chilakaguda
-
సస్పెన్స్ వీడిన వాటర్ ట్యాంక్ డెడ్‌బాడీ.. కిషోర్‌గా గుర్తింపు
సాక్షి, ముషీరాబాద్: చిలకలగూడ జలమండలి సబ్ డివిజన్ పరిధిలోని ఎన్ఆర్కె నగర్‌లోని వాటర్ ఓవర్‌హెడ్ ట్యాంకులో డెడ్‌బాడీపై బుధవారం సస్పెన్స్ వీడింది. ట్యాంక్‌లో పడి కుళ్లిన శవాన్ని కిషోర్‌గా.. అతని సోదరి డెడ్‌బాడీని గుర్తించింది. సంఘటనా స్థలంలో చెప్పుల ఆధారంగా గుర్తించారు. స్థానికంగా కిషోర్ పేయింటింగ్ వర్క్స్ చేస్తూ ఉండేవాడని, మద్యానికి బానిసైనట్లు తెలిపారు. 20 రోజుల క్రీతం చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. మరోవైపు కొద్ది రోజులుగా ఈ ట్యాంకు నుంచి సరఫరా అయిన నీటిని తాగిన రిసాలగడ్డ అంబేడ్కర్‌నగర్, హరినగర్, కృష్ణనగర్, శివస్థాన్‌పూర్, బాకారం ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కృష్ణా పైప్‌లైన్ మరమ్మతుల నేపథ్యంలో ఈనెల 8, 9వ తేదీలలో నగరంలోని నీటి సరఫరా నిలిపివేస్తుందని జలమండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్యాంకును శుభ్రం చేసేందుకు వెళ్లిన వారికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం 6గంటల సమయంలో డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని బయటకుతీశారు. బయటకు తీసిన మృతదేహం కుళ్లిపోయి ఉంది. వెంటనే ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించిన విషయం తెలిసిందే. -
లాక్డౌన్: చికెన్ వ్యాపారి కారుకు ప్రెస్ స్టిక్కర్.. చివరికి!
సాక్షి, చిలకలగూడ: లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఆంక్షల సడలింపుల్లో ఉన్న ‘ప్రెస్’ను తమకు అనుకూలంగా వాడుకుంటున్న ఉల్లంఘనులు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. కారుకు ప్రెస్ స్టిక్కర్ పెట్టుకుని లాక్డౌన్ సమయంలో దర్జాగా తిరుగుతున్న చికెన్ వ్యాపారిపై చీటింగ్ కేసు నమోదు చేసి కారును సీజ్ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకకు చెందిన బొమ్మగాని ఉపేందర్ చికెన్ వ్యాపారి. లాక్డౌన్ సమయంలో పోలీసు తనిఖీలు ముమ్మరం కావడంతో తన సొంతకారు (టీఎస్ 09 ఈఎఫ్ 4174)కు ప్రెస్ స్టిక్కరు పెట్టుకుని దర్జాగా తిరుగుతున్నాడు. గురువారం రాత్రి చిలకలగూడ పోలీసులు సీతాఫల్మండి చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఉపేందర్ తన కారులో అటుగా వచ్చాడు. పోలీసులు కారును ఆపగా రిపోర్టర్‌ను అంటూ దబాయించాడు. ఏ పత్రికలో పనిచేస్తున్నావో ఐడెంటిటీ కార్డు చూపించమని కోరగా నీళ్లు నమిలాడు. వాస్తవానికి తాను చికెన్ వ్యాపారినని, లాక్డౌన్ సమయంలో సడలింపు ఉండడంతో తన కారుకు ప్రెస్ స్టిక్కర్ అతికించానని వివరించాడు. లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘించినందుకు కారును సీజ్ చేయడంతోపాటు జరిమాన విధించారు. ప్రెస్ పేరిట మోసానికి పాల్పడిన ఉపేందర్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్ వివరించారు. లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చదవండి: ఆన్లైన్ డేటింగ్ పేరుతో వ్యభిచారం.. కస్టమర్‌గా ఫోన్‌చేసి.. Lockdown: సీఎం కేసీఆర్ ఆదేశం.. రంగంలోకి డీజీపీ -
అడ్రస్ అడిగి గొలుసు లాక్కొని వెళ్లారు
హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ మార్కండేయ దేవాలయం వద్ద శుక్రవారం చైన్‌స్నాచింగ్ సంఘటన చోటు చేసుకుంది. అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఓ మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కొని దుండగుడు పరారయ్యాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళ మెడలోనుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. ఈ ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈశ్వరీబాయి నగర్లో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న కమలారాణి(48) ఇంటి ఎదుట నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. దీంతో బాదితురాలు పోలీసులను ఆశ్రయించింది. సంఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పరిశీలించి వివరాలు సేకరించారు.