కళాశాల బోర్డు సభ్యుల సమావేశంలో ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన డంతో ఆందోళన విరమించారు. కోర్టు అనుమతులతోనే పెంచుతున్నాం.. తమ కళాశాలలో ఉన్న సౌకర్యాలు, బోధన, సదుపాయాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిన ఫీజుల నియంత్రణ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఫీజులను పెంచాలని యాజమాన్యం నిర్ణ యించింది. దీనికి సెప్టెంబర్‌లోనే హైకోర్టు అనుమతిచ్చింది. ఈ విషయాన్ని కళాశాలలో చేరేటప్పుడు విద్యార్థులకు వివరించాం. అత్యధిక విద్యార్థులు ఈ విషయాన్ని అంగీ కరిస్తూ అఫిడవిట్లు సైతం ఇచ్చారు. – ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీందర్‌రెడ్డి -
ఉత్సాహంగా ‘సాక్షి’ యూత్ ఫెస్ట్
ఆడిపాడిన విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: డ్రమ్స్ బీట్స్ దుమ్మురేపుతుంటే... వెస్ట్రన్ ట్యూన్స్ అడుగులు కదిపి ఆడించేశాయి. రసరమ్యమైన సంగీత ఝరిలో కుర్రకారు తమను తాము మైమరిచిపోయారు. ఆకాశమే హద్దుగా... ఆనందమే విందుగా ఆస్వాదించేశారు. యువతలో దాగివున్న కళను వెలికితీయడానికి గండిపేటలోని సీబీఐటీ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన ‘సాక్షి ఎరీనా వన్’ యూత్ ఫెస్ట్ నవోత్సాహంతో అదిరిపోయింది. ‘బజాజ్ పల్సర్ ఇండియా నంబర్‌వన్ బైక్’ అసోసియేటెడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ ఫెస్ట్‌లో వివిధ కళాశాలలకు చెందిన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చదువుతోపాటు తమకు నచ్చిన కళారంగంలో ప్రతిభ చాటి ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు. తొలిరోజు నిర్వహించిన ‘బాటిల్ ఆఫ్ బ్యాండ్ అండ్ ఇనుస్ట్రుమెంటల్ సోలో’లో ఎవరికెవరూ తీసిపోనంతగా పోటీపడ్డారు. ఆహూతుల నుంచి అభినందనలు అందుకున్నారు. బ్రాస్‌బ్యాండ్ కేటగిరీలో హైదరాబాద్‌లోని గీతం వర్సిటీ, టీకే ఆర్ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి రెండు గ్రూపులు పోటీపడ్డాయి. వీటితోపాటు సోలో కేటగిరీలో మరో ఆరుగురు గిటారు, పియానో ప్లేతో వీనులవిందు చేశారు. కార్యక్రమంలో ‘సాక్షి’ మీడియా గ్రూపు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి మాట్లాడుతూ... తరగతి గదులకు పరిమితమైన కళాశాలల విద్యార్థులను ప్రపంచానికి పరిచయం చేయాలన్న సదుద్దేశంతో ఈ ఫెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల అభిరుచులకు ఇది చక్కటి వేదికన్నారు. సీబీఐటీ కళాశాల ప్రిన్సిపాల్ చెన్నకేశవరావు మాట్లాడుతూ ‘సాక్షి’ మీడియా నిర్వహిస్తున్న ఈ ఫెస్ట్‌కు తమ కళాశాల వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. పోటీల న్యాయనిర్ణేతలుగా విజయ్ వాడ్రేవు, అరుణ్ రుబె న్ వ్యవహరించారు. మొత్తం ఏడు విభాగాల్లో 30 రకాల పోటీలు ఈ ఫెస్ట్‌లో నిర్వహిస్తారు. వచ్చే నెల 21 వరకు నగరంలోని వివిధ వేదికల్లో ఈ పోటీలు జరుగుతాయి. -
నేడు ‘సాక్షి-ఎరీనా వన్’ యూత్‌ఫెస్ట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి-ఎరీనా వన్’ యూత్‌ఫెస్ట్ శుక్రవారం నగరంలో ప్రారంభం కానుంది. హైదరాబాద్ గండిపేటలోని సీబీఐటీ కళాశాల ఇందుకు వేదిక కానుంది. అసోసియేటెడ్ స్పాన్సర్ ‘బజాజ్ పల్సర్ ఇండియా నంబర్ 1 బైక్’ సౌజన్యంతో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలిరోజు ‘బాటిల్ ఆఫ్ బ్యాండ్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ సోలో’ అంశంపై పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావచ్చు. మిగిలిన అంశాల్లో నిర్వహించే పోటీల వివరాలను ‘సాక్షి ఎరీనా వన్’ యాప్ ద్వారా త్వరలో వెల్లడించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.