coastal
-
తీర ప్రాంత శోధన కోసం ఎన్‌సీసీఆర్ కేంద్రం
పెదగంట్యాడ (విశాఖపట్నం): సముద్ర జలాల నాణ్యతను పర్యవేక్షించడంతో పాటు ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ (పీడబ్ల్యూక్యూ), ఎకో సిస్టం, సముద్ర తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై పరిశోధనలు చేసేందుకు ఎన్‌సీసీఆర్ ప్రధాన భూమిక పోషిస్తుందని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. మంగళవారం యారాడలోని డాల్ఫిన్ నోస్‌పై కొత్తగా నిర్మించిన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (ఎన్‌సీసీఆర్) కేంద్రాన్ని ఢిల్లీ నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.78 కోట్లతో నిర్మించిన ఈ కేంద్రంలో మరో 6నెలల్లో రీసెర్చ్‌కు అవసరమైన పరికరాలను సిద్ధం చేస్తామన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తీర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో విపత్తులు ఎక్కువయ్యాయని, ఇటీవల సంభవించిన తుపాన్ల వల్ల ముంబై, చెన్నై వంటి నగరాలు వణికిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 972 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీర ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించి, తీరం వెంబడి ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా పరిశోధనలు చేయాలని మినిస్ట్రీస్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ డాక్టర్ ఎం.రవిచంద్రన్ కోరారు. ఇప్పటివరకూ ఎన్‌సీసీఆర్ కేంద్రాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఎన్విరాన్మెంట్ విభాగంలో నిర్వహిస్తూ వస్తున్నామని, ఇకపై ఈ భవనంలోకి దానిని తరలించనున్నామని ఎన్‌సీసీఆర్ డైరెక్టర్ ఎంవీ రమణమూర్తి చెప్పారు. అనంతరం ఈ కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ (ఐఐటీఎం), ఎంవోఈఎస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కృష్ణన్, ఎంవోఈఎస్ డైరెక్టర్ డాక్టర్ విజయ్‌కుమార్, సీపీడబ్ల్యూడీ చీఫ్ ఇంజినీర్ ఎం.వెంకటేశ్వరరావు, పలువురు శాస్త్రవేత్తలు, రీసెర్చ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
అతిపెద్ద ఐస్‌బర్గ్ అంతర్ధానం!
వాషింగ్టన్: భూతాపానికి ఫలితం ఈ ఉదాహరణ. అంటార్కిటికాలోని అట్లాంటిక్ తీరప్రాంతంలో ఉన్న రొన్నే మంచు పలక నుంచి విడివడిన ఒక భారీ ఐస్‌బర్గ్ త్వరలోనే కనుమరుగు కానుంది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఈ ఐస్‌బర్గ్ 2021 మేలో విడిపోయాక మరో మూడు ముక్కలైంది. అమెరికాకు చెందిన టెర్రా ఉపగ్రహం ఈ ఐస్బర్గ్లోని అతిపెద్ద భాగం ఫొటో తీసింది. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరం పయనించిన ఈ ఐస్‌బర్గ్ భారీ శకలం ప్రస్తుతం దక్షిణ అమెరికా ఖండంలోని కేప్ హార్న్‌కు, అంటార్కిటికాలోని దక్షిణ షెట్లాండ్ దీవులు, ఎలిఫెంట్ దీవులకు మధ్యలోని డ్రేక్ పాసేజీలో ఉంది. ఎ–76ఎ గా పిలుస్తున్న దీని పొడవు 135 కిలోమీటర్లు కాగా వెడల్పు 26 కిలోమీటర్లు.. లండన్ నగరానికి ఇది రెట్టింపు సైజు అని అమెరికా నేషనల్ ఐస్ సెంటర్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇది తన ఆకారాన్ని కోల్పోలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, భూమధ్య రేఖ వైపు పయనించి అక్కడి సముద్ర జలాల వేడికి త్వరలోనే అంతర్థానం కానుందని అంటున్నారు. ఐస్‌బర్గ్‌లను సర్వసాధారణంగా బలమైన ఆర్కిటిక్ ప్రవాహాలు డ్రేక్ పాసేజ్ గుండా ముందుకు తోసేస్తాయి. అక్కడి నుంచి అవి ఉత్తర దిశగా భూమధ్య రేఖ వైపు పయనించి వేగంగా కరిగిపోతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
-
ట్రాఫిక్ కష్టాలు తీరేలా.. 2023కల్లా ‘కోస్టల్ రోడ్’ పూర్తి..
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ట్రాఫిక్ తిప్పలు త్వరలోనే తీరనున్నాయి. నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కోస్టల్ రోడ్ ప్రాజెక్టు, మెట్రో–2, 3, 4 దశలు, శివ్డీ–నవశేవా సీ–లింకు ప్రాజెక్టులు 2023 వరకు వినియోగంలోకి వస్తాయని రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే విశ్వాసం వ్యక్తం చేశారు. ముంబైలో జీవనాడి అయిన లోకల్ రైళ్లు సహా బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి ప్రధాన కారణం నగరంలో ప్రతీరోజు కొన్ని వందల కొద్దీ కొత్త వాహనాలు రోడ్డుపైకి రావడమే. వీటివల్ల నగరంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటంతో పాటు వాహనాలలో నుంచి వెలువడుతున్న పొగ, ఇతర విష వాయువులు, ధ్వని కాలుష్యం వల్ల వాతావరణం కలుషితం అవుతోంది. దీంతో ముంబైకర్లకు స్వచ్చమైన గాలి, ప్రశాంత వాతావరణం లభించడం లేదు. ఈ నేపథ్యంలో ముంబైకర్లకు ట్రాఫిక్ జామ్ సమస్యల నుంచి విముక్తి కల్పించడంతో పాటు స్వచ్చమైన గాలితో కూడిన ప్రశాంత వాతావరణాన్ని అందించాలన్న ఉద్దేశంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రణాళికలు రచించింది. చదవండి: ('పోల్‌వాల్ట్' కల ఢిల్లీకి తీసుకొచ్చింది.. బతుకుదెరువు కోసం) ఈ క్రమంలోనే బీఎంసీ పరిపాలనా విభాగం కోస్టల్ రోడ్ ప్రాజెక్టు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) మెట్రో–2, 3, 4 దశల ప్రాజెక్టులు, శివ్డీ–నవశేవా సీ–లింకు ప్రాజెక్టును తెరమీదకు తీసుకొచ్చాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ముంబైలో ట్రాఫిక్ జామ్ సమస్య చాలా శాతం వరకు తీరనుంది. ప్రయాణం వేగవంతం అవుతుంది. ప్రస్తుతం రెండు గంటల్లో పూర్తి అవుతున్న ప్రయాణం అప్పుడు అర గంటలోనే ముగుస్తుంది. అలాగే, బీఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోస్టల్ రోడ్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు దాదాపు 45 శాతం పూర్తి కావచ్చాయని మంత్రి ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. ఇక, ప్రిన్సెస్ స్ట్రీట్ నుంచి వర్లీ సీ–లింకు వరకు 10.58 కిలోమీటర్ల పొడవైన మార్గం ఉంది. ఇందులో నాలుగు లేన్లు (2+2) ఉంటాయి. ఈ మార్గం కొన్ని చోట్ల నేలపై నుంచి, మరికొన్ని చోట్ల భూగర్భం లోపలి నుంచి ఉంటుంది. దీనికి సంబంధించిన సొరంగ మార్గాన్ని తవ్వేందుకు 2,300 టన్నుల భారీ టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. మలబార్ హిల్ వద్ద భూగర్భం లోపల తవ్వకం పనులు ఈ ఏడాది జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి కూడా 2023 వరకు పూర్తికానున్నాయి. ఈ పనుల కోసం బీఎంసీ ఏకంగా రూ. 12,700 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇదే తరహాలో మెట్రో వివిధ ప్రాజెక్టు పనులు, శివ్డీ–నవశేవా సీ–లింకు పనులు కూడా పూర్తవుతాయని ఆదిత్య ఠాక్రే విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శివ్డీ–నవశేవా సీ–లింకును వర్లీ–బాంద్రా సీ–లింకుతో అనుసంధానం చేయనున్నారు. దీంతో వర్లీలో సీ–లింకు వంతెన పైకెక్కిన వాహనాలు శివ్డీ–నవశేవా మీదుగా నేరుగా నవీ ముంబైలో బయటకు వస్తాయి. ప్రస్తుతం ట్రాఫిక్ ఉన్న సమయంలో వర్లీ నుంచి నవీ ముంబై చేరుకోవాలంటే కనీసం రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది. కానీ, సీ–లింకు మీదుగా వెళితే సుమారు 30–45 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. దీంతో వాహనదారుల విలువైన సమయంతో పాటు వాహనాల ఇంధనం కూడా దాదాపు 50–70 శాతం వరకు ఆదా అవుతుంది. ధ్వని, వాయు కాలుష్యం కూడా సగానికి పైగా తగ్గిపోనుంది. ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో ముంబైకి ఎంతగానో దోహదపడుతాయని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు. -
కరిగిపోతూ.. కడలిలో కలసిపోతూ..
పిఠాపురం: జవాద్ తుపాను ప్రభావంతో కొత్తపల్లి మండల తీర ప్రాంతంలో కడలి కల్లోలం సృష్టించింది. ఎక్కడ చూసినా సుమారు 5 మీటర్ల మేర ముందుకు వచ్చిన సముద్రం తీరప్రాంతాన్ని కబళించింది. పొన్నాడ శివారు కోనపాపపేట తీవ్రంగా కోతకు గురైంది. మత్స్యకారుల ఇళ్లు సుమారు 12 ధ్వంసమయ్యాయి. పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. మరికొన్ని ఇళ్లు ఏ క్షణంలోనైనా సముద్ర కోతకు గురయ్యే ప్రమాదకర పరిస్థితికి చేరాయి. కోతతో కోనపాపపేటలో సముద్రంలో కలిసిపోతున్న కొబ్బరి చెట్లు విలువైన కొబ్బరి చెట్లు కడలిలో కలసిపోతున్నాయి. కోతకు గురవుతున్న తమ ఇళ్లలోని సామగ్రిని ఇతర ప్రాంతాలకు తరలించుకునే పనిలో కొందరు మత్స్యకారులు నిమగ్నమయ్యారు. కోతకు గురైన ప్రాంతాలను కొత్తపల్లి ఎంపీపీ కారే సుధ, మత్స్యకార నాయకుడు కారే శ్రీనివాసరావు తదితరులు ఆదివారం పరిశీలించారు. మత్స్యకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉప్పాడ తీర ప్రాంతం రెండో రోజు కూడా కోతకు గురైంది. పలు ఇళ్లతో పాటు బీచ్ రోడ్డు సుమారు కిలోమీటరు మేర ధ్వంసమైంది. శుక్రవారం నిలిపివేసిన రాకపోకలను ఆదివారం పునరుద్ధరించారు. కెరటాల ఉధృతి కొనసాగుతుండడంతో బీచ్ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కోతకు గురైన ఇంట్లో భయాందోళనల నడుమ మత్స్యకార కుటుంబం నేల మాయమై.. బావి మిగిలిందిలా.. కోనపాపపేటలో సముద్ర కోత తీవ్రతకు ఈ బావి సాక్ష్యంగా నిలుస్తోంది. పక్కనే సముద్రం ఉన్నా మంచినీటిని ఇచ్చి ప్రజల అవసరాలను తీర్చిన ఈ నేల బావి.. తీవ్రంగా అలల కోతకు గురైంది. ఫలితంగా చుట్టూ ఉన్న నేల కొట్టుకుపోగా బావి మట్టితో పూడుకుపోయి ఇలా మిగిలింది. -
నీట మునిగిన గంగా తీర ప్రాంతాలు
-
సముద్రంలో గల్లంతైన యువకుడి మృతదేహం గుర్తింపు
సాక్షి, ఒంగోలు : చీరాల రామాపురం బీచ్‌లో రెండు రోజుల క్రితం గల్లంతైన కార్తీక్‌రెడ్డి మృతదేహం గురువారం చీరాల వాడరేవుకు కొద్ది దూరంలోని విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. మృతదేహం రెండు రోజుల పాటు సముద్రపు నీటిలో ఉండటంతో చీకిపోయింది. కార్తీక్‌రెడ్డి శరీరాన్ని చేపలు కొరుక్కు తినడంతో శరీరంపై అక్కడక్కడా గాయాలు ఏర్పడ్డాయి పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ టీచర్స్ కాలనీకి చెందిన చల్లమల్లి వెంకట నారాయణరెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి (28) ఓ హోటల్లో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో కార్తీక్‌రెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి చీరాల రామాపురం బీచ్‌కు సరదాగా గడిపేందుకు వచ్చాడు. సోమవారం రాత్రి వారంతా కలిసి హైదరాబాద్ నుంచి బయల్దేరి 18న ఉదయం చీరాల రామాపురం బీచ్‌కు చేరుకున్నారు. అంతా కలిసి సరదాగా సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి కార్తీక్‌రెడ్డి గల్లంతయ్యాడు. ఆందోళన చెందిన అతని స్నేహితులు సమీపంలోని మత్స్యకారులకు తెలుపగా వారు సముద్రంలో వెతికారు. ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తండ్రి వెంకట నారాయణరెడ్డి వచ్చి ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కార్తీక్‌రెడ్డి ఆచూకీ కోసం సముద్ర తీరంలో గాలిస్తుండగా విజయలక్ష్మీపురం సముద్ర తీరానికి కార్తీక్‌రెడ్డి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ములుగు జిల్లా కోస్టల్ కంపేనీలో అగ్ని ప్రమాదం
-
‘ఫణి’ దూసుకొస్తోంది
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ప్రస్తుత సీజనులో తొలిసారిగా హిందూ మహా సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. కొద్ది గంటల్లోనే అది తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఈ నేపథ్యంలో తీవ్ర అల్పపీడనం శుక్రవారం నాటికి దక్షిణ బంగాళా ఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం శనివారం నాటికి తుపానుగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు ఐఎండీ విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాలు గురువారం రాత్రి బులెటిన్ విడుదల చేశాయి. తుపానుగా మారిన తర్వాత 72 గంటలు శ్రీలంక తూర్పు తీర ప్రాంతం వెంబడి వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్రల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. తొలుత ఈ తుపాను తమిళనాడు వద్ద తీరం దాటవచ్చని భావించింది. మారిన పరిస్థితులనేపథ్యంలో ఇది శ్రీలంక తూర్పు తీరం వెంబడి వాయవ్య దిశగా పయనించి దక్షిణ కోస్తాంధ్ర–ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈదురు గాలులు.. భారీ వర్షాలు తుపాను ప్రభావం ఈ నెల 28వ తేదీ నుంచి స్వల్పంగా మొదలై క్రమంగా పెరగనుంది. 28వ తేదీ నుంచి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో ఈదురు గాలులు ప్రారంభమై ఉధృతమవుతాయి. 28వ తేదీన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. 29వ తేదీన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. భారీ ఈదురుగాలులూ వీస్తాయి. అదే సమయంలో అక్కడక్కడా పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 30వ తేదీన తుపాను తీరం దాటే నాటికి తీవ్రత మరింత పెరిగి, పెనుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు, పాండిచ్చేరి తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు తుపాను ప్రభావం వల్ల ఈ నెల 29వ తేదీన తమిళనాడు, పాండిచ్చేరి తీర ప్రాంతాల్లోని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ‘‘30వ తేదీన పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మే 1వ తేదీన కూడా తమిళనాడు, పాండిచ్చేరిలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 29వ తేదీన దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. 30వ తేదీన కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి’’ అని ఐఎండీ ప్రకటించింది. మత్స్యకారులకు హెచ్చరిక వాయుగుండం, తుపాను నేపథ్యంలో బలమైన గాలులు వీస్తూ సముద్రం అలజడిగా మారనున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 30వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులకు సూచించింది. తుపానుకు ఫణిగా నామకరణం ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘ఫణి’ పేరును ఖరారు చేయనున్నారు. దీనికి ముందు 2018 డిసెంబర్ మూడో వారంలో తుపాను ఏర్పడింది. ఆ తుపానుకు పెథాయ్ పేరును థాయ్‌లాండ్ సూచించింది. ఆ తర్వాత క్రమంలో బంగ్లాదేశ్ సూచించిన ‘ఫణి’ని ప్రకటించనున్నారు. నిబంధనల ప్రకారం తుపానుగా మారాకే పేరు పెడతారు. ఆ లెక్కన ఇప్పుడు ఏర్పడబోయే తుపానుకు ‘ఫణి’గా శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. కోస్తాంధ్రలో జల్లులు.. సీమలో ఎండలు ‘‘మరఠ్వాడా నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ ప్రస్తుతం ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇంటీరియర్ ఒడిశాను, దానిని ఆనుకుని ఉన్న చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజులు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుంది’’ అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర కంటే రాయలసీమలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. అక్కడ సాధారణం కంటే 2–4 డిగ్రీలు, కోస్తాంధ్రలో 1–2 డిగ్రీలు ఎక్కువగా రికార్డు కానున్నాయి. గురువారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
సాగర తీరం
వెల్లాయి అప్పన్ గుడిశెలోంచి కాలు బయటకు పెట్టాడో లేదో ఏడుపుల శబ్దం గుడిశె పైకప్పును తాకింది. ఒక్క ఆ గుడిశె నించే కాదు పక్కనే ఉన్న ‘అమ్మి’ని గుడిశెలో నించీ, ఆ వెనక వరసగా ఉన్న గుడిశెల్లోంచీ ఏడుపులు ఊరంతా వినపడ్డాయి. అప్పన్ కన్నూర్‌కు బయల్దేరాడు. తమ దగ్గర డబ్బు ఉండి ఉంటే ఊళ్లోవాళ్లంతా అప్పన్ వెంట వెళ్లి ఉండేవారే. ఊరంతటికీ బదులు వెల్లాయి అప్పన్ తానొక్కడే ప్రయాణం అయ్యాడు. చిట్టచివరి గుడిశె దాటి అప్పన్ కొండమీద నడవసాగాడు. వెనుక నించి వినవస్తున్న ఏడుపుల శబ్దం క్రమక్రమంగా వినిపించకుండా పోయింది. కొండ దిగి గడ్డి పొలాల మధ్య కాలిబాట వెంట నడక సాగించాడు అప్పన్. అప్పన్ భుజం మీద అన్నం మూట వేలాడుతున్నది. పలుచటి గుడ్డలో మూటకట్టిన అన్నం అప్పన్ భుజాన్ని తడుపుతున్నది. అప్పన్ భార్య అన్నం వండుతున్నంత సేపూ ఏడుస్తూనే వుంది. కన్నీళ్లు ఆమె అన్నంలో కలిపిన పుల్లటి పెరుగులో జారిపడుంటయి. రైల్వేస్టేషన్ నాలుగు మైళ్ల దూరాన ఉన్నది. ఆ దారంట కొంత దూరం నడిచాక ఎదురుగ్గా వస్తూ కనిపించాడు కుట్టిహాసన్. ‘వెల్లాయ్’ అంటూ ఆప్యాయంగా, గౌరవంగా పిలిచాడు కుట్టిహాసన్. ‘కుట్టిహాసన్’ అన్నాడు వెల్లాయి అప్పన్. అంతే! రెండే రెండు మాటలు. రెండు పేర్లు. కానీ అదొక సుదీర్ఘ సంభాషణ. అందులో దుఃఖమూ ఓదార్పూ ఉన్నవి! కుట్టిహాసన్ని దాటి ముందుకు నడిచాడు అప్పన్. ఉతకడానికి బట్టల మూటతో కనిపించింది నీలి. ఆమె గౌరవంగా పక్కకు అడుగువేసి నిలబడి అన్నది. ‘వెల్లాయి అప్పన్’ అని. ‘నీలీ’ అన్నాడు అప్పన్. అంతే! రెండే రెండు మాటలు. కానీ వాళ్ల మధ్య అదొక సుదీర్ఘ సంభాషణే. వెల్లాయి అప్పన్ ముందుకి సాగాడు. కాలిబాట ఓ బురద రోడ్డుమీదకి చేర్చింది. మైలురాయి కోసం చూస్తూ అలా నడుస్తూ రాళ్లూ రప్పలూ దాటి నదిలోకి దిగాడు. నదికి ఆ వైపున ఉన్నది రైల్వేస్టేషన్. అప్పన్ మొదట ఇసుకలో తర్వాత మొల లోతు నీళ్లలో నడిచాడు. మెరిసే వెండి రంగు చిరు చేపలు అప్పన్ కాలి పిక్కలని తాకుతూ ఈదుతూ పోసాగాయి. నది మధ్యకు చేరిన అప్పన్‌కి చుట్టూ ఉన్న నీళ్లను చూస్తుంటే తండ్రి తనకు ఈత నేర్పడం, తండ్రి పోయాక శవానికి తను స్నానం చేయించడం, కర్మకాండ జరిపించడం గుర్తొచ్చేయి. నది ఒడ్డుకి చేరి జ్ఞాపకాలతో బరువెక్కిన గుండెతో ముందుకు నడిచాడు అప్పన్. స్టేషన్‌కి చేరుకున్నాక జాగ్రత్తగా పైపంచెలో ఓ మూల గట్టిగా కట్టిన ముడి విప్పి టికెట్ డబ్బు తీసి యిస్తూ వెల్లాయి అప్పన్ ‘కన్నూరు’ అన్నాడు. కిటికీ వెనుక ఉన్న టికెట్లిచ్చేవాడు. టికెట్ బయటకు విసిరేశాడు. అస్తమిస్తున్న సూర్యుడ్ని చూస్తూ రైలుకోసం ఓపిగ్గా నిరీక్షిస్తూ బెంచిమీద కూర్చున్నాడు అప్పన్. దూరంగా కొబ్బరి తోటలో చీకట్లు ముసిరాయి. పక్షులు గూళ్లవైపు రెక్కలు ఎగరేస్తూ వెళ్లాయి. అప్పన్‌కి కొడుకు గుర్తుకు వచ్చాడు. వాడు ఎగిరే పక్షులవైపు ఎంత ఆశ్చర్యంగా చూసేవాడో గుర్తొచ్చింది. అప్పన్‌కి తను తన తండ్రి చిటికెన వేలు పట్టుకుని పొలాల వెంట నడవడమూ గుర్తుకొచ్చింది.వెల్లాయి అప్పన్‌కి అన్నం మూట విప్పాలని అనిపించలేదు. అన్నం కట్టిన పలుచటి గుడ్డమీద చేయి ఆనించి, అలాగే నిద్రపోయాడు. నిద్రలో కల వచ్చింది. కలలో కన్దున్ని కనిపించి ‘కొడుకా!’ అని బిగ్గరగా అరిచాడు. రైలు శబ్దం విని ఉలిక్కిపడి లేచి పంచె మూలన కట్టిన టికెట్టుని తడిమి చూసుకుని రైలుపెట్టె వైపు పరుగెత్తాడు. ఫస్ట్‌క్లాస్ ఎక్కొద్దంటే వెనక్కు పరుగెత్తాడు. రిజర్వు అంటే ఇంకా వెనక్కి పరుగెత్తాడు. ఇంకా... ఇంకా వెనక్కి పరుగెత్తాడు. వెల్లాయి అప్పన్ ఎక్కిన బోగీలో నిలబడ్డానికి కూడా చోటు లేకపోయింది. నిలబడాల్సిందే. ఈ రాత్రంతా నిలబడే వుంటా. ఈ రాత్రంతా నా కొడుకూ మేలుకునే ఉంటాడు అనుకున్నాడు. చాలాకాలం కిందట వెల్లాయి అప్పన్ ప్రయాణం చేశాడు. కానీ అది పగలు... ఇది రాత్రి... చీకటి సొరంగాల మధ్య పరుగెత్తింది రైలు.వెల్లాయి అప్పన్ కన్నూరు చేరేటప్పటికి పూర్తిగా తెల్లవారలేదు. భుజమ్మీద అన్నపు మూట తడితడిగా వేలాడుతున్నది. స్టేషన్ బయట ఉన్న జట్కా బళ్లవాళ్లు అప్పన్‌ని పట్టించుకోలేదు. అప్పన్ వాళ్లని జైలుకి దారి ఎటో చెప్పమని అడిగాడు. ‘పొద్దున్నే వీడెవడయ్యా జైలుకి దారి అడుగుతున్నాడు’ అంటూ నవ్వాడు ఒకడు. మరొకడు పెద్దాయనా ‘నువ్వెళ్లాల్సిన పనిలేదు. దొంగతనం చెయ్యి. వాళ్లే తీసుకెళ్తారు’ అన్నాడు. చివరికి ఒకడు దయ తలచి దారి చెప్పాడు. ఆకాశం తొలి కిరణాలతో వెలుగుతుంటే, కాకుల గుంపు కావు... కావు మంటుంటే జైలువైపు నడిచాడు అప్పన్. జైలు గేటు దగ్గర గార్డు అడిగాడు. ‘ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చావు ముసలాయనా?’ అని. అప్పన్ చిన్నపిల్లవాడిలా అడుగు వెనక్కి వేసి పైపంచె ముడి విప్పి పసుపు రంగు కాగితం ముక్క అందిస్తూ ‘నా కొడుకు ఇక్కడ ఉన్నాడు’ అన్నాడు. ‘అయితే ఆఫీసు తెరిచేదాకా ఆగు’ అని నిర్లక్ష్యంగా అన్నవాడు... ఆ కాగితం పరీక్షగా చూశాక మెత్తబడ్డాడు. ‘రేపు... రేపే కదా...’ అన్నాడు జాలిపడుతూ. ‘నాకు తెలియదు. అందులో రాసుందట కదా.’ ‘అవును. రేపు ఉదయం అయిదింటికి.’ రాత్రంతా నిద్రపోకుండా ఉండి కొడుకు ఇంకా నిద్రలేచి ఉండడు. ఏం తింటాడు అనుకుంటున్న అప్పన్ చేయి అన్నం మూటను తాకింది. కొడుకా ఈ అన్నం మీ అమ్మ నాకోసం కట్టింది. దీన్ని ఇన్ని గంటలూ విప్పకుండా తీసుకువచ్చాను. ఇది తప్ప ఇంకేమీ ఇవ్వలేను అనుకున్నాడు. ఎండ క్రమంగా పెరిగింది. మూటలో అన్నం పాచిపోయింది. జైలు కార్యాలయం తెరుచుకుంది. టేబిళ్ల వెనక కూచున్నవాళ్లు పసుపుపచ్చ కాగితాలు తనిఖీ చేస్తున్నారు. బెంచీమీద ఎంతసేపు కూర్చున్నాడో తెలియలేదు అప్పన్‌కి. ఒక గార్డు వచ్చి అప్పన్‌ని జైలు లోపలికి తీసుకుపోయాడు. అక్కడంతా చల్లగా, తేమగా ఉంది. తాళం వేసున్న ఓ గదిలో ఊచల వెనుక ఉన్నాడు కందున్ని. అతను తండ్రివైపు ఎవరో కొత్తమనిషిని చూసినట్టు చూశాడు. అతని మెదడు ఇప్పుడు ఓదార్పును కూడా స్వీకరించే స్థితిలో లేదు. గార్డు తలుపు తెరిచి అప్పన్‌ని లోపలికి పంపించాడు. కొడుకుని కౌగిలించుకుందామని అప్పన్ ముందుకు వంగాడు. అప్పుడు కందున్ని వినేవాళ్ల చెవులు చీల్చివేసే కేక వేశాడు. అప్పన్ ‘కొడుకా’ అన్నాడు. కందున్ని ‘నాయనా’ అన్నాడు. రెండు మాటలే! ఈ రెండు మాటలతో ఆ తండ్రీకొడుకులు ఒకరి దుఃఖాన్ని ఒకరు పంచుకున్నారు. ‘కందున్నీ ఏం చేశావు?’ ‘నాకేమీ గుర్తులేదు.’ ‘చంపావా?’ ‘నాకేమీ గుర్తులేదు.’ ‘పోనీ. నువ్వు ఏదీ గుర్తు పెట్టుకోనవసరం లేదులే.’ కన్దున్ని మళ్లీ చెవులు చిల్లులు పడే కేకవేశాడు. ‘నాయనా... నన్ను ఉరి తీయనీయకు.’ పెద్దాయనా టైమయింది అన్నాడు గార్డు. అప్పన్ బయటకు వచ్చాడు. తలుపు మూసుకుంది. చిట్టచివరిసారి వెనక్కి తిరిగి చూశాడు అప్పన్. ఏదో ఓ ప్రయాణంలో తారసపడ్డ అపరిచితుడిలా కనిపించాడు కొడుకు. పరుగెడుతున్న రైలు కిటికీ ఊచల్లోంచి బయటకు చూస్తున్నవాడిలా ఉన్నాడు కొడుకు. వెల్లాయి అప్పన్ రోజంతా జైలు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. సూర్యుడు పడమర వైపు నించి కిందకి దిగి పోసాగాడు. కొడుకు ఈ రాత్రి నిద్రపోతాడా అనుకున్నాడు అప్పన్. రాత్రి అయింది. మళ్లీ ఉదయం వైపు కాలం కదిలింది. గోడల లోపల కందున్ని ఇంకా బతికే ఉన్నాడు.తెల్లవారుతుంటే గార్డుల ఈలలు వినిపించాయి. ఆ శబ్దం మరణ సంకేతం అని అప్పన్‌కి తెలియలేదు. కానీ రైతుగా కచ్చితమైన ‘టైమ్’ని గుర్తుపట్టే జ్ఞానం ఉంది అప్పన్‌కి. మంత్రసాని దగ్గర్నించి పసిపాపను అందుకున్నట్టుగా గార్డుల దగ్గర్నుంచి కొడుకు శవాన్ని అందుకున్నాడు అప్పన్.‘పెద్దాయనా శవానికి సంస్కారం చేస్తావా?’ అన్నాడో గార్డు.‘నాకు తెలియదు.’‘శవాన్ని తీసుకుపోతావా?’‘అయ్యా! నా దగ్గర పైసా లేదు.’ఊరవతల, నిర్జన ప్రదేశంలో, రాబందులు ఆకాశంలో గిరికీలు కొడుతున్న చోట కొడుకు శవాన్ని బండిలో లాక్కువచ్చిన వాళ్లు గొయ్యి తవ్వి శవాన్ని అందులో ఉంచి మట్టి కప్పబోతున్నప్పుడు అప్పన్ తన అరచేతిని కొడుకు చల్లటి నుదుటి మీద ఉంచి దీవించాడు.వాళ్ల పారతో ఆఖరుసారి మట్టి పోసి గొయ్యిని పూడ్చి వేశాక సముద్ర తీరానికి వచ్చాడు అప్పన్. అతను ఇంతకుముందు సముద్రాన్ని చూడలేదు. అతని చేతులకి చల్లగా తగిలిందది. అప్పుడు. తనకు ప్రయాణంలో తినడానికి భార్య కట్టిచ్చిన అన్నపు మూట. అప్పన్ మూట విప్పాడు. అన్నాన్ని ఒడ్డున ఉన్న ఇసుక మీద చల్లాడు.సూర్యుడి వెలుగులో మెరుస్తున్న అన్నాన్ని చూసి తమకు నైవేద్యంగా పెట్టిన అన్నాన్ని తినడానికి వచ్చిన, చనిపోయినవాళ్ల ఆత్మల్లా కాకులు ఒకదాని వెంట ఒకటి కిందకి వాలాయి. - మలయాళ మూలం: ఒ.వి. విజయన్ - అనువాదం: చింతపట్ల సుదర్శన్ -
ఏపీలో భారీ వర్షాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్ర జిల్లాల్లో శనివారం భారీగా వర్షం కురిసింది. ప్రాంతాల వారీగా చూసినట్లయితే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం, తూర్పుగోదావరి తణుకులో 6 సెంటీమీటర్లు, విజయనగరం జిల్లా సీతానగరంలో 8, బొబ్బిలిలో 7, ఎస్.కోటలో 5, గుంటూరు జిల్లా మాచర్లలో 5, కర్నూలు జిల్లా శ్రీశైలంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
కోస్తాంధ్రలో కొన్నిచోట్ల వర్షాలు
విశాఖపట్నం: ఈనెల 12, 13 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. కోస్తాంధ్రంలో కొన్ని చోట్ల చెదురు ముదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. -
విశాఖలో వర్షాలు