
హైదరాబాద్: ఫీజు పెంపును నిరసిస్తూ నగర శివారు గండి పేటలోని చైతన్యభారతి ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. గతంలో నిర్ధారించిన ఫీజు కన్నా సంవత్సరానికి రూ.86 వేలను అధికంగా చెల్లిం చాలని యాజమాన్యం మంగళవారం మొద టి, రెండో సంవత్సరం విద్యార్థులకు నోటీసులిచ్చింది. పెంచిన ఫీజులను తగ్గిం చాలని, గతంలో పేర్కొన్న విధంగానే ఫీజులు వసూలు చేయాలని బుధవారం కళాశాల ఎదురుగా హైదరాబాద్– శంకర్‌పల్లి రోడ్డుపై బైఠాయించారు. నార్సింగి సీఐ రమణగౌడ్ విజ్ఞప్తి మేరకు విద్యార్థులు కళాశాల ఆవరణలోకి వచ్చారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాదా పూర్ ఏసీపీ శివప్రసాద్‌రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీందర్‌రెడ్డి సమక్షంలో విద్యార్థుల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ నెల 9న జరిగే కళాశాల బోర్డు సభ్యుల సమావేశంలో ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన డంతో ఆందోళన విరమించారు.
కోర్టు అనుమతులతోనే పెంచుతున్నాం..
తమ కళాశాలలో ఉన్న సౌకర్యాలు, బోధన, సదుపాయాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిన ఫీజుల నియంత్రణ కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఫీజులను పెంచాలని యాజమాన్యం నిర్ణ యించింది. దీనికి సెప్టెంబర్‌లోనే హైకోర్టు అనుమతిచ్చింది. ఈ విషయాన్ని కళాశాలలో చేరేటప్పుడు విద్యార్థులకు వివరించాం. అత్యధిక విద్యార్థులు ఈ విషయాన్ని అంగీ కరిస్తూ అఫిడవిట్‌లు సైతం ఇచ్చారు.
– ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీందర్‌రెడ్డి