cheeting
-
లైక్,షేర్.. చీటింగ్
విజయవాడ స్పోర్ట్స్: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని యువత విలవిల్లాడుతున్నది. అత్యాశకు పోయి రూ.లక్షలకు లక్షలు సమర్పించుకుంటుంది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిత్యం ఈ తరహా ఘటనలు ఎక్కడో ఓచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయవాడ సీతారామపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వర్క్ ఫ్రం హోంలో భాగంగా ప్రస్తుతం సీతారామపురంలోని తన ఇంటి నుంచే పనిచేస్తున్నది. ఈ నెల ఐదో తేదీన తన వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌కు ఆకర్షితురాలై వెంటనే మెసేజ్లోని వెబ్‌సైట్‌ను క్లిక్ చేసింది. వెబ్సైట్లోకి వెళ్లి వివరాలను చెక్ చేసుకుంటుండగానే సదరు కంపెనీ నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ‘ఇన్‌స్టా గ్రాం, యూ ట్యూబ్, ఫేస్బుక్లో వచ్చే వీడియోలు చూసి లైక్, షేర్ చేస్తే డబ్బులు చెల్లిస్తామని, ఇంట్లో కూర్చునే నెలకు లక్షలు సంపాదించవచ్చు అని ఫోన్లో చెప్పిన వ్యక్తి మాటలను నమ్మింది. యువతికి టాస్క్‌లు మొదలయ్యాయి. ఆ రోజు తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కాసేపు విరామం ఇచ్చి ఈజీగా వచ్చే డబ్బుల కోసం తాపత్రయపడి కష్టపడి కొత్త పని టాస్క్‌లు పూర్తి చేసింది. వెంటనే ఆమె బ్యాంక్ ఖాతాలో రూ.1,200 జమయ్యాయి. దీంతో అదే పనిగా మరుసటి రోజు టాస్క్‌లు పూర్తి చేయడంతో మళ్లీ రూ. 2 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. యువతి బానిసత్వాన్ని గ్రహించిన సైబర్ నేరగాళ్లు ఆమెను అప్పుడే అసలైన ముగ్గులోకి దించారు. ‘రూ.5 వేలు డిపాజిట్ చేసే కొన్ని పేరున్న కంపెనీల టాస్క్‌లు ఇస్తాం, ఆ కంపెనీ ప్రొడక్టస్కు రేటింగ్ ఇవ్వాలంతే.. ఇది సింపుల్ టాస్క్.. ఎక్కువ లాభాలొస్తాయి..!’ అని నమ్మించారు. రూ.5 వేలు డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేసి వెబ్సైట్ వాలెట్ చెక్ చేసుకుంది. అందులో రూ.10 వేలు జమకావడంతో ఆనందంతో విత్‌డ్రా చేసుకుందామని విఫలయత్నం చేసింది. వెంటనే కంపెనీ ప్రతినిధులను ఫోన్లో సంప్రదించింది. రూ. ఏడు వేలు డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేస్తే మీ వాలెట్లో ఉన్న రూ.10 వేలు తీసుకొవచ్చని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఆ విధంగానూ చేసినా డబ్బు రాలేదు. బాధితురాలు డబ్బులు డిపాజిట్ చేస్తూనే ఉంది.. తీసుకోవడానికి వీలు లేని డబ్బులు వాలెట్లో పెరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా ఆ యువతి కేవలం 10 రోజుల్లో 14 లక్షల 13 వేల 900 రూపాయలను చెల్లించిన తరువాత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో విసురుతున్న వలలో నిరుద్యోగులతో సహా ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు పడుతుండడం గమనార్హం. ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల కేంద్రంగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఘటనలు ఈ ఆన్లైన్ మోసాల బాధితులు రోజురోజుకీ పెరుగుతున్నారు. నిత్యం స్మార్ట్ ఫోన్‌కే అంకితమవుతున్న వ్యక్తులు ఈ సైబర్ ఉచ్చులో పడుతున్నారు. ఈ ఏడాది జనవరి మూడో తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఈ తరహా ఘటనలపై సైబర్ పోలీస్ స్టేషన్లో 19 కేసులు నమోదయ్యాయి అప్రమత్తంగా ఉండండి.. స్మార్ట్ ఫోన్ వినియోగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. సులువుగా డబ్బులు వస్తాయని నమ్మి మోసపోవద్దు. ఈ తరహా ఘటనల్లో సైబర్ నేరగాళ్లు ప్రత్యేకంగా రూపొందించుకున్న ప్రోగ్రామింగ్ ద్వారానే వెబ్ లింక్స్‌ను తయారు చేస్తారు. డబ్బులు చెల్లింపులు యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ తదితర పద్ధతుల ద్వారా సేకరిస్తారు. నేరగాళ్ల కదలికలపై నిఘా ఉంచాం. బాధితులకు న్యాయం చేస్తాం. – టి.కె.రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా -
విలాసాల లేడీ.. రూ.4కోట్ల మోసం
ఆమె ఓ కి‘లేడీ’.. విలాసాలకు అలవాటు పడి కమీషన్ల పేరిట మహిళలను లక్ష్యంగా చేసుకుంది. వ్యాపారంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30 వేల కమీషన్ వస్తుందని నమ్మబలికింది. ఇలా మహిళలు ఒకరిద్వారా మరొకరు మొత్తం 15 మంది ఆమెకు సుమారు రూ.4 కోట్లు ముట్టజెప్పారు. రెండు నెలలు వారికి కమీషన్ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత ముఖం చాటేసింది. పెట్టుబడి పెట్టిన వారంతా డబ్బులు అడగడంతో లేవంటూ ఎదురుతిరిగింది. దీంతో బాధితులు లబోదిబో మంటున్నారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు అందడంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తునకు ఆదేశించారు. నల్లగొండ క్రైం : టప్పర్‌వేర్ (ప్లాస్టిక్ తరహా డబ్బాలు) వ్యాపారం పేరిట 15 మందికి రూ.4కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కిలేడీని నల్లగొండ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కిలేడీ చేతిలో మోసపోయిన వారు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి మొరపెట్టుకోగా ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసు లోతైన విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణంలోని శివాజీనగర్ చెందిన ఆకుల స్వాతి టప్పర్ వేర్ వ్యాపారం పేరిట దుకాణం తెరిచింది. ఈ వ్యాపారంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30వేల కమీషన్ వస్తుందని పలువురు మహిళలకు మాయమాటలు చెప్పింది. పట్టణంలోని యాటకన్నారెడ్డి కాలనీకి చెందిన మానస రూ.కోటి 30 లక్షలు స్వాతికి ఇచ్చింది. అదే కాలనీకి చెందిన యాట భారతమ్మ రూ.19 లక్షలు పెట్టుబడిగా ఇచ్చింది. ఇలా 15మంది మహిళలనుంచి రూ.4 కోట్లకుపైగానే వసూలు చేసింది. వరుసగా రెండు నెలలపాటు కమీషన్ డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత కమీషన్ ఇవ్వడం మానేసింది. పెట్టుబడులు పెట్టిన వారంతా డబ్బులు అడగడం మొదలు పెట్టడంతో ‘మీరు ఇచ్చేటప్పుడు ఏమైనా కాగితం రాసుకున్నామా..‘ అంటూ ఎదురుతిరిగింది. డబ్బులు లేవంటూ బెదిరించసాగింది. దీంతో బాధితులంతా శనివారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. వెంటనే ఆయన స్పందించి బాధితులతో కలిసి వచ్చి ఎస్పీకి రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. వాస్తవాలను విచారించి బాధితులకు న్యాయం చేయాలిన ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. దీంతో వెంటనే స్వాతిని అదుపులోకి తీసుకున్నారు. కేసును సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. ప్రజల డబ్బుతో విలాస జీవితం కమీషన్ల పేరిట మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఆకుల స్వాతి దందాకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులనుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమికంగా రూ.4కోట్ల వరకు కుచ్చుటోపీ పెట్టినట్లు ప్రత్యేక పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఇంటి దగ్గరే ఉండి రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30వేల కమీషన్ వస్తుందని చెప్పడంతో ఒకరి ద్వారా ఒకరు చైన్ లింక్ తరహాలో పరిచయం ఏర్పడి రూ.లక్షల్లో పెట్టిన పెట్టుబడి కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ప్రజలను మోసగించి తీసుకున్న డబ్బుతో కారు, ఇతర చోట్ల ఇంటి స్థలాలు కొనుగోలు, విలాసవంతమైన వస్తువులు కొన్నట్లు సమాచారం. బాధితులు ఎంతమంది ? వసూలు చేసిన డబ్బు ఎంతా? తీసుకున్న డబ్బుతో ఏం చేసింది ? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జెడ్పీలో ఉద్యోగాల పేరిట మోసం
ఒంగోలు: ప్రకాశం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కొందరు వ్యక్తుల ముఠా నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి ఉద్యోగ ఉత్తర్వులు అంటూ పలువురు నిరుద్యోగులను మోసం చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు షేక్ ఖాసిమ్ అనే వ్యక్తి సహా 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.31 లక్షల నగదు, డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
సినీ, టీవీ ఆర్టిస్టులను సరఫరా చేస్తానంటూ..
సాక్షి, హైదరాబాద్ : ‘మీకు సినీ, టీవీ నటులతో గడపాలని ఉందా..? నాకు తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమకు చెందిన నటీమణులెందరో తెలుసు.. అడ్వాన్స్ చెల్లిస్తే వారి ఫోన్ నంబర్లు ఇచ్చి వారితో నేరుగా మాట్లాడుకునే అవకాశం కల్పిస్తా.. కొత్త హీరోయిన్లు అయితే రూ.3 లక్షలు, పాత హీరోయిన్లకు రూ.2 లక్షలు..’ వాట్సాప్‌లో ఓ మాయలేడి పంపిన మెసేజ్ ఇదీ! ఈ మోసగత్తె ఉచ్చులో చిక్కి పలువురు రాజకీయ నాయకులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, యువకులు మోసపోతున్నారు. బంజారాహిల్స్‌కు చెందిన 23 ఏళ్ల ప్రశాంత్ వాట్సాప్‌లో వచ్చిన ఇలాంటి సందేశానికి ఆకర్షి తుడై రూ.25 వేలు వదులుకున్నాడు. రాజధాని నగరానికే చెందిన ఓ మాజీ మంత్రి కుమారుడు, కాంగ్రెస్ యువనేతదీ ఇదే పరిస్థితి! మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న 24 సంవత్సరాల సందీప్ రెండు నెలల జీతం పోగొట్టుకుని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపో యాడు. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువనేత రూ. లక్ష చేజార్చుకున్నాడు! సల్మా లక్ష్మిగా చెప్పుకుంటున్న ఓ మహిళ వీరందరినీ బురిడీ కొట్టించింది. తెలుగు, తమిళ్, హిందీ హీరోయిన్లు, టీవీ ఆర్టిస్ట్‌లను సరఫరా చేస్తానంటూ మార్ఫింగ్ చేసిన వారి ఫోటోలతో సహా యువకులకు వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుతూ భారీగా డబ్బులు గుంజింది. చిత్రమేమంటే ఆ మాయలేడి వలలో పడ్డవారెవ్వరూ ఇప్పటిదాకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వ్యక్తిగత ప్రతిష్ట, కుటుంబ గౌరవం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని సల్మా మరింత రెచ్చిపోయింది. కొందరు ఏజెంట్లను నియమించుకుని మరీ యువ ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు, యువ రాజకీయ నేతల మొబైల్ నంబర్లను సేకరించి వారికి గాలం వేస్తోంది. ‘‘ఓ యువనేత నాతో ఫోన్లో ఈ విషయం చెప్పారు. మీరు ఫిర్యాదు చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చా. కానీ ఆయన ముందుకురాలేదు. దీంతో ఆయనను సంప్రదించి మేమే మోసగత్తెకు సంబంధించిన వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నాం’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఫోన్ సంభాషణ రికార్డులు పంపి.. సల్మా లక్ష్మిగా చెప్పుకుంటున్న మహిళ తాను ముంబై వాసినని, తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమకు చెందిన నటీమణులు తనకు తెలుసునని పరిచయం చేసుకుంటోంది. నటీమణులతో శారీరక సంబంధాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పిస్తానని నమ్మబలుకుతోంది. ఏ మాత్రం అనుమానం రాకుండా వారికి సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి యువకులకు వాట్సాప్ ద్వారా చేరవేస్తోంది. అంతేకాదు హైదరాబాద్‌లోని అన్ని ఫైవ్‌స్టార్ హోటళ్లలో తనకున్న ప్రత్యేక గదుల్లో కాల్‌గరŠల్స్ ఉన్నారంటూ ఆ సందేశాల్లో పేర్కొంటోంది. ముందస్తుగా అడ్వాన్స్ సొమ్ము చెల్లిస్తే సదరు సినిమా, బుల్లితెర నటీమణుల ఫోన్ నంబర్లు ఇచ్చి వారితో మాట్లాడుకునే అవకాశం కల్పిస్తానని చెబుతోంది. కొత్త హీరోయిన్‌కు రూ.3 లక్షలు, పాత హీరోయిన్లకు రూ.2 లక్షలు చెల్లించాలంటూ, అందుకు తగ్గట్లుగా ఇద్దరు హీరోయిన్లుగా చెప్పుకుంటున్న వారితో జరిపిన ఫోన్ సంభాషణ రికార్డులను కూడా వాట్సాప్‌లో పంపుతోంది. ఇవన్నీ చూసి నిజమేనని నమ్మిన ప్రశాంత్ (బ్యాంక్ ఉద్యోగి) తనకు బాగా ఇష్టమైన ఓ తెలుగు నటీమణితో పరిచయం కావాలని సల్మాకు మెసేజ్ పెట్టాడు. అందుకు ‘అదేం పెద్ద కష్టం కాదు.. రూ.25 వేలు పేటీఎం ద్వారా చెల్లించండి’ అని సూచించిన సల్మా... ఓ మొబైల్ నంబర్ ఇచ్చింది. దీంతో ప్రశాంత్ 24 గంటల్లో ఐదుసార్లు రూ.5 వేల చొప్పున రూ.25 వేలు చెల్లించాడు. డబ్బు చేరగానే ఆ మాయలేడి ప్రశాంత్ నంబర్‌ను బ్లాక్ చేసింది. మోసపోయానని తెలుసుకున్న ప్రశాంత్ మౌనంగా ఉండిపోయాడు. గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ఓ యువనేత కూడా తనకు వచ్చిన వాట్సాప్ సందేశంతో సల్మాతో చాటింగ్ చేశాడు. ఆమె మాటలు నమ్మి ఓ హీరోయిన్‌తో పరిచయం కోసం తాపత్రయపడ్డాడు. ముందస్తుగా రూ.50 వేలు చెల్లించడానికి సిద్ధపడ్డాడు. సల్మా చెప్పిన మొబైల్ నంబర్ ద్వారా ఎయిర్టెల్ మనీ చెరవేశాడు. అంతే మరుసటి రోజు నుంచి ఆ యువనేత నంబర్‌ను బ్లాక్ చేసింది. తాను ముంబైలో ఉంటానని చెప్పుకుంటున్నా.. ఈ మాయలేడి ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. తప్పుడు నంబర్లు ఇస్తూ.. ఈ మాయలాడి ఫలానా హీరోయిన్ లేదా ఫలానా బుల్లితెర నటీమణి ఫోన్ నంబర్ అంటూ తప్పుడు నంబర్లు ఇస్తూ కూడా మోసాలకు పాల్పడుతోంది. సల్మా ఇచ్చిన ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసిన వారికి చీవాట్లు ఎదురవుతున్నాయి. ఆ ఫోన్ నంబర్లన్నీ మహిళలవే కావడం గమనార్హం. మోసపోవద్దనే ఉద్దేశంతోనే ఈ కథనం సల్మా మోసాలను ‘సాక్షి’ ప్రతినిధి దృష్టికి తీసుకువచ్చిన ఓ రాజకీయ యువనేత తన పేరు రహస్యంగా ఉంచాలని కోరారు. సల్మా మోసాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించడంతోపాటు కొందరు బాధితుల వివరాలు కూడా అందించారు. వీరి మాదిరిగా మరెవ్వరూ మోసపోవద్దనే ఉద్దేశంతోనే ‘సాక్షి’ ఈ కథనాన్ని ప్రచురిస్తోంది. -
టెండర్ ఇప్పిస్తానని టోకరా..
రూ.20వేలు, బంగారంతో ఉడాయించిన ఘనుడు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు సుబేదారి సీఎస్‌లో కేసు నమోదు హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్.. నిత్యం ఉద్యోగులు, అధికారులతో రద్దీగా ఉంటుంది. అనువణువునా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో అధికారుల పేరుచెప్పి టెండర్లు ఇప్పిస్తానంటూ ఓ కాంట్రాక్టరు నుంచి రూ.20వేలు, బంగారం తీసుకుని ఉడాయించాడు ఓ ఘనుడు. విషయం తెలసుకుని లబోదిబోమన్న బాధితుడు చివరకు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ పుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. అసలేంజరిగింది... ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా జిల్లాలకు అవసరమైన బీరువాలు, కుర్చీలు, బల్లలు కొనుగోలు కోసం కలెక్టరేట్ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియ కలెక్టరేట్లో శుక్రవారం జరిగింగి. ఈ సమయంలో కాజీపేట ప్రాంతానికి చెందని ఒక వ్యాపారి టెండర్ ధాఖలు చేయడానికి వచ్చాడు. అధికారులతో మాట్లాడుతున్నాడు. తనకు కావాల్సిన వివరాలు తెలుసుకుంటున్నాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన ఓ ఆగంతకుడు వ్యాపారిని బయటకు తీసుకు వెళ్లాడు. కలెక్టరేట్లో టెండర్లు నిర్వహిస్తున్న అధికారి తనకు బాగా తెలుసని నమ్మబలికాడు. రూ.20వేలు ఇచ్చినట్లయితే టెండర్ నీకే వచ్చేట్లు చేస్తానని అన్నాడు. దీంతో ఆ మాటలు నమ్మిన వ్యాపారి అక్కడిక్కడే రూ.20వేలు తీసి ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న తరువాత సదరు వ్యక్తి కలెక్టరేట్లోని డైనింగ్‌హాల్, ఇతర గదుల్లో తిరిగాడు. తరువాత కొద్ది సేపటికి వ్యాపారి వద్దకు వెళ్లి నీకు టెండర్ ఇవ్వడానికి సార్.. ఓకే అన్నాడు. కానీ... నీ చే తికి ఉన్న బంగారు ఉంగరం సార్‌కు బాగానచ్చిందట. ఒకసారి ఇస్తే ఫొటో తీసుకుని ఇస్తాడట అని నమ్మబలికాడు. దీంతో ఆ వ్యాపారి తన చేతికి ఉన్న సుమారు రూ.20వేల విలువైన బంగారు ఉంగరం తీసి ఇచ్చేశాడు. ఉంగరం చేతిలో పడగానే కలెక్టరేట్ వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించిన అగంతకుడు ముందు వైపు నుంచి బయటకు వెళ్లి పోయాడు. గంటలు గడిచినా టెండర్ ఇప్పిస్తానన్న వ్యక్తి రాకపోవడంతో అధికారుల వద్దకు వెళ్లి వ్యాపారి ఆరా తీశాడు. దీంతో తాను మోసపోయానఽని ఆ వ్యాపారికి అప్పడు అర్ధం అయింది. లబోదిబో మంటూ అధికారులకు జరిగిన విషయం చెప్పాడు. ఆ వ్యక్తితో కలెక్టరేట్లో అధికారులకు, ఉద్యోగులకు సంబంధం లేదని అధికారులు తేల్చిచెప్పారు. విషయంపై పోలీసుకుల ఫిర్యాదు చేయాలని సూచించారు. సుబేదారి పీస్‌లో కేసు నమోదు విషయంలో తమకేం సబంధం లేదని అధికారులు తేల్చి చెప్పడంతో బాధితుడు సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కలెక్టరేట్లో ఉన్న సీసీ టీవీ పుటేజీలు పరిశీలించారు. దీంట్లో డబ్బులు, ఉంగరం తీసుకున్న విషయం, కలెక్టరేట్లో అటు..ఇటు కలియ దిరిగిన విషయం సీసీ టీవీల్లో స్పష్టంగా నమోదైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో మేడారం పాస్‌ల విషయంలో... ప్రసుత్తం టెండర్ల పేరుతో డబ్బులు, బంగారం తీసుకుని ఉడాయింన తతంగం జరిగిన గదిలోనే మేడారం జాతర సమయంలో జాతర పాస్‌లు చోరీకి గురయ్యాయి. విషయం గుర్తించి అధికారులు సీసీ టీవీపుటేజీలు పరిశీలించారు. వాటి ఆధారంగా పాస్‌లు తస్కరించిన వ్యక్తిని గుర్తించి డీఆర్వో కేసు నమోదు చేయించారు. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుత ఘటన అదే గదిలో జరగడం గమనార్హం. ========================================================================================================ఎండ్ -
టెండర్ ఇప్పిస్తానని టోకరా..
రూ.20వేలు, బంగారంతో ఉడాయించిన ఘనుడు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు సుబేదారి సీఎస్‌లో కేసు నమోదు హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్.. నిత్యం ఉద్యోగులు, అధికారులతో రద్దీగా ఉంటుంది. అనువణువునా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇలాంటి ప్రదేశంలో అధికారుల పేరుచెప్పి టెండర్లు ఇప్పిస్తానంటూ ఓ కాంట్రాక్టరు నుంచి రూ.20వేలు, బంగారం తీసుకుని ఉడాయించాడు ఓ ఘనుడు. విషయం తెలసుకుని లబోదిబోమన్న బాధితుడు చివరకు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ పుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు. అసలేంజరిగింది... ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా జిల్లాలకు అవసరమైన బీరువాలు, కుర్చీలు, బల్లలు కొనుగోలు కోసం కలెక్టరేట్ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియ కలెక్టరేట్లో శుక్రవారం జరిగింగి. ఈ సమయంలో కాజీపేట ప్రాంతానికి చెందని ఒక వ్యాపారి టెండర్ ధాఖలు చేయడానికి వచ్చాడు. అధికారులతో మాట్లాడుతున్నాడు. తనకు కావాల్సిన వివరాలు తెలుసుకుంటున్నాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన ఓ ఆగంతకుడు వ్యాపారిని బయటకు తీసుకు వెళ్లాడు. కలెక్టరేట్లో టెండర్లు నిర్వహిస్తున్న అధికారి తనకు బాగా తెలుసని నమ్మబలికాడు. రూ.20వేలు ఇచ్చినట్లయితే టెండర్ నీకే వచ్చేట్లు చేస్తానని అన్నాడు. దీంతో ఆ మాటలు నమ్మిన వ్యాపారి అక్కడిక్కడే రూ.20వేలు తీసి ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న తరువాత సదరు వ్యక్తి కలెక్టరేట్లోని డైనింగ్‌హాల్, ఇతర గదుల్లో తిరిగాడు. తరువాత కొద్ది సేపటికి వ్యాపారి వద్దకు వెళ్లి నీకు టెండర్ ఇవ్వడానికి సార్.. ఓకే అన్నాడు. కానీ... నీ చే తికి ఉన్న బంగారు ఉంగరం సార్‌కు బాగానచ్చిందట. ఒకసారి ఇస్తే ఫొటో తీసుకుని ఇస్తాడట అని నమ్మబలికాడు. దీంతో ఆ వ్యాపారి తన చేతికి ఉన్న సుమారు రూ.20వేల విలువైన బంగారు ఉంగరం తీసి ఇచ్చేశాడు. ఉంగరం చేతిలో పడగానే కలెక్టరేట్ వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించిన అగంతకుడు ముందు వైపు నుంచి బయటకు వెళ్లి పోయాడు. గంటలు గడిచినా టెండర్ ఇప్పిస్తానన్న వ్యక్తి రాకపోవడంతో అధికారుల వద్దకు వెళ్లి వ్యాపారి ఆరా తీశాడు. దీంతో తాను మోసపోయానఽని ఆ వ్యాపారికి అప్పడు అర్ధం అయింది. లబోదిబో మంటూ అధికారులకు జరిగిన విషయం చెప్పాడు. ఆ వ్యక్తితో కలెక్టరేట్లో అధికారులకు, ఉద్యోగులకు సంబంధం లేదని అధికారులు తేల్చిచెప్పారు. విషయంపై పోలీసుకుల ఫిర్యాదు చేయాలని సూచించారు. సుబేదారి పీస్‌లో కేసు నమోదు విషయంలో తమకేం సబంధం లేదని అధికారులు తేల్చి చెప్పడంతో బాధితుడు సుబేదారి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కలెక్టరేట్లో ఉన్న సీసీ టీవీ పుటేజీలు పరిశీలించారు. దీంట్లో డబ్బులు, ఉంగరం తీసుకున్న విషయం, కలెక్టరేట్లో అటు..ఇటు కలియ దిరిగిన విషయం సీసీ టీవీల్లో స్పష్టంగా నమోదైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో మేడారం పాస్‌ల విషయంలో... ప్రసుత్తం టెండర్ల పేరుతో డబ్బులు, బంగారం తీసుకుని ఉడాయింన తతంగం జరిగిన గదిలోనే మేడారం జాతర సమయంలో జాతర పాస్‌లు చోరీకి గురయ్యాయి. విషయం గుర్తించి అధికారులు సీసీ టీవీపుటేజీలు పరిశీలించారు. వాటి ఆధారంగా పాస్‌లు తస్కరించిన వ్యక్తిని గుర్తించి డీఆర్వో కేసు నమోదు చేయించారు. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుత ఘటన అదే గదిలో జరగడం గమనార్హం. -
పాపం.. ఆయేషా జిత్తులు పారలేదు!
నేరానికి శిక్ష తప్పదన్న న్యాయశాస్త్ర మూల సూత్రం ఆమెకు తెలియదనుకుంటే పొరపాటే. ఎందుకంటే 27 ఏళ్ల ఆయేషా అహ్మద్ రాజనీతి శాస్త్రంలో పట్టా కూడా పుచ్చుకుందిమరి. గోటితో పోయేదాన్ని పోనివ్వకుండా ఎత్తులు, జిత్తులతో గొడ్డలిదాకా తెచ్చుకుంది. నిజానికి ఆమె చేసింది పెద్ద నేరమేమీకాదు. అయితే శిక్ష నుంచి బయటపడడానికి అతితెలివికిపోయి, చిక్కుల్లోపడింది! చివరికి మూడు నెలల కారాగార శిక్షకు గురైంది. ఇంతకీ ఆయేషా ఏంచేసిందంటే.. స్పీడ్ లిమిట్ ఉన్నచోట కారును వేగంగా నడిపింది. అంతేనా? అంతేకాదు అలా నడిపింది తానుకాదని, వేరొకరని అధికారులను నమ్మించేందుకు ప్రయత్నించింది. పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి నిజం కక్కేసింది. కారు స్పీడుగా నడిపినందుకు ఆమెకు పడిన ఫైన్ 85 పౌండ్లు (దాదాపు రూ.8 వేలు). ఆ నేరం నుంచి తప్పిచుకునేందుకు ఓ ఫేక్ లాయర్ కు ఆమె చెల్లించిన ఫీజు 450 పౌండ్లు (దాదాపు రూ. 44 వేలు). వెస్ట్ మిడ్ ల్యాండ్స్ (బ్రిటన్) లోని డుడ్లేలో నివసించే అయేషా అహ్మద్ 2014లో ఓ పార్టీ నుంచి తన బీఎండబ్ల్యూ కారులో తిరిగొస్తూ గంటకు 50 కిలోమీటర్లు మాత్రమే వెళ్లాలని స్పీడ్ లిమిట్ ఉన్నచోట్ 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ట్రాఫిక్ పోలీసులు అమర్చిన కెమెరాకు చిక్కింది. ఐదు నిమిషాల వ్యవధిలో రెండుసార్లు రూల్స్ బ్రేక్ చేసిన ఆయేషాకు తర్వాతి రోజు ట్రాఫిక్ పోలీసులు చలాన్ పంపారు. అప్పుడు మొదలైంది అసలు కథ.. ఎవరిద్వారా తెలుసుకున్నాడోగానీ ఓ లాయర్ ఆయేషాకు ఫోన్ చేసి, ఫైన్ తప్పేలా చేస్తానన్నాడు. సరేనని ఒప్పుకున్న ఆమె మరో వ్యక్తి ద్వారా రూ. 44 వేల ఫీజును లాయర్ కు చెల్లించింది. సదరు లాయర్.. ఆయేషా ఏ తప్పూ చేయలేదని, అప్పుడు కారు డ్రైవ్ చేసింది ఆమె కాదు, వేకొక వ్యక్తి అని అధికారులకు ప్రతినోటీసులు పంపాడు. కెమెరాలో దృశ్యాల్లోనేమో ఆయేషానే కారు డ్రైవ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి లాయరేమో అలా కాదంటున్నాడు. దీంతో ఉన్నతాధికారులు కేసును సీరియర్ గా తీసుకుని లోతుపాతుల్ని పరిశీలించారు. సదరు ఫేక్ డ్రైవర్.. వేరే కేసుల్లోనూ నిందితుడిగా ఉండటంతో పోలీసుల పని సులువైంది. ఆ తర్వాత ఆయేషాను అదుపులోకి తీసుకుని విచారించారు. డ్రైవ్ చేసింది తానేనని, ఒక ఫేక్ లాయర్ చేతిలో మోసపోయానని మొత్తం చెప్పేసి.. శిక్ష తగ్గించాలని కోరింది. కోర్టు మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. 'ఇంత చదువుకున్న నీకు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాననే విషయం తెలియదంటే మేం నమ్మం. శిక్ష పడితేగానీ నువ్ దారికిరావు' అంటూ మూడు నెలల జైలు శిక్ష విధించాడు వోల్వెరాంప్టన్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి. శిక్షతోపాటు 58 వారాల పాటు ఆయేషా లైసెల్స్ కూడా రద్దయింది. పాపం ఆయేషా..! -
మహిమగల చెంబు అని.. రూ.15లక్షలు కాజేశారు
ఎస్.కోట: ఫొటోలో కనిపిస్తోందే.. అదొక మహిమగల చెంబట! దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడెక్కడి సొమ్మంతా మన ఇంట్లోకి వచ్చి పడుతుందట! 'ఎలా వస్తాయి? డబ్బులేమైనా సెల్ ఫోన్ సిగ్నల్సా.. గాలిలో వచ్చేయడానికి?' అని మీకు సందేహం రావచ్చు. కానీ అది నిజమని నమ్మి, ఆ మహిమగల చెంబును దక్కించుకునేందుకు లక్షలు ఇచ్చేస్తుంటారు కొందరు. చివరికి తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఆశ్రయిస్తారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో సోమవారం వెలుగులోకి వచ్చిన సంఘటనా ఇలాంటిదే. పోలీసులు తెలిపిన వివరాలను బట్టి.. ఎస్.కోటకు చెందిన ఓ మహిళను సంప్రదించిన నిందితులు తమ దగ్గర మహిమగల చెంబు ఉన్నదని నమ్మించి రూ. 15 లక్షలు కాజేసి ఉడాయించారు. తీరా ఆ చెంబు సాధారణ చెంబేనని తెలుసుకుని, మోసపోయానని గ్రహించిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు సోమవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. -
మోడల్‌ను చేస్తామని నిండా ముంచారు..
హైదరాబాద్: మోడల్ కావాలని ఆశించిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల వల్లో పడి నిండా మునిగాడు. ఏకంగా రూ.9.63 లక్షలు పోగొట్టుకున్నాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాంపల్లికి చెందిన ఓ యువకుడు (17) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మోడల్ కావాలన్నది అతడి ఆకాంక్ష. ఈ క్రమంలో ఎల్యూమనేటరీ సొసైటీ విషయం ఇతడికి తెలిసింది. వివిధ రంగాల్లో ప్రతిభ ఉండి, ఉన్నతస్థాయికి చేరాలని ఆశించే వారిని ఈ సొసైటీ సభ్యులుగా చేర్చుకుంటుంది. నామ మాత్రపు ఫీజుతో తగిన తోడ్పాటు అందిస్తుంటుంది. అయితే నగర విద్యార్థి మాత్రం ఈ సొసైటీ వెబ్‌సైట్‌ను పోలిన బోగస్ సైట్‌కు ఈ-మెయిల్ పంపాడు. దీన్ని సృష్టించిన సైబర్ నేరగాళ్లు తక్షణం స్పందించారు. సభ్యత్వ నమోదు అంటూ 599 డాలర్లు (దాదాపు రూ.40 వేలు) వసూలు చేశారు. ఆ తర్వాత రకరకాల కారణాలు చెప్తూ రూ.9.63 లక్షలు దండుకున్నారు. దీంతో తాను మోసపోయానని బాధితుడు ఆలస్యంగా తెలుసుకున్నాడు. కాగా, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో డబ్బు డిపాజిట్ చేసిన మూడు ఖాతాల్లో రెండు ముంబై, మరోకటి లక్నోకు చెందినదిగా గుర్తించారు. ఇది నైజీరియన్ గ్యాంగ్ పనిగా అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
వెలుగుచూస్తున్న నందినీ చౌదరి లీలలు
హైదరాబాద్: బ్యూటీ స్పా ముసుగులో కస్టమర్లను మోసపుచ్చిన నందినీ చౌదరి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-72లోని బ్లష్ స్పా అండ్ లగ్జరీ సెలూన్ నిర్వాహకురాలు యలమంచిలి నందిని చౌదరి చేతిలో మోసపోయినవారు రోజుకొకరు బయటపడుతున్నారు. ఆభరణాల వ్యాపారం పేరుతో ఓ వ్యాపారిని నిండాముంచి అరెస్టు అయి జైలులో ఊచలు లెక్కిస్తున్న నందిని చౌదరిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనే కాకుండా పంజగుట్ట, నాంపల్లి, సీసీఎస్‌లో కూడా కేసులు నమోదవుతున్నాయి. నందినీ చౌదరీ తమ వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. తన స్పా అండ్ సెలూన్‌కు వచ్చే కస్టమర్లను మభ్యపెట్టి వారి నుంచి లక్షలాది రూపాయల విలువ చేసే ఆభరణాలతో పాటు అప్పు పేరుతో డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటికే నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. నాలుగు రోజుల క్రితం చందనబ్రదర్స్ నిర్వాహకులు తమను రూ. 20 లక్షల మేర మోసం చేసినట్లు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్‌లో రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తాజాగా మరోకేసు నమోదైంది. రూ.20 లక్షల మేర తమను మోసం చేసిందంటూ ఇద్దరు వ్యాపారులు ఫిర్యాదులిచ్చారు. ఇటీవల ఆమెను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించగా చాలా విషయాలు చెప్పకుండా దాటవేసినట్లు తేలింది. మరోమారు కస్టడీకి తీసుకోవాలని ఓ వైపు నాంపల్లి పోలీసులు, ఇంకో వైపు సీసీఎస్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేయాలని తలపెట్టారు. ఇదిలా ఉండగా హైఫై మహిళలను లక్ష్యంగా చేసుకొని వారికి కొందరు యువకులతో పరిచయాలు చేయించి మేల్ ఎస్కార్ట్స్‌ను పంపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని సమాచారం. ఇలా పాతికమంది మహిళలకు మేల్ ఎస్కార్ట్స్‌ను సరఫరా చేసి వారినుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు కూడా తెలుస్తోంది. వీరంతా పరువు పోతుందనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని భావిస్తున్నారు. -
పండుగ వేళ బంగారం వ్యాపారుల మోసాలు..
హైదరాబాద్: దీపావళీ పండుగ సందర్భంగా బంగారు వర్తకులు కొనుగోలుదారులను మోసం చేస్తున్నట్టు తూనికలు, కొలతల శాఖ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. బంగారం స్వచ్ఛత, తూకంలో దగా, నాణ్యత లేమి, తరుగు పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో ప్రముఖ ఆభరణాలు, షాపింగ్ మాల్స్‌లలో తనిఖీలు నిర్వహించిన అధికారులు 82కు పైగా కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర కంట్రోలర్, అదనపు డీజీపీ గోపాల్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో 15, రంగారెడ్డిజిల్లాలో 9, నల్లగొండలో 4, వరంగల్‌లో 9, కరీంనగర్లో 14, నిజామాబాద్‌లో 2, మహబూబ్‌నగర్‌లో 7, మెదక్‌లో 10, ఖమ్మం జిల్లాలో 12 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని వినియోగించి తయారు చేసిన ఆభరణాలను విక్రయిస్తునట్లు గుర్తించామన్నారు. -
ఎమ్మెల్యేకు టోకరా
- కుటుంబ సంక్షేమ అభివృద్ధి నిధి పేరుతో... - బ్యాంక్ అకౌంట్ ఆధారంగా నిందితుడు అరెస్ట్ హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకం పేరుతో మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డికి టోకరా వేసి రూ. 90 వేలు కాజేసిన వ్యక్తిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి జోన్ డీసీపీ రమారాజేశ్వరి కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన తోట బాలాజి అలియాస్ లక్ష్మణ్ మహేశ్ అలియాస్ మల్లిబాబు (37) రామగుండం ఎన్టీపీసీలో పని చేసేవాడు. పలు కారణాల రీత్యా సంస్థ వారు ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటినుంచీ ప్రజాప్రతినిధులను ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసే పని చేపట్టాడు. ఈ క్రమంలో ఈ నెల 8న మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి సెల్‌కు కాల్ చేయగా ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తి శ్రీధర్‌రెడ్డి ఫోన్లో మాట్లాడాడు. తనను రాఘవేంద్రారెడ్డిగా పరిచయం చేసుకుని, సెక్రటేరియట్లో పని చేస్తానని చె ప్పాడు. తెలంగాణ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో కారు కొనుగోలుకు, డెయిరీ ఫామ్, కిరాణ షాపుల కోసం కుటుంబ సంక్షేమ అభివృద్ధి నిధి పథకాన్ని ప్రారంభించిందని చెప్పాడు. పథకంలో మెంబర్షిప్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 300 చొప్పున మూడు వందల మంది నుంచి రూ. 90 వేలు ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ నంబర్ 200110100057005లో జమ చేయాలని ఇందుకు 8వ తేదీయే చివరి తేదీ అని చెప్పాడు. దీంతో వారు రూ. 90 వేలను బ్యాంక్‌లో జమ చేశారు. ఆ తర్వాత అదే నంబర్‌కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి సెక్రటేరియట్లో వాకబు చేయగా రాఘవేంద్రారెడ్డి అనే వారెవరూ అక్కడ లేరని, అలాంటి పథకమూ లేదని తెలిసింది. దీంతో శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంబించారు. బ్యాంక్ అకౌంట్ కృష్ణా జిల్లా పెనుగంచిబ్రోలులో నివసించే షేక్ నాజర్‌వలి కుమారుడు నాగూర్‌వలిదిగా గుర్తించారు. వీరిని విచారించగా నిందితుడికి బ్యాంక్ అకౌంట్ లేదని వీరిని పరిచయం చేసుకుని.. నగరం నుంచి తన తమ్ముడు బ్యాంక్‌లో డబ్బులు వేస్తాడని నమ్మబలికి వారి అకౌంట్లో డబ్బులు పడగానే డ్రా చేసుకున్నాడని తెలిసింది. వీరి సహాయంతో కేసును ఛేదించిన పోలీసులు నిందితుడు మల్లిబాబుని శనివారం అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ. 90 వేలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా గతంలో పలువురు ఎంపీలను మభ్యపెట్టి డబ్బులు కాజేసిన సంఘటనలో బోయినపల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో నిందితుడిపై కేసులు నమోదయ్యాయి. అంతేకాదు మల్లిబాబు గతంలో పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులనూ బురిడీ కొట్టించి డబ్బులు కాజేశాడు. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.