
అంబరాన్నంటిన పాండురంగడి రథోత్సవం
ఈడేపల్లి : పాండురంగస్వామి రధోత్సవ ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగుతోంది. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ ఊరేగింపు శనివారం ఉదయం వరకు పట్టణంలోని పురవీధుల్లో తిరుగుతొంది. స్వామి వారికి పెద్దఎత్తున మహిళలు ప్రత్యేక పూజలను చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, కౌన్సిలర్‌లు పల్లపాటి సుబ్రమణ్యం, కొట్టె వెంకట్రావు తదితరులు ఈ రథోత్సవంలో పాల్గొన్నారు.