ఈనెల 12, 13 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది.
విశాఖపట్నం: ఈనెల 12, 13 తేదీల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. కోస్తాంధ్రంలో కొన్ని చోట్ల చెదురు ముదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది.