cheaters
-
మహిళను ముంచిన ‘మ్యాట్రిమోని’ ప్రేమ!
హైదరాబాద్: మ్యాట్రిమోని సైట్లో పరిచయం చేసుకొని నగరానికి చెందిన ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసం చేశారు. నగర సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళ వివాహం కోసం మ్యాట్రిమోని సైట్లో రిజిస్టార్ చేసుకుంది. ఈ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి కొద్ది రోజులు చాట్ చేసుకున్నారు. తనను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తాను అమెరికాలో ఉన్నత స్థాయిలో పనిచేసే వ్యక్తినని, అమెరికా నుంచి ఇండియా వచ్చాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజుల తర్వాత ఇండియాలో ఉన్న తమ బంధువులకు సీరియస్‌గా ఉందని, వైద్యం చేయించాలని చెప్పి ఆ ఖర్చులకు గాను డబ్బులు కావాలని అడిగాడు. తాను ఇండియా వచ్చాక మొత్తం డబ్బులు తిరిగి ఇస్తానని, తర్వాత పెళ్లి కూడా చేసుకుందామని నమ్మించాడు. దీంతో ఆ మహిళ విడతల వారిగా రూ. 30 లక్షలు చీటర్స్ చేప్పిన విధంగా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం ఆ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన మహిళ మోసపోయానని నగర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. ఈ తరహా మ్యాట్రిమోని మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వారితో ఆన్లైన్లో ప్రేమ, పెళ్లి అని చెబితే నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
రామోజీ – బాబోజీ అండ్ కో...
షాపూర్జీ – పల్లోంజీ అనేది దేశంలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూప్. ఇలా జంటశ్రీల పేర్లతో జాయింట్ వ్యాపార సంస్థలు దేశంలో చాలా ఉన్నాయి. వీటన్నింటిలోకీ అత్యంత సృజనాత్మక మైన గ్రూప్ రామోజీ – బాబోజీ గ్రూప్! వారు తెలుగువారు కావడం తెలుగు వారందరూ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవలసిన విషయం. అందరికీ మల్లేనే వీరికీ విడివిడిగా సంప్రదాయ వ్యాపారాలున్నాయి. పచ్చళ్లూ, పాలు, పెరుగు, పూటకూళ్ల హోటళ్లు, పత్రికలూ వగైరా! వేరువేరుగా ఇన్ని వ్యాపార పీస్లున్నప్పటికీ వారు మాత్రం నాట్ హ్యాపీస్! బొంబాయి మాఫియా మీద వచ్చిన అన్ని సినిమాల్లోనూ ‘వుడ్ బీ డాన్’లు కామన్‌గా చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. ‘నేను బొంబాయిలో బతకడానికి రాలేదు, బొంబాయిని ఏలడానికి వచ్చాన’ని! రామోజీ, బాబోజీ హృదయాల్లో కూడా ఇటువంటి కోరికలే ఆరని అగ్నిజ్వాలలై భగభగ మండుతూ ఉండేవని వారి బయోగ్రఫీని తిరగేస్తే మనకు అర్థమవుతుంది. నువ్వాదరినీ, నేనీదరినీ అన్నట్టుగా వేరువేరు చోట్ల మండుతున్న ఈ రెండు కంచు కాగడాలను విధియాడిన వింత నాటకం ఒక చోటకు చేర్చింది. ఇంకేముంది! ప్రళయం రానే వచ్చింది. ఆకాశంలోని పక్షు లన్నీ భయంతో అరుస్తూ రెక్కలు అల్లాడిస్తూ నేలకు రాలి పడ్డాయి. అచ్చం అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిన్నచిన్న చిట్‌ఫండ్ కంపెనీలన్నీ రాలిపడ్డాయి. సూర్యుడు భగభగ మండుతూ అగ్నిగోళంలా దర్శనమిస్తాడు. ఫలితంగా భూమ్మీద ప్రజాస్వామ్యంలో దొంగలు పడ్డారు. చంద్రుడు బాబోజీ అనే అర్భకుడు రామోజీ సహకారంతో వెన్నుపోటు విద్యను ఉపయో గించుకొని దొడ్డిదారిన రాజ్యాధికారం చేపట్టాడు. చరిత్ర ఎరుగని వింతలు – విడ్డూరాలు ఒకదాని వెంట మరొకటి తరుముకుంటూ పరిణమించాయి. బిజినెస్ మ్యాన్ బాబోజీ అలియాస్ పొలిటికల్ చంద్ర బాబుకు సంబంధించిన రాజకీయ ప్రస్థానం తెలుగు ్రçపజలకు చర్వితచర్వణమే. అతనిలోని నివురుగప్పిన బిజినెస్ నిప్పును రాజేయగల పెట్టుబడికి స్వయంగా స్థోమత లేదు. రెండెకరాల పేద రైతు కుటుంబం. అందుకని రాజకీయ రూట్లో నరుక్కు రావాలని సంకల్పించారు. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఇందిరా కాంగ్రెస్ టిక్కెట్ కావాలనే పేరున్న నాయకుడు ఎవరూ మిగల్లేదు. ఏదో ఒక పార్టీ టిక్కెట్ పాలి టిక్స్‌కు పాస్‌పోర్టుగా పనికొస్తుందని చంద్రబాబు చంద్రగిరి నుంచి దరఖాస్తు చేసుకున్నారు. జాక్‌పాట్ తగిలినట్లయింది. ఇందిరమ్మ ప్రభంజనం రాష్ట్రాన్ని కమ్మేసింది. అనూహ్యంగా చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి అంజయ్యను ప్రసన్నం చేసుకోగలిగారు. మంత్రిపదవి లభించింది. బిజినెస్ మ్యాన్‌కు పెట్టుబడి దొరికింది. పెళ్లికాని యువకుడు, తమ సామాజికవర్గం వాడు మంత్రిపదవిలో ఉండడంతో ఎన్టీఆర్ తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు. బిజినెస్ మొదలైంది. తొలిమెట్టుగా తిరుపతి పుణ్యక్షేత్రంలోనే సొంత స్నేహితుల్ని మోసం చేసి ఒక హోటల్‌ను సొంతం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి మోసపు మెట్లనే ఒక్కొ క్కటిగా పేర్చుకుంటూ హెరిటేజ్ భవంతిని నిర్మించుకున్నారు. హెరిటేజ్ వ్యవహారంలో బాబు తనను మోసం చేశాడని మోహన్‌బాబు వంటి సెలబ్రిటీయే వాపోయిన సంగతి తెలిసిందే. కాలక్రమంలో చంద్రబాబుకు రామోజీతో ఒక సహకార ఒప్పందం కుదిరింది. ‘నీకిది – నాకది’ అనే సూత్రంపై కుదిరిన సహకార ఒప్పందం ఫలితంగా బాబు ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయం ఆయన బిజినెస్‌గా మారింది. బిజినెస్‌లు బినామీ పేర్లతో ఖండాంతరాల్లో ప్రవర్ధమానమవుతున్నాయన్న వార్తలు వచ్చాయి. అడ్డగోలుగా సంపాదించాలనుకునే చాలామందికి రామోజీ కథ చాలా ఉత్తేజభరితమైనది. అనుసరించిన మార్గం ఏదయితే నేమి ఆయనొక వ్యాపార మహాసామ్రాజ్యాన్ని నిర్మించగలిగారని ఈ బ్యాచ్‌వారు కీర్తిస్తుంటారు. ఆరంభంలో చేరదీసిన జేజే రెడ్డి అనే శ్రేయోభిలాషికి రామోజీ శఠగోపం పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాతనే ఆయన ప్రస్థానం వేగం పుంజు కున్నదట! ‘ఈనాడు’ పత్రిక కోసం విశాఖలో స్థలాన్ని అద్దెకు ఇచ్చిన రాజుగారిని మానసిక హింసకు గురిచేశారు. అదే రాజుగారు హైదరాబాద్ స్థలాన్ని కూడా లీజుకిచ్చారు. అక్కడ కూడా ఆయనకు చుక్కల్ని చూపించారట! విజయవాడ స్థలాన్ని చ్చిన సొంత తోడల్లుడు కూడా తర్వాత ఘొల్లుమనడం అందరికీ తెలిసిన విషయమే! ‘ఒకటా రెండా? ఎన్నని చెప్పను మా బాబాయి లీలలు’ అంటూ రామోజీ సోదరుని కుమారుడు చంద్రమౌళి ఏకంగా ఒక పుస్తకాన్నే రచించి జనంలోకి వదిలారు. మూడు మోసాలు – ఆరు వంచనలతో ఇలా సాగుతున్న రామోజీ వ్యాపార ప్రస్థానం చంద్రబాబుతో కుదిరిన సహకార ఒప్పందం తర్వాత మరో మలుపు తిరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూడు ప్రధానాంగాలపై ఆధారపడి పనిచేస్తుంది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు ఈ ప్రధానాంగాలు. వాటితోపాటు ఆరోగ్యకరమైన మీడియా కూడా ప్రజాస్వామ్య పరిపుష్టికి దోహదం చేస్తుందన్న విశ్వాసంతో దాన్ని ‘ఫోర్త్ ఎస్టేట్’గా పిలిచి గౌరవించారు. అధికారంలో ఉన్నప్పుడు శాసన, కార్యనిర్వాహక విభాగాలను వారి వ్యాపార ప్రయోజ నాలకే వాడుకున్నారు. వారి ప్రయోజనాలనే లోకకల్యాణంగా ప్రచారం చేసుకోవడానికి ఫోర్త్ ఎస్టేట్ మీద వారు సాధించిన ఆధిపత్యం తోడ్పడింది. లిటిగెంట్ వ్యూహాలతో, నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్ వంటి ఎత్తుగడలతో అనుకూల తీర్పులు వచ్చేలా చేసుకోవడంలో ప్రావీణ్యం సాధించారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల చేతిలో ఉండ వలసిన రాజదండాన్నీ ఈ ముఠా చేజిక్కించుకున్నది. వ్యవస్థల మీద పట్టుతో, మ్యానిపులేషన్లతో సకల వనరుల మీద కూడా వ్యాపార భాగస్వాములు అదుపు సాధించారు. చెరువుల్ని, గుట్టల్ని, రహదారుల్ని యథేచ్ఛగా ఆక్రమించి, చట్టాన్ని చట్టుబండగా మార్చి రామోజీ ఫిలింసిటీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. చట్టవిరుద్ధంగా వేలకోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించి సొంత వ్యాపారాలకు మదుపు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పునాది వేసిన ఐటీ టవర్స్ విషయాన్ని మూడేళ్లపాటు తొక్కిపెట్టి తమ బినామీలు, ముఠా సభ్యులతో దానిచుట్టూ రియల్ ఎస్టేట్ బేరాలు చేసిన అనంతరమే నిర్మాణాన్ని ప్రకటించారు. ఈ వ్యవహారంతో వేల కోట్ల రూపాయల లాభాన్ని వీరి ముఠా కళ్లచూడగలిగింది. మాదాపూర్ ఐటీ ప్రాంతంలో జరిగిన వ్యాపారాన్ని సూక్ష్మరూపంగా భావిస్తే అమరావతి రాజధాని ప్రాంతం విశ్వరూపంగా పేర్కొనవచ్చు. ఈ ముఠా వేల కోట్లలో ఇక్కడ పెట్టుబడి పెట్టి ఉండవచ్చని అంచనాలున్నాయి. లక్షల కోట్లలో లాభాలు పిండుకోవాలని తహతహలాడారు. ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో కథ అడ్డం తిరిగింది. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ భిన్నమైన పాలనా విధానాన్ని ఎంచుకోవడం ఈ వ్యాపార ముఠాకు మింగుడు పడలేదు. జగన్ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ మార్గాన్ని ఎంచుకున్నది. అధికార యంత్రాంగం ప్రజలకు చేరువగా వెళ్లడం వలన పారదర్శకత పెరుగుతుందనీ, తద్వారా అవినీతికి అవకాశం చిక్కదనీ ఈ ప్రభుత్వ ఆలోచన. దీనికితోడు టెక్నాలజీ వినియోగం ద్వారా ఒక్క పైసా వృథా కాకుండా నేరుగా లబ్ధిదారులకు చేర్చేవిధంగా కార్యక్రమాలను తయారు చేసుకున్నది. మరోపక్క ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాలం చేసిన గాయాలను గమనంలోకి తీసుకొని, మరోసారి గాయపడితే మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న నిర్ధారణతో మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇదొక వినూత్న ఆలోచన. విస్తృతస్థాయిలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే ప్రతిపాదన. కానీ బాబోజీ – రామోజీ కంపెనీతోపాటు దాని అనుబంధ కంపెనీ లకూ గుండెల్లో అణుబాంబు పేలినట్లయింది. ఈ ప్రభుత్వాన్ని తక్షణం గద్దె దింపవలసిన అగత్యం ఈ వ్యాపార ముఠాకు ఏర్పడింది. లక్షల కోట్ల కల గాలిలో దీపంలా మారడంతో ప్రభుత్వం మీద ఈ ముఠా యుద్ధాన్ని ప్రకటించింది. ఉచ్చమూ – నీచమూ అన్న ఇంగితం లేదు. న్యాయమూ – అన్యాయమన్న విచికిత్స లేదు. ధర్మమూ – అధర్మమన్న విచక్షణ లేదు. ప్రభుత్వం మీద బండలేయడమే ఏకైక కర్తవ్యంగా మారింది. ఈ కర్తవ్యంలో భాగమే ప్రతిరోజూ జరుగుతున్న విష ప్రచారం. రామోజీ పత్రిక ఛీనాడులో ప్రతిరోజూ శాపనార్థాలే బ్యానర్లు. ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేస్తే అది లోపల పేజీ వార్తగా మారింది. ఒక గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చేస్తే అది ప్రభుత్వ కక్ష అనే బ్యానర్ వార్తగా మారింది. అప్పటికే ఆ వరసలో యాభై ఇళ్ల ప్రహరీ గోడలు కూల్చారనీ, అందుకు ఆ ఇళ్ల యజమానులు సమ్మతించారనే వాస్తవాన్ని మాత్రం ఈ యెల్లో మీడియా విస్మరించింది. అంగీకరించని ముగ్గురు జనసేన కార్యకర్తల ఇళ్ల దగ్గరే ‘కక్ష’ సాధింపు రంగంలోకి వచ్చింది. పత్రికలో బ్యానర్ వార్త మాత్రమే సరిపోదని పాలిటిక్స్‌లో జూనియర్ ఆర్టిస్టుగా ఉన్న పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దించారు. ఆయన తన శాయశక్తుల ఓవరాక్టింగ్ చేసి వెళ్లారు. అయ్యన్నపాత్రుడు అనే సీనియర్ రాజకీయవేత్త అమ్మనాబూతులు మాట్లాడుతుంటే ఛీనాడుకు కమ్మగా తోచింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే, అందుకోసం ఒక రెవెన్యూ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేస్తే అయ్యన్నలో ఛీనాడుకు చిలిపితనం కనిపించింది. చేసింది తప్పు కనుక ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఛీనాడుకు కక్షసాధింపుగా కనిపించింది. వ్యక్తిగత ఫిర్యాదుతో సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఒక మహిళ చేతికి గాయం చేసుకున్నది. ఇది ఛీనాడుకు బ్యానర్ శీర్షిక ‘నేను వినను, నేను కనను’! అంటే ముఖ్యమంత్రి ప్రజల సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదని దాని భావన. అంతకు ముందురోజే అధికారులతో స్పందన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. స్పందన కార్యక్రమాన్ని మరింత క్రియాశీలకంగా చేయాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం కోసం మరింత మెరుగైన వ్యవస్థను తయారుచేయాలని నిర్దేశించారు. ఈ సంగతిని మాత్రం ఛీనాడు రాయలేదు. అధికార యంత్రాంగాన్ని ప్రజల గుమ్మం దగ్గరకు చేర్చడంలో జగన్మోహన్రెడ్డి చేసిన కృషి యావత్తు భారతదేశ చరిత్రలో సాటిలేనిది. ఒకటో తేదీ తెల్లవారుజామున వెలుగు రేకలు విచ్చుకోకమునుపే పెన్షన్ డబ్బులు చేతికందిస్తున్న రెండున్నర లక్షలమంది వలంటీర్ల మోముల్లో అవ్వాతాతలు జగన్మోహన్రెడ్డి ప్రతిరూపాన్ని చూసుకుంటున్నారు. ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో సేవకు సిద్ధంగా నిలబడిన సచివాలయాల సిబ్బందిలో ప్రజలకు జగన్ ప్రభుత్వం రోజూ కనిపిస్తూనే ఉన్నది. ఉద్యోగులే కాదు, ఎమ్మెల్యేలూ, మంత్రులు సైతం ‘గడప గడపకూ జగన్ ప్రభుత్వం’ పేరుతో నిత్యం జనంలోనే తిరుగుతున్నారు. వారంతా జగన్ పంపితే వస్తున్నారని ప్రజలకు తెలియదా? ‘ఫ్యామిలీ డాక్టర్’ ట్రయల్ రన్ జరుగుతున్నది. ఎవరికి సుస్తీ చేసినా వారింటికే డాక్టర్ రాబోతున్నాడు. ఇక మీదట జగన్మోహన్రెడ్డి ఇంటింటి ఫ్యామిలీ డాక్టర్ కూడా! ఇంతకంటే ప్రజలకు చేరువైన నాయకుడు ఈ దేశంలో ఇంకెవరున్నారో చెప్పమంటే ఏం చెబుతారు? అటువంటి జగన్మోహన్రెడ్డి ‘నేను వినను – నేను కనను’ అంటున్నాడని శీర్షిక పెడతారా? ఇది సిగ్గులేనితనం కాదా! ఇది బరితెగింపు కాదా? ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యావ్యవస్థ అత్యున్నత ప్రమాణాలనందుకున్నదని కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన పీజీఐ నివేదిక చాటిచెప్పింది. పైగా నాలుగేళ్ల కిందటి ఇదే నివేదికలో రాష్ట్రం అట్టడుగు పొరల్లో ఉంది. రెండేళ్లు కరోనా వెంటాడిన నేపథ్యంలో ఈ పురోగతి ఒక వండర్! కానీ ఛీనాడు మాత్రం పాఠశాల విద్య పతనమైందని తెంపరితనంతో కూడిన వంట కథలను వండి వార్చింది. రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరిణామంగా దేశవిదేశాల్లోని వ్యవసాయ రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఛీనాడు, దాని అనుబంధ మీడియా మాత్రం రాష్ట్రంలో వ్యవసాయం పడ కేసిందని కథలు అల్లుతారు. ఒక విషయం స్పష్టం. ప్రజల చేతికి అధికారాన్ని ఇచ్చే జగన్ ప్రభుత్వ విధానంపై వ్యాపార – రాజకీయ వర్గం యుద్ధం ప్రకటించింది. ప్రజల ప్రయోజనాలకూ, స్వార్థశక్తుల ప్రయోజనాలకూ మధ్యన జరుగుతున్న యుద్ధం ఇది. బాబోజీ – రామోజీ కంపెనీ నేతృ త్వంలో ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా, ప్రజల మీద పరోక్షంగా నిత్యం బాంబులు కురిపిస్తున్నారు. విషపూరితమైన రసాయన ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. యుద్ధం ప్రకటించినవాడు ఎంతటి శక్తిమంతుడైనా, ఎంతటి ధనాఢ్యుడైనా ప్రజలు చైతన్య వంతులైతే తోక ముడవక తప్పదు. అమెరికా మీద వియత్నాం ప్రజల విజయం చాటిచెప్పిన పరమ సత్యమిదే! ఠ్చిటఛీజ్ఛి జీ1959ఃజఝ్చజీ .ఛిౌఝ మోసాల గురూజీ ఛీనాడు రామోజీ! ► ఎవరీ రామోజీరావు? ఒక వ్యాపారవేత్త. ఈనాడు సంస్థల అధినేత. ఫిలిం సిటీ ఓనర్. సినిమా నిర్మాత. కొంతమందికి గురుపుంగవుడు. అంతేనా? ఇంకా వుంది. స్వార్థంకోసం సొంత చుట్టాలను కూడా మోసం చేయడానికి వెనుకాడని కపటి. వ్యవస్థలను మేనేజ్ చేయగల ప్రావీణ్యంతో బంధువులను కూడా కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ల భూముల్ని కారుచౌకగా కొట్టేసిన తిమింగలం. పత్రికను అడ్డం పెట్టుకొని కుళ్లు రాజకీయాలను రచించిన ఘనుడు. ► విలువైన భూములపై ఆయన కన్ను పడితే చాలు హస్తగతం చేసుకునేంతవరకూ ఎన్ని కుట్రలైనా చేస్తాడని ఒక సన్నిహిత బంధువు స్వయంగా చెప్పాడు. తన సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకునే క్రమంలో వేసిన ప్రతి అడుగులో బంధువుల కన్నీటి మడుగులు, బడుగుల నెత్తుటి జాడలు కనిపిస్తాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిగో మచ్చుకు కొన్ని అడుగులు... ► విజయవాడ బెంజ్‌సర్కిల్ సమీపంలో ‘ఈనాడు’ కార్యాలయం ఉన్న రెండెకరాల స్థలం రామోజీది కాదు. బంధువు, భాగస్వామి, తోడల్లుడైన ముసునూరు అప్పారావు, వల్లూరి వెంకటేశ్వరరావుల నుంచి రూ. 725 అద్దెతో 33 ఏళ్ళకు లీజు తీసుకున్నది. అక్కడ ‘ఈనాడు’ బిల్డింగ్ కట్టిన రామోజీకి స్థలం కాజేయాలనే దుర్బుద్ధి పుట్టింది. లీజు ముగిసిపోతున్న వేళ మరో 33 ఏళ్ళ లీజు కావాలంటూ కోర్టుకెక్కారు. అప్పారావుకు ఆ స్థలం అప్పగించాలని ఆదేశిస్తూ, 2013లో కోర్టు మందలించినా లాభం లేకపోయింది. 2017లో జిల్లా కోర్టు చెప్పినా, మళ్ళీ కోర్టుకెక్కారు. తాత్సారం చేస్తున్నారు. లీజు ముగిసినా ఖాళీ చేయకపోగా, ఇవ్వాల్సిన అద్దెకు అతీగతీ లేదు. 1970 లెక్కల ప్రకారం చూసినా లక్షల్లో అద్దె బాకీ. సొంత బంధువు స్థలానికే శఠగోపం పెట్టాలని రామోజీ మార్కు విశ్వప్రయత్నం సాగుతూనే ఉంది. ► వైజాగ్‌లో డాల్ఫిన్ హోటల్ కథా ఇలాంటిదే. భూ యజమానుల్ని మాయమాటలతో బెదిరించి, కారుచౌకగా స్థలం కొట్టేశారు. మొదట విశాఖలోని అల్లిపురం దగ్గర 1970 ప్రాంతంలో 8210 చ. గజాల స్థలాన్ని 50 ఏళ్ళకు రామోజీ లీజుకు తీసుకున్నారు. స్థల యజమానుల డబ్బు అవసరాన్ని గ్రహించి, వాళ్ళను మభ్యపెట్టారు. లీజు గడువు ఇంకా 16 ఏళ్ళు ఉండగానే దాదాపు రూ. 150 కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని రూ. 2.5 కోట్లకే 2005లో తన పేర ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఆ రూ. 2.5 కోట్లను కూడా మన నిరుపేద రామోజీ మూడు వాయిదాల్లో కానీ చెల్లించలేకపోయారట. మరో గమ్మత్తేమిటంటే – డాల్ఫిన్ హోటల్స్‌లో రామోజీతో సహా 172 మంది షేర్ హోల్డర్లు. రామోజీకి 95 శాతం, అంటే 3.82 లక్షల పైగా షేర్లున్నాయి. కానీ, విశాఖ, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన మిగిలినవారికి లాభాల్లో కనీస వాటా కూడా చెల్లించడం లేదట. ► ప్రియా పచ్చళ్ళ కంపెనీ నిర్మాణ సమయంలోనూ రామోజీది ఇదే స్టైల్. విజయవాడ శివారు కానూరు సమీపంలో సొంత బావ నుంచి 2 ఎకరాల స్థలం లీజుకు తీసుకున్నారు. ఆ స్థలానికి వెనకే మరో 2 ఎకరాల స్థలం ఉంది. దానికి వెళ్ళాలంటే ప్రియా పచ్చళ్ళకిచ్చిన స్థలంలో నుంచే దారి. స్థలంలో నుంచి దారి ఇస్తామని మొదట ఒప్పుకున్న రామోజీ అలవాటుగా నాలుక మడత తిప్పారు. దారి ఇవ్వకుండా సొంతవాళ్ళనే ఇబ్బంది పెట్టారు. ఆ దారిలో వెళ్ళేందుకు ప్రయత్నించిన సొంత బంధువును తన పత్రికా బలంతో రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. చివరకు ఆ బంధువు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తన స్థలానికి తాను వెళ్ళేందుకు దారి చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు. ►...ప్రతిచోటా కోర్టు నుంచి చీవాట్లు తిన్నా, తాను లీజుకు తీసుకున్న భూముల్ని సామ దాన భేద దండోపాయాలతో, తన చేతిలోని పచ్చ పత్రిక బలంతో కాజెయ్యడమే రామోజీ మార్కు నీతి, నిజాయతీ. ఈనాడు, మార్గదర్శి, ప్రియా... ఇలా ఆయన స్థాపించిన సామ్రాజ్యాల్లో చాలా భాగం లీజు భూముల లీగల్ కబ్జా లీలలే. న్యాయవ్యవస్థలోని కొందరు వ్యక్తుల సహకారంతో ప్రతి విషయంలో తప్పుడు మార్గాల్ని అన్వేషించే రామోజీ తన పత్రికలో ఇతరుల భూకబ్జాల గురించి రాస్తారు. గురివింద గింజనే గుర్తుకుతెస్తారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పొలంలో లంకెబిందెలు దొరికాయని, పక్క జిల్లాలు తిరుగుతూ..
సాక్షి,మదనపల్లె టౌన్(అన్నమయ్య) : బంగారమని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్న నిందితులను మంగళవారం మదనపల్లె టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ మురళీక్రిష్ణ, ఎస్ఐ చంద్రమోహన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. వాల్మీకిపురం మండలం నకిరి మడుగు పంచాయతీ ముడోరపల్లె షికాపాళెంకు చెందిన బి.గోవిందు కుమారుడు బుక్కియార్ గిరి అలియాస్ గోవిందబాబు, అలియాస్ కోటేశ్వరరావు(23), పుంగనూరు మండలం పాళెంపల్లె శికారుపాళ్యంకు చెందిన షానోజి కుమారుడు ముడియార్ ముత్యాలప్ప(31), వైఎస్సార్ జిల్లా వీరబల్లి మండలం తాటిమాకులపల్లె షికారిపాళ్యంకు చెందిన విజయ్‌కుమార్ కుమారుడు రాణా విజయక్రిష్ణ(25) ఒక బృందంగా ఏర్పడ్డారు. వారు కొన్నేళ్లుగా వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటు ఇంకా పలు చోట్ల తాము వ్యవసాయం చేస్తుండగా పొలంలో బంగారు పెద్ద ఎత్తున దొరికిందని, లంకబిందెలు ఇంట్లో దాచి ప్రభుత్వానికి తెలియకుండా పన్ను ఎగ్గొట్టి అమ్ముకోవాల్సి వస్తోందని అమాయకులను నమ్మించారు. పూసలను మొదట శాంపుల్‌గా బంగారును ఇచ్చి అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకుంటారు. మొదటగా కొద్దిపాటి బంగారాన్ని చూపి తరువాత వారికే నకిలీ బంగారాన్ని అప్పచెప్పి వారి వద్ద నుంచి నగదును తీసుకుని పరారు అవుతారు. ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా బద్వేలుకు చెందిన ఓ వ్యక్తిని మదనపల్లెకి రప్పించి ఇక్కడ అతన్ని మోసగించి రూ.5.70 లక్షలు తీసుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలించి పథకం ప్రకారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5.70 లక్షల నగదు, నకిలీ బంగారం పూసల దండలు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ వీరి పైన పలు చోట్ల పూసలు చూపి బంగారం అని నమ్మించి మోసాలకు పాల్పడిన కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. చదవండి: మాజీ ప్రేయసి ఇంకొకరితో చనువుగా ఉందని.. -
రుణాల మారటోరియం మోసాలతో జాగ్రత్త
న్యూఢిల్లీ: రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపుల (ఈఎంఐ)పై మారటోరియం అమలు నేపథ్యంలో మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఈఎంఐ మారటోరియం మోసాల గురించి అవగాహన పెంచుతున్నాయి. కీలకమైన ఓటీపీ, పిన్ నంబర్ల వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని సూచిస్తున్నాయి. ఖాతాల వివరాలను చోరీ చేసేందుకు సైబర్ క్రిమినల్స్, మోసగాళ్లు అనుసరిస్తున్న కొంగొత్త విధానాల గురించి అవగాహన కల్పించే దిశగా యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు గత కొద్ది రోజులుగా ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపిస్తున్నాయి. ఈఎంఐల మారటోరియంపై సహకరిస్తామనే పేరుతో మోసగాళ్లు .. ఓటీపీ, సీవీవీ, పాస్వర్డ్ లేదా పిన్ నంబర్ల వివరాలను ఇవ్వాలంటూ ఫోన్లు చేసే అవకాశాలు ఉన్నాయని బ్యాంకులు తెలిపాయి. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అటు కరోనా వైరస్ బాధితులకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించి ప్రధాని ప్రారంభించిన పీఎం–కేర్స్ నిధికి చందాల సేకరణ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని, వీటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాయి. ఎన్బీఎఫ్సీలకూ మారటోరియం... రుణాలపై మూడు నెలల మారటోరియం వెసులుబాటును నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కూడా వర్తింపచేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిధిలోని బ్యాంకులు యోచిస్తున్నాయి. తద్వారా కరోనా వైరస్ సంక్షోభం నుంచి అవి గట్టెక్కేందుకు తోడ్పాటు అందించాలని భావిస్తున్నాయి. తాము కూడా రుణగ్రహీతల కోవలోకే వస్తాం కాబట్టి తమకు కూడా మారటోరియం ఇవ్వాలంటూ ఎన్బీఎఫ్సీలు డిమాండ్ చేస్తున్నాయి. వివిధ వర్గాలకు రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు ప్రధానంగా నిధుల కోసం బ్యాంకులపైనే ఆధారపడుతుంటాయి. డిజిటల్ చెల్లింపులపై ప్రచారం... కరోనా వైరస్ కల్లోలాన్ని కట్టడి చేయడానికి కేంద్రం విధించిన లాక్డౌన్ సమయంలో డిజిటల్ చెల్లింపులను అనుసరించాలని ప్రజలను ఆర్బీఐ కోరింది. ఈ మేరకు అమితాబ్ బచ్చన్‌తో ట్విట్టర్ ప్రచారాన్ని ఆర్బీఐ ప్రారంభించింది. కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం సరైన చర్య అని ఆర్బీఐ తెలిపింది. -
యజమానినే ముంచేశారు..
పెదగంట్యాడ(గాజువాక): శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలన్నారు.. మంచి వారని భావించిన ఇంటి యజమాని వారికి ఇల్లు అద్దెకు ఇచ్చారు. తర్వాత ఇరుకుటుంబాల వారు బాగా దగ్గరయ్యారు. ఒకరికొకరు కష్టసుఖాలను పంచుకునేవారు. ఇదే ఆ ఇంటి యజ మాని నిలువునా మోసపోవడానికి దారితీసింది. ఈ సంఘటన వివరాలను న్యూపోర్టు పోలీస్ స్టేషన్లో సీఐ పైడపునాయుడు విలేకరులకు బుధవారం వివరించారు. ఇంటి యజమానికి పెళ్లయినా పిల్లలు లేకపోవడంతో అతని మేనకోడలను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం కలిగారు. అయితే యజమాని ఇటీవల మొదటి భార్యతో చనువుగా ఉండడంతో రెండో భార్య తట్టుకోలేపోయింది. తన పరిస్థితిని వారి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారితో వాపోయింది. ఇదే అదునుగా భావించి వారు ఆమెను నిలువునా ముంచేశారు. పూజల పేరిట రూ.4.20 లక్షల నగదుతో పాటు 7తులాల బంగారం, వెండి సామగ్రి దోచేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి అసలు రంగు బయటపడింది. 62వ వార్డు టీజీఆర్ నగర్లో దవులూరి చంద్రరావు అ నే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నా డు. ఏడాది కిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన వానపల్లి సీతారాం, అతని తల్లి పద్మ, చెల్లెలు కుమారితో వచ్చి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. చంద్రరావుకు వివా హమైనా పిల్లలు లేకపోవడంతో అతని మేనకోడలైన నిర్మలను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో చంద్రరావు మొద టి భార్యతో చనువుగా ఉండడంతో తట్టుకోలేకపోయిన నిర్మల ఇంట్లో అద్దెకుంటున్న వారితో తన పరిస్థితిని వివరించింది. ఇదే అదునుగా భావించిన వారు ‘నీ భర్తకు ప్రాణగండం ఉంద ని, పూజలు చేయాల’ని నమ్మబలికారు. అంతేకాకుండా ఆ విషయాన్ని తన భర్తకు చెబితే రక్తం కక్కుకుని చనిపోతాడని భయాందోళనకు గురి చేశారు. దీంతో భయపడిన నిర్మల భర్తకు తెలి యకుండా రూ.4.20 లక్షల నగదు, 7తులాల బంగారం, వెండి వస్తువులను దఫదఫాలుగా వారికి అందజేసింది. తర్వాత తాను మోసపోయానని భర్తకు తెలియజేయడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ అప్పలరాజు పాల్గొన్నారు. -
‘కమీషన్’ కేటుగాళ్లు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: వీరు ఘరానా మోసగాళ్లు.. ఇతరుల భూములపై నకిలీ పత్రాలు సృష్టించారు.. వీటిని కొన్ని కంపెనీలకు కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టారు.. భారీ మొత్తం రుణంగా ఇప్పించి నిర్ణీత శాతం కమీషన్ తీసుకున్నారు.. ఈ పంథాలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ లను మోసం చేసి రూ.100 కోట్ల రుణాలు ఇప్పించి, భారీగా కమీషన్లు తీసుకున్న శ్రీనివాస్‌రెడ్డి సహా పది మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరో 40 మంది పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డిపై హైదరాబాద్, రాచకొండతోపాటు ఏపీ లో 17 కేసులు నమోదయ్యాయి. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఎల్బీనగర్ ఇన్చార్జ్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డితో కలసి కమిషనర్ మహేశ్ భగవత్ శనివారం మీడియాకు వెల్లడించారు. నకిలీ పత్రాలు సృష్టించి.. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి నగరంలోని ఎస్సార్‌నగర్‌లో ఉంటున్నాడు. తొలుత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్న అతను ఆ వ్యాపా రాన్ని పక్కకు పెట్టి మోసాలు చేయడం ప్రారంభించా డు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని స్థలా ల్లో ఉన్న సాంకేతిక అంశాలు, చిన్న చిన్న లోపాలను గుర్తించే శ్రీనివాస్‌రెడ్డి వాటి పాత యజమానులను మభ్యపెట్టి, నకిలీ పత్రాలు సృష్టించి సదరు స్థలం తన పేరుతో ఉన్నట్లు డాక్యుమెంట్లు సిద్ధం చేసి, రుణాలు తీసుకునే కంపెనీలకు అవసరమైన కొలట్రల్ సెక్యూరిటీలు అందిస్తానంటూ ప్రచారం చేసుకుంటాడు. ఆసక్తి చూపిన వారితో కమీషన్‌పై ఒప్పందం చేసుకునేవాడు. వెలుగులోకి వచ్చింది ఇలా... అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ స్థలానికి సంబంధించి నకిలీపత్రాలను సృష్టించిన శ్రీనివాస్‌రెడ్డి ఇస్నాపూర్ ఎస్బీ హెచ్లో కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టి ఓ సంస్థకు రూ.18 కోట్ల రుణం ఇప్పించాడు. ఈ మేరకు రూ.66 లక్షల కమీషన్ తీసుకున్నాడు. అదే స్థలంపై, మరో సెట్టు పత్రాలను ఇంకో సంస్థకు కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టడానికి సిద్ధమై రామంతాపూర్‌లోని ఆంధ్రాబ్యాంక్ లో దాఖలు చేశాడు. ఈ 2 బ్యాంకులకు లీగల్ ఒపీయన్ ఇచ్చే అధీకృత సలహాదారు ఒక్కరే. అతను ఈ విష యాన్ని గుర్తించి ఎస్బీహెచ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రూ.18 కోట్ల రుణం పొందిన సంస్థ ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకోవడంతోపాటు దానిని నాన్‌పెర్ఫామింగ్ అసెర్ట్‌గా ప్రకటించింది. నష్టపోయిన ఆ సంస్థ యజమాని కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టిన స్థలం పై ఆరా తీయడంతో అబ్దుల్లాపూర్‌మెట్‌కి చెందిన వారికి విషయం తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరెడ్డి, గోపాలకృష్ణ, వినోద్ కుమా ర్, మహమ్మద్ షఫీ, విశ్వనా థమ్, జగన్రావు, పిల్లి ఐలయ్య, వెంకటరామ్‌రెడ్డి, గంగరామ్, వేముల అశోక్‌లను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సిబ్బంది తప్పిదంతోనే భూమి, ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో యజమానులు హాజరుకావడంతోపాటు వారి గుర్తింపుకార్డులు, ఈసీ, టైటిల్ డీడ్లు, లింక్ డాక్యుమెంట్లు తనిఖీ, యజమాన్య హక్కులు తనిఖీ చేయాల్సి ఉండగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీ సు(ఎస్ఆర్వో)ల్లో అటువంటిదేమీ చేయలేదు. బ్యాం కర్లు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేయకుండానే రుణాలు ఇచ్చారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈసీ లో నిక్షిప్తమైన సమాచారాన్ని తొలగించాలంటూ ఎస్ఆర్వోలకు పోలీసులు లేఖ రాయనున్నారు. కొలట్రల్ మోసాలపై తనిఖీ చేసి విధుల్లో ఉదాసీనంగా వ్యవహరించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖ రాస్తామని మహేశ్ భగవత్ తెలిపారు. -
ఎస్సీ,ఎస్టీ కేసు పేరుతో రూ.15లక్షలు వసూలు
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ,ఎస్టీ చట్టం పేరుతో అక్రమంగా బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సోమజిగూడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో రమేష్, సంజీవ కుమార్, కిరణ్ అనే ముగ్గురు కొద్ది కాలం క్రితం పనిలో చేరారు. అయితే వీరి పనితీరు నచ్చని యజమాని శ్రీనివాస్, పనిలో నుంచి తప్పిస్తానని హెచ్చరించాడు. దీంతో యజమానిపై కోపం పెంచుకున్న ముగ్గురు ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా యజమాని నుంచి ఒక చెక్, ప్రామిసరి నోటు తీసుకొన్నారు. కేసు పేరుతో దాదాపు పదిహేను లక్షల రూపాయలకు పైగా శ్రీనివాస్ నుంచి వసూలు చేశారు. అయితే వీరి వేధింపులను కొద్ది కాలం పాటు భరించిన యజమాని.. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఎల్బీ నగర్ పోలీసులు ముగ్గరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కొద్ది మొత్తంలో డబ్బు, ప్రామిసరి నోటు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎవరైన ఇలాంటి చీటింగ్, బెదిరింపులకు పాల్పడితే 9490617111 ద్వారా తమను సంప్రదించవచ్చని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. -
మోసగాళ్లు వచ్చేశారు..
► మహారాష్ట్ర నుంచి దళారుల రంగప్రవేశం ► అనుమతి లేని బీటీ–3 రకం పత్తి విత్తనాల విక్రయాలు ► కలుపు మందులు అవసరం లేదంటూ ప్రచారం ► ఒక్కో ప్యాకెట్ ధర రూ.1,600 ► మోసపోవద్దంటున్న వ్యవసాయశాఖ అధికారులు భూపాలపల్లి: ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతన్నకు మోసగాళ్ల బెడద మొదలైంది. అమాయక రైతులే లక్ష్యంగా కొందరు అనుమతి లేని పత్తి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ మోసం చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన కొందరు వ్యక్తులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ బోల్‌గార్డ్(బీటీ) 3 విత్తనాలను విక్రయిస్తున్నారు. ఈ విత్తనాలను నాటితే కలుపు మందులు అవసరం లేదంటూ ప్రచారం చేస్తూ రైతులను ముంచేందుకు యత్నిస్తున్నారు. బీటీ–2కే అనుమతి గత ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాల మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది సైతం అదే పరిస్థితి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన కొందరు జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, కాటారం, మహదేవ్పూర్ మండలాలతో పాటు ములుగు డివిజన్లోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో బీటీ–2 రకం పత్తి విత్తనాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. కాగా అనుమతి లేని బీటీ–3 విత్తనాలు మేలైనవని దళారులు రైతులను నమ్మబలుకుతున్నారు. ఈ విత్తనాలు నాటితే కలుపు మందులు కొట్టాల్సిన అవసరం లేదని, దిగుబడి ఎక్కువగా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన బీటీ –2 పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ.800 వరకు ఉండగా దళారులు నకిలీ విత్తనాలను రూ.1,200 నుంచి రూ.1,600 వరకు వి క్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. విత్తన ప్యాకెట్ల విక్రయాల కోసం దళారులు కమీషన్ పద్ధతిన స్థానికులను కొందరిని నియమించుకుని ఈ దందా సాగిస్తున్నట్లు తెలిసింది. లైసెన్స్ లేకుండానే.. బీటీ 3 పేరిట విత్తనాలు విక్రయించే వారితో పాటు మరికొందరు గ్రామాల్లో తిరుగుతూ ఇతర రకాల నకిలీ విత్తనాలు వి క్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఫర్టిలైజర్, విత్తన విక్రయ దుకా ణాలు ఏర్పాటు చేసుకోకుండా, లైసెన్సులు పొందకుండా విత్తన విక్రయాలు జరుపుతున్నారు. పలువురు దళారులు తెల్ల సంచుల్లో విత్తనాలను విక్రయిస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు విక్రయించే వారు రైతులకు రశీదులు ఇవ్వడం లేదు. కనీసం దుకాణాల అడ్రస్ కూడా సరిగా తెలియజేయడం లేదని తెలిసింది. లైసెన్స్ లేని వారి వద్ద, ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు కొనుగోలు చేయడం మూలంగా విత్తనం మొలకెత్తకపోయినా, పంట దిగుబడి రా కున్నా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మా దృష్టికి వచ్చింది.. భూపాలపల్లి డివిజన్ పరిధిలో కొందరు వ్యక్తులు బీటీ–3 పేరిట పత్తి విత్తనాలు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. బీటీ–3కి ప్రభుత్వం అనుమతి లేదు. అలాంటి విత్తనాలను రైతులు కొనుగోలు చేసి మోసపోవద్దు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రశీదు తప్పకుండా తీసుకోవాలి. రశీదు, విత్తన ప్యాకెట్ కవర్‌ను పంట దిగుబడి వచ్చే వరకు దాచి ఉంచాలి. బీటీ–3 విత్తనాలు విక్రయించే వారి సమాచారం అందిస్తే తగు చర్యలు తీసుకుంటాం. – సత్యంబాబు, ఏడీఏ, భూపాలపల్లి -
స్వార్థపరులే పార్టీని వీడారు
నర్మెట : కొందరూ వారి స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని మోసం చేసి వెళ్లిపోయారని కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మ¯ŒS గొల్లపల్లి కుమారస్వామి అన్నారు. ఎంతో నమ్మకంతో వారికి పదవులను కట్టబెట్టిన మోసంచేవారన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్య జూంలాల్‌నాయక్, చేర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జుల సుధాకర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి చేరడంపై గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కుమారస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిదని అన్నారు. పార్టీ పదవులతో అన్నివిధాలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు పార్టీని వీడటం సరైంది కాదన్నారు. కాంట్రాక్టుల కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు. వారు పార్టీని వీడటం వల్ల అధినాయకత్వానికి కాని, పార్టీకి కాని ఏలాంటి నష్టం లేదన్నారు. వారి స్థానాలను త్వరలోనే క్రీయశీలకంగా పనిచేసే కార్యకర్తలకు అప్పగిస్తామని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కొంపెల్లి రమేష్, ప్రజ్ఞపురం కనుకయ్య, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు -
మోసగాళ్ల అడ్డాగా ‘రాజధాని’
ప్రత్యేక యంత్రాంగం లేకపోవడంతో చెలరేగుతున్న నేరగాళ్లు పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు బలవుతున్న సామాన్యులు మాయమాటలతో కోట్లు కొల్లగొడుతున్న వైనం గుంటూరుకు చెందిన డాక్టర్ రావుకు పెనమలూరు మండలం కానూరులో నివేశన స్థలం ఉంది. దానిని విక్రయించేందుకు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ఇద్దరు బ్రోకర్లు రంగ ప్రవేశం చేసి స్థలం కాగితాలు తీసుకున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి మరొకరికి విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు రావుకు తెలిసి నిలదీశారు. దీంతో బ్రోకర్లు కొంత డబ్బులు ఇస్తే అడ్డు తొలుగుతామంటూ బెదిరిం చారు. విధిలేని స్థితిలో బాధితుడు పోలీసు కమిషనర్‌ను కలవగా నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నగరంలోని శుభదర్శి చిట్‌ఫండ్స్ రూ.200 కోట్ల మేర డిపాజిటర్లను ముంచింది. గత ఏడాది జులైలో ‘శుభదర్శి’ మూత పడటంతో వందలాది మంది బాధితులు లబోదిబోమన్నారు. పాతికేళ్లుగా డిపాజిటర్ల నమ్మకం చూరగొన్న శుభదర్శి పెట్టుబడులను స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను అరెస్టు అయితే చేశారుకానీ బాధితులకు న్యాయం జరగలేదు. పటమటలంకకు చెందిన వంశీకృష్ణ మెడికల్ సీట్ల పేరిట రూ.కోట్లు కొల్లగొట్టాడు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులకు కర్ణాటక రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేశాడు. సీట్ల విషయం ఆరా తీస్తే రేపు మాపంటూ తిప్పసాగాడు. అనుమానంతో కొందరు తల్లిదండ్రులు వాకబ్ చేయగా వంశీకృష్ణ మోసం వెలుగు చూసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విజయవాడ : రాజధాని ఆర్థిక నేరాలకు అడ్డాగా మారింది. ప్రైవేట్ చిట్స్ ఎగవేత.. తప్పుడు పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వసూళ్లు.. కాల్‌మనీ పేరుతో వేలకు వేలు రోజువారీ వడ్డీలకు ఇస్తూ వేధించడం.. ఇలా ఎక్కడ చూసినా మోసాలే. ఆర్థిక నేరాలను అరికట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. పోలీసుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని ఆర్థిక నేరగాళ్లు చెలరేగి పోతున్నారు. అప్పులు ఇచ్చి వేధింపులకు దిగుతున్న వారిపై 20 రోజుల్లో నగర పోలీస్ కమిషనర్‌కు 750 ఫిర్యాదులు అందాయి. కాల్‌మనీ వ్యాపారులు నగరంలో ఎలా రెచ్చిపోతున్నారో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు. చిట్స్ పేరిట మోసాలు.. ప్రైవేటు చిట్స్ నగర సంస్కృతిలో అంతర్భాగమయ్యాయి. ఏళ్ల తరబడి ఇళ్ల వద్ద చిన్నపాటి చిట్టీలతో నమ్మకం పెంచుకుంటున్నారు. ఆపై లక్షల్లో చిట్స్ వేస్తూ కోట్ల రూపాయలు ఎగవేతకు పాల్పడుతున్నారు. పైసా పైసా కూడబెట్టిన సొమ్ము చిట్స్‌లో పెట్టి అనేక మంది వీధుల పాలవుతున్నారు. ఏడాది కాలంలో వంద మందికి పైగా ప్రైవేటు చిట్స్ ఎగవేతకు పాల్పడినవారు ఉన్నారు. అనేక మంది చిరు వ్యాపారులు, ఉద్యోగులు వీరి బారిన పడి సర్వం కోల్పోయారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు.. రాజధాని కావడంతో భూముల విలువ అమాంతంగా పెరిగింది. తప్పుడు పత్రాలు సృష్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టే ముఠాలు తయారయ్యాయి. ఆపై న్యాయస్థానంలో వ్యాజ్యాలు వేస్తూ అసలు యజమానులతోనే బేరసారాలకు దిగుతున్నారు. పోలీసుల వద్దకు వచ్చినా భూములకు సంబంధించి వివాదాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు అవసరమైన యంత్రాంగం లేక విచారణ పేరిట సాగదీస్తున్నారు. రియల్ ఎస్టేట్ మోసాలకు అంతే లేదు. ఉద్యోగాల పేరిట మోసం.. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల పేరిట మోసగించే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొందరు పోలీసు ఉద్యోగుల తాలూకు బంధువులు కూడా ఉద్యోగాల పేరిట మోసగించిన వారిలో ఉండటం విశేషం. ప్రత్యేక విభాగమేది.. పోలీసు కమిషనరేట్‌లో ఆర్థిక నేరాలను అరికట్టేందుకు నామమాత్రం వ్యవస్థ మాత్రమే ఉంది. సీసీఆర్బీ ఏసీపీ పర్యవేక్షణలో సిటీ స్పెషల్ బ్రాంచిలోని ఇద్దరు ఇన్స్పెక్టర్లు మాత్రమే ఆర్థిక నేరాల నియంత్రణ విభాగంలో అదనపు విధులు నిర్వహిస్తున్నారు. ఈ విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరంపై నగర పోలీసు అధికారులు అనేకమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆర్థిక నేరాలకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుతోనే ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. గత మూడేళ్లలో నమోదైన చీటింగ్ కేసులు 2013లో కేసులు 358 2014లో కేసులు 328 2015లో కేసులు 392 -
బంపర్ ఆఫర్ పేరుతో..
రూ. లక్షలు వసూలు చేసి ఉడాయించిన ముఠా లబోదిబోమంటున్న బాధితులు భువనగిరి : ప్రజల అమాయకత్వాన్ని, ఆశను ఆసరా చేసుకుని బంపర్ ఆఫర్ల పేరుతో రూ.లక్షలు వసూలు చేసి ఉడాయించిన ఓ ముఠా ఉదంతం గురువారం భువనగిరిలో వెలుగు చూసింది. జిల్లాతో పాటు ,రంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో ఆటోల ద్వారా హోంనీడ్స్ పేరిట మోసపోయిన వారంతా భువనగిరికి చేరుకుని లబోదిబోమంటున్నారు. వివ రాలు.. 20 రోజుల క్రితం నలుగురు యువకులు శ్రీ ఆంజనేయ మార్కెటింగ్ పేరుతో పోచమ్మవాడలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. రంగు రంగుల బ్రోచర్లు తయారు చేసి ఆటోల్లో గ్రామాలకు చేరుకున్నారు. బ్రోచర్లలో స్క్రాచ్ కార్డులను పొందుపరిచారు. ఒక్కో కార్డు రూ.100కు విక్రయించారు. కార్డును స్క్రాచ్ చేయగ అందులో ఆర్డినరి కంపెనీలకు చెందిన రైస్ కుక్కర్ , మిక్సి, టేబుల్‌ఫ్యాన్, డీవీడీ, హోం థియేటర్, మిక్సర్‌గ్రైండర్‌లు బహుమతులుగా వచ్చాయి. మందుగానే ఒక్కొక్కరి వద్ద రూ.1900 వసూలు చేసి వీటిలో కేవలం 500 లోపు విలువ గల వస్తువులను ఇచ్చారు. ఈనెల 10 తేదీన భువనగిరిలో బంపర్ డ్రా తీయడం జరుగుతుందని చెప్పారు. బంపర్ డ్రాలో రిఫ్రిజిరేటర్, ఎల్సీడీ, 10 గ్రాముల బంగారం, ల్యాప్‌ట్యాప్, వాషింగ్ మెషీన్‌లభిస్తాయని చెప్పడంతో పెద్ద ఎత్తున వారివద్ద స్క్రాచ్ కార్డులు కొన్నారు. ఇలా మోసగాళ్లు యాదగిరిగుట్ట, యాదగిరిపల్లి, మోత్కూరు, ఆత్మకూర్, వడాయిగూడెం, ముగ్దుంపల్లి, కొండమడుగు, మాదాపురం, అవుషాపురం, వలిగొండ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున స్క్రాచ్ కార్డులు విక్రయించి రూ.లక్షలు దండుకున్నారు. అయితే తమకు స్క్రాచ్ కార్డులో వచ్చిన ఫ్యాన్లు ఇవ్వకుండా కేవలం రైస్‌కుక్కర్‌ను మాత్రమే ఇచ్చిన వారు మిగతా వస్తువులతో పాటు బంపర్ ఫ్రైజ్ కూడా ఇస్తామని చెప్పిన ప్రకారం వివిధ గ్రామాల నుంచి కార్డులు తీసుకువచ్చారు. తీరా ఇక్కడి వచ్చి చూస్తే మోసగాళ్లు ఇంటికి తాళం వేసి ఎప్పుడో ఉడాయించారు. దీంతో తాముమోసపోయామని ఆగ్రహించిన వారంత తీవ్ర దూషణలకు దిగారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమకు జరిగిన మోసాన్ని వివరించి న్యాయం చేయాలని పోలీస్‌లను కోరారు. 10వ తేదీ రమ్మన్నారు ఆగస్టులో మాయింటికి వచ్చారు. బంపర్ ఆఫర్ ఉందని చెప్పి రూ.1900 తీసుకుని స్క్రాచ్ కార్డు ఇచ్చారు. అందులో ఫ్యాన్ వచ్చింది.కానీ రూ. 400ల కుక్కర్ ఇచ్చారు. ఇదేమిటని అడిగితే 10వ తేదీ భువనగిరిలో బంపర్ డ్రా తీస్తారు. ఆ రోజు అక్కడివస్తే ఫ్యాన్ లేదా మిగిలిన 1500లు ఇస్తామని నమ్మబలికారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరూ లేరు. తనలాంటి వారెందరో మోసపోయారు. - మారగోని మల్లయ్య, వలిగొండ -
కర్నూలులో ఢిల్లీ చీటర్స్
-
బెజవాడలో నయా మోసగాళ్లు
-
420 అంటే..?
మోసగాళ్లను మన దేశంలో ‘ఫోర్ట్వంటీ’అంటుంటాం. బ్రిటిష్ హయాంలోనే 1860లో ఇండియన్ పీనల్ కోడ్ అమలులోకి వచ్చింది. ఇందులోని సెక్షన్ 420 మోసాన్ని నిర్వచిస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్ పుణ్యాన మోసగాళ్లకు మన దేశంలో ‘ఫోర్ట్వంటీ’లుగా గుర్తింపు వచ్చింది. అమెరికాలో ‘ఫోర్ట్వంటీ’ వేరే అర్థంలో వాడుకలో ఉంది. అక్కడ ‘ఫోర్ట్వంటీ’ అంటే ఏప్రిల్ 20. నెల సంఖ్య ముందు, తేదీ సంఖ్య తర్వాత రాసే అమెరికన్ పద్ధతి ప్రకారం (4/20) అది మామూలే కదా అనుకుంటున్నారా..? నిజమే! అయితే, ఈ తేదీకి మరో విశేషం కూడా ఉంది. గంజాయి వినియోగాన్ని నియంత్రించడాన్ని కాలిఫోర్నియా రాష్ట్రం అమలులోకి తెచ్చిన చట్టం కోడ్ నంబర్ కూడా 420. అయితే ఏప్రిల్ 20 గంజాయి పొగరాయుళ్ల అనధికారిక సెలవు. దాంతో కాలిఫోర్నియాలో ఏటా ఏప్రిల్ 20వ తేదీన గంజాయి పొగరాయుళ్లు గుంపులుగా గుమిగూడి ‘దమ్ మారో దమ్’ అంటూ ఊగి తూగుతుంటారు. -
కమీషన్ పేరుతో దగా
సుమారు రూ.10 కోట్లు కాజేసిన దంపతులు బంజారాహిల్స్: లక్ష రూపాయలు ఇవ్వండి... నెలకు 10 శాతం కమీషన్ ఇస్తాం.. కావాలంటే మీ డబ్బు మధ్యలోనే వాపస్ తీసుకోవచ్చు.. ఇలా మాయమాటలు చెప్పి.. అమాయకుల నుంచి పెట్టుబడి పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న కేటుగాడిని బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలు నగరం బండ్లమిట్టకు చెందిన కానుగుల శ్రీనివాసరావు, సురేఖ దంపతులు గతకొంత కాలంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.71లోని నవ నిర్మాణ్‌నగర్‌లో ఓ ఖరీదైన ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని గ్రీన్వాల్ట్ గ్లోబల్ పేరుతో కార్యాలయం తెరిచారు. తమ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూజిలాండ్‌లో ఉందని, ఆంధ్రప్రదేశ్ శాఖకు తాను మేనేజర్‌నని శ్రీనివాసరావు స్థానికులను నమ్మించాడు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం కమీషన్లు ఇస్తామని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివాసం ఉండే ఎస్కే మస్తాన్ కమీషన్‌కు ఆశ పడి తనతో పాటు బంధువులు, మిత్రులతో రూ. 53 లక్షలు కట్టించాడు. మూడు నెలల పాటు సక్రమంగానే కమీషన్లు ఇచ్చిన శ్రీనివాసరావు ఆ తర్వాత ముఖం చాటేశాడు. గట్టిగా అడిగేసరికి 2014 ఆగస్టు 3వ తేదీ రాత్రి బిచాణా ఎత్తేశాడు. బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలో దిగిన పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకోగా.. భార్య సురేఖ పరారీలో ఉంది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 420, 506 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, వీరి చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య భారీగానే ఉండవచ్చని పోలీసులకు అందిన ఫిర్యాదులు ద్వారా తెలుస్తోంది. కూకట్‌పల్లికి చెందిన ఎం.మురళీకృష్ణ, చిక్కడపల్లికి చెందిన ఆదిత్య మోహన్, మెహిదీపట్నంకు చెందిన సూర్యప్రకాశ్, సురేందర్‌రాజు, శ్రీనివాస్, శంకర్ తదితరులు కూడా ‘గ్రీన్వాల్ట్ గ్లోబల్’లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి మోసపోయామని ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడు సుమారుగా 150 మంది నుంచి రూ. 10 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఇద్దరు చంద్రులూ మోసగాళ్లే
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సిరికొండ : తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ మాదిగలను మోసం చేసిన వారేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాదిగల ఉద్యమాలతో ఆ వర్గానికి తప్ప సమాజంలోని మిగిలిన వారందరికీ మేలు జరిగిందని అన్నారు. దండోరా పోరాటాలతోనే ఆరోగ్యశ్రీ పథకం, వికలాంగులకు రూ.1500 పింఛన్లు అమలయ్యాయని చెప్పారు. ఇద్దరు సీఎంలు మాదిగల అండతోనే అధికారంలోకి వచ్చారని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామన్న తెలంగాణ సీఏం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం పెట్టి చేతులు దులుపుకున్నారని, ఏపీ సీఎం చంద్రబాబు అయితే మొత్తానికే ముఖం చాటేశారని విమర్శించారు. తెలంగాణ నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని, ఏపీలో వర్గీకరణ తీర్మానం చేయాలనే డిమాండ్‌తో వచ్చే నెల 18న ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పడమే కాకుండా మంత్రి వర్గంలో ఉన్న రాజయ్యను అకారణంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి రవికిరణ్, మండలాధ్యక్షుడు అశోక్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పిప్పెర సంజీవ్, నాయకులు గణేష్, సాయిలు, ఎంఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఫర్జానా తదితరులు పాల్గొన్నారు. -
నేను గానీ.. ఫోన్ గానీ చేశానంటే..
గుర్ల: పట్టపగలు..నలుగురూ నడయాడే మండల కేంద్రం...సినీ ఫక్కీలో ఓ ఘరానా మోసగాడు.. మహిళ మెడలోని రెండు తులాల బంగారు తాళిని తీసుకుని పరారయ్యాడు. గుర్ల పోలీసులు, స్థానికులు, బాధితురాలు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గూడెం గ్రామానికి చెందిన రుంకాన పైడితల్లి అలియాస్ తట్టు (52)అనే మహిళ తన మనుమరాలి పేరును రేషన్‌కార్డులో చేర్పించాలనే.. ఉద్దేశంతో మండలం కేంద్రం గుర్లలో ఉన్న మీసేవ వద్దకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులను పట్టుకుని వెళ్లింది...జనన ధ్రువీకరణ పత్రం లేకపోతే రేషన్‌కార్డులో పేరు నమోదు చేయడం జరగదని ధ్రువీకరణ పత్రం పట్టుకుని సోమవారం రమ్మని మీసేవ ఆపరేటర్ చెప్పాడు. దీంతో ఆమె సోమవారం వద్దామనుకుని ఆమె అక్కడ నుంచి గూడెం వెళ్లి పోవాలని నిర్ణయించుకుని ఆటోలో ప్రయాణించి విజయనగరం , పాలకొండ రహదారిపై ఉన్న గూడె జంక్షన్ వద్ద దిగింది. అక్కడ నుంచి గ్రామానికి కాలినడకన వస్తుండగా అదే రోడ్డుపై ఎదురుగా గుర్తుతెలియని ఓ అపరిచిత వ్యక్తి మోటారు సైకిల్‌పై వచ్చి.. ఆమె ముందు ఆపి ... పెద్దమ్మా ఏం వచ్చావని పరిచయం ఉన్న వ్యక్తిలా పలకరించాడు.. ఏమీ లేదు నాయనా రేషన్‌కార్డులో నా మనుమరాలి పేరు చేర్పిద్దామని వచ్చాను.. పని అవ్వక తిరుగుముఖమయ్యానని చెప్పింది. నేను ఒక్క ఫోన్‌కాల్ చేస్తే తహశీల్దారు రేషన్‌కార్డులో పేరు చేర్పిస్తాడు... నా బండి ఎక్కు అన్నాడు. నిరక్ష్యరాస్యత, పల్లెటూరి అమాయకత్వం కలిగిన ఆమె ఘరానా మోసగాడి మాటలు నమ్మి బండి ఎక్కింది. అపరిచిత వ్యక్తి ఆమెను నేరుగా తహశీల్దారు కార్యాలయం వద్దకు తీసుకు వెళ్లి రేషన్‌కార్డుకు జిరాక్స్‌లు తీయించాడు...అనంతరం ఫొటోలు కూడా తీయించాలని ఆమెతో చెప్పి తీసుకు తీసుకెళ్లాడు. తహశీల్దారు కార్యాలయం నుంచి గుర్ల జంక్షన్‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో కెల్ల జంక్షన్ వద్ద బండి ఆపి పెద్దమ్మా... రేషన్ కార్డులు పేదవారికి ఇస్తారు.. బంగారు తాళి మెడలో ఉంటే.. ధనవంతులు అనుకుని ఉన్న రేషన్‌కార్డు కట్ చేస్తారని చెప్పి ఫొటో తీసే ముందు మెడలోని తాడు తీసి పట్టుకో అని చెప్పాడు. అపరిచిత వ్యక్తి చెప్పిన ప్రకారం ఆమె మెడలోని తాడు తీసి చేత్తో పట్టుకుంది. ఈ లోగా అపరిచిత వ్యక్తి బండిని స్టార్ట్‌చేసి గేరు వేశాడు... పెద్దమ్మా బండెక్కు అన్నాడు.. ఆమె బండి ఎక్కడంలో ఇబ్బంది పడుతుండగా... చేతిలో తాళి పట్టుకుని ఎక్కలేకపోతున్నావు.. ఆ తాడుని నేను పట్టుకుంటాను ఇవ్వు.. అని ఆ వ్యక్తి అన్నాడు. అలాగే నాయనా నువ్వు పట్టుకో అని చెప్పి ఆమె అతని చేతికి బంగారు తాళి ఇచ్చింది. దీంతో ఆ వ్యక్తి బంగారుతాడు అందుకుని క్షణంలో అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ వెంటనే ఆమె పెద్దగా గోల చేయడంతో స్థానికులు చుట్టుముట్టారు. ఈలోగా అపరిచిత వ్యక్తి మోటారు సైకిల్‌పై పరారయ్యాడు. అనంతరం బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఎస్సై నీలకంఠం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అపరిచిత మెసేజ్‌లతో మోసం
రూ.1.84 లక్షలకు టోకరా పెద్దతిప్పసముద్రం: అపరిచిత మెసేజ్‌లతో పలువురు మోసగాళ్లు యువకులను బుట్టలో వేసుకుని మోసం చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్ చూసి రూ.1.84 లక్షలు పోగొట్టుకున్న యువకుడి ఉదంతం పీటీఎం మండలంలో వెలుగుచూసింది. పీటీఎంకు చెందిన ఓ యువకుడు ఈ నెల 12న ఇంట్లో కూర్చుని మనోరంజన్ చానల్ పెట్టుకుని చూస్తున్నాడు. అందులో ప్రముఖ క్రికెటర్ ముఖ చిత్రాన్ని చూపుతూ ఇతని పేరును కింద స్లైడ్స్‌లో చూపుతున్న నంబర్‌కు ఫోన్ చేసి సరైన సమాధానం ఇచ్చిన వారికి రూ.12 లక్షల నగదు అందజేస్తామని పేర్కొన్నారు. సదరు యువకుడు క్రికెటర్ పేరు కోహ్లి అని టీవీలో సూచించిన నంబర్‌కు ఫోన్లో సమాధానం ఇచ్చాడు. అదే రోజు రాత్రి 9091327247 నంబర్ నుంచి యువకుడి సెల్‌కు ఇన్కమింగ్ కాల్ వచ్చింది. మీరు సరైన సమాధానం చెప్పారు.. మేం నిర్వహిస్తున్న టాటా మోటార్ లిమిటెడ్ టెల్కోసిటీ జల్షద్పూర్ గేట్ డిస్పాచ్ డిపార్ట్మెంటు జార్ఖండ్ తరఫున రూ.12.80 లక్షల నగదును గెలుచుకున్నారని తెలిపారు. ముందస్తుగా ట్యాక్స్ రూపంలో మా బ్యాంకు ఖాతా 34287329081కు రూ.12,800 జమ చేయాలని అపరిచిత వ్యక్తి సూచించాడు. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో యువకుడు సొమ్మును బ్యాంకులో జమ చేశాడు. మళ్లీ ఫోన్ చేసి మీది సేవింగ్స ఖాతా అని, కరెంటు ఖాతాగా మార్చడానికి రూ.7,500, ఇన్‌కంట్యాక్స్ అంటూ మరో రూ.25 వేలు ఇలా 13 రోజుల వ్యవధిలో మొత్తం రూ.1,84,900 జమ చేయించారు. మళ్లీ ఫోన్ చేసి రూ.17 వేలు కడితే మొత్తం సొమ్మంతా మీ ఖాతాలో జమ చేస్తామని అపరిచిత వ్యక్తులు చెప్పారు. అప్పటికి అనుమానం వచ్చిన ఆ యువకుడు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. బ్యాంకును సంప్రదించగా ఆ అకౌంట్ నంబర్ ‘రాజేష్ శర్మ, 521/7ఏ, షర్దాపూర్, ఫేజ్ టూ, గోవిందాపూర్, మీరట్ జిల్లా అనే చిరునామా ఉన్నట్లు గుర్తించారు. మూడు నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు ఇలాంటి ఫోన్ మెసేజ్‌కు ఆకర్షితుడై రూ.62,500 పోగొట్టుకున్నాడు. -
మోదీ, బాబు .. ఇద్దరూ మోసగాళ్లే
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మోపిదేవి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ మోసగాళ్లేనని మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) చెప్పారు. మోపిదేవిలో మంగళవారం రేమాల బెనర్జీ అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నెహ్రూ మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీకి మోదీ అన్యాయం చేస్తే, చంద్రబాబు సొంత మామనే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కేవలం రెండు సీట్లున్న బీజేపీ నేడు అధికారంలోకి రావడానికి అద్వానీ ఎంతో కృషిచేయగా, మామకు వెన్నుపోటు పొడిచి బాబు సీఎం అయ్యారని దుయ్యబట్టారు. గుజరాత్ రాష్ట్రంలో అల్లర్లు జరిగినప్పుడు సీఎంగా ఉన్న నరేంద్రమోదిని తప్పించాలని నాడు వాజ్‌పేయి చూస్తే, అండగా నిలిచిన అద్వానీని మోదీ విస్మరించారన్నారు. సింగపూర్ పేరుతో ప్రజలకు మోసం రాష్ట్రాన్ని సింగపూర్‌గా మారుస్తామని చెబుతున్న చంద్రబాబు మాటలన్నీ మోసమేనని మరో ముఖ్యఅతిథి, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య విమర్శించారు. నూతన రాజధాని నిర్మాణానికి రైతుల భూములు తీసుకుని పట్టా ఇస్తా, వెయ్యిగజాలు స్థలం ఇస్తామంటూ మరోసారి నమ్మించడాని బాబు చూస్తున్నారని, అయితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు వదులుకోవడాని రైతులు సిద్ధంగా లేరని స్పష్టంచేశారు. బాబు పాలనలో పూర్తిగా విఫలమై ప్రధాని మోదీ జపంచేస్తూ ఢిల్లీలో అపాయిమెంట్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారని ఎద్దేవా చేశారు. డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు పార్టీ సభ్వత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ రకాల తెలుగు వంటకాలతో వనభోజనాలు నిర్వహించారు. పార్టీ నాయకుడు దేవినేని అవినాష్, మత్తి వెంకటేశ్వరావు, జి.బాబూరావు, పి.విశ్వేశ్వరావు, డి.మురళీకృష్ణ, అడపా నాగేంద్ర, మస్తాన్ వలీ, అన్నపరెడ్డి సత్యనారాయణ, పద్మశ్రీ, బండ్రెడ్డి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
చిక్కిన టక్కరులు
* అడ్డతీగల ఐఓబీ రుణకుంభకోణంలో 15 మంది అరెస్టు * రూ.2.5 కోట్ల గోల్‌మాల్‌లో అప్పటి బ్రాంచి మేనేజరూ పాత్రధారే * నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో బ్యాంకుకు టోపీ * అమాయక రైతులనూ వంచించిన టక్కరులు * బయట పడాల్సి ఉన్న మరెందరో మోసగాళ్లు అడ్డతీగల : రుణాల పేరుతో బ్యాంకుకు టోపీ పెట్టిన టక్కరుల్లో కొందరు ఎట్టకేలకు కటకటాల వెనక్కి వెళ్లారు. 2010-12 మధ్య ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ) అడ్డతీగల శాఖ నుంచి రూ.2.5 కోట్లను దర్జాగా దండుకున్న వ్యవహారంలో ఆ బ్రాంచి అప్పటి మేనేజర్ కడర్ల భాస్కరాచారిని, మరో 14 మందిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారంతా నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు కొందరు రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలను తీసుకుని, వారి సంతకాలను ఫోర్జరీ చేసి, తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు పొందినట్టు దర్యాప్తులో తేలింది. ఐఓబీ అడ్డతీగల శాఖలో పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడంపై అనుమానం వచ్చిన బ్యాంకు ఉన్నతాధికారులు తమ విజిలెన్స్ విభాగంతో దర్యాప్తు జరిపించి, రుణాల మంజూరులో అక్రమాలు వాస్తవమేనని గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రుణకుంభకోణంలో మరిన్ని కోణాలు వెలుగు చూశాయి. ఎటువంటి భూమి లేకపోయినా భూమి ఉన్నట్టు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించి, వాటిని బ్యాంకులో లక్షల్లో రుణాలు పొందినట్టు తేలింది. అంతేకాక.. అమాయకులైన పలువురు రైతుల నుంచి పాస్ పుస్తకాలు తీసుకుని, బ్యాంక్ నుంచి వారి పేరిట ఎక్కువ మొత్తంలో రుణం తీసుకుని, వారికి కొద్దిమొత్తమే ఇచ్చి, మిగిలినది మింగిన వైనమూ వెలుగు చూసింది. మరెందరో మోసగాళ్లు.. 2010-2012 మధ్య కాలంలో జరిగిన ఈ కుంభకోణంలో రూ.2.5 కోట్ల మేరకు అక్రమార్కులు స్వాహా చేసినట్టు రంపచోడవరం ఏఎస్పీ సీహెచ్ విజయారావు విలేకరులకు తెలిపారు. ఐఓబీ విజిలెన్స్ దర్యాప్తులో 19 మంది అక్రమాలకు పాల్పడినట్టు తేలిందని, బ్యాంక్ అధికారుల నుంచి తమకు వచ్చిన ఫిర్యాదుపై గత ఏప్రిల్ 24న కేసు నమోదు చేశామని చెప్పారు. అప్పటి బ్రాంచి మేనేజర్ కడర్ల భాస్కరాచారితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ వ్యవహారంలో అనేకమంది పాత్ర ఉన్నట్టు తేలిందన్నారు. గురువారం అప్పటి బ్రాంచి మేనేజర్ కడర్ల భాస్కరాచారితో పాటు గంగవరం మండలం సూరంపాలెంకు చెందిన తోటా వరలక్ష్మి, పాలోజి సీత, చవలం ప్రసాద్‌దొర, కుంజం గంగాదేవి, పాలోజి సత్తిబాబు, కొత్తాడకి చెందిన కారం వెంకన్నదొర, పడాల లక్ష్మి, తలారి బేబి(మొల్లేరు), గంగవరానికి చెందిన సారపు కృష్ణదొర, బరిజి కాటంస్వామి, మాగంటి నూతన్‌ప్రసాద్, కోటం ప్రసాద్బాబుదొర , అడ్డతీగలకు చెందిన వాకపల్లి గిరిబాబు, కింగు మహంతి శ్రీను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ 15 మందీ నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో రూ.13.70 లక్షల మేరకు రుణాలు పొందినట్లు గుర్తించామన్నారు. తమ దర్యాప్తులో రుణాల కుంభకోణం రూ.2.5 కోట్ల మేరకు జరిగినట్టు తేలిందని, అడ్డతీగల, గంగవరం, వై.రామవరం మండలాల్లో మరెందరో రైతుల నుంచి పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకుని, రుణాల పొందారని చెప్పారు. అమాయకుల ఫొటోలతో తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసి కూడా రుణాలు తీసుకున్నట్టు బయటపడిందన్నారు. వివిధ ప్రభుత్వశాఖల నుంచి తగిన సమాచారం వచ్చాక మరింతమందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసు దర్యాప్తులో కీలకపాత్ర పోషించిన సీఐ ముక్తేశ్వర్రావు, ఎస్సైలు టి.రామకృష్ణ(అడ్డతీగల), లక్ష్మణరావు(వై.రామవరం), తిరుపతిరావు (దుశ్చర్తి), భీమశంకర్, కానిస్టేబుళ్లను అభినందించారు. -
పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు