CEO Rajesh Gopinathan
-
టీసీఎస్ లాభం రూ. 10 వేల కోట్లు
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అంచనాలకు అనుగుణమైన లాభాలతో రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల సీజన్‌కు బోణీ కొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ లాభం 8.4 శాతం పెరిగి రూ. 10,431 కోట్లుగా నమోదైంది. టీసీఎస్ లాభాలు ఒక త్రైమాసికంలో రూ. 10వేల కోట్ల మైలురాయిని అధిగమించడం ఇదే ప్రథమం. ఇక సమీక్షా కాలంలో ఆదాయం 18 శాతం ఎగిసి రూ. 55,309 కోట్లకు చేరింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ. 46,867 కోట్ల ఆదాయంపై రూ. 9,624 కోట్ల లాభం నమోదు చేసింది. సీక్వెన్షియల్‌గా చూస్తే లాభం 10 శాతం, ఆదాయం 5 శాతం పెరిగాయి. ‘మా సర్వీసులకు డిమాండ్ పటిష్టంగా ఉంది. వివిధ విభాగాలు, మార్కెట్లలో లాభదాయకతపరంగా మెరుగైన వృద్ధి నమోదు చేశాం‘ అని సంస్థ సీఈవో రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. అయితే, వ్యాపార పరిస్థితులు ‘సవాళ్లతో‘ కూడుకుని ఉన్నాయని, మరింత ‘అప్రమత్తంగా‘ వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి రిస్కుల ప్రభావం కంపెనీపై పడకుండా సాధ్యమైన ప్రయత్నాలన్నీ చేస్తామని స్పష్టం చేశారు. భౌగోళిక, రాజకీయపరమైన సవాళ్లపై ఆందోళనల కారణంగా క్లయింట్లు దీర్ఘకాలిక డీల్స్‌కు దూరంగా ఉంటున్నారని సీవోవో గణపతి సుబ్రమణియం చెప్పారు. ధరలపరంగా పరిస్థితి స్థిరంగానే ఉందని, రూపా యి క్షీణత కారణంగా ఒత్తిళ్లేమీ లేవని పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ► షేరు ఒక్కింటికి రూ. 8 చొప్పున టీసీఎస్ రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డు తేదీ అక్టోబర్ 18 కాగా, నవంబర్ 7న చెల్లిస్తుంది. ► క్యూ2లో నిర్వహణ మార్జిన్ 1.6% క్షీణించి 24%కి పరిమితమైంది. నాలుగో త్రైమాసికం నాటికి దీన్ని 25%కి పెంచుకోవాలని.. తర్వాత 26–28%కి చేరుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. ► విభాగాల వారీగా చూస్తే సమీక్షా కాలంలో రిటైల్, సీపీజీ (కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్) 22.9%, కమ్యూనికేషన్స్.. మీడియా 18.7 శాతం, టెక్నాలజీ .. సర్వీసులు 15.9 శాతం, తయారీ 14.5 శాతం, బీఎఫ్ఎస్ఐ 13.1% మేర వృద్ధి నమోదు చేశాయి. ► కంపెనీ ఆర్డరు బుక్ విలువ సెప్టెంబర్ త్రైమాసికంలో 8.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో 400 మిలియన్ డాలర్ల ఒప్పందమే అతి పెద్దది. ► క్యూ2లో కొత్తగా 9,840 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 6,16,171కి చేరింది. మహిళా సిబ్బంది వాటా 35.7 శాతంగా ఉంది. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) జూన్ త్రైమాసికంలో 19.7 శాతంగా ఉండగా క్యూ2లో 21.5 శాతానికి చేరింది. అయితే, ఇది దాదాపు గరిష్ట స్థాయికి చేరినట్లేనని, ఇక్కడి నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని లక్కడ్ తెలిపారు. టీసీఎస్ షేరు సోమవారం 2% పెరిగి 3,121 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వచ్చాయి. -
టెక్ దిగ్గజం టీసీఎస్ లో భారీ మార్పులు..
-
టెక్ దిగ్గజం టీసీఎస్ లో భారీ మార్పులు..
బెంగళూరు : దేశీయ అతిపెద్ద ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసు(టీసీఎస్) లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 9 ఏళ్ల కాలంలో తొలిసారి భారీ పునర్వ్యస్థీకరణ ప్రక్రియను టీసీఎస్ చేపట్టింది. తమ బిజినెస్ లైన్స్ ను పునర్వ్యస్థీకరించి, వాటికి కొత్త అధినేతగా క్రిష్ణన్ రామానుజంను నియమించింది. దీంతో బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసుల అధినేతగా క్రిష్ణన్ రామానుజంను నియామకం అయ్యారు. అంతేకాక కంపెనీ వ్యాపారాల అధినేతలను కూడా టీసీఎస్ మార్చేసింది. డిజిటల్ ఆఫర్స్ ను వృద్ధి చేయడానికి టీసీఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 2009లో కొత్త సీఈవోగా ఎన్ చంద్రశేఖరన్ అపాయింట్ అయినప్పుడు కంపెనీ తన ఆర్గనైజేషన్ లో భారీ మార్పులు చేపట్టింది. అనంతరం ఇప్పటివరకు ఎలాంటి పునర్వ్యస్థీకరణ ప్రక్రియను చేపట్టలేదు. ప్రస్తుతం చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్ గా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో టీసీఎస్ కొత్త సీఈవోగా రాజేష్ గోపినాథ్ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచమంతా వేగవంతంగా డిజిటల్ లోకి రూపాంతరం చెందుతుండటంతో డిజిటల్ లాంటి కొత్త వ్యాపారలపై దృష్టిసారించాలని టీసీఎస్ నిర్ణయించిందని తెలిసింది. ఈ నేపథ్యంలో భాగంగా పునర్వ్యస్థీకరణ ప్రక్రియ ఈ కంపెనీ చేపట్టింది. 2017 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ డిజిటల్ బిజినెస్ లు 28 శాతం పెరిగాయి. కంపెనీ రెవెన్యూల్లో 16 శాతం ఇవే ఆక్రమించుకున్నాయి. ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ డేటా ప్రకారం 155 బిలియన్ డాలర్ల ఇండస్ట్రి రెవెన్యూల్లో డిజిటల్ వ్యాపారాల శాతం 14 శాతమున్నట్టు తెలిసింది. ఈ పునర్వ్యస్థీకరణ తమల్ని మరింత చురుకుగా తయారుచేస్తుందని రామానుజం తెలిపారు. యంగ్ లీడర్స్ కు అవకాశాలు వృద్ధి పెరుగుతుందన్నారు. మొత్తంగా అన్ని సర్వీసుల లైన్స్ ను కలిపి ఒక మెగా యూనిట్ గా టీసీఎస్ రూపొందించింది. అదే బిజినెస్ టెక్నాలజీ సర్వీసులు. ప్రస్తుతం దీనికి అధినేతగానే రామానుజం నియామకం అయ్యారు. కొన్ని సర్వీసు లైన్స్ అధినేతల్లోనూ పునర్వ్యస్థీకరణ చేపట్టిందని టీసీఎస్ ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. -
చల్లటి మాట చెప్పిన టీసీఎస్
ముంబై: ఐటి కంపెనీల భారీ ఉద్యోగాలకోతతో ఆందోళనలో ఉన్న టెకీలకు ప్రపంచ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) శుభవార్త అందించింది. ఒకవైపు దిగ్గజ టెక్ కంపెనీలు వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంటే టీసీఎస్ సమీప భవిష్యత్తులో అలాంటి ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా మరింతమంది ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామంటూ తీపికబురు అందించింది. ప్రభుత్వ డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) కొత్త బీపీవో కేంద్రాన్ని గురువారం లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగుల కోతపై ప్రశ్నించినపుడు ఖచ్చితంగా అలాంటి ప్రణాలికలేవీ లేవని టీసీఎస్ సీఈవో, ఎండీ, రాజేష్ గోపీనాథన్ వెల్లడించారు. తమ సంస్థ విస్తరణలో భాగంగా మరింత మందిని టెక్ నిపుణులు నియమించుకోనున్నట్టు తెలిపారు. టిసిఎస్ అధికార ప్రతినిధి ప్రదీప్ బాజీ మాట్లాడుతూ డిటిటల్ ఇండియా ఇనీషియేషన్ తో భవిష్యత్తులో దేశీయ ఐటి రంగంలో మరింత ప్రకాశవంతంగా ఉండనుందన్నారు. ఈనేపథ్యంలో ఎక్కువ మంది వ్యక్తులతో కనెక్ట్ కావడానికి తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు. దేశీయ ఐటీ కంపెనీలు కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర ఉద్యోగులను తగ్గించుకుంటోంటే టీసీఎస్ ప్రకటన ఆహ్వానించతగినదని మార్కెట్నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా టిసిఎస్ 45 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది, ప్రపంచంలోని ఉత్తమ శిక్షణ పొందిన కన్సల్టెంట్లు 387,000 మంది ఉన్నారు. మార్చి 31, 2017 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కంపెనీ 17.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమీకరించింది. -
రాజేశ్ గోపీనాథన్‌కు టీసీఎస్ పగ్గాలు
• చంద్రశేఖరన్ స్థానంలో ఎంపిక • ఫిబ్రవరి 21న బాధ్యతల స్వీకరణ ముంబై: టీసీఎస్ నూతన ఎండీ, సీఈవోగా రాజేశ్ గోపీనాథన్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న ఎన్.చంద్రశేఖరన్ టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులు కావడంతో, ఆయన స్థానంలో నూతన నాయకుడిగా గోపినాథన్ను టీసీఎస్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 21న ఎన్.చంద్రశేఖరన్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. అలాగే, కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా ఎన్ గణపతి సుబ్రమణ్యంను నియమించింది. ఈయనను టీసీఎస్ బోర్డు డైరెక్టర్‌గానూ ఎంపిక చేసింది. ప్రస్తుతం సుబ్రమణ్యం టీసీఎస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రాజేశ్ గోపీనాథన్ 2001 నుంచీ టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. 2013 ఫిబ్రవరిలో టీసీఎస్ సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. ఎన్S. చంద్రశేఖరన్ చదివిన తిరుచ్చి ఆర్ఈసీలోనే రాజేశ్ గోపీనాథన్ కూడా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. టీసీఎస్ ఎదుగుదలలో ఆయన పాత్ర కూడా ఉంది.