class 10
-
ఆ రెండు పరీక్షలు మళ్లీ నిర్వహిస్తాం: సీబీఎస్ఈ
సాక్షి, న్యూఢిల్లీ: పదో తరగతి గణితం, 12వ తరగతి ఆర్థికశాస్త్రం పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ఇటీవల జరిగిన పదో తరగతి మ్యాథమెటిక్స్, 12వ తరగతి ఎకనామిక్స్ పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీకైనట్టు వెలుగుచూడటం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు.. ప్రశ్నాపత్రాలు లీక్ కావడం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించామని, ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షల తేదీని తమ వెబ్సైట్లో వెల్లడిస్తామని సీబీఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ రెండు పరీక్షలు మళ్లీ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన ఈ రెండు పరీక్షలకు దాదాపు 28లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్ఈ నిర్ణయంతో పదో తరగతిలో 16,38,428 మంది విద్యార్థులు, 12వ తరగతిలో 11,86,306మంది విద్యార్థులు మరోసారి పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. టెన్త్ మ్యాథమెటిక్స్ ప్రశ్నాపత్రం చాలా సులువుగా రావడం, 12వ తరగతి ఎకనామిక్స్ ప్రశ్నాపత్రం లీకై.. వాట్సాప్లో చక్కర్లు కొట్టడం పరీక్షల సందర్భంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
మార్చి 9 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు
వచ్చే మార్చి 9 వ తేదీ నుంచి సీబీఎస్ఈ 10 గ్రేడ్ (పదవ తరగతి), 12 గ్రేడ్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలలో వారం రోజులపాటు పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉంది. 10 వ తరగతి 2016 2017 మొత్తం విద్యార్థుల సంఖ్య 1491371 1667573 మొత్తం స్కూళ్ల సంఖ్య 15286 16354 మొత్తం పరీక్షా కేంద్రాల సంఖ్య 3742 3974 12 వ తరగతి 2016 2017 మొత్తం విద్యార్థుల సంఖ్య 1065179 1098420 మొత్తం స్కూళ్ల సంఖ్య 10093 10677 మొత్తం పరీక్షా కేంద్రాల సంఖ్య 3757 3503 -
పన్నేండేళ్లకే పన్నెండు పూర్తి చేశాడు
రాజస్థాన్: రాజస్థాన్లో ఓ పన్నేండేళ్ల పిల్లాడు రికార్డు సృష్టించాడు. పన్నేండేళ్లకే పన్నెండో తరగతి పాసయ్యాడు. సోమవారం సాయంత్రం రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఆర్బీఎస్ఈ) విడుదల చేసిన ఫలితాల్లో ఈ రికార్డు వెల్లడయింది. అబ్బాస్ శర్మ అనే పిల్లాడి వయసు 12 ఏళ్లు. ఇతడు ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడే తండ్రి సచిన్ శర్మ 2004లోనే స్కూల్ లో పేరు నమోదు చేశాడు. గతంలో పదేళ్లకే పదో తరగతి పాసై రికార్డు సృష్టించి చర్చల్లో నిలిచాడు. తాజాగా మరోసారి పన్నెండో తరగతిలో 600 మార్కులకు 325 మార్కులు తెచ్చుకొని దిగ్విజయంగా ఢిగ్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. -
సీబీఎస్ఈ పరీక్షల డేటాషీట్ విడుదల
ఈ ఏడాది సీనియర్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (12వ తరగతి), సెంకడరీ స్కూల్ ఎడ్యుకేషన్ (పదో తరగతి) పరీక్షలకు హాజరుకాబోయే విద్యార్థుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తాజాగా డేటాషీట్ విడుదల చేసింది. సీబీఎస్ఈ పరిధిలో పదో తరగతి పరీక్షలు మార్చ్ 1వ తేదీ నుంచి ప్రారంభమై.. మార్చి 28వ తేదీన ముగియనున్నాయి. 12వ తరగతి పరీక్షలు మార్చ్ 1న ప్రారంభమై.. ఏప్రిల్ 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ (www.cbse.nic.in.) లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.