Child sale
-
ఆ పిల్లల రోదన తీరేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: అప్పటివరకు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పసిపిల్లలను ఒక్కసారిగా తమ నుంచి దూరం చేశారని పెంపుడు తల్లిదండ్రుల ఆవేదన ఒకవైపు.. కన్నవాళ్లు, పెంపుడు తల్లిదండ్రులు.. ఎవరూ కనిపించక పిల్లల రోదన మరోవైపు.. వెరసి యూసుఫ్‌గూడలోని శిశు విహార్ వద్ద పరిస్థితి కంటనీరు తెప్పిస్తోంది. పరారీలో ఉన్న ఢిల్లీ, పుణేకు చెందిన ప్రధాన నిందితులు పోలీసులకు చిక్కి, పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరనేది తేలే వరకూ ఈ పసికందుల ఆక్రందన తప్పేలా లేదు. సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసును ఎలా కొలిక్కి వస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్, విజయవాడకు చెందిన పిల్లల విక్రయం ముఠా ఇప్పటివరకు 60కి పైగా చిన్నారులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయించగా.. వీరిలో 13 మంది శిశువులను పోలీసులు రక్షించి, శిశు విహార్‌లో చేర్చిన సంగతి తెలిసిందే. మధ్యవర్తులు ఢిల్లీ, పుణేలకు చెందిన కిరణ్, ప్రీతి, కన్నయ్య నుంచి పిల్లలను తీసుకొచ్చి, పెంపుడు తల్లిదండ్రులకు విక్రయించారు. ఈ పిల్లల అసలు తల్లిదండ్రులు ఎవరు? నిందితులు పేద తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని కొనుగోలు చేశారా? లేక అపహరించి, మధ్యవర్తుల ద్వారా విక్రయించారా? అనే అంశాలపై స్పష్టత వస్తేనే కేసు దర్యాప్తు ముందుకెళుతుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దీంతో కిరణ్, ప్రీతి, కన్నయ్యల కోసం నలుగురు సిబ్బంది చొప్పున రెండు ప్రత్యేక బృందాలు ఢిల్లీ, పుణేలలో గాలిస్తున్నాయి. పేరెంట్స్ ఎవరనేది తేలితేనే.. ఈ చిన్నారుల అసలు తల్లిదండ్రులు ఎవరనేది తేల్చడం పోలీసులకు సవాల్‌గా మారింది. పిల్లల డీఎన్ఏలతో తల్లిదండ్రుల డీఎన్ఏ నమూనాలను సరిపోల్చుతామని, ఒకవేళ పిల్లల డీఎన్ఏతో సరిపోలితే అసలు తల్లిదండ్రులకే అప్పగిస్తామని, ఒకవేళ తేలని పక్షంలో పిల్లల్ని తిరిగి శిశు విహార్కే తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. పిల్లలపై ఇష్టం లేని తల్లిదండ్రులకు బలవంతంగా ఇచ్చేయాలా? లేక పిల్లలంటే ప్రేమ చూపే పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించాలా? అనేది తేల్చలేని పరిస్థితి నెలకొంటుందని ఓ అధికారి తెలిపారు. త్వరలోనే పెంపుడు తల్లిదండ్రుల అరెస్టు.. పిల్లలను అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరం. ఇప్పటికే పిల్లలను విక్రయించిన 11 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ఇక, పిల్లలను కొనుగోలు చేసిన దంపతులపై కూడా సీఆర్పీసీ, జువెనైల్ జస్టిస్ (జేజే) చట్టాల కింద కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. త్వరలోనే వీరిపై సెక్షన్ 370, 372, 373 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, 81, 87, 88 జువెనైల్ జస్టిస్ యాక్ట్–1985 కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేయనున్నట్లు సమాచారం. -
బయట కాపుకాసి.. కాళ్లు, చేతులు కట్టేసి..
సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసు వెనుక ముగ్గురు ధీర వనితల పోరాటం దాగి ఉంది. అక్షర జ్యోతి ఫౌండేషన్‌ను నిర్వహించే అక్కాచెల్లెళ్లు ధైర్య సాహసాలతో ఈ మానవ అక్రమ రవాణా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితో పాటు స్వప్న, షేక్ సలీంలను పట్టుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన తీరును అక్కాచెల్లెళ్లు అనూష, శ్రీవైష్ణవి, ప్రత్యూషలు ‘సాక్షి’తో పంచుకున్నారు. మహిళ ఇచ్చిన సమాచారంతో.. అక్షర జ్యోతి ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ మహిళ అనూషను సంప్రదించింది. తనకు పిల్లల్లేరని, శోభారాణి పిల్లలను విక్రయిస్తున్నట్టుగా తెలిసిందని, ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ శోభారాణి ఫోన్ నంబర్ ఇచ్చింది. షాక్‌కు గురైన అక్కాచెల్లెళ్లు శోభారాణి కార్యకలాపాలపై స్టింగ్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి యూట్యూబ్ చానల్ విలేకరి సాయికుమార్ సహకరించారు. సీక్రెట్ కెమెరాలతో క్లినిక్‌లోకి..: ఈనెల 21న శ్రీవైష్ణవి పిల్లల్లేని తల్లిగా నటిస్తూ తనకో బిడ్డ కావాలని శోభారాణిని కలిసింది. దీంతో ఆమె వాట్సాప్‌లో అబ్బాయి, అమ్మాయి ఫొటోలను పంపించింది. బాబును కొనేందుకంటూ రూ.4.50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చెల్లించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పీర్జాదిగూడలోని క్లినిక్‌కు వచ్చి బాబును తీసుకెళ్లాలని శోభ సూచించింది.దీంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, సాయికుమార్‌తో శివ, శ్రీనివాస్ అనేవారు బృందంగా ఏర్పడి, సీక్రెట్ కెమెరాలను ధరించి క్లినిక్ లోపలికి వెళ్లారు. ఒకవేళ నిందితులు అనుమానంతో తమపై దాడి చేసినా, పారిపోయేందుకు ప్రయత్నించినా పట్టుకునేందుకు వీలుగా క్లినిక్‌కు వెళ్లే రెండు మార్గాలలో మరో 10 మందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. క్లినిక్ లోపల నిందితులు శోభారాణి, స్వప్నలతో జరిగే సంభాషణలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు బయట ఉన్న బృందానికి వాట్సాప్ మెసేజ్‌లలో చేరవేస్తూ ఏమాత్రం తేడా వచి్చనా వారు సహాయపడేలా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్టో కారులో బాబును తెచ్చి.. వారు క్లినిక్‌లోకి వెళ్లిన అరగంటలో మరో నిందితుడు షేక్ సలీం తెలుపు రంగు ఆల్టో కారులో బాబును తీసుకొచ్చాడు. క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే భవనం యజమాని ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత శోభరాణి వెళ్లి బాబును తీసుకుని క్లినిక్ లోపలికి వచ్చింది. రెండు నకిలీ ఆధార్ కార్డులను ఇస్తూ వీళ్లే బాబు తల్లిదండ్రులు అని చెప్పింది. ఇంకో రూ.20 వేలు అదనంగా ఇస్తే బాబు బర్త్ సరి్టఫికెట్ కూడా ఇస్తానని, దీంతో మీరే సొంత తల్లి అయిపోతారని శ్రీవైష్ణవికి శోభ సూచించింది. ఒప్పందం మేరకు మిగతా డబ్బును అందించాలని కోరింది. దీంతో బయటికెళ్లి తీసుకొస్తానని శ్రీవైష్ణవి తలుపులు తెరవడంతో అప్పటికే బయట ఉన్న వారిని చూసిన శోభ, ఇతర నిందితులు ఇదంతా ట్రాప్ అని గ్రహించారు. చున్నీతో కాళ్లు, చేతులు కట్టేసి.. శోభారాణి, స్వప్న, సలీంలు క్లినిక్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ బయట ఉన్న బృందం కాపు కాస్తుండటంతో వారికి చాన్స్ లేకుండా పోయింది. సలీం గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ప్రత్యూష బలంగా అతన్ని పట్టుకొని, చున్నీతో అతని కాళ్లు, చేతులు కట్టేసింది. అతన్ని పక్కన ఉన్న పిల్లర్‌కు కట్టిపడేసింది. ఇదంతా స్టింగ్ ఆపరేషన్ తెలిసిపోవడంతో శోభారాణి ఏడుపు మొదలుపెట్టింది.పోలీసులకు ఫోన్ చేయవద్దని సెటిల్మెంట్ చేసుకుందామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈలోగా డయల్ 100కు ఫోన్ చేయడంతో మేడిపల్లి పోలీసులు వచ్చారు. నిందితులను ఠాణాకు తరలించి, బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు అప్పగించారు. నిందితులను పోలీసులు విచారించగా.. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యల నుంచి పసికందులను కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. లింగ నిర్ధారణ, గర్భస్రావాలు కూడా.. శోభారాణి 20 ఏళ్లుగా పీర్జాదిగూడలో ఫస్ట్ ఎయిర్ సెంటర్ పేరుతో క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ముందు గదిలో క్లినిక్ ఉండగా.. వెనుక గది అంతా చీకటిగా ఉంది. ఇందులో శస్త్ర చికిత్సల కత్తెర్లు, క్లాంప్స్, బోన్ కట్టర్స్, సూదులు వంటి సర్జికల్ పరికరాలున్నాయి. డస్ట్ బిన్లో కనిపించకుండా దాచిపెట్టారు. శోభారాణి అక్రమంగా గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ విచారణలో తేలింది. (ఆడెపు శ్రీనాథ్) -
నాన్నే.. అమ్ముకున్నాడు..
డిచ్పల్లి/అశ్వారావుపేట రూరల్: కన్నతండ్రులే కాసులకు కక్కుర్తి పడి పేగుబంధాన్ని తెంచుకోజూశారు.. అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువులను అమ్మకానికి పెట్టారు.. రెండు వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు పసికందులను విక్రయించిన తండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించి వారి ఆచూకీ తెలుసుకున్నారు. ఆ శిశువులను తీసుకొచ్చి తల్లుల ఒడికి చేర్చా రు. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన భీమవ్వ, కొమురయ్య దంపతులు సంచారజాతికి చెందినవారు. వీరికి ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కుమారులు పఠాన్‌చెరులోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్నారు. పాపతో కలసి ఆ దంపతులు రెండు నెలల క్రితం డిచ్పల్లి మండలం ఘన్పూర్ మహాలక్ష్మీనగర్ కాలనీకి వలస వచ్చారు. గుడారంలో ఉంటూ రోడ్ల పక్కన చిత్తు కాగితాలు ఏరుకుని జీవిస్తున్నారు. గర్భిణీ అయిన భీమవ్వ శనివారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. స్థానిక ఆశ వర్కర్ తల్లీబిడ్డలను డిచ్పల్లి క్లస్టర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరిశీలించిన వైద్య సిబ్బంది శిశువు తక్కువ బరువుతో ఉన్నాడని, వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే, వారు నిజామాబాద్‌కు కాకుండా తమ గుడారం వద్దకు చేరుకున్నారు. సమీపంలోని బట్టీలో ఆ ఇద్దరు దంపతులు కల్లు తాగుతుండగా ధర్మారం(బి) గ్రామానికి చెందిన లక్ష్మణ్ పరిచయమయ్యాడు. కొమురయ్యకు మాయమాటలు చెప్పి, రూ.2,500 ఇచ్చి బాలుడ్ని తీసుకెళ్లాడు. మత్తు దిగిన తర్వాత భీమవ్వ శిశువు గురించి భర్తను నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేసింది. విచారణలో కొమురయ్య అసలు విషయం చెప్పడంతో ధర్మారం(బి)లోని లక్ష్మణ్ ఇంటికి పోలీసులు చేరుకుని శిశువును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం భీమవ్వను, శిశువును జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రానికి తరలించారు. అయితే, తాను శిశువును కొనుగోలు చేయలేదని, రాత్రి వారి గుడారం దగ్గర నుంచి వెళ్తుండగా తల్లిదండ్రులు కల్లు మత్తులో సోయి లేకుండా పడిపోయి ఉన్నారని, శిశువు ఏడుస్తుండటంతో ఎవరైనా ఎత్తుకెళ్తారేమోననే అనుమానంతో ఇంటికి తీసుకొచ్చినట్లు లక్ష్మణ్ పోలీసులకు తెలిపారు. రూ. 2 లక్షలకు విక్రయించిన తండ్రి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లికి చెందిన ఘంటా అరుణ్‌కుమార్ భార్య చిలకమ్మ ఈ నెల 3న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె మత్తులో ఉండగానే భర్త అరుణ్ కుమార్, అత్త ఘంటా మేరీ కలిసి శిశువును చింతలపూడి మండలానికి చెందిన ఆర్ఎంపీలు బుచ్చిబాబు, శ్రీనివాస్, అశ్వారావుపేటకు చెందిన ప్రశాంతి సహకారంతో విశాఖకు చెందిన ఓ వ్యక్తి కి రూ. 2 లక్షలకు అమ్మేశారు. శిశువు విషయమై అల్లిపల్లి అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆరా తీయగా విక్రయించినట్లు గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అరుణ్‌కుమార్, మేరితోపాటు బుచ్చిబాబు, శ్రీనివాస్, ప్రశాంతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చల్లా అరుణ తెలిపారు. -
నా బిడ్డ నాకు కావాలి...
సాక్షి, హైదరాబాద్ : అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను పోషించలేక ఓ తల్లి పొత్తిళ్లలోనే పసికందును విక్రయించింది. అయితే తన బిడ్డ తనకు కావాలని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాచారం సీఐ కిరణ్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పఠాన్‌చెరువు ప్రాంతానికి చెందిన మీనా, వెంకటేష్ దంపతులు నగరానికి వలసవచ్చి నాచారం అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, మీనా ఇళ్లల్లో పాచి పని చేసేది. ఆమెకు మొదట ఆడపిల్ల పుట్టి పురిట్లోనే చనిపోయింది. ఆ తర్వాత ఆమె మరో కుమార్తెకు జన్మనిచ్చింది. ప్రసుత్తం ఆ పాప వయస్సు 2.5 ఏళ్లు. మూడోసారి గర్భం దాల్చిన మీనా తనకు మళ్లీ ఆడపిల్ల పుడితే ఎవరికైనా అమ్మేస్తానని నాచారం ప్రాంతానికి చెందిన మధ్యవర్తి జీహెచ్ఎంసీ స్వీపర్ జానకికి చెప్పింది. ఈ క్రమంలో గత జూలై 19న మీనా నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. అయితే జానకి మీనాకు ఆడ పిల్ల పుట్టిందని అబద్దం చెప్పింది. అంతేగాక సదరు పసికందును హెచ్‌బీ కాలనీ కృష్ణానగర్‌కు చెందిన రాజేశ్వర్‌రావు, నగినా దంపతులకు రూ.లక్షకు ఇప్పించింది. అందుకు సంబందించి ఒప్పంద పత్రాలు కూడా రాసుకున్నారు. దీంతో రాజేశ్వర్‌రావు, నగినా బిడ్డను తీసుకుని వెళ్లిపోయారు. కాగా మళ్లీ డబ్బులు కావాలని మీనా వెంకటేష్ రాజేశ్వర్‌రావు దంపతులను ఒత్తిడి చేయడంతో వారు ససేమిరా అన్నారు. దీంతో వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. గురువారం రాత్రి మీనా తన కుమారుడిని తనకు ఇప్పించాలని కోరుతూ నాచారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు ఆడ పిల్ల పుట్టిందని చెప్పి మోసం చేశారని నా కొడుకును ఇప్పించాలని వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బిడ్డ్డను స్వాధీనం చేసుకుని శిశు విహార్‌కు తరలించారు. ఈ ఘటనలో ఈఎస్ఐ ఆస్పత్రి సిబ్బంది పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శిశువును అమ్మిన, కొనుక్కున్న వారివురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బాలుడి అపహరణ.. విక్రయానికి యత్నం
అమీర్‌పేట: రోడ్డుపై భిక్షాటన చేస్తున్న వ్యక్తి ఓ బాలుణ్ని అపహరించి అమ్మకానికి పెట్డాడు. సకాలంలో గుర్తించిన పోలీసులు సదరు బాలుడిని చేరదీసి శిశువిహార్‌కు తరలించారు.సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ రామారావునగర్‌లో ఉంటున్న పరశురాం రెండు కాళ్లూ లేకపోవడంతో జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం జవహర్‌నగర్ చౌరస్తా సమీపంలో ఏడాది వయసున్న బాలుణ్ని కాచికూడకు చెందిన కృష్ణ అనే వ్యక్తికి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కాచికూడకు చెందిన పరశురాం తన స్నేహితుడైన రవి ద్వారా ఎలక్ట్రిషియన్ కృష్ణకు బాలుడిని రూ.40 వేలకు విక్రయించేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. మూసాపేట కూరగాయల మార్కెట్ వద్ద బాలుడు తనకు దొరికాడని నిందితుడు చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. పరశురాంతో పాటు కృష్ణ, రవిలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.బాలుడిని శిశువిహార్‌కు తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
అమ్మకం వెనుక అసలు కథేంటి?
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో ముక్కుపచ్చలారని పసికందును అమ్మకానికి సిద్ధపడ్డ ఘటన మలుపులు తిరుగుతోంది. శిశువును అమ్మేందుకు తీసుకొచ్చిన మహిళ శిశువు తల్లికాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లా కడెంకు చెందిన పుట్ట గంగజ్యోతికి మహారాష్ట్రకు చెందిన నవీన్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వివాహ అనంతరం వీరు ఆర్మూర్‌లోని బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. నవీన్ స్థానికంగా మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఒక కూతురు స్నేహ (4) ఉంది. కొన్ని రోజుల క్రితం భర్త నవీన్ గంగజ్యోతిని విడిచి వెళ్లిపోయాడు. దీంతో జ్యోతి యాచిస్తూ జీవనం గడుపుతోంది. ఆదివారం ఉదయం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నెలరోజులు కూడా నిండని పసికందును రూ.20 వేలకు అమ్మకానికి పెట్టింది. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. శిశువు జననం గురించి వివరాలు అడిగితే జ్యోతి పొంతనలేని సమాధానాలు చెబుతోంది. శిశువు బహిరంగ ప్రదేశంలో జన్మించిందని ఒకసారి, ఇంట్లోనే జన్మించిందని మరోసారి చెబుతుండటంతో జ్యోతి ఆ శిశువుకు తల్లి కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిశువుకు నెల రోజుల వయస్సు ఉంటుందని జ్యోతి చెబుతుండగా పరీక్షించిన వైద్యులు 11 రోజుల వయస్సుగా నిర్ధారించారు. ఇంతలో ఐసీడీఎస్ అధికారుల ఆధీనంలో ఉన్న శిశువు తమ బిడ్డేనం టూ ఆర్మూర్‌కు చెందిన దంపతులు అధికారులను సం ప్రదించినట్లు తెలిసింది. అధికారులు మాత్రం డీఎన్ఏ పరీక్షల అనంతరం శిశువు తల్లిదండ్రుల నిర్ధారణ తర్వాతే వారికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అంత వరకు పసికందును కరీంనగర్‌లోని శిశుగృహ సంరక్షణ కేంద్రానికి, అలాగే జ్యోతి, తన కూతురు స్నేహ(4)ను స్వధార్ కేంద్రానికి తరలించారు. ఐసీడీఎస్ మెట్పల్లి సీడీపీవో తిరుమలదేవి, ధర్మపురి సీడీపీవో అరుణ, జిల్లా చైల్డ్ డెవలప్మెంట్, ప్రొటెక్షన్ ఆఫీసర్ హరీశ్ ఉన్నారు. పాప కిడ్నాప్‌పై కేసు మెట్పల్లిలో అమ్మకానికి పెట్టిన పాప కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన గందం సుమలత ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో తన 15 రోజుల పాపను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని సోమవారం ఫిర్యాదు చేసింది. ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కాగా పాప అమ్మకానికి పెట్టిన గంగజ్యోతి కూడా తనది ఆర్మూర్ అని చెప్పడంతోపాటు ఐసీడీఎస్ అధికారులకు అనుమానాలు కలుగుతున్నాయి. వారి వద్దనున్న పాప, కిడ్నాప్ అయిందన్న పాప ఫొటోలు ఒకేలా ఉండటంతో ఆర్మూర్‌కు చెందిన సుమలత కూతురుగానే భావిస్తున్నారు. -
కలకలం రేపిన పసికందుల విక్రయం
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,కాకినాడ : పసికందుల విక్రయ వ్యవహారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఉలిక్కిపడేలా చేసింది. అప్పుడే పుట్టిన పిల్లను ఇక్కడ పనిచేసిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేరొకరికి విక్రయించారన్న వ్యవహారం బయటికొచ్చింది. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. అక్రమ సంబంధాలతో పుట్టిన పసికందులను, ఆర్థిక ఇబ్బందుల వల్ల గర్భిణులు వదిలి వెళ్లిన మహిళలను టార్గెట్‌గా చేసుకుని ఆడబిడ్డకు ఒక రేటు, మగ బిడ్డకు ఒకరేటు పెట్టి విక్రయాలు సాగిస్తున్నట్టుగా అధికారులకు తెలియడంతో వారు నివ్వెరపోయారు. విశాఖ జిల్లా షిప్‌యార్డ్‌కు చెందిన 30 ఏళ్ల వయస్సు గల మహిళ ఈ ఏడాది జూలై 23వ తేదీ ఉదయం ప్రసవం కోసం కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. అదే రోజు ఉదయం 9.37 నిమిషాలకు ప్రసవించింది. మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు డిశ్చార్జ్ అయ్యింది. తనకెవ్వరూ లేరని, తన ఇష్ట పూర్వకంగా వెళ్లిపోతున్నానని చెప్పి, ఆమేరకు రాసిన పేపరుపై వేలి ముద్ర వేసి వెళ్లిపోయింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడామె వ్యవహారం ఆసుపత్రి అధికారుల దృష్టికి వచ్చింది. తన పసి బిడ్డను ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించారని, అందుకు ఆసుపత్రిలో సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన మహిళ ఇదే ఆసుపత్రిలో మరో విభాగం పనిచేస్తున్న ఆమె భర్త మధ్యవర్తులగా వ్యవహరించి, రూ.60వేలకు పసికందును బేరం పెట్టారని బుధవారం ఓ వ్యక్తి ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సంబంధిత వైద్యాధికారులు వెంటనే అప్రమత్తమై ఆరా తీశారు. క్రయ, విక్రయాల వ్యవహారం ఆసుపత్రిలో జరగలేదని, ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాక జరిగి ఉండొచ్చని నిర్ధారణ వచ్చిన అధికారులు ఆరోజు ప్రసవమైన మహిళ కేస్ షీట్, ఇతర వివరాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అలాగే క్రయవిక్రయాల వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పుడిది ఆసుపత్రిలో చర్చనీయాంశమై అన్ని విభాగాల్లో కలకలం రేపింది. ఇప్పటికే అనేక ఘటనలు గతేడాది నవంబర్ 23న గంటా లక్ష్మికి అప్పుడే పుట్టిన బిడ్డకు టీకాలు వేయించాలని పండు రమణ అనే మహిళ మాయమాటలు చెప్పి బయటికి ఉడాయించింది. సీసీ పుటేజీ ఇతరత్రా ఆధారాలతో ఆ మాయలేడీ రమణను పట్టుకున్నారు. అంతకు ముందు 2010 మేనెలలో ఓ బిడ్డ అపహరణకు గురైంది. పుట్టిన బిడ్డ చనిపోవడంతో అదను చూసుకుని ఓ మహిళ జీజీహెచ్‌లో బిడ్డను తీసుకుపోయింది. పిఠాపురం ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించి, ఆమెను పట్టుకుని బిడ్డను వెనక్కి తీసుకుని ఆ తల్లికి అప్పగించారు. 2016లో ఇదే తరహాలో శిశువును తస్కరించగా, అదే రోజు సాయంత్రానికి కల్లా కిర్లంపూడి ప్రాంతంలో గుర్తించి తల్లికి అప్పగించారు. ఇవి తమ ఆసుపత్రికి మాయని మచ్చగా మిగిలిపోయాయని, అటువంటి చెడ్డ పేరు రాకుండా చూసుకునేందుకు అధికారులు నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో పసికందు విక్రయ వ్యవహారం దృష్టికి రావడంతో అధికారులు మరింత కలవరం చెందుతున్నారు. -
ఆమెను 500 రూపాయలకు అమ్మేశారు....
సాక్షి, ఇటానగర్ : ఆమె, ఆమె మోకాళ్ల ఎత్తువరకు ఉన్నప్పుడు తండ్రి చేతులు పట్టుకొని నడుచుకుంటూ వచ్చింది. పచ్చని తేయాకు తోటల మధ్య నుంచి చెంగు చెంగున ఎగురుకుంటూ బయల్దేరింది. ఓ తేయాకు తోట ముందు తండ్రితోపాటు బస్కెక్కింది. ఆ బస్సు ఆమెను ఆమె తండ్రిని ఎక్కడికో తీసుకెళ్లి దింపేసింది. మళ్లీ తండ్రివెంట అలా నడుచుకుంటూ కొంతదూరం వెళ్లింది. అక్కడ ఓ అందమైన ఇంటి ముందు తండ్రితో పాటు నిలబడింది. ఆ ఇంట్లో నుంచి ఎవరో బయటకు వచ్చారు. తండ్రికి ఐదు వందల రూపాయల నోటు ఇచ్చారు. పిల్లను అక్కడే వదిలేసి తండ్రి వెనుతిరిగి పోయాడు. ఆ ఇంట్లోని వారు ఆ పిల్లను ఇంట్లోకి తీసుకెళ్లారు. తండ్రి కోసం ఎంతో ఏడ్చింది. తండ్రి తిరిగి రాలేదు. అప్పుడే కాదు. ఎప్పటికీ తిరిగి రాలేదు. ఆ పిల్ల పేరు బడాయిక్. అంతకుమించి అప్పటికి ఆమెకు ఏమీ తెలియదు. ఆ ఇంట్లోని వారు ఆ చిట్టి చేతులతోని అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేయించారు. ఇల్లు ఊడిపించారు. కొన్ని రోజుల తర్వాత గిన్నెలు తోమించారు. ఆ తర్వాత బట్టలు , ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంట్లో వంట చేయడం కూడా నేర్చుకుంది. ఇలా ఎనిమిదేళ్లు వచ్చేసరికి బడాయిక్ అన్ని పనులు నేర్చుకుంది. అప్పటి నుంచి ఆ ఇంట్లో రోజుకు 17 గంటలపాటు చాకిరి చేయడం ప్రారంభించింది. పదేళ్లు వచ్చేసరికి ఆ కుటుంబంతో తనకేమీ సంబంధం లేదని, ఆ ఇంట్లో తాను పని మనిషినని తెలిసివచ్చింది. తన జీతం నెలకు వందరూపాయలని తెలుసుకుంది. జీతాన్ని నెలనెల తన పేరిట బ్యాంకులో జమ చేస్తారని తెల్సింది. అది కూడా తనకివ్వరని, ఒంట్లో బాగోలేనప్పుడు ఆ డబ్బులతోనే మందులు ఇప్పిస్తారని తెల్సింది. ఎక్కడో చదువుకుంటున్న ఆ ఇంటి యజమాని కూతురు సెలవులకు ఇంటికొచ్చినప్పుడు సరదాగా గడిపేందుకు సెలవులు కూడా ఉంటాయని తెల్సింది. తనకు 12 ఏళ్లు వచ్చే సరికి తాను బానిసగా బతుకుతున్నానని తెల్సింది. అప్పటి నుంచి తోటి వారికోసం వెతకడం ప్రారంభించింది. ఆమెకు 16వ ఏట, అంటే 2016లో తనలాంటి పని మనిషి తగిలింది. ఆమె సహాయంతో మొబైల్ ఫోన్ సంపాదించి లీలమాత్రంగా గుర్తున్న తన అంకుల్‌కు ఫోన్ చేయడం ప్రారంభించింది. ఎన్నో రాంగ్ నెంబర్ల అనంతరం ఓ రోజున అంకుల్‌కు ఫోన్ కలిసింది. తన గురించి తెలియజేయడంతోపాటు తన ఊరు, రాష్ట్రం గురించి తెలుసుకుంది. తానుంటున్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అని ఇదివరకే తెలుసుకున్న బడాయిక్కు తన స్వగ్రామం అస్సాంలోని బిశ్వనాథ్ జిల్లా పూరుబరి విలేజ్ అని తెల్సింది. అంకుల్ చెప్పిన వివరాలు, తోటి పనిమనిషి సహకారంతో అక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న స్వగ్రామం చేరుకుంది. కలలో చూసినట్లుగా కనిపిస్తున్న ఆ గ్రామంలో తాముంటున్న ఇంటిని గుర్తుపట్టలేకపోయింది. అంకుల్ సాయంతో ఇల్లు చేరింది. ఇంటి ముందు తన కోసం ఎదురు చూస్తున్న తనను అక్కున చేర్చుకొని తనివితీర ఏడ్చింది. వరండాలో ఓ మూలన బిత్తరపోయి చూస్తున్న తన తండ్రి దగ్గరికి వెళ్లి చెంప మీద లాగి కొట్టింది. తన తండ్రి తన తర్వాత తన చెల్లి కూడా తనలాగే అమ్మేశాడని బడాయిక్ తెలుసుకుంది. పిల్లల అక్రమ రావాణాను అరికట్టేందుకు, పిల్లల హక్కుల కోసం స్థానికంగా పోరాడుతున్న స్వచ్ఛంద జాగతి సమితీ, థామ్సన్ రాయ్‌టర్స్ ఫౌండేషన్ సభ్యులను బడాయిక్ కలుసుకొని తన కథను వివరించింది. తనను ఎప్పుడు అమ్మేశారో తెలియదని, తనకిప్పుడు మాత్రం 16, 17 ఏళ్లు ఉండవచ్చని తెలిపింది. అమ్మేసిన తన చెల్లెలిని కూడా వెతికి పెట్టాల్సిందిగా ఆమె స్వచ్ఛంద సంస్థలను కోరింది. బడాయిక్ లాంటి వారు తప్పించుకొని ఇంటికి రావడం వల్ల ఆమె అనుభవించిన జీవితం గురించి తెల్సింది. వెనక్కి రాని వారి గురించి ఎప్పటికీ తెలియదు. అమ్మివేయడం లేదా ఎత్తుకెళ్లడం వల్ల గల్లంతైన పిల్లల్లో సగం మంది వ్యవసాయ పనుల్లో, నలుగురిలో ఒకరు ఉత్పాదన రంగంలో, మిగతా వారంతా ఇళ్లలో, హోటళ్లలో అరవ చాకిరి చేస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తం 16.80 కోట్ల మంది పిల్లలు, భారత్‌లో 40 లక్షల మంది పిల్లలు ఇలా వెట్టిచాకిరిలో మగ్గిపోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమగా గుర్తింపుపోందిన అస్సాం తేయాకు పరిశ్రమ గత కొన్నేళ్లుగా తీవ్రంగా దెబ్బతినడం, కార్మికులు ఉపాధి కోల్పోవడం, పేదరికం పెరిగిపోవడం వల్ల ఇక్కడ పిల్లల అమ్మకాలు పెరిగాయి. కొన్ని సందర్భాల్లో ఆరుబయట ఆడుకుంటున్న పిల్లలను ఇరుగు, పొరుగువారు కూడా ఎత్తుకెళ్లి అమ్మేస్తున్నారు. -
ఎంతటి దయనీయం!
మల్కన్‌గిరి(ఒడిశా): దేశంలోనే దయనీయ పరిస్థితులలో ఉంది ఒడిశా రాష్ట్రం. ఒంటి మీద ఉన్న ఒకే చీరను, ఉతికి మళ్లీ ఒంటి మీదే ఆరబెట్టుకునే మహిళా కూలీలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడి ప్రజల దరిద్రాన్ని కళ్లకట్టే సంఘటన ఒకటి ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో జరిగింది. తినడానికి తిండి లేదు - భార్యకు జబ్బు - మందులు కొనడానికి డబ్బులేదు -చేసేదేమీలేక ఆ వ్యక్తి రెండు నెలల వయసున్న తన కొడుకును 700 రూపాయలకు అమ్మేశాడు. మల్కన్‌గిరి జిల్లా కోర్కుండ బ్లాక్ లోని చిట్టపల్లి-2 గ్రామానికి చెందిన గిరిజన దంపతులైన సుకురా ముదులి, ధుముసి నిరుపేదలు. ప్రభుత్వం నుంచి ఏ సాయమూ అందడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ధుముసికి మందులు కొనాల్సి వచ్చింది. కానీ డబ్బుల్లేకపోవడంతో ఆ దంపతులు గత ఫిబ్రవరిలో దగ్గర్లోని చిట్టపల్లి-3 గ్రామానికి వెళ్లి 'ఆశా'కార్యకర్తకు తన బిడ్డను అమ్మేశారు. ఆమె ధుమసికి మందులకోసం రూ. 700లతోపాటు 50 కేజీల బియ్యం ఇచ్చింది. ఇటీవల ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డి. ప్రశాంత్ కుమార్ రెడ్డి దర్యాప్తు చేయాలని శిశుసంక్షేమ కమిటీని ఆదేశించారు. పేదరికం వల్లే సుకురా అమ్మినట్లు దర్యాప్తులో తేలింది. సుకురా దంపతులకు బిడ్డను పోషించే తాహతు లేకపోవడంతో ఆ బాలుడు ప్రస్తుతం ఆశా కార్యకర్త ఇంట్లోనే ఉంటున్నాడు. -
మెదక్ జిల్లాలో మరో శిశువిక్రయం
మెదక్: రాష్ట్రంలో శిశువిక్రయాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పేదరికంతో భారమైన తమ పిల్లలను కన్న తల్లిదండ్రులే అమ్ముకుంటున్న ఘటనలు రాష్ట్రంలో ఏదోఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆస్పత్రి ఖర్చు చెల్లించలేక తమ ఇద్దరి కవల పిల్లలను అమ్ముకున్న ఘటన జరిగిన రెండురోజులకే తాజాగా మరో శిశు విక్రయ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పేదరికంతో కన్నతల్లిదండ్రులు తమ కూతుర్ని 2,500 రూపాయలకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన శిశుసంక్షేమశాఖ మంత్రి సునీతా మండలంలో చోటుచేసుకున్నట్టు సమాచారం.