చిలుకూరులో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం
చిలుకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతిపిత గాంధీని అగౌరపరిచాడని, విగ్రహాంను బురదలో వేయించాడాన్ని ఇందుకు నిరసనగా శనివారం చిలుకూరు గ్రంథాయలంలో ఆర వైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపితకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి హాదాలో ఉండి జాతిపిత గాంధీ విగ్రహాంను బరదలో వేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. జాతిపితను అగౌవరపరిచిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, గ్రంథాలయ చైర్మన్ అత్తులూరి శ్రీనివాస్‌రావు, ఆర్య వైశ్య సంఘం నాయకులు రేపాల అప్పారావు, శ్రీకాకుళపు బ్రహ్మనందం, ఈగ శ్రీను, టీఆర్ఎస్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు.