co-operative sector
-
సహకార రంగం.. బలోపేతం
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను పునర్ వ్యవస్థీకరించి, మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (నాబ్కాన్స్) చేసిన సిఫార్సులకు అనుగుణంగా చట్ట సవరణకు అంగీకరించారు. పీఏసీఎస్‌లలో క్రమం తప్పకుండా నిపుణులైన వారితో ఆడిటింగ్ చేయించాలని, రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే ఏం చేయాలన్న దానిపై కూడా కార్యాచరణ ఉండాలని చెప్పారు. మూడవ పార్టీతో (థర్డ్ పార్టీ) స్వతంత్రంగా విచారణ చేయించాలని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నడపడానికి సంబంధించిన యాజమాన్య పద్ధతుల్లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఎన్ఏబీసీఓఎన్ఎస్ – నాబ్కాన్స్) సిఫార్సులపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు గురించి అధికారులు సీఎంకు వివరించారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని నివేదించారు. వాటి లైసెన్స్‌లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని తెలిపారు. 45 శాతం పీఏసీఎస్‌లు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయని, 49 శాతం మండలాలకు డీసీసీబీ బ్రాంచ్ నెట్‌వర్క్‌తో అనుసంధానం లేదని చెప్పారు. రుణాలు తక్కువగా ఇవ్వడంతోపాటు మోసాలు అధికంగా జరుగుతున్నాయని వెల్లడించారు. కేవలం పంట రుణాలకే పరిమితం అవుతున్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవడం లేదని వివరించారు. డీసీసీబీల పనితీరు మెరుగవ్వాలి డీసీసీబీల్లో మెరుగైన పనితీరు ఉండాలని, వీటి నుంచి చక్కగా రుణాలు అందాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రుణాలు ఎవరికి ఇవ్వాలి.. ఎలా ఇవ్వాలి అనే దానిపై నిర్దిష్ట విధివిధానాలు ఉండాలని, ఈ విధివిధానాలకు లోబడే అందరి పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలకు డీసీసీబీలు దన్నుగా నిలిచేలా పలు సిఫార్సులకు ఆమోదం తెలిపారు. కోఆపరేటివ్ బ్యాంకుల మార్కెట్ షేర్ 20 శాతం వరకు పెంచాలని నిర్ణయించారు. ఆర్బీకేల కార్యక్రమాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా డీసీసీబీల రుణ ప్రణాళికలు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే ఎంఎస్ఎంఈలకు దన్నుగా ఉండేలా రుణ కార్యక్రమాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. డీసీసీబీ బ్యాంకుల పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూల భావం పోవడంతో పాటు విశ్వాసం, నమ్మకం కలిగించాలని సూచించారు. నాణ్యమైన సేవలు అందించడంతో పాటు రుణాలు ఇవ్వడంలో మంచి ప్రమాణాలు పాటించాలని, ఆర్థిక కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని, ఎక్కడా అవినీతి ఉండకూడదన్నారు. డీసీసీబీ బ్యాంకుల సమర్థత పెరగడంతో పాటు మంచి యాజమాన్య పద్ధతులు రావాలని పేర్కొన్నారు. చక్కెర కర్మాగారాల్లో ఇథనాల్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని, దీనివల్ల ఆ కర్మాగారాలకు ఊరట లభిస్తుందని సూచించారు. ఏప్రిల్ 15 నాటికి గోడౌన్ల నిర్మాణానికి టెండర్లు వ్యవసాయం అనుబంధ రంగాల్లో విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం చేపడుతున్న మల్టీ పర్పస్ సెంటర్ల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. గోడౌన్ల నిర్మాణానికి ఏప్రిల్ 15 కల్లా టెండర్ల ఖరారు చేసి, ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని అధికారులు వెల్లడించారు. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ మల్టీపర్పస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న గోడౌన్లు, డ్రైయింగ్ యార్డులు, కోల్డు రూమ్‌లు, పంటల సేకరణ కేంద్రాలు ఇతర వ్యవసాయ పరికరాలు, సామగ్రి మొత్తం వీటన్నింటి కోసం సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సహకార శాఖ స్పెషల్ సెక్రటరీ వై మధుసూదనరెడ్డి, కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీస్ బాబు ఏ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాల వెల్లువతో రైతులకు మంచి రేటు పాల వెల్లువ కార్యక్రమంపై కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల రైతులకు మంచి రేటు దొరుకుతోందని అధికారులు వెల్లడించారు. మిగతా జిల్లాలకూ ప్రాజెక్టును విస్తరిస్తున్నామని అధికారులు తెలిపారు. పాల వెల్లువతో మార్పు ఇదీ.. నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సిఫార్సులపై చర్చ సహకార వ్యవస్థను బలోపేతం చేసి, సమర్థవంతంగా నడపడానికి యాజమాన్య పద్ధతుల్లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేసిన సిఫార్సులపై సమావేశంలో చర్చించారు. ఈ సిఫార్సులకు అనుగుణంగా చట్ట సవరణకు సీఎం అంగీకారం తెలిపారు. ఆ సిఫార్సులు ఇలా ఉన్నాయి. ► సమగ్ర బ్యాంకు సేవల కోసం ఆప్కాబ్, డీసీసీబీల నుంచి పీఏసీఎస్‌ల వరకు కంప్యూటరీకరణ చేయాలి. ► పీఏసీఎస్‌లు క్రెడిట్ సేవలతో పాటు నాన్ క్రెడిట్ సేవలు కూడా అందించాలి. ► పీఏసీఎస్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలి. ఇందులో భాగంగా ప్రతి 3 ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు ఒక పీఏసీఎస్ ఉండేలా చూడాలి. ► ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో నిపుణులైన వారిని నియమించాలి. వ్యవసాయం, బ్యాంకింగ్, ఆర్థిక, అకౌంటెన్సీల్లో నిపుణులైన వారిని బోర్డుల్లోకి తీసుకురావాలి. ► బోర్డుల్లో మూడింట ఒక వంతు మందిని డైరెక్టర్లుగా నియమించాలి. బోర్డులో సగం మంది ప్రతి రెండున్నరేళ్లకు విరమించేలా ఏపీసీఎస్ యాక్ట్‌కు సవరణ తీసుకురావాలి. పీఏసీఎస్‌లోనూ మూడింట ఒక వంతు మంది ప్రొఫెషనల్స్‌ను తీసుకురావాలి. గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ అసిస్టెంట్లను పీఏసీఎస్ సభ్యులుగా తీసుకురావాలి. -
చెరకు రైతుల బకాయిలు తీర్చాలి
సాక్షి, అమరావతి: చెరకు రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా తీర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.54.6 కోట్ల బకాయిలను ఈ నెల 8న రైతు దినోత్సవం సందర్భంగా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీని వల్ల దాదాపు 15 వేల మంది చెరకు రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహకార చక్కెర ఫ్యాక్టరీలపై మరింతగా అధ్యయనానికి మంత్రుల బృందం ఏర్పాటు చేస్తున్నామని, ఈ బృందం లోతుగా అధ్యయనం చేసి ఆగస్టు 15వ తేదీలోగా సమగ్ర నివేదికను సమర్పించాలన్నారు. ఈ సమీక్ష వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. ► రాష్ట్రంలో సహకార చక్కెర ఫ్యాక్టరీల పరిస్థితులను అధికారులు సీఎంకు వివరించారు. రైతులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలపై సీఎం ఆరా తీశారు. ► ప్రస్తుతం సహకార చక్కెర కర్మాగారాల వద్ద ఉన్న నిల్వలను ప్రభుత్వ పరంగా ఎంత వరకు వినియోగించగలమో ఆలోచించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీతో పాటు, ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీలు.. ఇలా ఎక్కడ వీలైతే అక్కడ వినియోగించుకునేలా ఆలోచించాలన్నారు. దీని వల్ల ఆ ఫ్యాక్టరీలకు కొంతైనా మేలు జరుగుతుంది. ► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చేతులెత్తేసిన సహకారం
భీమవరం టౌ¯ŒS : ఇతని పేరు రామకృష్ణ శర్మ. రిటైర్డ్ ఉద్యోగి తాను కూడబెట్టుకున్న రూ.20 లక్షలను జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) భీమవరం శాఖలో డిపాజిట్ చేశారు. ఆ మొత్తంపై నెలనెలా వచ్చే వడ్డీ తీసుకుని కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సహకార సంఘాల్లో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో నవంబర్ నెలకు సంబంధించిన వడ్డీ తీసుకునే అవకాశం లేక రామకృష్ణ శర్మ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఆ బ్యాంక్ శాఖకు వచ్చిన ఆయన వడ్డీ సొమ్ము ఎప్పుడిస్తారని సిబ్బందిని అడిగారు. మరికొంత సమయం పడుతుందని చెప్పడంతో ఏం చేయాలో పోలుపోని స్థితిలో.. ఆ బ్రాంచికి వచ్చిన డీసీసీబీ చైర్మ¯ŒS ముత్యాల రత్నంను కలిశారు. తాను డీసీసీబీలో సొమ్ము దాచుకున్నానని, దానిపై వచ్చే వడ్డీపైనే ఆధారపడి జీవిస్తున్నానని.. ఇప్పటి పరిస్థితి చూస్తే భయంగా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. అన్ని బ్యాంకుల్లోనూ లావాదేవీలు జరుగుతుంటే.. సహకార బ్యాంకులో మాత్రం ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. దీంతో బ్యాంక్ చైర్మ¯ŒS రత్నం వారానికి రూ.24 వేలు ఇస్తామని, కొంత ఓపిక పట్టాలని నచ్చజెప్పి పంపించారు. జిల్లాలోని సొసైటీలు, అన్ని డీసీసీబీ బ్రాంచిల్లోనూ ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. రైతుల పరిస్థితి మరీ దుర్భరం పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగానే ఉంది. డీసీసీబీ బ్రాంచిలు, సొసైటీల్లో అన్నిరకాల లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన సొమ్మును తీసుకునే అవకాశం లేకపోవడం, కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పరిధిలో 256 సహకార పరపతి సంఘాలు (సొసైటీలు) ఉండగా, 3.14 లక్షల మంది రైతులకు వాటిలో ఖాతాలు ఉన్నాయి. రూ.2 వేల కోట్లను సహకార సంఘాల ద్వారా రుణాలిచ్చారు. ఇందులో రూ.1,400 కోట్లను పంట పెట్టుబడుల నిమిత్తం ఇచ్చారు. మరో రూ.600 కోట్లను వ్యవసాయేతర రుణాలుగా మంజూరు చేసినా.. వాటిని కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే తీసుకున్నాయి. ఇదిలావుంటే.. రూ.1,241 కోట్లను రైతులు, ఇతర వర్గాలవారు సహకార సంఘాల్లో డిపాజిట్లుగా వేశారు. సహకార సంఘాల్లో పొదుపు ఖాతాలు సైతం ఉన్నాయి. డిపాజిట్ల నుంచి, పొదుపు ఖాతాల నుంచి రైతులు నగదు తీసుకునే అవకాశం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలు, పరిమితులను అనుసరించి వాణిజ్య బ్యాంకుల్లో నోట్ల మార్పిడి, ఖాతాల నుంచి కొంతమొత్తంలో నగదు తీసుకునే అవకాశం కల్పించారు. డీసీసీబీ బ్రాంచిలు, సహకార సంఘాల్లోని ఖాతాదారులకు ఈ అవకాశం లేకుండాపోయింది. దీంతో రైతులు, సహకార సంఘాల్లో సొమ్ములు దాచుకున్న ఇతర ఖాతాదారులు నగదు పొందే అవకాశం లేక అవస్థలు పడుతున్నారు. పొదుపు ఖాతాలూ స్తంభించాయి డీసీసీబీ బ్రాంచిలు, సొసైటీల్లో పొదుపు ఖాతాలు కూడా ఉన్నాయి. వాటినుంచి కనీసం వంద రూపాయలైనా తీసుకునే అవకాశం లేకపోవడంతో ఖాతాదారులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాణిజ్య బ్యాంకుల్లోని ఖాతాల నుంచి నిర్ధిష్ట పరిమితి మేరకు నగదు తీసుకునే అవకాశం కల్పించినా.. సహకార బ్యాంకులకు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. రెండో విడత రుణమాఫీ కింద కొందరు రైతులకు చెందిన వ్యక్తిగత అకౌంట్లలో రూ.2 వేల చొప్పున సొమ్ము జమకాగా, ఆ మొత్తాన్ని సైతం తీసుకునే అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతం వరి కోతల సీజ¯ŒS నడుస్తోంది. రైతులకు పెట్టబడులు నిమిత్తం వేలాది రూపాయలు అవసరం. సహకార బ్యాంకులు, సొసైటీల్లో లావాదేవీలు నిలిచిపోవడంతో వాటిలో ఖాతాలు కలిగిన రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. పోనీ.. వ్యవసాయ ఖర్చుల కోసం బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందుదామన్నా అవకాశం లేకుండాపోయింది. ఆర్బీఐ నుంచి సొమ్ము రాలేదు నోట్ల మార్పిడి నిమిత్తం డీసీసీబీ అధికారులు రూ.175 కోట్లను రిజర్వ్ బ్యాంక్‌కు డిపాజిట్ చేయగా, ఇప్పటివరకు రూ.5 కోట్ల విలువైన నోట్లు మాత్రమే వచ్చాయి. రూ.170 కోట్ల నగదుకు సంబంధించి కొత్త నోట్లు వస్తేగాని డీసీసీబీలో కనీస స్థాయిలో అయినా లావాదేవీలు జరిపే పరిస్థితి లేదు. ఆ సొమ్ము ఎప్పుడొస్తుందో, లావాదేవీలు ఎప్పుడు మొదలవుతాయో తెలియక అటు ఉద్యోగులు, ఇటు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఉపశమన చర్యలు అక్కరకొస్తాయా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం గురువారం కొన్ని ఉపశమన చర్యలు ప్రకటించింది. పంట రుణం పొందిన, కిసా¯ŒS క్రెడిట్ కార్డు ఉన్న రైతు తన ఖాతా నుంచి వారానికి రూ.25 వేల నగదు తీసుకోవచ్చు. పంట అమ్మగా వచ్చిన సొమ్ము ఆర్టీజీఎస్ లేదా చెక్కు ద్వారా తన ఖాతాలోకి వచ్చి ఉంటే, అదనంగా వారానికి మరో రూ.25 వేలు తీసుకోవచ్చు. అంటే ఇలాంటి సందర్భాల్లో రైతు గరిష్టంగా వారానికి రూ.50 వేలు విత్‌డ్రా చేయడానికి ఆస్కారం ఉంటుంది. రబీ సీజ¯ŒS మొదలైన నేపథ్యంలో పెట్టుబడులు, ఎరువులు, ఇతర ఖర్చుల నిమిత్తం రైతులకు ఈ వెసులుబాటు కల్పించారు. పంట బీమా ప్రీమియం గడువును 15 రోజులు పొడిగించారు. ఈ నిర్ణయం వాణిజ్య బ్యాంకుల్లో ఖాతాలున్న రైతులకు ఉపశమనం ఇస్తుంది. సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న, వాటిలో డిపాజిట్లు, పొదుపు ఖాతాలు ఉన్న రైతులకు తాజా నిర్ణయం వల్ల ఒరిగేదేమీ ఉండదని సహకార రంగ వర్గాలు చెబుతున్నాయి. -
చక్కెర కర్మాగారాల ప్రైవేటీకరణకు కుట్ర
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేస్తోంది తమవారికి కట్టబెట్టే కుట్రలు చేస్తోంది ధ్వజమెత్తిన వైఎస్ జగన్ విశాఖపట్నం: సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేసి తమవారికి కట్టబెట్టాలని కుట్రలు పన్నుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. చక్కెర రైతుల తరఫున పోరాడతామని, ఫ్యాక్టరీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. హుదూద్ తుపాను బాధిత విశాఖపట్నం జిల్లాలో ఐదో రోజు పర్యటనలో భాగంగా జగన్ శనివారం అనకాపల్లి, చోడవరంలతోపాటు విశాఖ ఏజెన్సీలోని పాడేరు, హుకుంపేట, అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తమ వద్దకు వచ్చిన జగన్‌ను చూసి చెరకు రైతులు, గిరిజనులు ప్రభుత్వం తమను ఆదుకోవడంలేదని వాపోయారు. తమకు సాయం చేయాలని, తమ కోసం పోరాడాలని కోరారు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నంలో బయలుదేరిన ఆయన అనకాపల్లిలోని ఆవఖం డం వద్ద ఆగి వరద ముంపులో మునిగిన చెరకు తోటలను పరిశీలించారు. కూలిన గుడిసెలను చూశారు. అక్కడినుంచి అనకాపల్లిలోని చవితి నివీధి, విజయరామరాజుపేట జంక్షన్, తుమ్మపాల, వెంకుపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కూలిన ఇళ్లు, గుడిసెలను పరిశీలించారు. చెరకు రైతులు, మహిళలతో మాట్లాడారు. ఏజెన్సీలోని పాడేరులోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మోదుపల్లిలో తుపానుకు దెబ్బతిన్న కాఫీ తోటలను పరిశీలించారు. యరడపల్లిలో బురదలో నడుస్తూ కూలిన ఇళ్లను పరిశీలించారు. గిరిజనులతో మాట్లాడారు. అరకులోయ రూరల్ మండలంలో కొండచరియ విరిగిపడి దుర్మరణం పాలైన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అరకులో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శనివారం అర్ధరాత్రి వరకు అలుపు లేకుండా ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా తమ్ముపాల, మోదుపల్లి వద్ద ఆయన చెరకు, కాఫీ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నారంటే.... ► సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టేస్తోంది. అనకాపల్లి షుగర్స్ రైతులకు రూ.6కోట్లు ఇవ్వాల్సి ఉండగా... కేవలం రూ.2కోట్లే ఇచ్చింది. మిగిలిన రూ.4కోట్లు ఇవ్వకపోగా... ఫ్యాక్టరీ రూ.23కోట్లు నష్టాల్లో ఉన్నట్లు చూపిస్తోంది. ఆ సాకుతో ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయాలన్నది ప్రభుత్వ దురుద్దేశం. గతంలో కూడా ఇలాగే సహకారరంగంలోని సుగర్ ఫ్యాక్టరీలను తమవారికి తక్కువ ధరకు కట్టబెట్టేశారు. ఈసారి అదే చేద్దామనుకుంటున్నారు. ► రైతులతో ప్రభుత్వం చెలగాటమాడాలని చూస్తోంది. సర్కారు ఆటలు సాగనివ్వం. సుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతాం. చెరకు రైతులకు హెక్టారుకు రూ.10వేలు పరిహారం ఇస్తామమని ప్రభుత్వం చెబుతోంది. అది ఏమూలకు సరిపోతుంది? ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలి. కొబ్బరి చెట్టుకు రూ.5వేలు ఇవ్వాలి. ► కాఫీ రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలి. కాఫీ తోటల్లో కూలిపోయిన సిల్వర్‌వోక్ చెట్లు మరో 15ఏళ్లకుగానీ పెరగవు. ఆ చెట్ల నీడలోనే కాఫీ తోటలు పెరుగుతాయి. అవి లేకపోతే కాఫీ తోటలు పెరగవని ప్రభుత్వానికి తెలీదా? ప్రభుత్వం హెక్టారుకు రూ.15వేలు ఇస్తామని చెబుతోంది. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. గిరిజనులు ఏజెన్సీలో తప్ప బయటకు వెళ్లలేరు. వారికి మరో బతుకుదెరువు లేదు. కాబట్టి నష్టపోయిన కాఫీ తోటలకు హెక్టారుకు రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించాలి. అందరికీ భరోసానిస్తూ... విశాఖపట్నంలో శనివారం ఉదయం మొదలైన జగన్ ఐదోరోజు పర్యటన అర్ధరాత్రి వరకూ సాగింది. తుపానువల్ల తమకు కలిగిన నష్టాన్ని రైతులు, గిరిజనులు ఆయనకు చెప్పుకున్నారు. అందరికీ న్యాయం జరిగేవరకూ పోరాడతానని భరోసానిస్తూ జగన్ ముందుకు సాగారు. జగన్ పర్యటన లో ముఖ్యాంశాలు ఇలా... ► గత పైలీన్ తుపానుతో మొత్తం పంట పోయింది. కానీ పరిహారం ఇవ్వలేదు. ఈసారైనా పంట చేతికొస్తుందనుకుంటే మళ్లా తుపాను ముంచెత్తింది. ఇంతవరకు ఎవ్వరూ రాలేదు. మా గతేం కాను. దిక్కుతోచడం లేదని కర్రిరాము, పిల్లా కొండయ్య, అప్పలనాయుడులు జగన్‌తో చెప్పుకుని వాపోయారు. ► గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తుమ్మపాల ఫ్యాక్టరీని అమ్మేద్దామనుకున్నారు. అప్పట్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి అడ్డుకున్నారు. మళ్లీ ఇప్పుడు సీఎం ఆ ఫ్యాక్టరీని అమ్మేస్తారనిపిస్తోంది. ఫ్యాక్టరీ మూసేశారు. ఏడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. చెరకు క్రషింగ్ డబ్బులు ఇవ్వడం లేదు.రైతులం రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తంచేశారు. తుపాను వచ్చినప్పుడు భారీ వర్షాలకు ఏలేరు, పులికాల్వ పొంగడంతో 3,500 ఎకరాల్లో చెరకు పంట మునిగిపోతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. -
విత్తన పరాధీనతకు చెల్లు చీటీ
విత్తన పరిశ్రమ నియంత్రణాధికారులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపి ఆ దిశగా చర్యలను చేపట్టాలి. సహకార రంగంలో విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించి విత్తన రైతుల నుంచి నేరుగా రైతులకు విత్తనాలు అందేలా చేస్తేనే ప్రైవేటు, బహుళజాతి విత్తన కంపెనీల గుత్తాధిపత్యానికి కళ్లాలు వేయడం సాధ్యం. విత్తనాలు లేకుంటే వ్యవసాయం లేదు. వచ్చే ఏడాది విత్తడానికి రైతులు ఈ ఏడాది పండిన పంటల నుంచే ఎంచుకుని దాచుకునేవారు. తమలో తాము పంచుకునేవారు. మంచి విత్తనాలను గుర్తించి మెరుగైన రకాలను పునరు త్పత్తి చేసేవారు. అది విత్తు రైతు చేజారిపోని నాటి గతం. అధిక దిగుబడి వంగడాలకు ప్రోత్సాహం, సంస్కరణల పేరిట కేంద్రం రైతు చేతిలోని విత్త నాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టింది. నాణ్యతా ప్రమాణాలంటూ రైతుల విత్తన ఉత్పత్తి పరిజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేసింది. దీంతో క్రమక్రమంగా రైతులు విత్తన ఉత్పత్తి పద్ధతులను, పరిజ్ఞానాన్ని మరచిపోయే పరిస్థితి ఏర్పడింది. విత్తనాల కంపెనీల మాయాజాలానికి విత్తనాలను పండించే తెలంగాణ రైతు లకే విత్తనం కరువయ్యే దుస్థితి దాపురించింది. రైతులు విత్తనాల కోసం విత్తన కంపెనీలపై ఆధారపడాల్సి వస్తోంది. తెలంగాణను విత్త నోత్పత్తి కేంద్రంగా మారుస్తామని టీఆర్ఎస్ ఎన్నికల్లో వాగ్దానం చేసింది. కానీ తెలంగాణ ఇప్పటికే విత్తన ఉత్పత్తి కేంద్రం. అది రైతులను దివాలా తీయించి, విత్తన కంపెనీలను కోట్లకు పడగలె త్తేట్టు చేసింది. జరగాల్సింది విత్తన ఉత్పత్తి రంగ ప్రక్షాళన. విత్తన ఉత్పత్తి రంగ ప్రక్షాళన జరగాలి పత్తి విత్తన రంగాన్ని కొన్ని ప్రైవేటు సంస్థలే శాసిస్తున్నాయి. బీటీ పత్తి వలన తెలంగాణ రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగకపోగా ఏటా కోట్ల రూపా యలు రైతులు విత్తన కంపెనీలకు చెల్లించుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే గత ఏడాది తెలంగాణ రైతాంగం వాటికి వెయ్యి కోట్లు సమర్పిం చుకుంది. కానీ కంపెనీల ప్రకటనలకు భిన్నంగా మొక్కలు సరిగా పెరగక, చీడ పురుగులకు గురై రైతులు నష్టపోయారు. చెప్పిన దిగుబడిలో సగం కూడా రాలేదు. పైగా మార్కెట్లో తగిన ధరలు రాక మరింతగా నష్టానికి గుర య్యారు. వ్యాపార ప్రకటనలతో మభ్యపెట్టి రైతులకు మళ్లీ అదే నాసిరకం విత్తనాలను అంటగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత మాత్రం విశ్వసించలేని కంపెనీల కాకి లెక్కలే వ్యవసాయ శాఖ గణాంకాలు. వాస్తవంగా విత్తనాల ఉత్పత్తి ఎంతో ఎవరికీ తెలియదు. కాబట్టి విత్తనాల కంపెనీలు, డీలర్లకు విత్తనాల కొరతను సృష్టించి రైతులను కొల్లగొ ట్టడం అలవాటుగా మారింది. పత్తి విత్తన కంపెనీలకు స్వంత విత్తన క్షేత్రాలు ఉండవు. రైతులతో ఒప్పందాలు చేసుకొని విత్తనాలను ఉత్పత్తి చేయిస్తారు. మొత్తం ఎంత విస్తీర్ణంలో ఎంత పరిమాణంలో విత్తనాలు ఉత్పత్తి అయ్యాయో గోప్యమే. వార్షిక ఉత్పత్తి ప్రణాళికలు సైతం రహస్యమే. ప్రభుత్వం, స్థానిక మార్కెటింగ్ కమిటీలతో కొంత సమాచారాన్ని పంచుకోవాలి. కానీ విత్తన కంపెనీలు అరకొర సమాచారంతో సరిపుచ్చుతాయి. మార్కెట్ ధరలకు అను గుణంగా విత్తన ధరలు కూడా పెరగాలనే వింత వాదనతో విత్తన కంపెనీలు ఏటా ప్రభుత్వంపై ధరలను పెంచాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఉత్పత్తి ఖర్చులు పెరిగి, ఉత్పత్తి తగ్గిపోయిందని, బీటీ పత్తి వల్ల రైతుల ఆదాయం గణనీ యంగా పెరిగిందని కుంటి సాకులు చూపుతున్నారు. పత్తి విత్తనాల మీదే కాదు అన్ని విత్తనాల ఉత్పత్తి మీద, ధరల మీద ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. ఒక్క బీటీ పత్తి విత్తనాల మీదే ఒక బహుళజాతి కంపెనీ ఏటా రూ. 400 కోట్ల రాయల్టీని పొందుతోంది. కానీ విత్తన నాణ్యతకు మాత్రం అది జవాబుదారీతనం వహించదు. బీటీ పత్తి విత్తన ప్యాకెట్ ధరలో విత్తనాలు ఉత్పత్తి చేసే రైతుకు చెల్లించేది 20 నుంచి 30 శాతం మాత్రమే. కంపెనీ ఆర్గనైజర్ల వాటా కూడా అందులోనే . కంపెనీల సమాచారం ప్రకారం ప్రతి విత్తన ప్యాకెట్ ధరలో మూడు రకాల ప్రధాన ఖర్చులు కనబడతాయి. విత్తన రైతులకు ఇచ్చే సేకరణ ధర, మేధో సంపత్తి హక్కులకు గానూ మోన్సాంటో కంపెనీకి చెల్లించే రాయల్టీ, విత్తన కంపెనీ ఖర్చులు. ఆ లెక్కలనే నమ్మేట్ట యితే విత్తన కంపెనీలు లాభాలు లేకుండా ఎందుకు వ్యాపారం చేస్తున్నా యనే అనుమానం కలుగక మానదు. విత్తనాల ధరలు పెరిగితే కంపెనీల లాభాలు మరింత పెరుగుతాయి. విత్తన రైతులకు చెల్లించే ధర పెరగదు, పరాధీనమైన విత్తన రంగంవిత్తన ఉత్పత్తిలో ప్రైవేటు రంగానికి పూర్తి స్థాయి పాత్రను కల్పిస్తూ 2002లో కేంద్ర ప్రభుత్వం చేసిన విధానపరమైన మార్పు తరువాత విత్తన రంగం అనేక మార్పులకు లోనైంది. దేశీయ విత్తన సరఫరా కంపెనీల సంఖ్య తగ్గి, బహుళజాతి కంపెనీల పాత్ర పెరిగిపోయింది. అనేక పంటలపైనా, కూరగా యలపైనా విదేశీ కంపెనీల పెత్తనం పెరిగింది. అవి చైనా, తైవాన్ లాంటి దేశాలనుంచి తక్కువ ధరకు కూరగాయల విత్తనాలను దిగుమతి చేసుకొని ఇక్కడి రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. దీంతో వినియోగదారు లపై అధిక ధరల భారం పడుతోంది. కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి ఇది కూడా ఒక కారణం. కొన్ని ప్రధాన వాణిజ్య పంటలకు ప్రైవేటు కంపెనీల విత్తనాలు తప్ప గత్యంతరం లేదు. వ్యవసాయ విశ్వవిద్యా లయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు విత్తనాలపై పరిశోధనలను గానీ, విత్తన ఉత్పత్తిని గానీ చేపట్టడం లేదు. పేరుకు జాతీయ స్థాయి నుంచి మనకు ప్రభు త్వ రంగ విత్తన వ్యవస్థ ఉన్నా, ప్రభుత్వ విత్తన కార్యక్రమాలు శిథిలావస్థకు చేరాయి. వివిధ ప్రభుత్వాలు ప్రైవేటు విత్తన పరిశ్రమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ విత్తన కార్యక్రమాలను నిర్లక్ష్యం చేశాయి. నిధులను తగ్గించాయి, కేటాయించిన వాటిని నేతలు, అధికారులు కైంకర్యం చేశారు. నేడు బీటీ యేతర పత్తి విత్తనాలు దొరకని ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఒక కంపెనీ లెసైన్స్ చట్రంలోనే అన్ని కంపెనీలను ఇరికించి బీటీ పత్తినే కొనేలా చేసిన ప్రత్యక్ష చర్యల ఫలితమిది. దేశీయ పత్తి విత్తనాల ఉత్పత్తి వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో ఒక బహుళజాతి కంపెనీ సఫలీకృతమైంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆహార పంటలన్నిటిపైనా ఒకే బహుళజాతి సంస్థ గుత్తాధిపత్యం, గుత్త వ్యాపారానికి దారి తీయక తప్పదు. పత్తి విత్తనాలలోని మన పరాధీనత పాలకులకు, రైతులకు, ప్రజలకు గుణపాఠం. రాష్ట్ర ప్రభుత్వాలకే నియంత్రణాధికారాలు ప్రస్తుతం పార్లమెంటు ముందున్న విత్తనాల బిల్లులో అనేక లోపాలున్నాయి. గత అనుభవాల దృష్ట్యా విత్తన పరిశ్రమ నియంత్రణాధికారులను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం అత్యవసరం. విత్తన ధరల నియంత్రణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉండాలి. స్వతంత్ర సంస్థ మదింపు చేసిన ఉత్పత్తి ఖర్చులను పరిగణనలోకి తీసుకొని విత్తనాల ధరలను నిర్ణయించాలి. తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపి ఆ దిశగా చర్యలను చేపట్టాలి. కేవలం బీటీ పత్తికి మాత్రమే గాక అన్ని రకాల విత్తనాల ధరలు, నాణ్యతలకు సంబంధించి పూర్తి పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయడం చాలా అవసరం. తెలంగాణను విత్తన ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందించడానికి పాటించాల్సిన సూత్రాలు, తీసుకోవాల్సిన చర్యలు : 1. విత్తన కంపెనీల నియంత్రణకు రాష్ట్ర స్థాయి విత్తన చట్టాన్ని తేవాలి. ధర, నాణ్యత, లభ్యతలకు రక్షణను కల్పించాలి. 2. రాష్ట్ర స్థాయి విత్తన సమాచార వ్యవస్థను ఏర్పరచి తెలంగాణ రైతులకు నిరంతరాయంగా విత్తన సమాచారాన్ని అందించాలి. 3. విత్తనాలకు సంబంధించిన శాస్త్రీయమైన, మార్కెట్ సంబంధమైన సమాచారంతో ఏటా రాష్ట్ర వ్యవసాయ శాఖ నివేదికను తయారు చేసి భవిష్యత్ ప్రణాళికలకు, విధానాలకు ప్రాతిపదికను ఏర్పరచాలి. 4. విత్తన కంపెనీలు లేదా ఆర్గనైజర్లకు విత్తన రైతులకు మధ్య ఒప్పందానికి చట్టబద్ధతను కల్పించి రైతుల ప్రయోజనాలను కాపాడాలి. 5. సహకార రంగంలో విత్తన ఉత్పత్తిని ప్రోత్సహించి, సాంకేతిక, పెట్టుబడి పరమైన సహాయాన్ని అందించాలి. తద్వారా విత్తన రైతుల నుంచి నేరుగా రైతులకు విత్తనాల సరఫరా సాధ్యమవుతుంది. అప్పుడే ప్రైవేటు విత్తన పరిశ్రమకు కళ్లాలు వేయడం సాధ్యం 6. హైదరాబాద్‌లో విత్తన ఎగుమతులు - దిగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. 7. ప్రభుత్వ రంగంలో వ్యవ సాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాల విత్తన పరిశోధనను ప్రోత్సహించాలి. 8. నాసిరకం విత్తనాలు సరఫరా చేసిన కంపెనీల నుంచి సత్వరమే రైతులకు తగు నష్ట పరిహారం అందేలా చట్ట సవరణలు చేయాలి. 9. రైతులు స్వంతంగా విత్తనాలను తయారు చేసుకోడాన్ని ప్రోత్సహించే పథకాలను చేపట్టాలి. (వ్యాసకర్త వ్యవసాయరంగ విశ్లేషకులు) డాక్టర్ డి. నర్సింహారెడ్డి -
తుమ్మపాలపై ప్రయి‘వేటు’?
అనకాపల్లి, న్యూస్‌లైన్: రైతుల షేరుధనంతో సహకార రంగంలో కొనసాగుతున్న తుమ్మపాల చక్కెర కర్మాగారంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్న దీనిపై ప్రైవేటు వ్యక్తుల కన్నుపడింది. లీజుమాటున దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహం సాగుతోంది. ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగించాలనే సాకుతో కొత్త వ్యూహానికి ఓ వర్గం తెరలేపింది. వచ్చే సీజన్లో కర్మాగారంలో క్రషింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు సుమారు రూ.60 లక్షలు ఇప్పటికీ చెల్లించలేదు. కార్మికులకు వేతనాల విషయంలోనూ యాజమాన్యం విఫలమైంది. పలు దర్యాప్తులు, నివేదికల పేరిట ప్రభుత్వం సాచివేత ధోరణితో ఇప్పుడున్న యంత్రాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు కర్మాగారం భవితవ్యంపై శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవల చక్కెర అధికారుల నివేదికల మేరకు కాసింత ఆర్థిక ఆసరా లేదా ఆధునికీకరణకు నిధులొస్తాయని భావిం చారు. కానీ తాజాగా టీడీపీ నాయకుడొకరు దీనిని దక్కించుకోవడానికి అధికార పార్టీ నాయకులతో మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఈయన ఇప్పటికే సహకార రంగంలో ఓ వ్యవస్థను నడుపుతున్నారు. ఏదోలా గానుగాట జరగాలని ఆశించే రైతులకు ఇది కాసింత ఊరట నిచ్చే అంశమే అయినా రైతుల పోరాటంతో నిలిచిన ఈ ఫ్యాక్టరీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుందన్న ప్రచారాన్ని ఈ ప్రాం తీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్మాగారం ప్రైవేటు పరం అయితే సహకార స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని కొందరు రైతులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పష్టత వస్తే పోరాటానికి రైతు ప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ పాలసీ మేరకే కర్మాగారం భవితవ్యం ప్రభుత్వ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కర్మాగారంలోని యంత్రాలకు ఓవర్ హాలింగ్ చేస్తున్నాం. మహాజనసభ నిర్వహణకు అనుమతి కోరాం. డిసెంబర్ మొదటి వారంలో గానుగాటకు సన్నాహాలు చేస్తున్నాం. ఇతరత్రా అంశాల తుది నిర్ణయం ప్రభుత్వానిదే. -ప్రభుదాస్, ఎమ్డీ సహకార రంగంలో ఉంటే ... =రైతులకు భాగస్వామ్యం ఉంటుంది =ప్రభుత్వ అజమాయిషీ పనిచేస్తుంది =అవసరమైతే ప్రభుత్వం నిధులు, రుణాలు మంజూరవుతాయి =ఫ్యాక్టరీ ఉద్యోగులకు భద్రత, లాభనష్టాలతో పని లేకుండా బోనస్ పంపిణీ =రైతు ఉద్యమాలు, డిమాండ్ల సాధనలో ప్రజాస్వామ్యబద్ధ యాజమాన్యం ఉంటుంది ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళితే... =ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయి. =పెట్టుబడిదారీ వ్యవస్థ అమలవుతుంది. =కర్మాగార ఉద్యోగులకు భద్రత ఉండదు =కర్మాగారాన్ని తెరవడం, కొనసాగించడం, మూసివేతల్లో నియంతృత్వ నిర్ణయాలుంటాయి. =బోనస్ పంపిణీలో లాభనష్టాలను బేరీజు వేస్తారు =రైతుల భాగస్వామ్యానికి విలువుండదు =చెరకు సేకరణలో యాజమాన్య విధానాలను ప్రశ్నించే వీలుండదు. -
బక్షి సిఫారసుల అమలు ఆపండి: మంత్రి కాసు
నాబార్డు చైర్మన్ బక్షి సిఫారసులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయని.. ఆ సిఫారసుల మేరకు జారీచేసిన ఉత్తర్వుల అమలును వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సమగ్రమైన చర్చకు వీలుగా అన్ని రాష్ట్రాల సహకార శాఖల మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి చిదంబరానికి ఆయన సోమవారం లేఖ రాశారు. ప్యాక్స్ ప్రతిపత్తిని దెబ్బతీస్తూ, వాటిని కేవలం ‘బిజినెస్ కరస్పాండెంట్లు’గా పరిమితం చేయటం వల్ల సన్నకారు, కౌలు రైతుల రుణ పరపతి దెబ్బతింటుందని కాసు పేర్కొన్నారు. పైగా సహకార రంగం రాష్ట్ర అధికారాల పరిధిలోనిదని, రాష్ట్ర సహకార చట్టంలో మార్పులు చేయకుండా నాబార్డు ప్రస్తుత సిఫారసులను అమలు చేయటం కుదరదని పేర్కొన్నారు. ప్యాక్స్ రికార్డుల స్వాధీనానికి సర్క్యులర్: ఇదిలావుంటే.. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆస్తులు, అప్పులు, డిపాజిట్లు, ఖాతాలకు సంబంధించిన అన్ని రికార్డులను స్వాధీనం చేసుకోవాలని సంబంధిత కేంద్ర సహకార బ్యాంకులకు నాబార్డ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వి.రామకృష్ణ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. ఇకపై ప్యాక్స్ సొంతంగా ఎలాంటి డిపాజిట్లూ తీసుకోరాదని, రుణాల లావాదేవీలు జరపరాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై ‘ప్యాక్స్’ కేంద్ర సహకార బ్యాంకులకు కేవలం బిజినెస్ కరస్పాండెంట్లుగానే వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.