chitti amount
-
రూ.30 కోట్లతో చీటీల నిర్వాహకులు పరార్!
అక్కిరెడ్డిపాలెం (విశాఖపట్నం): విశాఖ గాజువాకలో టీడీపీ కార్పొరేటర్ ముఖ్య అనుచరుడు చీటీల పేరిట సుమారు 500 మందిని రూ. 30 కోట్లకు ముంచేసిన వైనం బయటపడింది. అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా జీవితాన్ని మొదలెట్టి, భారీ మొత్తంలో చీటీలు కట్టించిన అతను.. చివరకు కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు శుక్రవారం గాజువాక పోలీసుల్ని ఆశ్రయించారు. ఏసీపీ త్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక వాంబే కాలనీకి చెందిన మరడాన పరశురాం 65వ వార్డు టీడీపీ కార్పొరేటర్ బొడ్డు నర్సింహ పాత్రుడు(కేబుల్ మూర్తి)కి ముఖ్య అనుచరుడు. పరశురాం 12 ఏళ్ల క్రితం అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా అందరితో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత చిన్నచిన్న చీటీలు ప్రారంభించాడు. వాటిని నెమ్మదిగా పెంచుకుంటూ రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ. 20 లక్షలు, రూ. 25 లక్షల వరకు తీసుకువెళ్లాడు. నమ్మకంగా ఉండటంతో ఎక్కువ మంది ఇతని వద్దే చీటీలు వేసేవారు. ఈ చీటీల నిర్వహణలో పరశురాంతో పాటు భార్య కుమారి, అన్నయ్య సత్తిబాబు, వదిన జ్యోతి, మేనల్లుడు ధనుంజయ్, అక్క చంద్ర, మామయ్యలు పాలు పంచుకొనేవారు. దీంతో పాటు పప్పుల చీటీలు, వరలక్ష్మీ వ్రతం కార్డులు, కిరాణా లక్కీ డ్రాలు వంటి స్కీములను కూడా నడిపారు. ఇటీవలి కాలంలో చీటీలు, స్కీముల పేరుతో అందరి నుంచి రూ. 30 కోట్ల వరకు వసూలు చేసి, పరారయ్యారు. ఈ విషయం శుక్రవారం బయటపడటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రూ.లక్షల్లో నష్టపోయినట్లు పలువురు బాధితులు పోలీసులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంత మొత్తమో నిర్ధారించి, శనివారం కేసు నమోదు చేస్తామని ఏసీపీ త్రినాథ్ తెలిపారు. -
ఆ మాటే అల్లుడి చేతిలో అత్త ప్రాణం తీసింది..
సాక్షి, సంగారెడ్డి: అత్తను గొంతునులిమి అల్లుడు హత్య చేసిన సంఘటన మండలంలోని నాగపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ శివలింగం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలమ్మ (60)కు ఇద్దరు కూతుర్లు కాగా పెద్ద కూతురు లక్ష్మిని పుల్కల్ మండలం మంతూరు గ్రామానికి చెందిన నేనా బాగయ్యకు ఇచ్చి వివాహం చేశారు. చిట్టి గ్రూపు డబ్బులు కట్టడానికి మంగళవారం బాగయ్య నాగపూర్‌కు వచ్చాడు. ఈ క్రమంలో ఏ పని చేయకుండా తిరుగుతున్నావని అత్త అనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపంలో బాగయ్య అత్త గొంతు నులిమి హత్య చేశాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. చదవండి: (యూకే నుంచి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం) -
నగదు లేక పెళ్లి కూతురి కన్నీళ్లు
పరకాల: కుమార్తె వివాహం కోసం చిట్టి (ఫైనాన్స్) డబ్బులు ఎత్తుకుంటే.. నిర్వాహకు లు బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేశారు. ఆ డబ్బు ఇవ్వా లంటూ పెళ్లికార్డు తో సహా బ్యాంకుకు వచ్చిన పెళ్లి కుమార్తె, ఆమె తల్లి ఎంత బతి మిలాడినా బ్యాంకు అధికారులు నగదు ఇవ్వ లేదు. దీంతో ఆ పెళ్లికూతురు బ్యాంకులోనే కన్నీటి పర్యంతమైంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన బొజ్జం శ్రీనివాస్, కరుణ దంప తులు, వారి కుమార్తె అశ్వినిల వ్యథ ఇది. ఈ నెల 22న అశ్విని వివాహం జరుగనుంది. దీంతో డబ్బు కోసం వారు శనివారం ఇక్కడి ఎస్బీఐ బ్రాంచికి వచ్చారు. కానీ డబ్బు ఇవ్వలేమని బ్యాంకు అధికారులు స్పష్టం చేయడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. చివరికి నగదు అందకుండానే కన్నీటితో వెనుదిరిగారు.