CEO Amitabh Kant
-
‘నీతి’ ఆరోగ్య సూచీలో కేరళ టాప్
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ వెల్లడించిన ఆరోగ్య సూచీలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. వైద్యసదుపాయాలు, శిశు మరణాల రేటు, ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు, సంపూర్ణ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం అమలు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ‘ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు, ప్రగతిశీల భారతం: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ర్యాంకుల రిపోర్టు’ పేరుతో నీతి ఆయోగ్–ప్రపంచబ్యాంకు సంయుక్తంగా రూపొందించిన ఈ జాబితాను శుక్రవారం విడుదల చేశారు. గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. గతంతో పోలిస్తే ఇటీవల వైద్యప్రమాణాలు మెరుగుపరుచుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్ అట్టడుగు స్థానంలో నిలిచింది. జాబితాలో దారుణమైన పనితీరును కనబరిచిన రాష్ట్రాలుగా రాజస్తాన్, బిహార్, ఒడిశా నిలిచాయి. ఏపీ 8వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే మెరుగైన వైద్యవసతులు కల్పిస్తున్న జాబితాలో జార్ఖండ్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్ తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాలను మరింత ప్రోత్సహిస్తామని.. ఈ జాబితా విడుదల సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. జాబితాలో తొలిస్థానంలో నిలవటం.. ఎల్డీఎఫ్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ వెల్లడించారు. తొలి మూడు తుది మూడు కేరళ బిహార్ పంజాబ్ రాజస్తాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ -
స్కూళ్లూ, జైళ్లూ కూడా ప్రైవేట్‌పరం చేయాలి
♦ ఇన్ఫ్రా ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం తప్పుకోవాలి ♦ నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ న్యూఢిల్లీ: ప్రభుత్వం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాలని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. కెనడా.. ఆస్ట్రేలియా వంటి దేశాల తరహాలోనే స్కూళ్లు, కాలేజీలు, జైళ్లను కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన ఇండియా పీపీపీ సదస్సు 2017లో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వం చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించింది. కానీ నిర్వహణ మాత్రం గొప్పగా చేయలేదు. అందుకే ప్రభుత్వం రివర్స్ బాట్ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానానికి మళ్లాలి.. ప్రాజెక్టులను విక్రయించేసి, నిర్వహణను ప్రైవేట్ రంగానికే అప్పగించాలి‘ అని కాంత్ చెప్పారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయాల్లోని బాత్రూమ్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని ఉదహరిస్తూ.. ఇలాంటివన్నీ ప్రైవేట్ రంగానికి అప్పగించాలని సూచించారు. -
రవాణా భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ వాహనాలదే
న్యూఢిల్లీ: భారతదేశ రవాణా వ్వవస్థ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ప్రతి అయిదు సంవత్సరాలకు బ్యాటరీల ఖర్చు దాదాపు సగం తగ్గుతోందని దీంతో రాబోయే 4-5 సంవత్సరాలలో, ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోలు లేదా డీజిల్ వాహనాల కంటే చాలా చవగ్గా లభిస్తాయని చెప్పారు. అలాగే నిర్వహరణ ఖర్చు కేవలం 20 శాతం మాత్రమేనని చెప్పారు. నీతిఆయోగ్, రాక్ మౌంటైన్ ఇన్సిస్టిట్యూట్ నిర్వహించిన విడుదల చేసిన ఒక ఉమ్మడి నివేదిక ను బుధవారం వెల్లడించింది. 2030 నాటికి భారతదేశం కోసం కార్బన్ ఉద్గారాలను 1 గిగాటోన్ (జిటి) గా తగ్గనుందనీ, డీజిల్, పెట్రోల్ ఖర్చుల్లో 60 బిలియన్ డాలర్లను ఆదా చేయగలమని నివేదించింది. అయితే ప్రయివేట వాహనాలయాజమాన్యం ద్వారా దేశం సవాళ్లు ఎదుర్కోనుందని తెలిపింది. ఈ సందర్భంగా కాంత్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన మరో ఉద్ఘాటించారు. రాబోయే దశాబ్దకాలంలో ఇవి భారీ ఎత్తున మార్కెట్లోకి రానున్నాయన్నారు. అయిదే ఈ ప్రక్రియలో ఆలస్యమైతే.. చమురుకు బదులుగా బ్యాటరీలను దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి వస్తుందని..ఇది పెద సవాలని తెలిపారు. దీంతో మార్కెట్లో వెనుకబడిపోతామని హెచ్చరించారు. అందుకే ఈ వాహనాల తయారీలో ముందుండాలన్నారు. పెద్ద స్థాయిలో గిరాకీని పెంచడం ముఖ్యమనీ, ప్రభుత్వ వాహనాలపై, ప్రజా వాహనాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రభుత్వం దానిని నడపడం చాలా ముఖ్యమని కాంత్ అన్నారు. ఈ నివేదిక ప్రకారం, వార్షిక డీజిల్ , పెట్రోల్ వినియోగం 2030 నాటికి 156 మిలియన్ టన్నుల దాకా తగ్గనుంది. తద్వారా సంవత్సరానికి 3.9 లక్షల కోట్ల రూపాయల ($ 60 బిలియన్) ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతుంది. పాసెంజర్ మొబిలిటీ సంబంధిత డిమాండ్64 శాతం తగ్గడంతోపాటు, 2030 నాటికి 37శాతం కార్బన్ ఉద్గారాలను నిరోధించకలుగుతుందని నివేదిక అంచనా వేసింది. '2030 నాటికి వార్షిక డీజిల్, పెట్రోల్ తగ్గింపు 156 మిలియన్ టన్నుల చమురుతో సమానమవుతుందని నివేదించింది. -
భీమ్ యాప్ డౌన్లోడ్స్ ఎన్నో తెలుసా?
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల యాప్ భీం(బీహెచ్ఐఎం) రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారరంభించిన డిజిటల్ పేమెంట్స్ యాప్ కు భారీ ఆదరణ లభిస్తోంది డౌన్ లోడ్స్లో 17 మిలియన్లను దాటిందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాలను ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ఈ యాప్‌ను ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. తొలుత ఈ యాప్‌కు సాంకేతికంగా కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయని చెప్పిన కాంత్ అవి ఇప్పుడు గణనీయంగా తగ్గాయని చెప్పారు. అలాగే ప్రస్తుతం ఈ యాప్ కోసం ఐవోస్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దీంతో పాపులర్ ఆండ్రాయిడ్ వెర్షన్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే గత ఏడాది నవంబరు, డిసెంబర్ కాలంలో యూఎస్ఎస్డీ ఆధారిత ట్రాన్సాక్షన్లు (ఫీచర్ ఫోన్లో బ్యాంకింగ్ సేవలకు పయోగించే మొబైల్ కోడ్ సందేశం) 45 శాతం పెరిగాయని, నవంబరు 8కి ముందు భారత్‌లో 8 లక్షల పీవోఎస్ మిషన్లు మాత్రమే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 28 లక్షలకు పెరిగిందని అమితాబ్ కాంత్ వెల్లడించారు. కాగా డీమానిటైజేషన్ అనంతరం డిశెంబర్ 30 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంచ్ బీమ్ యాప్ ను లాంచ్ చేశారు. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహ అందించే దిశగా ఈయాప్ ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ముఖ్యంగా మొబైల్ వాలెట్స్, యూఎస్ఎస్డీ,రూ పే లాంటి డిజిటల్ చెల్లింపులకు గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే.