cheatings
-
ఓఎల్ఎక్స్ పేరుతో ఆగని మోసాలు
ఆన్లైన్ మోసాలకు అంతే ఉండటంలేదు. కారుచౌక బేరమని ప్రకటనలు గుప్పిస్తూ అమాయకులను మాటలతో బురిడీ కొట్టిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఓఎల్ఎక్స్ వంటి వెబ్సైట్లలో టూవీలర్స్, ఫోర్‌వీలర్స్ తదితరాలను తక్కువ ధరలకు సెకండ్ సేల్ అని ప్రకటనలు గుప్పిస్తూ ఆకర్షిస్తారు. అందులోని నంబరును సంప్రదిస్తే మాటలతో మాయచేసి ఆన్లైన్ ద్వారా నగదు అందుకుని మాయమవుతున్నారు. సాక్షి, అమరావతి : ‘మారుతీ స్విఫ్ట్.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్.. తక్కువ ధరలకే ఇస్తున్నాం..’ అంటూ ఓఎల్ఎక్స్ పేరిట వెబ్సైట్లో వచ్చిన ప్రకటనలను నమ్మి మోసపోతున్న ఘటనలకు అడ్డుకట్ట పడటంలేదు. ఓఎల్Šఎక్స్ పేరిట వస్తున్న ప్రకటనల్లో 90 శాతం తప్పుడువని పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొందరు మోసగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. అమాయకులు నష్టపోతూనే ఉన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని మిలటరీ కార్యాలయాల్లో పనిచేస్తున్నామని నేరస్తులు తమను తాము పరిచయం చేసుకుంటున్నారు. మోసపోతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఏడాదికి సగటున ఎనిమిది మంది బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ రిజిస్ట్రేషన్ నంబర్లే.. రాజస్థాన్, హరియాణ రాష్ట్రాలకు చెందిన సైబర్ నేరస్తులు ఈ మోసాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేయించిన బైక్‌లు, కార్ల ఫొటోలను ప్రకటనల్లో ఇస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్, రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయాల్లో రిజిస్టరైన కార్లు, బైకుల ఫొటోలు సేకరిస్తారు. అసలు ధరలో 50 నుంచి 60 శాతానికే ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు బయానా పుచ్చుకున్నాక వాహనాన్ని పంపుతున్నామని, మిగిలిన డబ్బులు పంపించేయాలని సూచిస్తున్నారు. కార్లు కొనుగోలు చేసిన వారికి గన్నవరం విమాశ్రయం పార్కింగ్‌లో వాహనం ఉందని.. వెళ్లి తీసుకోండని సూచిస్తున్నారు. తక్కువ ధరలకే కార్లు వస్తున్నాయన్న ఆశతో కొందరు సైబర్ నేరస్తులు సూచించిన ఖాతాల్లో నగదు బదిలీ చేసి మోసపోతున్నారు. ‘కారు’మేఘం భవానీపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ప్రేమ్‌కుమార్ ఈ నెల 3వ తేదీన వెబ్సైట్లో ఐ10 కారు విక్రయ ప్రకటన చూశారు. ప్రకటనలో ఉన్న నంబరుకు ఫోన్ చేయగా.. తనను తాను మిలటరీ రిటైర్డ్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. రూ.80 వేలకు కారు ఇస్తానని అవతలి వ్యక్తి చెప్పాడు. మిలటరీ కొరియర్ ద్వారా కారును విజయవాడ విమానాశ్రయానికి పంపుతానన్నాడు. ముందస్తుగా కొరియర్ చార్జీల కింద రూ.16,150 పంపించాలని సూచించాడు. అంతా బాగుందనుకున్న ప్రేమ్‌కుమార్ నిందితుడి ఖాతాలో నగదు జమ చేశాడు. ఆ నగదు తన ఖాతాలో పడగానే అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ‘బుల్లెట్’ వేగంతో మాయం పెనమలూరు మండలం పోరంకికి చెందిన కరణం సాయికుమార్‌కు బుల్లెట్ అంటే ఇష్టం. జనవరి నెలలో వెబ్సైట్లో ప్రకటన చూసి.. ప్రకటనకర్తను సంప్రదించాడు. రూ.1.79 లక్షలకు బుల్లెట్ ఇస్తానని అతను చెప్పాడు. ముందుగా రూ.లక్ష ఇస్తే రిజి్రస్టేషన్ చేయిస్తానని నమ్మించాడు. అతని ఖాతాలో సాయికుమార్ రూ.లక్ష జమ చేశాడు. బుల్లెట్ కోసం ఫోన్ చేయగా.. అవతల రింగే కాలేదు. మోసపోయానని తెలుసుకున్న సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు పంపిస్తున్నానని.. గూడవల్లిలో నివాసముంటున్న శ్రీనివాసరావు ఏప్రిల్ నెలలో ఓఎల్ఎక్స్లో మారుతీ స్విఫ్ట్ కారు అమ్మక ప్రకటనను చూశాడు. రూ.2.75 లక్షలకే కారు విక్రయిస్తానంటూ ఓ వ్యక్తి ప్రకటించడంతో అతని నంబర్‌కు ఫోన్ చేశాడు. తాను హైదరాబాద్‌లో ఉంటున్నానని ఆర్మీ కంటోన్మెట్‌లో ఉద్యోగమని అవతలి వ్యక్తి చెప్పాడు. బయానాగా రూ.27,500 నగదు జమ చేస్తే.. కారు అప్పగిస్తానన్నాడు. అతడి మాటలు నమ్మిన శ్రీనివాసరావు నగదు నిందితుడి ఖాతాలో జమ చేశాడు. గంటలు.. రోజులు గడిచినా అతడు రాలేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముందుగా డబ్బు చెల్లించొద్దు ఓఎల్ఎక్స్ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్న ప్రకటనలు చూసి మోసపోరాదు. వాహనం చూడకుండా ముందుగా విక్రయదారులకు ఆన్లైన్లో డబ్బులు చెల్లించవద్దు. మిలటరీలో పనిచేస్తున్నామంటూ ఇటీవల చాలా మంది మోసకారులు తప్పుడు ప్రకటనలు పెడుతున్నారు. వాటిని చూసి మోసపోకండి. వాహనం ప్రత్యక్షంగా చూసి నచ్చాకే.. రికార్డులు పరిశీలించుకుని కొనుగోలుకు ముందుకెళ్లాలి. – కె.శివాజీ, సీఐ, సైబర్ క్రైం -
శివకుమార్ అంటే ఐ‘డర్’
సాక్షి, సిటీబ్యూరో: చైనా బైక్స్ పేరుతో దేశ వ్యాప్తంగా 60 మందికి పైగా టోకరా వేసిన శివకుమార్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘరానా మోసగాడిని సీసీఎస్ పోలీసుల శనివారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హయత్‌నగర్ సమీపంలోని పెద్ద అంబర్‌పేటలో ఉన్న గోడౌన్‌ను సీజ్ చేసిన అధికారులు అందులో ఉన్న బైక్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క ఈ ఘరానా మోసగాడు అనేక మంది యువతులనూ వంచించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కోణంలో తమకు ఫిర్యాదులు రాలేదని, వస్తే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని సీసీఎస్ అధికారులు పేర్కొంటున్నారు. ఐడర్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అదే బ్రాండ్‌తో బైక్స్ తయారు చేసి విక్రయించాలని శివకుమార్ ప్రయత్నాలు చేశాడు. చైనాకు చెందిన ద్విచక్ర వాహనాల తరహాలోనే ఇవీ ఉంటాయని ప్రచారం చేసుకున్నాడు. అయితే ఇలాంటి వాహనాల తయారీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. తానే స్వయంగా హైదరాబాద్‌లో కొన్ని వాహనాలు తయారు చేయించి ప్రదర్శించాడు. మొత్తం 15 మోడల్స్‌లో 110 సీసీ నుంచి 650 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలు ఉంటాయని, వీటి ధర రూ.49 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని నమ్మబలికాడు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ మహరాష్ట్ర, గోవాలతో పాటు దేశ వ్యాప్తంగా 60 మంది నగదు చెల్లించి డీలర్షిప్స్ తీసుకున్నారు. ఈ నయవంచకుడు కొందరు యువతులకూ ప్రేమ పేరుతో వల వేసి వారినీ వంచించాడు. ఆయా యువతులతో సన్నిహితంగా ఉన్న సమయాల్లో వారికి తెలియకుండా వీడియోలు, ఫొటోలు తీసేవాడు. వీటిని చూపించి ఆ యువతులను బెదిరించే వాడని, అలా తన డీలర్ల వద్దకు వారిని పంపుతూ ఆ దృశ్యాలు చిత్రీకరించే వాడని తెలిసింది. రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వరకు డిపాజిట్లుగా, మరికొంత మొత్తం బైక్స్ కోసం అడ్వాన్స్‌గా చెల్లించే డీలర్లు చివరకు మోసపోయామని తెలుసుకునే వారు. తాము చెల్లించిన నగదు తిరిగి ఇవ్వమంటే ‘దృశ్యాలు’ ఉన్నాయంటూ వారినీ బ్లాక్మెయిల్ చేసే వాడని తెలుస్తోంది. ఇతడి కార్యాలయంలో సోదాలు చేసిన పోలీసులకు రెండు ఈ తరహాకు చెందిన సీడీలు లభించాయని సమాచారం. పోలీసులు మాత్రం తమకు ఈ వ్యవహారాలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేస్తున్నారు. ఇతడిపై ఇప్పటికే జూబ్లీహిల్స్, కాచిగూడ, మీర్‌చౌక్, సరూర్‌నగర్ ఠాణాల్లో కేసులు నమోదై ఉండగా... తాజాగా సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. శివకుమార్ మాటలు నమ్మిన అనేక మంది డీలర్లు కొన్ని నెలలుగా షోరూమ్స్, కార్యాలయాలు, సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు. అప్పటి నుంచి వాటి అద్దెలు, వారికి జీతాలు చెల్లిస్తున్నారు. చివరకు ఇప్పుడు మోసపోయామని తెలియడంతో లబోదిబోమంటున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటూ ఆన్లైన్లో మోసాలు
సాక్షి, సిటీబ్యూరో: మల్టీ నేషనల్ కంపెనీల్లో భారీ వేతనం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని కుచ్చుటోపీ పెడుతున్న ఇద్దరు ఆన్లైన్ నేరగాళ్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఘజియాబాద్‌లో అరెస్టుచేసి ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. శనివారం సైబరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం... నోయిడాలో నివాసం ఉంటున్న నీతూ కుమార్, కృష్ణన్ కుమార్‌లు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతాలలోని క్యాప్ జెమినీ తదితర మల్టీ నేషనల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయని క్వికర్, ఇండీడ్, సైన్.కామ్ వెబ్సైట్లలో ప్రకటనలు ఇచ్చారు. వీటిని చూసి తమను సంప్రదించిన నిరుద్యోగులతో కృష్ణన్ కుమార్ భార్య ఆశా, నీతూ కుమార్ స్నేహితురాలు శిఖా శర్మలు క్రేజీకాల్.నెట్ నుంచి కాలింగ్ ఆప్షన్ ఉపయోగించి మాట్లాడేవారు. బ్యాక్ డోర్లో ఈ ఉద్యోగులు ఇప్పిస్తున్నామని, ఇందుకు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేవారు. అనంతరం ఒక్కో అభ్యర్థి నుంచి రూ. లక్ష నుంచి రూ. లక్షా 20 వేల వరకు తమ బ్యాంక్ ఖాతాల్లో వేయించుకొనేవారు. డబ్బు చెల్లించిన వారికి నకిలీ క్యాప్ జెమినీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న రిచా అగర్వాల్ పేరుతో వీరు నకిలీ ఆఫర్ లెటర్లను డబ్బు చెల్లించిన వారికి మెయిల్ చేసేవారు. వాటిని తీసుకొని క్యాప్ జెమినీకి వెళ్లిన వారికి అసలు విషయం తెలిసి లబోదిబోమనేవారు. ఇలా మోసపోయిన కూకట్‌పల్లికి చెందిన ఓ బాధితుడితో పాటు సైబరాబాద్‌లో మోసపోయిన మరో 17 మంది ఫిబ్రవరి 24న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల నుంచి బాధితులు చేసిన ఫోన్‌కాల్స్, బ్యాంక్ ఖాతా నెంబర్ల ఆధారంగా నిందితులు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్నట్టు ఉంటున్నట్టుగా గుర్తించి సైబర్ ఏసీపీ జయరాం పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలోని బృందం అక్కడికెళ్లింది. నీతూ కుమార్, కృష్ణన్కుమార్లను శుక్రవారం అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చింది. వీరి నుంచి రూ.45 వేల నగదు, ఒక ల్యాప్‌టాప్, నాలుగు సెల్ఫోన్లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు కాగా, కరీంనగర్ జిల్లాకు చెందిన సోమేశ్‌రెడ్డి అనే వ్యకి కి ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందని పోలీసులు భావిస్తున్నారు. బ్యాక్‌డోర్ అపాయింట్మెంట్ పేరిట బడా కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వచ్చే కాల్, మెయిల్‌లకు స్పందించరాదని స్టీఫెన్ రవీంద్ర నిరుద్యోగులకు సూచించారు. -
ప్రజలలో తిరుగుబాటు
సాక్షి, కడప: చంద్రబాబు చెబుతున్న.. చేస్తున్న మోసాలపై ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమైందని.. త్వరలోనే చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం రాజంపేటలోని ఉస్మాన్‌నగర్‌లో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి.. గోపవరం మండలం రాచాయపేటలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య.. ఓబుళవారిపల్లె మండలం గద్దెలరేవుపల్లె పంచాయతీలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తదితరులు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలనుంచి ఎక్కడ చూసినా చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని.. ఇప్పటికైనా చంద్రబాబు గుర్తెరిగి ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చాలని సూచించారు. రాష్ట్రాన్ని ఎంతోమంది పరిపాలించారని.. కానీ ఇంత ఘోరంగా పరిపాలించిన ముఖ్యమంత్రులెవరూ లేరని ధ్వజమెత్తారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోందని.. ప్రజలు కూడా టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారని వారు తెలిపారు. నేడు పలుచోట్ల గడప గడపకు వైఎస్ఆర్ : గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా బుధవారం గోపవరం మండలంలోని సండ్రపల్లె గ్రామంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎమెల్సీ గోవిందరెడ్డి, సమన్వయకర్త వెంకటసుబ్బయ్య పాల్గొననున్నారు. జమ్మలమడుగు మున్సిపాలిటీలోని 12వ వార్డులో బుధవారం మాజీ మంత్రి, సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టనున్నారు. రాజంపేట పరిధిలోని ఎర్రబల్లెలో జిల్లా ఆధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరగనున్నారు. ఓబుళవారిపల్లె మండలం బొల్లవరం, బీపీ రాజుపల్లెల్లో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొల్లం బ్రహ్మానందరెడ్డిలు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బాబు మోసాలను ఎండగట్టనున్నారు. -
హవ్వా.. వీళ్లా ఇంటర్ టాపర్లు!
పాట్నా: 'రాజనీతి శాస్త్రం వంటలు చేయడం గురించి నేర్పిస్తుందట. ఇక నీళ్లకు హెచ్2వోకు చాలా బేధాలున్నాయట' ఈ మాటలు మొన్న బిహార్‌లో వెల్లడించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ వచ్చిన విద్యార్థులు చెప్పిన సమాధానాలు. దీంతో వారికి మరోసారి పరీక్షలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బిహార్‌లో ఇటీవల పన్నెండో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో రూబీ రాయ్(17) అనే విద్యార్థి ఆర్ట్స్ విభాగంలో టాపర్. అలాగే మరో విద్యార్థి జూనియర్ లెవల్లో టాపర్. వీరిద్దరిని స్థానిక మీడియా ఒకటి ఇంటర్వ్యూ చేసింది. ఇందులో రూబీని పాలిటిక్స్ గురించి ప్రశ్నించగా.. వంట చేయడం గురించి చెబుతుందని, మరో జూనియర్ విద్యార్థి హెచ్ టూ వో, నీళ్లు గురించి అడిగితే తెలియదని చెప్పడంతో వాళ్లు అవాక్కయ్యారు. ఇలాంటి వారు మొత్తం పదిమంది టాపర్లను ప్రశ్నించినా ఇలాంటి సమాధానాలే చెప్పడంతో ఆ వివరాలు బయటకొచ్చాయి. దీంతో ఆ పదిమంది విద్యార్థులకు వచ్చే వారంలో మళ్లీ పరీక్ష పెట్టేందుకు బిహార్ అధికారులు సిద్ధమయ్యారు. కాగా, ఇక్కడ హాజీపూర్‌లోని వీన్ రాయ్ అనే కాలేజీకి చెందిన విద్యార్థులే అధికంగా చీటింగ్ పాల్పడ్డారని విద్యాశాఖ అధికారులు చెప్పారు.