టెక్ దిగ్గజం టీసీఎస్ లో భారీ మార్పులు..
టెక్ దిగ్గజం టీసీఎస్ లో భారీ మార్పులు..
Published Wed, May 17 2017 9:24 AM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM
బెంగళూరు : దేశీయ అతిపెద్ద ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసు(టీసీఎస్) లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 9 ఏళ్ల కాలంలో తొలిసారి భారీ పునర్వ్యస్థీకరణ ప్రక్రియను టీసీఎస్ చేపట్టింది. తమ బిజినెస్ లైన్స్ ను పునర్వ్యస్థీకరించి, వాటికి కొత్త అధినేతగా క్రిష్ణన్ రామానుజంను నియమించింది. దీంతో బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసుల అధినేతగా క్రిష్ణన్ రామానుజంను నియామకం అయ్యారు. అంతేకాక కంపెనీ వ్యాపారాల అధినేతలను కూడా టీసీఎస్ మార్చేసింది. డిజిటల్ ఆఫర్స్ ను వృద్ధి చేయడానికి టీసీఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 2009లో కొత్త సీఈవోగా ఎన్ చంద్రశేఖరన్ అపాయింట్ అయినప్పుడు కంపెనీ తన ఆర్గనైజేషన్ లో భారీ మార్పులు చేపట్టింది.
అనంతరం ఇప్పటివరకు ఎలాంటి పునర్వ్యస్థీకరణ ప్రక్రియను చేపట్టలేదు. ప్రస్తుతం చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్ గా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో టీసీఎస్ కొత్త సీఈవోగా రాజేష్ గోపినాథ్ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచమంతా వేగవంతంగా డిజిటల్ లోకి రూపాంతరం చెందుతుండటంతో డిజిటల్ లాంటి కొత్త వ్యాపారలపై దృష్టిసారించాలని టీసీఎస్ నిర్ణయించిందని తెలిసింది. ఈ నేపథ్యంలో భాగంగా పునర్వ్యస్థీకరణ ప్రక్రియ ఈ కంపెనీ చేపట్టింది. 2017 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ డిజిటల్ బిజినెస్ లు 28 శాతం పెరిగాయి. కంపెనీ రెవెన్యూల్లో 16 శాతం ఇవే ఆక్రమించుకున్నాయి.
ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ డేటా ప్రకారం 155 బిలియన్ డాలర్ల ఇండస్ట్రి రెవెన్యూల్లో డిజిటల్ వ్యాపారాల శాతం 14 శాతమున్నట్టు తెలిసింది. ఈ పునర్వ్యస్థీకరణ తమల్ని మరింత చురుకుగా తయారుచేస్తుందని రామానుజం తెలిపారు. యంగ్ లీడర్స్ కు అవకాశాలు వృద్ధి పెరుగుతుందన్నారు. మొత్తంగా అన్ని సర్వీసుల లైన్స్ ను కలిపి ఒక మెగా యూనిట్ గా టీసీఎస్ రూపొందించింది. అదే బిజినెస్ టెక్నాలజీ సర్వీసులు. ప్రస్తుతం దీనికి అధినేతగానే రామానుజం నియామకం అయ్యారు. కొన్ని సర్వీసు లైన్స్ అధినేతల్లోనూ పునర్వ్యస్థీకరణ చేపట్టిందని టీసీఎస్ ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.
Advertisement
Advertisement