chilakalapudi
-
మెరిసే.. మెరిసే.. బంగారంలా.. రూ.10 కోట్ల నుంచి రూ.100 కోట్లను దాటి..
సాక్షి, అమరావతి: ఆకాశాన్నంటుతున్న ధరతో సామాన్యులకి బంగారం అందని ఆభరణమే అయింది. చిన్నపాటి గొలుసు కొనాలన్నా లక్షలు పెట్టాల్సిందే. డిజైన్లు అంతకంటే వేగంగా మారిపోతున్నాయి. బంగారానికి ప్రత్యామ్నాయంగా పుట్టుకు వచ్చిందే ఇమిటేషన్ లేదా రోల్డ్ గోల్డ్ లేదా వన్‌గ్రామ్ గోల్డ్ నగలు. ఏ పేరుతో పిలుచుకున్నా వీటి కేరాఫ్ అడ్రస్ కృష్ణా జిల్లా చిలకలపూడి. బంగారు ఆభరణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా గిల్ట్ నగలు తయారు చేయడం చిలకలపూడి కళాకారుల గొప్పతనం. బాగా డిమాండ్ ఉన్న యాంటిక్ నగల్లో కూడా కొత్త డిజైన్లు సృష్టిస్తూ మహిళల మనసులు దోచుకుంటున్నారు. లక్షలు విలువ చేసే బంగారు బ్రైడెల్ సెట్స్‌ను రూ.5,000 నుంచి రూ.25,000కే అందిస్తున్నారు. సినిమాల్లో, సీరియల్స్‌లో నటీనటులు ధరించే ఆభరణాల్లో అత్యధిక శాతం చిలకలపూడిలో తయారైనవే. అంతేకాకుండా అనకాపల్లి నుంచి చికాగో వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు దేవుని అలంకరణకు ఉపయోగించే వజ్ర, వైఢూర్యాలు పొదిగిన కిరీటాలు, ఆభరణాలు కూడా ఇక్కడివే. ఒక కుటుంబంతో ఆరంభం 114 ఏళ్ల క్రితం ఒక కుటుంబంతో ప్రారంభమైన ఈ కళ ఇప్పుడు గోల్డ్ పార్క్ ఏర్పాటుతో పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది. 1908లో మచిలీపట్నానికి సమీపంలో ఉన్న చిలకలపూడి గ్రామంలో టేకి నరసింహం అనే స్వర్ణకారుడి ఆలోచన నుంచి మొదలయ్యింది ఈ రోల్డ్ గోల్డ్ వ్యాపారం. బంగారం ధరలు భారీగా పెరగడంతో మధ్య తరగతి ప్రజల కోసం రాగి మీద బంగారం పూతతో ఆభరణాల తయారీని మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 100 ఉండే బంగారం దిద్దులను కేవలం పావలాకే అందించడంతో ఈ రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. వైఎస్సార్ చొరవతో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు దేశంలో ఇమిటేషన్ గోల్డ్ ఆభరణాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోటీని తట్టుకోలేక చిలకలపూడి తయారీదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి వచ్చింది. వెంటనే ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చి, మచిలీపట్నం ఇమిటేషన్ గోల్డ్ జ్యూవెలరీ పార్క్ ఏర్పాటు చేశారు. 2007లో 48 ఎకరాల్లో ఇమిటేషన్ జ్యూవెలరీ పార్కు ఏర్పాటైంది. ఇప్పుడు ఈ పార్కులో 236 యూనిట్లలో ప్రత్యక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తోంది. మచిలీపట్నం, పెడన, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఉండే 24 గ్రామాలకు చెందిన 27 వేల మందికి పైగా మహిళలు ఇంటి వద్దే ఆభరణాలు తయారు చేస్తూ పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరు ఒక్కొక్కరు రోజుకు రూ.200 నుంచి రూ.450 వరకు సంపాదిస్తున్నారు. ప్లేటింగ్, క్యాడ్, కాస్టింగ్ వంటి సౌకర్యాలు ఒకే చోట ఉండటంతో ఈ పార్కులో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తొలుత రూ.10 కోట్లుగా ఉన్న చిలకలపూడి వ్యాపారం రూ.100 కోట్లను అధిగవిుంచడమే కాకుండా ఇతర రాష్ట్రాల పోటీని తట్టుకొని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. అదే బాటలో జగన్ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పార్క్‌ను మరింత అభివృద్ధి చేస్తోంది. రూ. 8 కోట్లతో రహదారులు, డ్రెయిన్లు, ఈటీపీ ఆధునికీకరణ, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపడుతోంది. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. నూతన డిజైన్ల రూపకల్పనకు క్యాడ్, కాస్టింగ్ వంటి వాటిలో ఇక్కడ శిక్షణ ఇస్తారు. -
3 వేలు పెడితే ఒంటినిండా ‘బంగారం’!
మహేష్ ఇంట్లో రేపు ఫంక్షన్.. బంధువులతో ఇంటి లోగిలి కళకళలాడుతోంది.. మహేష్ కూతురు మాత్రం ఒక మూల కూర్చొని మూతి మూడు వంకర్లు తిప్పుతోంది.. మహేష్ పెదాలపై చిరునవ్వు కనిపిస్తున్నా.. మనసులో ఆందోళన ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది.. కూతురు అడిగిన నగలు తేవడానికి తగిన డబ్బు లేదు.. ఏం చేద్దామా అని ఒకటే ఆలోచన.. ఇంతలో తళుక్కుమంటూ ఐడియా తట్టింది.. వెంటనే బందరులోని చిలకలపూడి వెళ్లాడు.. బడ్జెట్‌కు తగ్గట్టు, కూతురికి నప్పేట్టు నగలు తీసుకున్నాడు.. ఆ నగల ధగధగలతో ఫంక్షన్లో మహేష్ కూతురు మిలమిలా మెరిసిపోయింది.. మహేష్ మనసు ఆనందంతో మురిసిపోయింది. ఇదీ చిలకలపూడి ఇమిటేషన్ జ్యూయలరీ ప్రత్యేకత. అది నిజంగా కొత్త ‘బంగారు’ లోకమే.. కోవిడ్‌తో కుదేలైన ఈ వ్యాపారం.. ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్లీ కాంతులీనుతోంది. మచిలీపట్నం: రోల్డ్‌గోల్డ్ నగల తయరీకి బందరు ఖ్యాతి గడించింది. బందరు కేంద్రంగా వందల ఏళ్లుగా సాగుతున్న ఈ పరిశ్రమ ఏడాదికి రూ. 100 కోట్లకు పైగా వ్యాపారం చేస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి 30 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. కోవిడ్‌తో కుదేలైనా బందరు బంగారం మళ్లీ కాంతులీనుతోంది. కోవిడ్ వైరస్ తగ్గుముఖం పట్టడం, సాధారణ జన జీవనానికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయటంతో రోల్డ్‌గోల్డ్ పరిశ్రమలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఇదీ చరిత్ర.. రోలింగ్ మెషిన్ల మీద రోల్ చేయగా వచ్చిన మెటీరియల్‌తో చేసిన నగలు కనుక వీటిని రోల్డ్ గోల్డ్ నగలు అంటారు. ఈ రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు పితామహుడుగా గుడివాడ మోటూరుకు చెందిన కమ్మిలి వెంకటరత్నంను పరిగణిస్తారు. ఈయన 1902లో బందరు చిలకలపూడిలో కవరింగ్ గోల్డ్ పరిశ్రమను ప్రారంభించాడు. ఆ తర్వాత అంచలంచెలుగా పరిశ్రమ అభివృద్ధి చెందగా.. 1982లో మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ అండ్ ప్లేటింగ్ జ్యూయలరీ మ్యానుఫ్యాక్చరింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో పరిశ్రమను ప్రభుత్వం గుర్తించి మచిలీపట్నం శివారు పోతేపల్లిలో ‘మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూయలరీ పార్క్’ పేరుతో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీని పరిధిలో 240 యూనిట్లు ఉన్నాయి. మళ్లీ కాంతులు.. ► కోవిడ్ ప్రభావంతో దాదాపు పది నెలల పాటు పూర్తిగా మూతపడిన నగల తయారీ పరిశ్రమ నెమ్మదిగా కోలుకుంటోంది. ప్రస్తుతం 90 యూనిట్లలో నగల తయారీ జరుగుతుంది. ►ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మంది దీనిలో భాగస్వాములవుతున్నారు. దీంతో ప్రతి రోజూ రూ.50 లక్షల మేర విలువ గల బంగారు నగలను తయారు చేస్తూ, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ►రోల్డ్గోల్ నగలను కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచే కాకుండా, పొరుగున ఉన్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలు దారులు వస్తున్నారు. ఇక్కడ నుంచి నగలు తీసుకెళ్లి వారి వారి ప్రాంతాలో దుకాణాలు నిర్వహించుకొని విక్రయిస్తుంటారు. అ‘నగ’నగా చిలకలపూడి.. బందరు లడ్డూ, బాదం పాలుతో పాటు రోల్డ్‌గోల్డ్ నగల తయారీకి బందరు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. రోల్డ్‌గోల్డ్ నగల తయారీతో పాటు, వాటిని విక్రయించేందుకు దుకాణాలు సైతం ఇక్కడ వందలాదిగా వెలిశాయి. బందరులోని ఏ వీధిలో చూసిన రోల్డ్‌గోల్డ్ నగల దుకాణాలు దర్శనమిస్తాయి. చిలకలపూడిలో ప్రతి ఇల్లూ ఓ జ్యూయలరీ పరిశ్రమే. రూ.3 వేలు పెడితే ఒంటినిండా బంగారం.. ప్రస్తుతం బంగారం ధర సామాన్యులకు అందుబాటులేని పరిస్థితి. అంతో, ఇంతో ఆర్థికంగా ఉన్నా, మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా వచ్చిన మోడల్స్ కొనుగోలు చేయటం కష్టంగానే మారుతోంది. అందుకనే సామాన్యుల నుంచి ధనిక వర్గాల వారు వరకు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలపై ఆసక్తి చూపుతారు. బందరులో రూ. 3 వేలు పెడితే ఒంటినిండా నగలు వేసుకోవచ్చు. గ్యారెంటీ లేనివి ఒక నెల, గ్యారంటీ ఆభరణాలు ఆరు నెలల పాటు ఫంక్షన్లు, పెళ్లిలో సింగారించుకుని జిగేల్మనచ్చు. రాయితీ లేకుంటే మూతే.. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను కోవిడ్ కోలుకోలేని దెబ్బతీసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీ పరిశ్రమ నిలబడేలా చేసింది. ప్రస్తుతం గతంతో పోల్చితే 60 శాతం మేర వ్యాపారం సాగుతోంది. పది నెలల పూర్తిగా మూసివేశాం. ఆ కాలానికి కార్మికులను ఆదుకునేలా ప్రభుత్వం సాయం చేస్తే బాగుంటుంది. అన్నివర్గాల వారిని ఆదుకుంటున్న ప్రభుత్వం రోల్డ్‌గోల్డ్ పరిశ్రమలోని కార్మికులను కూడా ఆదుకోవాలి. – అంకెం జితేంద్ర కుమార్, అసోసియేషన్ కార్యదర్శి పదేళ్లుగా ఇదే వ్యాపారం పదేళ్లుగా రోల్డ్‌గోల్డ్ నగల విక్రయం చేస్తున్నాం. దుకాణాన్ని నేనే చూసుకుంటాను. భర్త సాయంతో పాటు, మరో ఇద్దరికి జీతం ఇచ్చి షాపులో పెట్టుకున్నాం. ఇప్పుడైతే రోజుకు రూ.15 నుంచి రూ.20 వేలు వరకు అమ్మకం సాగుతోంది. కోవిడ్ ముందైతే రూ.30 వేలు వరకు అమ్మడుపోయేవి. అన్నీ పోను రోజుకు వెయ్యి వరకు మిగులుతోంది. మంచి మోడల్స్ కొనుగోలుకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. – మారుబోయిన శివాని, చిలకలపూడి తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వ రాయితీ.. ఎన్నో ఏళ్లుగా రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను నమ్ముకుని వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. కానీ వీరి సమస్యలను పాలకులెవ్వరూ పట్టించుకోలేదు. పాదయాత్ర సమయంలో బందరు వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రోల్డ్‌గోల్డ్ పరిశ్రమను చూసి, తాము అధికారంలోకి వస్తే అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే రోల్డ్‌గోల్డ్ యూనిట్లకు విద్యుత్ రాయితీ ప్రకటించారు. యూనిట్ విద్యుత్ వినియోగంపై వాస్తవంగా అయితే రూ. 9.50 చెల్లించాల్సి ఉంది. కానీ రోల్డ్గోల్ నగల తయారీదారులకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.6 రాయితీ కల్పించింది. దీంతో పరిశ్రమ పురోభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. -
చిలకలపూడిని మింగేస్తున్న డ్రాగన్
సాక్షి, అమరావతి: చైనా.. మన భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడమే కాదు.. మారుమూల ప్రాంతాలకు సైతం చొచ్చుకొచ్చి మన మార్కెట్లను కబ్జా చేసేసింది. చైనా వస్తువుల్ని బహిష్కరించాలనే డిమాండ్ పురుడు పోసుకోకముందే.. రోల్డ్ గోల్డ్ (గిల్టు) నగల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చిలకలపూడి మార్కెట్‌ను డ్రాగన్ మింగేసింది. ‘బంగారం’ లాంటి నగలు ► చిలకలపూడి చుట్టుపక్కల దాదాపు వందేళ్ల నాటినుంచి గిల్టు నగలు తయారు చేస్తున్నారు. ► గాజులు, వడ్డాణాలు, చెవి దిద్దులు, నెక్లెస్‌లు, హారాలు, పాపిడి బిళ్లలు, జడగంటలు, దేవతా విగ్రహాలకు కిరీటాలు, హారాలు, గొలుసులు, వంకీలు, పట్టీలు, మాటీలను వేలాది డిజైన్లలో తయారు చేసే నిపుణులకు ఇక్కడ కొదవలేదు. వీటికి 6 నెలలు, ఏడాది, రెండుమూడేళ్ల వరకు గ్యారంటీ ఇచ్చి మరీ విక్రయిస్తుంటారు. ► ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన చిలకలపూడి బంగారం కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ మార్కెట్లకు ఇమిటేషన్ నగలు అందిస్తోంది. ► కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 10 వేల కుటుంబాలు (45 వేల మందికి పైగా కార్మికులు) వీటి తయారీపై జీవనోపాధి పొందుతున్నాయి. మచిలీపట్నంలోని పోతేపల్లి జ్యువెలరీ పార్కులో మొత్తం 236 పరిశ్రమలున్నాయి. ► వీటికి అనుబంధంగా మచిలీపట్నం, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, చల్లపల్లి, ఘంటసాల, పామర్రు, మొవ్వ తదితర ప్రాంతాల్లో వేలాది మంది ఇళ్ల వద్ద నగలకు రాళ్లు అద్దడం, మంగళ సూత్రాలకు మెరుగులు అద్దడం, పూసల దండలు చుట్టడం వంటి వివిధ రకాల పనులు చేస్తుంటారు. రూ.80 కోట్ల టర్నోవర్‌ను మింగేసిన డ్రాగన్ ► మచిలీపట్నం ప్రాంతంలో నెలకు సగటున రూ.7 కోట్ల చొప్పున ఏడాదికి రూ.80 కోట్ల విలువైన ఇమిటేషన్ నగలు ఉత్పత్తి అయ్యేవి. ► గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఇమిటేషన్ నగలపై కన్నేసిన డ్రాగన్ క్రమంగా చిలకలపూడి పరిశ్రమను కబ్జా చేసింది. ► ప్రస్తుతం చిలకలపూడి నగల మార్కెట్లో ఏకంగా 60 శాతం చైనా ప్రమేయం ఉంటే.. కేవలం 40 శాతం మాత్రమే స్థానికత ఉంది. ► నాణ్యత మాట అటుంచితే చైనా ఉత్పత్తుల ధర తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. లాభాలు తగ్గాయి చైనా సరుకులు తక్కువ ధరకు వస్తున్నాయనే దిగుమతి చేసుకుంటున్నాం. 60 శాతం చైనా సరుకులు మన మార్కెట్‌ను ఆక్రమించాయి. వాటి నాణ్యత ఎలా ఉన్నా ముందుగానే డబ్బులు చెల్లించాల్సి రావడంతో లాభాలు తగ్గిపోయాయి. అవే ధరలకు మన దేశీయ మార్కెట్లో ముడి సరుకుల ఉత్పత్తి జరిగితే చైనా సరుకుల్ని బహిష్కరించవచ్చు. – పీవీ సుబ్బారావు, అధ్యక్షుడు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వయం సమృద్ధి సాధిస్తేనే.. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే నినాదం చాలా గొప్పదే. అయితే, మనం స్వయం సమృద్ధి సాధించే దిశగా దిగువ స్థాయి వరకు ప్రయత్నం జరగాలి. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన చిలకలపూడి గిల్టు నగల రంగాన్ని నిలబెట్టుకునే స్థాయిలో మన ప్రయత్నాలు గట్టిగా జరగాలి. – నూకల సురేష్, గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ అధినేత -
అంబరాన్నంటిన పాండురంగడి రథోత్సవం
ఈడేపల్లి : పాండురంగస్వామి రధోత్సవ ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగుతోంది. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఊరేగింపు శనివారం ఉదయం వరకు పట్టణంలోని పురవీధుల్లో తిరుగుతొంది. స్వామి వారికి పెద్దఎత్తున మహిళలు ప్రత్యేక పూజలను చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, కౌన్సిలర్లు పల్లపాటి సుబ్రమణ్యం, కొట్టె వెంకట్రావు తదితరులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. -
చిలకలపూడి అ'నగ' నగా ...
చిలకలపూడి బంగారం పేరుతో అమ్మకాలు వందేళ్లుగా నగల తయారీ దేశ విదేశాల్లోనూ డిమాండ్ 10 వేలకుపైగా కుటుంబాలకు ఉపాధి రాజు ఇంట్లో ఫంక్షన్ రేపు..బంధువులతో ఇంటి లోగిలి కళకళలాడుతోంది.. రాజు భార్య మాత్రం ఒక మూల కూర్చొని మూతి మూడు వంకర్లు తిప్పుతోంది..రాజు పెదాలపై చిరునవ్వు కనిపిస్తున్నా..మనసులో ఆందోళన ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది.. భార్య అడిగిన నగలు తేవడానికి తగిన డబ్బు లేదు..ఏం చేద్దామా అని ఒకటే ఆలోచన..ఇంతలో తళుక్కుమంటూ ఐడియూ తట్టింది..వెంటనే చిలకలపూడి వెళ్లాడు..బడ్జెట్‌కు తగ్గట్టు..భార్యకు నప్పేట్టు నగలు తీసుకున్నాడు.. ఆ నగల ధగధగలతో ఫంక్షన్లో రాజు భార్య మిలమిల మెరిసిపోయింది..రాజు మనసు ఆనందంతో మురిసిపోయింది. ఇదీ చిలకలపూడి ఇమిటేషన్ జ్యూయలరీ ప్రత్యేకత..వనితలచే వందనమనిపించుకుంటూ..కళారంగంలో కాంతులీనుతూ..దేశ,విదేశాల్లో తళతళ మెరిసిపోతూ..వందేళ్లుగా వన్నెతగ్గని ఆదరణ చూరగొంటోందీ గిల్టు బంగా రం.దీని కథేంటో చూద్దాం మరి.. మచిలీపట్నం: బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో తక్కువ ఖర్చుతో బంగారు నగలనే ధరించిన అనుభూతిని పొందాలంటే రోల్డ్‌గోల్డ్ నగలను ఆశ్రయించాల్సిందే. అచ్చంగా బంగారు నగలను పోలినట్లుగా రోల్డ్‌గోల్డ్ తయారు చేసి ఆరు నెలలు, ఏడాది, రెండు, మూడు సంవత్సరాల గ్యారెంటీ ఇచ్చి విక్రరుున్నారు బందరు ప్రాంతంలో. మారుతున్నఅభిరుచులకు అనుగుణంగా వేలాదిగా డిజైన్లు తయారు చేయటంలో నిపుణులున్నాలిక్కడ. అటు బంగారు నగల తయారీలోనూ, ఇటు చిలకలపూడి నగల తయారీలోనూ పేరుగడించారు. భరత నాట్యం, కూచిపూడి, కథకళి, ఒడిస్సీ తదితర నాట్యాల్లో కళాకారులు ఉపయోగించే అన్ని రకాల ఆభరణాలను ఇక్కడ తయారు చేస్తారు. చిలకలపూడి బంగారు నగల తయారీలో బందరులో దాదాపు 10 వేల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ తయారైన నగలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర ప్రాంతాలకు ఎగుమతి అవుతారుు. విదేశాల్లో ఈ బంగారానికి ఆదరణ ఉంది. ఆభరణాల తయారీ ఇలా.. సుమారు వందేళ్ల క్రితం రోల్టుగోల్డు వస్తువుల తయారీ బందరులోని చిలకలపూడిలో ప్రారంభమైంది. తొలుత కాపర్(రాగి) ఇత్తడి, జింక్ మెటిరియల్‌ను కలిపి మెటీరియల్‌ను తయారు చేస్తారు. ఇందులో రాగి శాతం అధికంగా ఉంటుంది. దీనిని ఇనుపరాడ్ల మాదిరిగా మార్చి పిడకల మధ్య కాలుస్తారు. ఈ మెటీరియల్‌కు సాగే గుణం వచ్చేందుకు కాల్చి గాలిలోనే ఆరబెట్టి కఠినత్వాన్ని తగ్గిస్తారు. ఈ రాడ్లను ప్రత్యేక యంత్రాల ద్వారా రేకులుగాను, సన్నటి తీగలుగాను తీస్తారు. వీటిని నగల తయారీకి ఉపయోగిస్తారు. గతంలో గోల్డ్ కవరింగ్‌లో నగ ల తయారీకి ఉపయోగించే తీగలోనే బంగారం కలిపేవారు. తయూరైన డిజైన్లను తొలుత సల్ఫ్యూరిక్ యాసిడ్, అనంతరం నైట్రిక్ యాసిడ్‌లో కడుగుతారు. నగలకు పూర్తి స్థాయిలో మెరుపు వచ్చేందుకు బంగారు కోటింగ్‌కు ఉపయోగించే పౌడరుతో కలిపిన ద్రావకంలో ముంచి తీస్తారు. వీటిని రంపపు పొట్టులో ఉంచి కలియతిప్పుతారు. దీంతో గోల్డ్ ప్లేటింగ్ వేసిన నగలు మరింత మెరుపును సంతరించుకుంటాయి. గ్యారంటీతో అమ్మకం చిలకలపూడి నగల గోల్డ్ కోటింగ్‌కు ఏడాది గ్యారంటీ ఉంటుంది. జాగ్రత్తగా వాడుకుంటే మరో ఆరు నెలలపాటు కోటింగ్ పోదు. మరింత ధర పెడితే రెండు, మూడు సంవత్సరాల వరకు గ్యారంటీతో నగలు లభిస్తాయి. చెవి దిద్దులు రూ. 20ల నుంచి దొరుకుతారుు. రంగురాళ్లు పొదిగిన నెక్లెస్‌లు, గొలుసులు రూ. 250లకు లభిస్తాయి. గాజుల రాళ్లు పొదిగినవి రూ. 100 నుంచి రూ. 250లకు లభిస్తాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఇవి చిలకలపూడిలో తయూరు చేసినట్లు గుర్తించలేం. వీటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నాయి. ఈ నగలకు డిమాండ్ ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డిజైన్లు మారుతుంటాయి. మార్కెట్లోకి వచ్చిన నూతన డిజైన్ల వైపే మహిళలు మక్కువ చూపుతుంటారు. రోల్డ్‌గోల్డ్ నగల్లో గాజులు, వడ్డాణాలు, చెవి దిద్దులు, నెక్లెస్‌లు, హారాలు, పాపిడిబిళ్లలు, జడగంటలు, దేవతా విగ్రహాలకు కిరీటాలు, హారాలు, గొలుసులు, వంకీలు, పట్టీలు, మాటీలను వేలాది డిజైన్లలో తయారు చేస్తారు. పెళ్లి నగలు కొనేందుకు వచ్చాం మధ్యతరగతి కుటుంబాల వారు బంగారంతో పెళ్లి నగలు చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఫంక్షన్లు, పండుగలకు బంగారునగలు వేసుకుని వెళ్లాలంటే భయం. ఈ నేపథ్యంలోనే రోల్డ్‌గోల్డ్ నగలను కొనేందుకు వచ్చాం. ఈ నగలు తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసినా అచ్చు బంగారాన్ని పోలి ఉంటాయి. జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ కాలం మన్నుతాయి. - రమాదేవి, గుడివాడ -
రోడ్డు ప్రమాదంలో తెలుగువారు మృతి