CM Akhilesh Yadavs
-
లైవ్: అఖిలేశ్ తిరుగుబాటు చేస్తారని అనుకోలేదు!
ఉత్తరప్రదేశ్ తాజా అప్డేట్స్.. లక్నో: 2012లో అఖిలేశ్ యాదవ్‌ను ములాయంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రిని చేశారని, కానీ ఇలాంటిరోజు ఒకటి వస్తుందని ఇద్దరు అప్పట్లో ఊహించలేదని ఎస్పీ నేత మధుకర్ జైట్లీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ తన తప్పును ఒప్పుకొంటే.. ఆయనపై బహిష్కరణ వేటును ఉపసంహరింపజేసేందుకు ప్రయత్నిస్తానని నేతాజీ చెప్పారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తండ్రిపై అఖిలేశ్ తిరుగుబాటుచేసే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార ప్రతినిధి రాజీనామా.. ఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన సీఎం అఖిలేశ్ యాదవ్‌కు మద్దతుగా ఆ పార్టీ అధికార ప్రతినిధి జూహి సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తాను ఎస్పీ అధినేత ములాయం సింగ్‌కు వ్యతిరేకం కాదని, కానీ సీఎం అఖిలేశ్‌కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. పార్టీ నుంచి సీఎంను సస్పెండ్ చేస్తే.. అధికార ప్రతినిధి కూడా రాజీనామా చేయాల్సిన అవసరముంటుందని ఆమె పేర్కొన్నారు. అందరి మద్దతు అఖిలేశ్‌కే.. యావత్ ఉత్తరప్రదేశ్ ప్రజల మద్దతు అఖిలేశ్‌కు ఉందని, ఆయన వెంట నడిచేందుకు యువత, మహిళలు, ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎస్పీ ఎమ్మెల్యే పవన్ పాండే అన్నారు. అఖిలేశ్ వర్గం ఎమ్మెల్యేల భేటీలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖిలేశ్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. హలో అఖిలేశ్.. ఉత్తరప్రదేశ్‌లోని తాజా రాజకీయాల నేపథ్యంలో సీఎం అఖిలేశ్ యాదవ్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుత సంక్షోభంలో దృఢంగా ముందుకు సాగాలని సూచిస్తూ ఆయనకు శుభాభినందలు మమత తెలిపారు. ములాయంకే నా మద్దతు: అమర్‌సింగ్ ఎంతో కష్టపడి సమాజ్‌వాదీ పార్టీని ములాయం సింగ్ నిర్మించారని, తాజా సంక్షోభంలో ఆయనకే తన మద్దతు ఉంటుందని సీనియర్ నేత అమర్‌సింగ్ స్పష్టం చేశారు. -
అఖిలేశ్‌కు పొంచి ఉన్న మహాగండం!
బలపరీక్షకు సిద్ధపడాలని గవర్నర్ ఆదేశించే అవకాశం లక్నో: సీఎం అఖిలేశ్ యాదవ్, ఆయన సన్నిహితుడు రాంగోపాల్ యాదవ్‌ను ఆరేళ్లపాటు ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఆరేళ్లపాటు బహిష్కరించడంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ములాయం నిర్ణయం నేపథ్యంలో ఎస్పీని నిట్టనిలువునా చీల్చి సొంత కుంపటి పెట్టేదిశగా అఖిలేశ్ యాదవ్ సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన సొంత కుంపటి పెడితే.. ఆయనతో జత కలిసేందుకు సిద్ధమని మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం అఖిలేశ్ యాదవ్ శనివారం తన నివాసంలో మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో అఖిలేశ్ వర్గీయులుగా పేరుపడిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా సీఎం ఇంటికి క్యూ కట్టారు. రంగంలోకి గవర్నర్! అధికార పార్టీ ఎస్పీలోని పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రాంనాయక్ రంగంలోకి దిగారు. అఖిలేశ్‌ను ఆరేళ్లపాటు ఎస్పీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు సిద్ధపడి.. మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్.. అఖిలేశ్‌ను ఆదేశించే అవకాశముందని తెలుస్తోంది. జనవరి 3న యూపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో 72 గంటలలోపే బలపరీక్షకు సిద్ధపడాలని గవర్నర్ ఆదేశించే అవకాశముందని వినిపిస్తోంది. మరోవైపు ఎస్పీలోని తాజా సంక్షోభంపై స్పందించిన గవర్నర్.. పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నట్టు ప్రకటించారు. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలతో అఖిలేశ్‌ను, రాంగోపాల్ యాదవ్‌ను పార్టీ చీఫ్ ములాయం ఆరేళ్లు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. -
అఖిలేశ్ ఇంటికి క్యూకట్టిన ఎమ్మెల్యేలు
లక్నో: అధికార సమాజ్‌వాదీ పార్టీ నుంచి సీఎం అఖిలేశ్ యాదవ్ బహిష్కరణకు గురైన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లక్నోలోని సీఎం నివాసం వద్దకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని అఖిలేశ్‌కు మద్దతుగా, ములాయం, శివపాల్ యాదవ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పార్టీలో అఖిలేశ్ వర్గీయులుగా పేరుపడిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా సీఎం ఇంటికి క్యూ కట్టారు. ( చదవండి : ములాయం కుటుంబంలో ఏం జరిగింది?) సీఎం అఖిలేశ్.. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో శనివారం కీలక భేటీ నిర్వహిస్తారని తెలిసింది. అంతకు ముందే, అంటే, నేటి రాత్రి అఖిలేశ్ మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే ఆరోపణలతో అఖిలేశ్‌ను పార్టీ చీఫ్ ములాయం ఆరేళ్లు సస్పెండ్ చేశారు. పార్టీకి నష్టం చేసేవిధంగా వ్యవహరించిన రాంగోపాల్ యాదవ్‌పైనా ములాయం వేటువేశారు. జనవరి 1న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రాంగోపాల్ ప్రకటించారు. అఖిలేశ్ ఏం చెయ్యబోతున్నారనేది ప్రస్తుతానికి సస్సెన్స్. (చదవండి : 1న అఖిలేశ్ వర్గం భారీ సభ.. )