CID additional DG
-
కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు: ఏఏజీ
-
చంద్రబాబుని కస్టడీకి ఇస్తేనే అసలు నిజాలు బయటపడతాయి: సీఐడీ
-
కస్టడీకి చంద్రబాబు..! సీఐడీ డిమాండ్..
-
స్కిల్ కుంభకోణం సూత్రధారి చంద్రబాబే
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం ప్రధాన సూత్రధారి అని నిర్ధారణ అయినందునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశామని సీఐడీ అదనపు డీజీ సంజయ్ స్పష్టం చేశారు. సీమెన్స్ అనే కంపెనీ ఉదారంగా రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పడంతోపాటు అలానే జీవోలు జారీ చేసి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో మూడు నెలల వ్యవధిలో రూ.371 కోట్లు ప్రాజెక్టు నిమిత్తం హడావుడిగా విడుదల చేసి అవినీతికి పాల్పడ్డారని వెల్లడించారు. ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమెన్స్ కంపెనీ ద్వారా ఏపీలో ఆరు క్లస్టర్లుగా ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. జీవోలో నిధుల వెచ్చింపు 90ః10 నిష్పత్తిగా చెప్పిన్పటికీ ఒప్పందంలో మాత్రం ఆ ప్రస్తావనే లేదని చెప్పారు. అయితే వాస్తవంగా సీమెన్స్ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ గురించే తెలియదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా కింద రూ.371 కోట్లు విడుదల చేసి, 2015–16లో అందులోంచి రూ.271 కోట్లు ఇతర సంస్థలకు అక్రమంగా నిధులు మళ్లించారని చెప్పారు. సీమెన్స్ కంపెనీకి తెలియదు సీమెన్స్ కంపెనీకే తెలియకుండా ఆ కంపెనీ మాజీ ఎండీ సుమన్‌బోస్ ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారని సంజయ్ తెలిపారు. ఆ విషయాన్ని సీమెన్స్ కంపెనీ కూడా గుర్తించిందన్నారు. నిందితుల్లో ఒకరైన సుమన్ బోస్.. ఒప్పందం కుదిరిన రోజున విద్యుత్తు లేనందున కొవ్వొత్తుల వెలుగులో సంతకాలు చేశామని.. కాబట్టి అందులో వివరాలు సరిగా చూడలేదని చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ విద్యుత్తు రాలేదా అని ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రైవేటు వ్యక్తి అయిన గంటా సుబ్బారావుకు ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టి, ప్రభుత్వ అధికారులపై పెత్తనం అప్పగించడం.. ఆయన చెప్పినట్టే నిధులు విడుదల చేయాలని చెప్పడం ఏమిటని నిలదీశారు. నిధులు విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు సమావేశం మినిట్స్ రికార్డులను గంటా సుబ్బారావు చూపించినట్టు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారన్నారు. త్వరలో మరో ఏడుగురి అరెస్ట్ కుంభకోణం తాలూకు ఫైళ్లలో చంద్రబాబు 13 డిజిటల్ సంతకాలు చేశారని సంజయ్ తెలిపారు. మొత్తం కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఆధారాలతోసహా బయట పడటంతోనే ఆయన్ను అరెస్ట్ చేశామని, ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించిందన్నారు. ఈ కేసులో మరో ఏడుగురిని అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు. స్కిల్ కుంభకోణంపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తూ ఇప్పటికే సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ ఖని్వల్కర్, స్కిల్లర్ ప్రైవేట్ లిమిలెడ్ మాజీ ఆర్థిక సలహాదారు ముకుల్ చంద్ర అగర్వాల్, సీఏ సురేష్ గోయెల్లను అరెస్ట్ చేసిందన్నారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ లక్షల డాలర్లు లాటరీ తగలిందని చెప్పి అందులో పది శాతం కడితేనే మొత్తం ఇస్తాననే రీతిలో ఈ కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. తేదీ, లెటర్ నంబరు లేకుండా ఒప్పందం చేసుకోవడం ఎక్కడన్నా జరుగుతుందా.. అని ప్రశ్నించారు. ఈ కేసులో ముద్దాయిలు సెల్ఫ్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. -
పవన్ కళ్యాణ్ ప్రశ్నకు ఏపీ సీఐడీ కౌంటర్..
-
తప్పుడు డాక్యుమెంట్స్‌తో ఒప్పందాలు చేసుకున్నారు: ఏపీ సీఐడీ
-
ప్రభుత్వ జీవోకు, అగ్రిమెంట్‌కు చాలా తేడాలు ఉన్నాయి: ఏపీ సీఐడీ
-
ఈ స్కామ్‌లో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయి: ఏపీ సీఐడీ
-
ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ తప్పనిసరి
-
మార్గదర్శి ఫైనాన్సియల్ పెద్ద స్కాం: ఏపీసీఐడీ
-
కంపెనీనే సొంతంగా చిట్స్ తీసుకుంటుంది: సీఐడీ అడిషనల్ డీజీ
-
చందాదారుల డబ్బును అక్రమంగా దారి మళ్లించారు: సిఐడీ ఏడీజీ
-
‘మార్గదర్శి’ మోసాలివిగో.. సీఐడీ ప్రాథమిక విచారణలో ఏం తేలిందంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మోసాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు క్షుణ్నంగా విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం సూచించింది. మనీ లాండరింగ్, నిధుల స్వాహా, కార్పొరేట్ మోసాలు, బినామీ లావాదేవీలతో పన్ను ఎగవేత లాంటి కీలక అంశాలను తమ విచారణలో కనుగొన్న నేపథ్యంలో మరింత లోతుగా దర్యాప్తు చేయడం అవసరమని పేర్కొంది. సీఐడీ ఏడీజీ సంజయ్ బుధవారం ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు. చిట్‌ఫండ్ పేరుతో జరిగిన అతిపెద్ద ఆర్థిక మోసాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అడ్డుకున్నట్లు వెల్లడించారు. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించిన చరిత్ర కలిగిన మార్గదర్శి చిట్ గ్రూప్ 1982 చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అమాయక చందాదారులను దోపిడీ చేస్తోందన్నారు. మార్గదర్శి ఉల్లంఘనలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలో ఉన్నందున రెండు రోజుల పాటు ఢిల్లీలో ఆయా విచారణ సంస్థలను కలుసుకుని వివరాలు అందచేసినట్లు చెప్పారు. మోసపూరిత ఆర్థిక సంస్థలు చట్టాలను ఉల్లంఘిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ప్రేక్షకపాత్ర వహించరాదని సుప్రీంకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. సత్యం, సహారా, శారదా తరహాలో.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఉల్లంఘనలు, మోసపూరిత పద్ధతులు సత్యం కంప్యూటర్స్, సహారా, శారదా చిట్స్ మోసాలకు చాలా దగ్గరగా ఉన్నట్లు సంజయ్ తెలిపారు. ఈ దోపిడీని అరికట్టేందుకు మార్గదర్శి ఖాతా పుస్తకాలపై లోతైన విచారణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ దిశలోనే తమ దర్యాప్తు కొనసాగుతోందని, తదుపరి వివరాలు తగిన సమయంలో వెల్లడిస్తామన్నారు. రహస్యంగా నిధుల మళ్లింపు.. డిపాజిట్ల ద్వారా మార్గదర్శి సేకరించిన నిధులను అనుబంధ కంపెనీలు, షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇతర పెట్టుబడులకు రహస్యంగా మళ్లించడంతోపాటు అధిక మొత్తంలో సభ్యత్వాలు స్వీకరిస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడుతోందన్నారు. వడ్డీ, భద్రత అందించే పేరుతో చందాదారుల సొమ్మును మార్గదర్శి వద్దే ఉంచాలని బలవంతం చేయడం, ‘చెక్స్ ఆన్హ్యాండ్, క్యాష్ ఆన్హ్యాండ్’ పేరుతో నగదు నిల్వల్ని పెంచడం లాంటి మోసపూరిత అకౌంటింగ్ పద్ధతుల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఈమేరకు ఎఫ్ఐఆర్లలో ఏ–1గా మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా కంపెనీ ఎండీ శైలజా కిరణ్, ఏ–3గా బ్రాంచి మేనేజర్లు, ఏ–4గా కంపెనీ, ఏ–5గా ప్రిన్సిపల్ ఆడిటర్ కె.శ్రవణ్ పేర్లను నమోదు చేసినట్లు తెలిపారు. ఏ–1 నుంచి ఏ–5 వరకూ అందరినీ ఒక్కోసారి ప్రశ్నించినా తప్పించుకునే సమాధానాలు వచ్చాయని చెప్పారు. అవసరమైన సమాచారం, పత్రాలను చిట్ రిజిస్ట్రార్, సీఐడీకి మార్గదర్శి ఇవ్వడం లేదన్నారు. సీఐడీ ప్రాథమిక విచారణలో ఏం తేలిందంటే... ♦చిట్‌ఫండ్ చట్టంలోని పలు నిబంధనలను మార్గదర్శి గ్రూప్ ఉల్లంఘించింది. ♦చందాదారుల సొమ్మును హెచ్‌యూఎఫ్ నియంత్రిత సంస్థలకు మళ్లించింది. ♦చట్ట విరుద్ధంగా చందాదారుల సొమ్మును ఎక్కువ రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్‌కు మళ్లించారు. ♦నాలుగు నుంచి ఐదు శాతం వార్షిక వడ్డీ రేటు అందిస్తూ భవిష్యత్తు సభ్యత్వాల రసీదు ముసుగులో అక్రమ డిపాజిట్లను బలవంతంగా తీసుకుంటోంది. ♦చిట్‌ఫండ్ చట్టం 1982 ప్రకారం కంపెనీ బ్యాలెన్స్ షీట్, ఖాతాల వివరాలను అందించలేదు. ♦ఖాతాలకు మసిపూసి మారేడు కాయ చేస్తూ అవసరమైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. ♦నిందితులు విచారణకు సహకరించకుండా వివిధ మార్గాల ద్వారా సీఐడీ పరువు తీయడం, నిందలు మోపేందుకు యత్నిస్తున్నారు. ‘సుప్రీం’ ఏం చెప్పిందంటే... ‘‘చిట్ ఫండ్స్ చట్టాన్ని ప్రధానంగా చందాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు రూపొందించారు. కొన్ని మోసపూరిత ఆర్థిక సంస్థలు చందాదారులు/డిపాజిటర్లను మోసం చేయడమే కాకుండా నిధులను పక్కదారి పట్టించడం లేదా మళ్లించడం చేస్తున్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల విధి. ప్రజల సంక్షేమానికి సంరక్షకుడిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి పరిష్కారాన్ని కనుగొనకుండా మౌన ప్రేక్షకుడిగా ఉండరాదు’’ అని శ్రీరామ్ చిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని సంజయ్ తెలిపారు. చదవండి: ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్: సీఎం జగన్ -
తవ్వేకొద్దీ బయటకొస్తున్న మార్గదర్శి అక్రమాలు..!
-
అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు లభించాయి. హైదరాబాద్‌లోని నారాయణ కూమార్తెలు, బంధువుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఆడియో క్లిప్ లభించింది. నారాయణ, ఆయన కుమార్తె మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఇందులో మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు నారాయణ వివరించినట్లు సమాచారం. దీని ప్రకారమే మనీ రూటింగ్... తద్వారా అమరావతిలో భూములు కొనుగోలు జరిగినట్లు ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యుల నివాసాల్లో రెండో రోజు ఏపీ సీఐడీ అధికారుల సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబుస్, కొండాపూర్‌లోని కోళ్ల లగ్జరియా విల్లాస్లోని నారాయణ, ఆయన కుమార్తెల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు అధికారులు. అమరావతి భూముల కొనుగోళ్లకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసుల దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. -
సీఐడీ అదనపు డీజీ సునీల్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: సీఐడీ అదనపు డీజీ సునీల్‌కుమార్ తమ కుటుంబసభ్యులను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆయన మామ, విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తండ్రి పెనుమాక సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు సునీల్‌కుమార్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌం టర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. -
‘అక్షయగోల్డ్’ కేసుల్లో రూ.12.2 కోట్ల ఆస్తులు జప్తు
హైదరాబాద్ సిటీ: ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్షయ గోల్డ్ ఫర్మ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్, అక్షయ గోల్డ్ రియల్ ఎస్టేట్స్ అండ్ వెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసుల్లో రూ.12.2 కోట్ల స్థిరాస్తుల్ని జప్తు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సరైన రిజిస్ట్రేషన్లు, టైటిల్ డీడ్స్ లేని ఫ్లాట్ల అమ్మకాలతో పాటు వివిధ స్కీముల పేరుతో డిపాజిట్లు సేకరించిన ఈ సంస్థలు భారీగా మోసానికి పాల్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 17 కేసులపై దర్యాప్తు చేపట్టిన రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు డిపాజిట్‌దారుల నుంచి వసూలు చేసిన సొమ్ములో రూ.41.54 లక్షల్ని ఇతర సంస్థలకు మళ్ళించినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మంది నిందితులుగా నిర్థారించిన అధికారులు వారితో పాటు సంస్థల పేరిట ఉన్న స్థిరాస్తుల వివరాలు సేకరించారు. కృష్ణా, గుంటూరు, మెదక్‌లతో పాటు విశాఖపట్నంలో ఉన్న రూ.12.2 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సర్కారు మధ్యంతర అనుమతిస్తూ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీ అదనపు డీజీని ఆదేశించింది.