Coconut cultivation
-
సహకరిస్తే సాగు.. విస్మరిస్తే ఉద్యమం
సాక్షి, అమలాపురం: ‘కొబ్బరి మార్కెటింగ్‌లో మాకు ఎదురవుతున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తే సాగుబాట పడతాం. కాదని వాటిని విస్మరిస్తే ఉద్యమ బాట పడతాం’ అని అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సులో రైతులు తేలి్చచెప్పారు. భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో అమలాపురంలో రెండు రోజుల అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు రెండవ రోజైన బుధవారం పలు తీర్మానాలు ఆమోదించారు. సమస్యల పరిష్కారం కోసం కొబ్బరి సాగు చేసే రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుస్తామని సభలో వక్తలు ప్రకటించారు. సదస్సు అధ్యక్షుడు, బీకేఎస్ ఆలిండియా కోకోనట్ కనీ్వనర్ సుందరరాజన్ మాట్లాడుతూ.. కొబ్బరి సాగులో సమస్యలను తెలుసుకునేందుకు.. వాటి పరిష్కారాల కోసం జాతీయ స్థాయిలో కొబ్బరి రైతుల ఫోరం ఏర్పాటు చేశామని, దీనిలో భాగంగా ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లో సదస్సులు పూర్తి చేశామని తెలిపారు. బీకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ మిశ్రా మాట్లాడుతూ.. దేశంలో కొబ్బరి సాగు చేసే ఎనిమిది రాష్ట్రాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఆ రాష్ట్రాల రైతు ప్రతినిధులతో చర్చించాక అజెండా రూపొందించి ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని చెప్పారు. బీకేఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి మాట్లాడుతూ.. మన సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తే సరే, లేకుంటే మనమంతా సంఘటితమై ఉద్యమం చేయాల్సి ఉంటుందన్నారు. కోనసీమ రైతులు 2011లో చేసిన సాగుసమ్మె ఉద్యమం వల్ల రూ. లక్ష వరకు వడ్డీ లేని రుణం, రూ. మూడు లక్షల వరకు పావలా వడ్డీ రుణం, సమీకృత వ్యవసాయానికి నిధులు పొందిన విషయాన్ని రైతులు గుర్తించుకోవాలని తెలిపారు. దక్షిణ భారత రైతులు ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.కొబ్బరి సమస్యలకు ఏఐ పరిష్కారం..కొబ్బరి బోడకాయను కేజీ రూ. 45 చేసి కొనుగోలు చేయాలని, ఎఫ్‌పీవోలు, సహకార సంఘాల ద్వారా కొబ్బరి కొనుగోలు చేయించాలని, యాంత్రీకరణకు రాయితీలు ఇవ్వడంతో పాటు కొబ్బరి దింపు సమస్య పరిష్కారానికి ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ)లో ప్రయోగాలకు ఐఐటీ, ఇస్రో వంటి సంస్థల సహకారం తీసుకోవడం వంటి తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఐక్యరాజ్య సమితి 2026ను కొబ్బరి సంవత్సరంగా గుర్తించాలని, ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేయాలనే తీర్మానాన్ని సైతం రైతులు ఆమోదించారు. సదస్సుకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, విశాఖపట్నం జిల్లాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కొబ్బరి ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ పలువురిని ఆకట్టుకున్నాయి. -
కొబ్బరి.. దయచూపాలి మరి
సాక్షి, అమలాపురం: ప్రపంచంలోనే లాంగెస్ట్ అండ్ టాలెస్ట్ క్రాప్‌గా గుర్తింపు పొందిన కొబ్బరి సాగులో రైతులు వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారానికి రైతులు, రైతు సంఘాల నాయకులు చేస్తున్న సూచనలను కేంద్రానికి, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు నివేదిస్తామని జాతీయ కొబ్బరి సదస్సులో వక్తలు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని జనహిత భవనంలో భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరిగే అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆలిండియా కోకోనట్ కన్వినర్ సుందరరాజన్ అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల కొబ్బరి రైతుల సమస్యలు, పరిష్కార సూచనలపై చర్చాగోíÙ్ఠ జరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొబ్బరి సాగు, యాజమాన్య పద్ధతులు, కొబ్బరికాయ సేకరణ, రవాణా, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ అవకాశాల్లో ఎదురవుతున్న సమస్యలను, వాటికి పరిష్కారాలను సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీడీబీ), కాయర్ బోర్డు, పరిశ్రమల సంస్థలు, ఏజెన్సీల సహాయ నిరాకరణపై సుదీర్ఘ చర్చ జరిగింది. సమావేశానంతరం పలు తీర్మానాలు రూపొందించారు. వీటిని బుధవారం అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో జరిగే రెండోరోజు సదస్సులో మరోసారి చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించనున్నట్లు బీకేఎస్ ప్రతినిధులు తెలిపారు.తీర్మానాలు ఇలా..» ఎండు కొబ్బరితోపాటు కొబ్బరి బోడకాయ (వలిచిన కాయ)ను కిలో రూ.45 ధర నిర్ణయించి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలి.. » ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్)ల ద్వారా కూడా కొబ్బరి కొనుగోలు చేయాలనే ప్రధాన తీర్మానాలతోపాటు దింపు యంత్రాలను రాయితీలపై అందించాలి.. » రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓ)ల ఏర్పాటుకు సహకారం, మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలి.. » వాతావరణ, దిగుబడి ఆధారిత బీమా సౌకర్యం, అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను తక్కువ ధరకు అందించాలి.. » కొబ్బరి చెట్టును ఔషధ గుణమైన చెట్టుగా గుర్తించాలి.. » కొబ్బరిని పరిశ్రమగా గుర్తించడంతోపాటు రాయితీల కల్పన, పాతచెట్ల తొలగింపు పథకం ఆర్‌అండ్‌ఆర్‌కు అందించే ప్రోత్సాహాన్ని చెట్టుకు రూ.వెయ్యి నుంచి రూ.2,500కు పెంచారు. -
‘కొబ్బరి’లో ‘సుగంధా’ల గుబాళింపు!.. అంతర పంటలతో లాభాలు
ఉద్యాన తోటల్లో సైతం ఏదో ఒకే పంటపై ఆధారపడకుండా.. అంతర పంటల సాగు చేస్తేనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటవుతుంది. కొబ్బరి రైతుల ΄ాలిట అంతరపంటల సేద్యం కల్పతరువుగా మారింది. దక్షిణ కోస్తా ఆంధ్రా జిల్లాల్లో వాతావరణం కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50 శాతానికిపైగా పాత ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. కొబ్బరి తోటల్లో ఉండే పాక్షిక నీడ వల్ల చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణం సుగంధ ద్రవ్య పంటల (స్పైసెస్)కు ఎంతో అనువైనది. ముదురు కొబ్బరి తోటల్లో అనేక సుగంధ ద్రవ్య పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ, నేరుగా మార్కెటింగ్ చేసుకుంటున్న రైతుల విజయగాథలెన్నో. విశేష ప్రగతి సాధిస్తున్న అటువంటి ఇద్దరు ప్రకృతి వ్యవసాయదారులు ఉప్పలపాటి చక్రపాణి, సుసంపన్న అనుభవాలను తెలుసుకుందాం.. గత ఐదారేళ్లుగా కొబ్బరిలో అంతర పంటలు సాగు చేస్తూ.. వీటి ద్వారా ప్రధాన పంటకు తగ్గకుండా అదనపు ఆదాయం పొందవచ్చని రైతు శాస్త్రవేత్త ఉప్పలపాటి చక్రపాణి రుజువు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్క్ష్మీపురం గ్రామానికి చెందిన చక్రపాణి గత 13 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కొబ్బరి తోటలో వక్క, మిరియాలు, పసుపు అల్లం పండిస్తూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. కొబ్బరి తోటలో ఆరేళ్ల క్రితం నాటిన 2,500 వక్క చెట్లు చక్కని ఫలసాయాన్నిస్తున్నాయి. ఈ ఏడాది 700 వక్క చెట్లకు కాపు వచ్చింది. 2 టన్నుల ఎండు వక్కకాయల దిగుబడి ద్వారా రూ. 3 లక్షల 80 వేలు ఆదాయం వచ్చిందని చక్రపాణి వివరించారు. 300 కొబ్బరి చెట్లకు ఐదారేళ్ల క్రితం మిరియాల తీగలను పాకించారు. వీటిద్వారా 500 కిలోల ఎండు మిరియాల దిగుబడి వచ్చింది. కేజీ రూ.600 చొప్పున రిటైల్‌గా అమ్ముతున్నారు. గానుగ నూనెతో ఆరోగ్యం కొబ్బరి చెట్ల మధ్య వక్క చెట్లు పెంచి.. కొబ్బరి చెట్లకు అనేక ఏళ్ల క్రితమే మిరియం మొక్కల్ని పాకించడంతో చక్రపాణి కొబ్బరి తోట వర్టికల్ గ్రీన్ హెవెన్‌గా మారిపోయింది. కొబ్బరి చెట్లకు మిరియం మొక్కలు చుట్టుకొని ఉంటాయి కాబట్టి, మనుషులను ఎక్కించి కొబ్బరి కాయలు దింపే పద్ధతికి స్వస్తి చెప్పారు. కాయల్లో నీరు ఇంకిన తర్వాత వాటికవే రాలుతున్నాయి. రాలిన కాయలను అమ్మకుండా.. సోలార్ డ్రయ్యర్లో పూర్తిగా ఎండబెట్టి కురిడీలు తీస్తున్నారు. కురిడీలతో గానుగల ద్వారా సేంద్రియ కొబ్బరి నూనె తీసి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. రెండేళ్లుగా తాము ఇంట్లో వంటలకు తమ సేంద్రియ కొబ్బరి నూనెనే వాడుతున్నామని, చాలా ఆరోగ్య సమస్యలు తీరటం గమనించామని చక్రపాణి సంతోషంగా చెప్పారు. పసుపు ఫ్లేక్స్ కొబ్బరి తోటలో వక్క, మిరియాలతో పాటు రెండేళ్లుగా అటవీ రకం పసుపును కూడా సాగు చేస్తున్నారు చక్రపాణి. ఈ రకం పసుపు వాసన, రంగు చాలా బాగుంది. పచ్చి పసుపు కొమ్ములను పల్చటి ముక్కలు చేసి, సోలార్ డ్రయ్యర్ లో ఎండబెట్టి, ఆ ఫ్లేక్స్‌ను అమ్ముతున్నారు. వాటి వాసన, రంగు, రుచి అద్భుతంగా ఉన్నాయని వాడిన వారు చెబుతున్నారన్నారు. సిలోన్ దాల్చిన చెక్క బెటర్ కొబ్బరిలో వక్క వేయడంతో పైకి తోట వత్తుగా కనిపించినా నేలపైన అక్కడక్కడా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీల్లో గత ఏడాది నుంచి అటవీ పసుపుతో పాటు అల్లం, సిలోన్ దాల్చిన చెక్క, నట్మగ్లను సాగు చేస్తున్నామని చక్రపాణి తెలిపారు. సాధారణంగా మనం ఇళ్లలో వాడే దాల్చిన చెక్క విదేశాల నుంచి దిగుమతయ్యే సాధారణ రకం. సిలోన్ దాల్చిన చక్క రకం దీనికన్నా మెరుగైనది. ఇది పల్చగా ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కోస్తా ఆంధ్రలో బాగా పండుతోందని చక్రపాణి వివ రించారు. కొబ్బరి, ΄ామాయిల్ తోటల్లో అంతర పంటల సాగు ద్వారా అధికాదాయం పొందేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పెదవేగి మండల ఉద్యాన అధికారి ఎం. రత్నమాల తెలి΄ారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. – కొత్తపల్లి వినోద్‌కుమార్, సాక్షి, పెదవేగి, ఏలూరు జిల్లా కేరళ మాదిరిగా ఇక్కడా పండిస్తున్నా! రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లోనే పంటలు పండించటం నేర్చుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో అప్లాండ్ ఏరియాలో ఉద్యాన తోటలకు అనువైన వాతావరణం ఉంది. ఇవి సారవంతమైన భూములు. ఇక్కడి నీరు కూడా మంచిది. నాలుగైదేళ్లుగా భూగర్భజలాలు పెరగడంతో నీటి సమస్య లేదు. కొబ్బరిలో అంతర పంటలకు అనుకూలంగా ఉండేలా ముందే తగినంత దూరంలో మొక్కలు నాటుకొని సాగు చేసుకోవచ్చు. అంతర పంటలద్వారా సూక్ష్మ వాతావరణం సృష్టించుకొని కేరళలో మాదిరిగా సుగంధ ద్రవ్య పంటలు సాగు చేసుకోవచ్చు. కేరళలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే మన దగ్గర 45 డిగ్రీల వరకు వస్తుంది. కొబ్బరిలో అంతర పంటల వల్ల బయటతో పోల్చితే పది డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఎండ, గాలిలో తేమ సమపాళ్లలో చెట్లకు అందుతున్నందున కేరళలో మాదిరిగా మిరియాలు, దాల్చిన చెక్క ఇక్కడ మా తోటలోనూ పండుతున్నాయి. – ఉప్పలపాటి చక్రపాణి (94401 88336), లక్ష్మీపురం, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా -
కొబ్బరికి అ‘ధనం’ కోకో..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతరపంటగా మెట్ట ప్రాంతంలో ప్రారంభమైన కోకో సాగు ప్రస్థానం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాన పంటగా మారింది. ఆయిల్‌పామ్, కొబ్బరికి అంతరపంటగా రైతుకు రెట్టింపు ఆదాయం కోసం ప్రభుత్వం కోకో సాగును ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉండటం, సాగు నిర్వహణ తక్కువగా ఉండటం, సాగుకు సంబంధించి మొదటి మూడేళ్లు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడంతో జిల్లాలో కోకో సాగు గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 39,714 హెక్టార్లల్లో కోకో సాగు ఉండగా కేవలం ఏలూరు జిల్లాలోని 4 మండలాల్లోనే 14,364 హెక్టార్లలో కోకో సాగవుతుండడం విశేషం. 1990లో పశ్చిమగోదావరి జిల్లాకు పరిచయమైన కోకో సాగు ఏటా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. అత్యధికంగా ఏలూరు జిల్లాలో వెయ్యి హెక్టార్లు సాగు చేయనున్నారు. ఆయిల్‌పామ్ తరహాలోనే కోకో మొక్కలు కూడా కంపెనీల ద్వారానే రైతులకు పంపిణీ చేసి మొదటి మూడేళ్లు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు చెల్లిస్తుండడం, అంతరపంటగా మంచి డిమాండ్ ఉండడంతో సాగు విస్తీర్ణంపై జిల్లాలో రైతులు ఆసక్తి చూపుతున్నారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన కోకోను 1990లో కేంద్ర ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ కాజునట్ అండ్ కోకో డెవలప్మెంట్ ద్వారా దేశానికి పరిచయం చేసింది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో మాండలీజ్ కంపెనీ ద్వారా జిల్లాలో కోకో సాగుకు సంబంధించి మొక్కలు సరఫరా చేస్తున్నారు. కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా ఎకరాకు సగటున రూ.80 వేల వరకు ఆదాయం సమకూరుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో దిగుబడి అత్యధికంగా ఉంది. అంతరపంటగా ఉన్నప్పటికీ మొక్కలకు సబ్సిడీలు, మొదటి మూడేళ్ల నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం ఇస్తుండటం అలాగే 4వ సంవత్సరం నుంచి 30 ఏళ్ల వరకు మంచి దిగుబడి ఇస్తుండడంతో సాగుకు డిమాండ్ పెరిగింది. చాక్లెట్ల తయారీలో కీలకం ప్రధానంగా కోకోను చాక్లెట్ల తయారీలో వినియోగిస్తుంటారు. జిల్లాలో మాండలీజ్ కంపెనీ కోకోను కొనుగోలు చేసి తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ యూనిట్లో చాక్లెట్ల తయారీలో వినియోగిస్తున్నారు. దాదాపు 8 ప్రధాన కంపెనీలకు సంబంధించి 50కు పైగా రకాల చాక్లెట్లలో కోకోను అధికంగా వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా ప్రోత్సహిస్తుంది. దేశంలో ఏపీ నంబర్‌వన్ కోకో సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఏపీలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలు మొదటి స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో 39,714 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న కోకో సాగు ఏటా సగటున 10,903.20 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. తమిళనాడులో 32,080 హెక్టార్లలో 2,802.45 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. అలాగే కేరళ రాష్ట్రంలో 17,366 హెక్టార్లలో సాగు జరుగుతుండగా 9,647.40 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. అలాగే కర్ణాటకలో 14,216 హెక్టార్లలో 3,719.10 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుంది. రాష్ట్రంలో హెక్టారుకు సగటున 950 కిలోలు, తమిళనాడులో 350 కిలోలు, కర్ణాటకలో 525, కేరళలో 850 కిలోలు దిగుబడి వస్తుంది. దేశ వ్యాప్తంగా 4 దక్షిణాది రాష్ట్రాల్లో 97,563 హెక్టార్లలో కోకో సాగు విస్తీర్ణం ఉండగా ప్రతి ఏటా 2,07,072.15 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం కిలో ధర రూ.205గా ఉంది. అంతరపంటగా ప్రోత్సాహం కొబ్బరి, ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా కోకో బాగా ఉపయుక్తంగా ఉండడంతో ఉద్యానశాఖ ద్వారా పభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో అత్యధికంగా సాగు విస్తీర్ణం ఉంది. – ఎ.దుర్గేష్, ఉద్యానశాఖ ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ -
‘పశ్చిమ’లో కొబ్బరి.. తడబడి
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొబ్బరి ఎగుమతులు పతనమవుతున్నాయి. మార్కెట్ పుంజుకుంటున్న సమయంలో ఇతర రాష్ట్రాల్లో పంట అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతులు ఢీలా పడ్డాయి. దీంతోపాటు నాణ్యతపరంగా పొరుగు రాష్ట్రాల్లో పంట బాగుండటంతో మన మార్కెట్ డౌన్ అయ్యింది. జిల్లాలో సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉండగా.. ప్రస్తుతం రోజుకు 30 లారీల కొబ్బరి ఎగుమతి చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొబ్బరి మార్కెట్ పుంజుకుంటున్న సమయంలో తమిళనాడు, కేరళ కొబ్బరి అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా నుంచి ఎగుమతులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇక్కడి నుంచి తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్ ప్రాంతాలకు పెద్ద ఎత్తున కొబ్బరికాయలు ఎగుమతి చేస్తుంటారు. ఉమ్మడి జిల్లాలో ఏలూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం వద్ద రెడ్డిసీమ, కోరుమామిడి, చింతలపూడి, ద్వార కాతిరుమల, దేవరపల్లి, పెదవేగి, కొవ్వూరు, నల్లజర్ల, గోపాలపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, మొగల్తూరు, పేరుపాలెం ప్రాంతాల్లో కొబ్బరి సాగు ఎక్కువగా ఉంది. సీజన్లో రోజుకు 100 లారీల వరకు కొబ్బరి ఎగుమతి చేస్తారు. శ్రావణమాసం సందర్భంగా కొద్దిరోజుల ముందు వరకూ ఎగుమతులు బాగున్నా.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. లారీకి 30 వేల కాయల వరకు.. చిన్నలారీలో సుమారు 20 వేలు, పెద్ద లారీలో 30 వేల వరకు కాయలను లోడు చేస్తుంటారు. ప్రస్తుతం జిల్లా నుంచి సుమారు 30 లారీల పంట ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం పాత, కొత్త కాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. తమిళనాడులో కొబ్బరి కాయల ధర రూ.7 నుంచి రూ.8 వరకు ఉండటంతో అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు బాగున్నాయి. డిమాండ్ ఎక్కడెక్కడంటే.. గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిసా, హర్యానా రాష్ట్రా ల్లో సాధారణ రోజుల్లో కూడా కొబ్బరి కాయకు డిమాండ్ ఉంటుంది. జిల్లా నుంచి పీచు కాయ గుజరాత్‌కు ఎక్కువగా ఎగుమతి అవుతుంది. బెల్ట్ ఫోర్ పట్టా రకాన్ని మహారాష్ట్ర, గుజరాత్‌కు ఎగుమతి చేస్తుంటారు. కొబ్బరి ఎగుమతుల్లో రాష్ట్రంతో తమిళనాడు, కేరళ పోటీపడుతున్నాయి. లాక్డౌన్ సమయంలో ఆంధ్రా కొబ్బరి ఎగుమతి అధికంగా ఉండటంతో పాటు ధర రూ.15 వరకూ పలికింది. ఒక్కసారిగా తమిళనాడు, కేరళలో దిగుబడులు పెరగడంతో మన మార్కెట్లో ధరలు తగ్గాయి. పరిశోధనా కేంద్రాలు కీలకం పరిశోధనా కేంద్రాల సూచనలు ఆధారంగా ఇతర రాష్ట్రాల్లో రైతులు కొబ్బరి సాగుచేస్తున్నారు. తద్వారా నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. మన రాష్ట్రంలో కోనసీమ జిల్లా అంబాజీపేటలో మినహా మరెక్కడా కొబ్బరి పరిశోధనా కేంద్రం లేకపోవడంతో రైతులకు సాగుపై సరైన అవగాహన లేకుండా పోయింది. విస్తీర్ణం తగ్గుతూ.. జిల్లాలో గతంలో సుమారు 60 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు చేసేవారు. ఆక్వా విస్తీర్ణం పెరుగుతుండటంతో ప్రస్తుతం సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. ఆక్వా చెరువు గట్ల వెంబడి ఉన్న కొబ్బరి చెట్లకు నల్లి తెగులు సోకడంతో ఆశించిన దిగుబడులు రావడం లేదు. కొబ్బరి కాయపై మచ్చలు ఏర్పడటం, కాయ పరిమాణం తగ్గడంతో రైతులు లాభాలను అందుకోలేకపోతున్నారు. పరిశోధనా కేంద్రం అవసరం తమిళనాడు, కేరళతో సంబంధం లేకుండా మన రాష్ట్రంలో కొబ్బరికి డిమాండ్ పెరగాలంటే ఇక్కడ పండించే కొబ్బరి కాయకు మచ్చ లేకుండా ఉండాలి. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కొబ్బరి పరిశోధనా కేంద్రాలు ఉండాలి. వాటి ద్వారా రైతులకు అవగాహన కల్పించాలి. లేదంటే తమిళనాడు కొబ్బరి పంట అందుబాటులో ఉంటే మన పంటకు డిమాండ్ తగ్గుతుంది. – దేవరపు లక్ష్మీనారాయణ, పాలకొల్లు కొబ్బరి మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు డిమాండ్ తగ్గింది శ్రావణమాసం పూర్తికావడంతో మహారాష్ట్రలో డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం శూన్యమాసం కావడం, తమిళనాడు, కేరళæ పంట అందు బాటులోకి రావడంతో మన మార్కెట్ పతనమవుతోంది. ఇటీవల జిల్లాలో వరదలు రావడంతో చెట్లు సుమారు 20 రోజులు నీటిలో ఉండటంతో కాయల్లో నాణ్యత తగ్గింది. డొక్క, పీచు ఇలా అన్ని రంగాల్లో ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – మాటూరి వీర వెంకట నరసింహమూర్తి, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల కోకోనట్ కోప్రా మర్చంట్స్ అసోసియేషన్ సెక్రటరీ -
కొబ్బరి రైతులకు శుభవార్త
సాక్షి, తూర్పు గోదావరి: రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు శుభవార్త అందించారు. ఉపాధి హమీ పథకాన్ని కొబ్బరి తోటల పెంపకానికి అనుసంధానం చేశామని కన్నబాబు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా కొబ్బరికి 75 శాతం బీమా ప్రీమియంను కొబ్బరి అభివృద్ధి బోర్డుతో కలిసి ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు. వేజ్ కాంపొనెంట్ కింద రూ.1,73,591, మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.1,06,179లు కలిపి మూడు ఏళ్లకు హెక్టారుకు రూ.2,79,770లు కొబ్బరి రైతుకు ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా కొబ్బరి తోటలు పెంపకం చేయాలనుకునే రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల కొబ్బరి ధరలు పడిపోయిన నేపథ్యంలో నాఫెడ్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో ఐదు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల నెల రోజుల్లోనే మిల్లింగ్ కోప్రాకి రూ. రెండు వేలు రేటు పెరిగిందని గుర్తుచేశారు. సీపీసీఆర్‌ఐ నిర్ణయం ప్రకారం త్వరలోనే సామర్లకోట వద్ద కొబ్బరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. రైతు తోటలోనే శాస్త్రజ్ఞులు పరిశోధన చేసేలా 'ఆన్ ఫార్మింగ్ రిసెర్చ్ స్టేషన్'ను కోనసీమలో ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. -
సేంద్రియ లాభాల కో(క్కొరో)కో!
‘సాగు గిట్టుబాటు కావడం లేదు. పెట్టిన పెట్టుబడులు రావడం లేదు. దీర్ఘకాలిక పంటే అయినా సాగు చేస్తూ నష్టాలు చవిచూడలేము. దీనికన్నా కోకో తోటలను తొలగించుకోవడమే మేలు’ ఇది కోనసీమలో రసాయనిక వ్యవసాయం చేసే కోకో రైతుల ఆవేదన. అయితే, సేంద్రియ పద్ధతులు పాటించే రైతులు ఖర్చులు భారీగా తగ్గించుకొని లాభాల బాటలో సాగుతున్నారు. కొబ్బరి సాగులో కోకో ప్రధాన అంతర పంట. కొబ్బరితోపాటు ఆయిల్ పామ్ తోటల్లో సైతం దీన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా వేలాది ఎకరాల్లో కోకో సాగు జరుగుతున్నది. ఇటీవల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో దీని విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం కోకో సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉంది. కొబ్బరి సంక్షోభ సమయంలో రైతులను ఆదుకున్నది కోకో పంటే. కోకో ఆదాయంపైనే కొబ్బరి రైతులు ఆధారపడిన సందర్భాలూ లేకపోలేదు. అటువంటిది పెట్టుబడులు పెరగటం, పెట్టుబడులకు తగిన ఆదాయం రాక కోనసీమలో పలువురు రైతులు కోకో తోటలను తొలగిస్తున్నారు. గడిచిన ఒకటి, రెండు నెలల్లో పలువురు రైతులు అరటి తోటల్లో కోకో చెట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారు. ఇందుకు వారు చెప్పే కారణాలివి.. ఇటీవల కాలంలో పెట్టుబడులు పెరగడం, తగిన దిగుబడి రాకపోవడం, కోకో గింజలకు కనీస ధర రాకపోవడం. సేంద్రియ సాగు పద్ధతే శ్రేయోదాయకం ఇటువంటి సమయంలో పెట్టుబడులు తగ్గించుకునేందుకు సేంద్రియ సాగు విధానం మేలు అని ఉద్యానశాఖాధికారులు, శాస్త్రవత్తేలు, ఈ విధానంలో సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. రసాయనిక ఎరువుల స్థానంలో భూసారం పెంచుకునేందుకు జీవామృతం, వేస్ట్ డీ కంపోజర్, పంచగవ్య వంటి ద్రవరూప ఎరువులను వినియోగించడం, డ్రిప్ వాడకంతో పెట్టుబడులు మూడొంతులు తగ్గుతున్నాయని సేంద్రియ రైతులు చెబుతున్నారు. రూ. 13 వేలకు తగ్గిన పెట్టుబడి రసాయన పద్ధతుల్లో సాగు చేసే రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.70 వేల వరకు ఖర్చవుతుండగా, సేంద్రియ విధానంలో సాగు చేస్తే రూ.13 వేలు ఖర్చవుతుండటం విశేషం. పెట్టుబడులు తగ్గించుకోవడం ద్వారా సేంద్రియ రైతులు ఎకరాకు రూ.43,540 వరకు లాభాలు పొందుతుంటే.. రసాయన, సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులు ఎకరాకు రూ. 6,150 మేరకు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. తక్కువ ఖర్చు, లాభసాటి ధర సేంద్రియ సాగు వల్ల రసాయనిక సేద్యం కన్నా ఏ విధంగా చూసినా మేలే. తొలి రెండేళ్లు సెమీ ఆర్గానిక్ అంటే 60:40, 40:60 పద్ధతుల్లో సాగు చేశాను. గడచిన రెండేళ్ల నుంచి పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నాను. దీని వల్ల స్వల్పంగా దిగుబడి తగ్గినా.. పెట్టుబడులు సగానికి పైగా తగ్గాయి. డ్రిప్ వల్ల కూలీల ఖర్చును కూడా బాగా తగ్గించగలిగాను. సేంద్రియ విధానంలో సాగు చేస్తేనే లాభసాటి ధర వస్తోంది. – వంకాయల స్వామిప్రకాష్ (98663 55165), ఆదర్శ రైతు, ఇమ్మిడివరప్పాడు, అమలాపురం, తూ.గో. జిల్లా సేంద్రియ విధానంలో డ్రిప్ పెట్టిన కోకోతోట – ఎన్. సతీష్, సాక్షి, అమలాపురం -
గిరి సీమల్లో కొబ్బరి సిరులు
అమలాపురం: మైదానంలో డెల్టా ప్రాంతాలకు.. మెట్టలో సాగునీటి సౌలభ్యమున్న ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కొబ్బరి సాగు.. ఇకనుంచీ కొండకోనల్లోనూ జోరుగా సాగనుంది. గిరి సీమల్లో సిరులు కురిపించడం ద్వారా గిరిపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. మొట్టమొదటిగా తూర్పు కనుమల్లో విశాఖ మన్యంలో కొబ్బరి సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొబ్బరిసాగును ప్రోత్సహించేందుకు సెంట్రల్ ప్లానిటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీపీసీఆర్‌ఐ) ముందుకొచ్చింది. ఇందులో భాగంగా విశాఖ మన్యంలో 100 ఎకరాలకు సరిపడే కొబ్బరి మొక్కలను గిరి రైతులకు అందించనుంది. అన్నీ సవ్యంగా సాగితే విశాఖతోపాటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ కొబ్బరిసాగుకు సీపీసీఆర్‌ఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొండ ప్రాంతాల్లో సాగుకు చేయూత.. కొబ్బరి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కేరళే. అక్కడ పశ్చిమ కనుమల విస్తీర్ణం ఎక్కువైనప్పటికీ కొబ్బరి సాగు పెద్దఎత్తున సాగుతుండడం విశేషం. మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. కేవలం ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, చిత్తూరు జిల్లాల్లోని మైదాన, మెట్ట ప్రాంతాల్లో సుమారు 3.01 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. కేరళలో వర్షపు నీటిని నిల్వ చేయడం.. బిందు సేద్యం(డ్రిప్ ఇరిగేషన్), ఆచ్ఛాదన(మల్చింగ్) విధానాలతో కొండ ప్రాంతాల్లో కొబ్బరిని విజయవంతంగా సాగు చేస్తున్నారు. వాటర్ స్టోరేజ్ ట్యాంకులు, చెక్‌డ్యామ్‌లను నిర్మించి.. వాటి ద్వారా నీటిని మళ్లించి మంచి దిగుబడి సాధిస్తున్నారు. ఇదే విధానంతో రాష్ట్రంలోనూ కొబ్బరి సాగును ప్రోత్సహించేందుకు కేరళలోని కాసర్ఘోడ్లోని సీపీసీఆర్‌ఐ ప్రధాన కార్యాలయం ముందుకొచ్చింది. సంస్థ డైరెక్టర్ డాక్టర్ పాలెం చౌడప్ప ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సాగుకు చేయూతనిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తొలి విడతగా ప్రయోగాత్మకంగా విశాఖ మన్యంలోని చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో ఎంపిక చేసిన రైతులకు వచ్చేనెలలో ఆరువేల కొబ్బరి మొక్కలను ఉచితంగా అందించనున్నారు. ఎకరాకు 60 మొక్కల చొప్పున వంద ఎకరాల్లో కొబ్బరితోట సాగు చేసేలా గిరిజన రైతులను ఎంపిక చేశారు. వీరికి మొక్కలతోపాటు కాపు వచ్చేవరకు ఎరువులు, బిందు సేద్యం పరికరాలను ఉచితంగా అందించనున్నారు. సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తెస్తారు. కొబ్బరిలో కోకో, పోక, ఏజెన్సీలో సాగు జరిగే కాఫీ, డ్రాగన్ ఫ్రూట్, అనాస వంటి పంటల్నీ సాగు చేసేలా ప్రోత్సహించనున్నారు. ఇక్కడ సాగు విజయవంతమైతే.. విశాఖతోపాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేస్తారు. నీరు నిల్వ చేస్తూ.. కొండలపై సాగు చేస్తూ... కేరళ రైతులు వర్షం రూపంలో పడిన ప్రతి నీటిబొట్టునూ కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. నీటిని నిల్వ చేసుకోవడం, దానిని తోటలకు మళ్లించడం ద్వారా అక్కడి రైతులు సముద్ర తీరప్రాంతమైన ఇసుక నేలలు, కొండవాలు ప్రాంతాల్లోనూ కొబ్బరి పంటను పండించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇళ్లు, ఇతర భవంతులపై పడే వర్షపు నీటిని ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకులకు మళ్లించి.. దీన్నుంచి డ్రిప్ ద్వారా కొబ్బరి, ఇతర మొక్కలకు నీటిని ప్రవహింపచేస్తున్నారు. ఇదే రీతిలో కొండవాలు ప్రాంతాల్లో పడే వర్షపు నీటిని దిగువ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్యాంకుల్లోకి మళ్లిస్తున్నారు. ఈ నీరు ట్యాంకులోకి వెళ్లేందుకు అనువుగా గట్లు వేస్తూ.. ట్యాంకులోకి నీరు వెళ్లేచోట అడుగున వెడల్పుగా బ్లాక్‌మెటల్ వేస్తారు. తొలుత ఇళ్లు, భవనాలన ఉంచి వచ్చే నీటిని, తరువాత దిగువన నిర్మించిన ట్యాంకు నీటిని కొబ్బరి సాగుకోసం వినియోగిస్తున్నారు. దీర్ఘకాలికంగా మంచి ఆదాయం... ఏజెన్సీలో కొబ్బరిసాగు చేస్తే గిరి రైతులు దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందుతారు. కాఫీ, మామిడి, జీడి మామిడి కన్నా కొబ్బరి ఎక్కువకాలం పంట. నెలనెలా దిగుబడి రూపంలో ఆదాయం వస్తుంది. కొబ్బరితోపాటు దీనిలో విలువైన అంతర పంటలను కూడా సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సాగుకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాం. కేరళ తరహాలోనే బిందు సేద్యం పద్ధతిలో ఏజెన్సీలోనూ కొబ్బరిసాగు చేయవచ్చు. –పాలెం చౌడప్ప, డైరెక్టర్ సీపీసీఆర్‌ఐ, కాసరఘోడ్, కేరళ -
మిశ్రమ పంటలతో మేలు
మిశ్రమ పంటలతో మేలైన ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) రాష్ట్ర కార్యదర్శి, ఆదర్శరైతు (98852 63924) ముత్యాల జమ్మీలు(జమ్మీ). కొబ్బరిలో అంతర పంటలుగా ఆయన అరటి, కోకో, పోక, మిరియాలను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మిశ్రమ పంటలు సాగు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు. కొబ్బరిలో అంతరపంటల సాగుపై ఇస్తున్న కథనాల్లో భాగంగా రెండో కథనంలో మిశ్రమ పంటల సాగు పద్ధతి ఎలా చేపట్టాలో ఆయన వివరిస్తున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... ‘‘కొబ్బరి సాగుకు పెట్టుబడి పెరుగుతోంది తప్ప తగిన రాబడి లేదు. అదే వాటిలో అంతర పంటలుగా మిశ్రమ పంటలను సాగు చేస్తేమరింత ఆదాయం వస్తుంది. ఏటా కొబ్బరి సాగుకు ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతోంది. రాబడి సైతం దీనిలో కోకో, అరటి, పోక, మిరియం పంటలను అంతర పంటలుగా సాగు చేయడం వల్ల నాకు అయ్యే అదనపు పెట్టుబడి ఏడాదికి రూ.22,500 మాత్రమే. కాని ఆయా పంటల దిగుబడి ద్వారా ఖర్చులు పోను నాకు వచ్చే అదనపు లాభం (కొబ్బరితో సంబంధం లేకుండా) ఎకరాకు రూ.75 వేలు. కోకో తోట వయస్సు పెరిగే కొద్దీ దిగుబడి పెరిగి లాభం మరింత పెరుగుతుంది. ’’ కోకో . మా కుటుంబానికి ఉన్న కొబ్బరి తోటల్లో సగం తోటల్లో కోకోను అంతర పంటగా సాగు చేస్తున్నా. కొబ్బరి వయస్సు 60 ఏళ్లయితే, కోకోది సుమారు 40 ఏళ్లు. ఈ కారణంగా ఏటా ఈ రెండు పంటలకు యాజమాన్య పద్ధతులకు అంటే దుక్కులు, ఎరువులు, నీరు పెట్టడం వంటి చిన్నచిన్న పెట్టుబడులు సరిపోతాయి. కోకోలో అదనంగా కొమ్మల కత్తిరింపునకు మాత్రమే పెట్టుబడి అవుతోంది. కాని ఈ రెండు పంటల ద్వారా దీర్ఘకాలికంగా ఆదాయం పొందవచ్చు. * ఎకరా కొబ్బరి తోటలో నాలుగు చెట్ల మధ్య కోకో మొక్కను వేశాను. నాలుగేళ్ల క్రితం మొక్కలు పాతితే గత ఏడాది నుంచి దిగుబడి వస్తోంది. ఎకరాకు 180 మొక్కలు నాటాను. * పక్వానికి వచ్చే కోకో కాయలను వారానికి ఒకసారి కోస్తాను. తరువాత గుజ్జుతీసి పిక్కలను ముందు పులియబెట్టి, తరువాత నాలుగు రోజులు పాటు ఎండలో పెట్టి పిక్కలను విక్రయిస్తాను. * కోకో గింజలను సీజన్లో కేజీ రూ.210 చేసి అమ్మకాలు చేశాం. ఇప్పుడు అన్‌సీజన్ కావడం వల్ల రూ.160 మాత్రమే ధర ఉంది. ఎకరాకు ఎంతలేదన్నా కొబ్బరితో సంబంధం లేకుండా రూ.25 వేల వరకు ఆదాయం వస్తోంది. * అదే 15 ఏళ్లకు పైబడి తోట ఉన్న రైతులకు నాలుగైదు రెట్లు దిగుబడిగా వస్తోంది. అటువంటి తోట ఉన్న రైతులు ఎకరాకు ఏడాదికి రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశముంది. పెట్టుబడి . * కొబ్బరికి చేసే దమ్ములు కోకోకు సరిపోతాయి. ఫ్రూనింగ్ (కొమ్మలు కత్తిరింపునకు) ఏడాదికి ఎకరాకు రూ.500 అవుతోంది. * ఏడాదికి రెండుసార్లు (జూలై, అక్టోబర్) యూరియా, పొటాష్, సూపర్ మందును కేజీ చొప్పున చెట్టుకు వచ్చి మూడు కేజీల చొప్పున అందిస్తున్నా. ఎరువుల ధరలు, చెట్టు కుదళ్లు కొట్టే కూలీలకు కలిపి ఎకరాకు రూ.నాలుగు వేలు పెట్టుబడి అవుతోంది. * చెట్టును ఆశించే తెగుళ్ల నివారణకు మరో రూ. వెయ్యి వరకు అవుతోంది. మొత్తం మీద ఎకరాకు రూ.5,500 పెట్టుబడి అవుతుంటే, రూ. 25 వేల వరకు ఆదాయంగా వస్తోంది. అరటి . * కొబ్బరి, కోకో సాగవుతున్న రెండు ఎకరాల్లో అరటిని కూడా అంతర పంటగా సాగు చేశాను. కొబ్బరి చెట్లు, కోకో చెట్ల మధ్య వరుసగా అరటి చెట్లు వేశాం. ఎకరాకు 400 మొక్కల వరకు వేశాం. * దక్కులు ఎలాను కొబ్బరి తోటకు చేయిస్తున్నందున దీనికి పెట్టుబడి కొంత వరకు కలసి వస్తోంది. కానీ ఏడాదికి మూడుసార్లు కలుపు తీయించాల్సి ఉంది. చెట్టు ఖరీదు, ఎరువులు, ఇతర యాజమాన్య పద్ధతులకు వచ్చి రూ.40 వరకు పెట్టుబడి అయ్యింది. గెల రూ.90 చేసి అమ్మకాలు చేసినందున పెట్టుబడి పోను చెట్టుకు రూ.50 చొప్పున ఎకరాకు రూ.20 వేల వరకు అదనపు ఆదాయం వచ్చింది. పోక . * కొబ్బరి తోట చుట్టూ పోక చెట్లు వేశాను. అలాగే తోటకు నీరు వెళ్లే బోదెల గట్లకు ఇరువైపులా కూడా పోకచెట్లు నాటాను. దగ్గర, దగ్గరగా మొక్కలు పాతుకుంటే ఎకరాకు 400 వరకు మొక్కలు నాటవచ్చు. *పోకకు పెద్దగా పెట్టుబడి పెట్ట లేదు. కోకో మొక్కలకు ఎరువులు వేసినప్పుడే వీటికి కూడా ఏడాదికి రెండు దఫాలుగా యూరియా, సూపర్, పొటాష్ ఎరువులు వేశాం. చెట్టుకు వచ్చి విడతకు అరకేజీ చొప్పున వేశా. ఎకరాకు రూ.వెయ్యి వరకు పెట్టుబడి అయ్యింది. * పోక వల్ల ఏడాదికి రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయంగా వస్తోంది. మిరియం . ఏజెన్సీల్లోనే కాదు.. మన కొబ్బరి తోటల్లో కూడా మిరియాన్ని అంతర పంటగా సాగు చేయవచ్చు. దీనిని మా తోటలో ప్రయోగ్మాతంగా సాగు చేస్తున్నా. బోదెను అనుకుని ఉన్న 15 పోక చెట్ల మీద మిరియం తీగను ఎక్కించాను. గత ఏడాది చాలా తక్కువ దిగుబడి వచ్చింది. దీనిని మా ఇంటి అవసరాల కోసం వినియోగించాను. అయితే ఈ ఏడాది మిరియం గుత్తులు ఎక్కువ వేసింది. కనీసం ఏడెనిమిది కేజీలకు పైబడి దిగుబడిగా వచ్చే అవకాశముంది. మార్కెట్ ధరను బట్టి చూస్తే కనీసం రూ.పది వేల వరకు ఆదాయం రావచ్చు.