columnist
-
పాతికేళ్ల ‘కాలమ్’గా రాస్తూనేవున్నా!
25 సంవత్సరాలు అనేది ఆసక్తికరమైన వయస్సును సూచిస్తుంది. మీరు ఈ వయసులోనే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అన్ని బార్ల తలుపులు మీకోసం తెరుచుకుంటాయి. మిమ్మల్ని ఎవరూ ఇక అబ్బాయిగా భావించరు. 18 లేదా 21 ఏళ్ల వయసులో మిమ్మల్ని మీరు ‘యంగ్’ అని పరిగణించుకోవచ్చు. కానీ 25 ఏళ్ల వయసులో మీరు వయోజనుల కిందే లెక్క. గత 25 ఏళ్లుగా నేను కాలమ్ రాస్తూనే ఉన్నాను. ప్రతి వారం నా వ్యాసం వచ్చేది. తాము చదివింది ప్రజలు ఇష్టపడ్డారనే నేను భావిస్తున్నాను. కానీ ఇన్నేళ్లుగా కాలమ్ ఉనికిలో ఉండటం అనేది ఇక ఆశ్చర్యం కలిగించదు. అయితే పాఠకులకు ఇన్నేళ్లు సుపరిచితం కావడం ఎంతో ఇష్టమైన విషయం కదా! బహుశా ఇన్నేళ్లలో నేను రాస్తూవచ్చిన కంటెంట్ మారుతూ ఉండి ఉండవచ్చు. మొదట్లో నా రాతల్లో శైశవ దశ ఉండేది. నాలో ఒక భాగం వయోజనుడే ఉంటాడు కానీ మరొక భాగం పిల్లాడి గానే ఉంటాడు. కానీ నేను రుషిలాగా నటిస్తుంటాను. సిల్లీ జోక్స్ వేస్తున్నప్పుడు నాలో చిలిపితనం సులువుగా ఆవరిస్తుంటుంది. కాలమ్ ఇంతకాలం కొనసాగినందుకు ఈ జోక్స్, చిలిపితనమే కారణం అయి ఉండవచ్చని నా అనుమానం. ఒక వారం నా వ్యాసం మీకు ఆసక్తి కలిగించకపోతే మరోవారం తప్పక మీకు ఆసక్తికరంగా ఉండి ఉంటుంది. నేను ఇన్నేళ్లుగా నిత్యం ప్రతివారం ఎలా రాస్తూ వస్తున్నారని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు. 1997 జూలై 6న నా కాలమ్ ఒక దినచర్యలా ప్రారంభమైంది. నాటి ప్రధాని ఇందర్ కుమార్ గుజ్రాల్‌తో డిన్నర్ చేస్తున్న జ్ఞాపకాలను అది గుర్తు చేసింది. ఆయన నాకు ఆహ్వానం పంపినప్పుడు నేనెంత సంతోషించానంటే దాన్ని అసలు దాచుకోలేకపోయాను. విచారకరమైన విషయం ఏమిటంటే, అరకొర విషయాలే తప్ప దాంట్లో పెద్దగా నివేదించడానికి నా వద్ద సమాచారం ఏదీ లేకుండా పోయింది. నన్ను నేను ప్రదర్శించుకోవడమే నా నిజమైన ఉద్దేశంగా ఉండేది. సంవత్సరాలు గడిచే కొద్దీ నా కాలమ్ అనేక దిశల్లో మెరుగుపడుతూ వచ్చింది. చాలా కాలంపాటు ఒకే పత్రికలో నా కాలమ్ ప్రయాణించింది (‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రికలో ‘సండే సెంటిమెంట్స్’ పేరిట వచ్చింది). వారాంతపు అనుబంధ సంచికల్లో వెనుక పేజీలో అది మొదలైంది. ఆ సమయంలో అది ఒక డైరీగా ఉండేది. తర్వాత ఆ పత్రిక అనుబంధ సంచికను కూడా మెయిన్ పేపర్లో కలిపేయడంతో అప్పటి నుంచి నా కాలమ్ కూడా అక్కడే కొనసాగింది. ఇక్కడే అనేకమంది జ్ఞానులు నా చుట్టూ ఉండటంతో నా కాలమ్ ప్రస్తుతం రూపంలో మెరుగుపడింది. దాని సైజ్ రీత్యా అది సింగిల్ ఇష్యూ కాలమ్గానే ఉంటూ వచ్చింది. స్థలాభావం కారణంగా నా కాలమ్ సైజ్ కూడా తగ్గిపోతూవచ్చింది. దీంతో అది ఒక ‘స్ప్లింట్ ఐడెంటిటీ’ని సాధించింది. ఈ స్కిజోఫ్రెనియా నేను రెండు స్వరాలతో మాట్లాడేలా చేసింది. ఆరోజు ప్రధాన సమస్యలపై సీరియస్ ప్రతిఫలనాలను ఒక స్వరం ప్రకటిస్తే, మరొక స్వరం జోకులతో, అసంబద్ధ ఆలోచనలతో కొనసాగేది. గత పాతికేళ్లుగా నేను ప్రతి వారమూ నా కాలమ్ రాస్తూ వచ్చాను. ఒక్క వారం కూడా నేను రాయడం మానలేదు. ఒకే ఒక వారం మాత్రం నాటి సంపాదకుడితో చిన్నపాటి గొడవ కారణంగా దాని ప్రచురణ ఆ వారానికి ఆగిపోయింది. దాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాన్ని గుర్తుంచు కోకపోతేనే ఉత్తమంగా ఉంటుంది. కానీ నా కారణంగా నా కాలమ్ గత పాతికేళ్లుగా ఆగిపోలేదు అని చెప్పడానికే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఒక అంచనా ప్రకారం నేను ఇప్పటికి నా కాలమ్‌లో పది లక్షల పదాలను రాసి ఉంటాను. నా కాలమ్‌లోని కొన్ని కథనాలను వివిధ ప్రచురణ సంస్థలు సంకలనాలుగా ప్రచురించాయి. రెండు సంకలనాలను విజ్డమ్ ట్రీ వాళ్లు ప్రచురిస్తే, మూడోది హార్పర్ కాలిన్స్ సంస్థ ప్రచురించింది. ప్రశాంతమైన సాయంవేళల్లో ఆ పుస్తకాలను నేను తడుముతూ ఉంటాను. నేను మొదట కాలమ్ రాయడం ప్రారంభించినప్పటికంటే అదే విషయాన్ని ఇప్పుడు ఎంత బాగా రాయగలిగి ఉండేవాడిని అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. వయస్సు నన్ను ఎదిగించి ఉండవచ్చు. ఈ క్రమంలో నేను జ్ఞానినయ్యానని నా నమ్మకం. మొదట్లో చాలా తేలిగ్గా రాస్తూ పోయేవాడిని. కానీ క్రమంగా నా కాలమ్ రాయాలంటే గట్టి కృషి చేయాల్సి వచ్చింది. ఒకోసారి అది నాకు ఎంతో ఇబ్బందికరంగా కూడా మారేది. సంవత్సరాలపాటు నేను రాస్తూ వచ్చిన ఈ కాలమ్‌ను నామట్టుకూ ఎంతగానో ఆస్వాదించాను. ఎందుకంటే అవి పాఠకుల కోసం రాసినవి కదా! పాఠకుల ప్రశంసను కోరుకోవడం కంటే మించినది నాకు ఏదీ లేదు. పాఠకులతో పాటు నా సహోద్యోగులు కూడా సహకరిస్తూ వచ్చారు కాబట్టే ఇంత సుదీర్ఘ కాలం నా ఈ కాలమ్ కొనసాగింది. ఇంతకాలం నా కాలమ్‌ను చదివి నందుకు ఆదరించినందుకు, నాకు మద్దతి చ్చినందుకు పాఠకులందరికీ ధన్యవాదాలు. (క్లిక్: తరతరాలనూ రగిలించే కవి) - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు -
‘డ్రెస్సింగ్ రూంలో ట్రంప్ అసభ్యంగా ప్రవర్తించారు’
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద లైంగిక ఆరోపణలు కొనసాగుతున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన నాటి నుంచి ట్రంప్ మీద చాలా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. న్యూయార్క్‌కు చెందిన ఈ జీన్ కారోల్(75) అనే అడ్వైజ్ కాలమిస్ట్ ఒకరు 1990ల కాలంలో ట్రంప్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. తన ‘హైడియస్ మెన్’ పుస్తకంలో దీని గురించి చెప్పుకొచ్చారు. ‘1995 - 96కాలంలో ట్రంప్‌తో పరిచయం ఏర్పడింది. అప్పుడు ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఒకరోజు నేను మాన్‌హట్టన్ డిపార్ట్మెంట్ స్టోర్‌కి వెళ్లినప్పుడు ట్రంప్ అక్కడ కనబడ్డారు. ఆయనతో అంతకు ముందే పరిచయం ఉండటంతో పలకరింపుగా నవ్వాను. తనేదో జోక్ చేశాడు. అలా సరదాగా నవ్వుతు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంతలో ట్రంప్ ఓ బాడీ సూట్ తెచ్చి ట్రై చేయమంటూ నన్ను డ్రెస్సింగ్‌రూమ్‌లోకి తోశారు. తర్వాత నా వెనకే డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించార’ని కారోల్ తెలిపారు. ‘ఈ సంఘటనతో ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాను. వెంటనే ఆయన్ని తోసేసి అక్కడ నుంచి బయటకు పరిగెత్తుకొచ్చాను. ఆ సమయంలో అక్కడ డిపార్ట్మెంట్ సిబ్బంది ఎవరూ లేర’ని తెలిపారు. ఈ విషయం గురించి తాను ఇద్దరు మిత్రులతో చర్చించానని.. ఒకరేమో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయమని చెప్పగా.. ఆయనకు చాలా పలుకుబడి ఉంది కాబట్టి మౌనంగా ఉండమని హెచ్చరించారన్నారు కారోల్. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ కొట్టి పారేశారు. తన జీవితంలో ఇంతవరకూ కారోల్ని కలవలేదని చెప్పుకొచ్చారు. ‘ఇది ఫేక్ న్యూస్. దీనికి సంబంధించి ఎలాంటి ఫోటోలు లేవు.. వీడియో లేదు.. రిపోర్టు లేవు.. చుట్టుపక్కల ఎవరూ లేరు... బెర్గ్డార్ప్ గాడ్‌మ్యాన్ కంపెనీ కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి వీడియో ఫుటేజ్ లేదని చెప్పింది. ఎందుకంటే అసలు అలాంటి సంఘటన జరగలేదు కాబట్టి’ అంటూ ట్రంప్ మండిపడ్డారు. -
ప్రోత్సహిస్తూ.. పోరాడుతూ.. మున్ముందుకు..
అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆవిర్భవించిన సందర్భానికి ఒక బలమైన సాహిత్య నేపథ్యం ఉంది. ఆ నేపథ్యానికి ఆధునిక తాత్విక పునాది ఉంది. నూతన ప్రాపంచ దృక్పథం ఉంది. అందువల్లనే అరసం అనేక విజయాలు సాధించగలిగింది. ప్రజల పక్షాన, ప్రజాకంటక పాలకులను ప్రశ్నించే పక్షాన గళమెత్తుతోంది. ప్రశ్నించే శక్తుల్ని ప్రోత్సహిస్తోంది. స్వయంగా నిలదీస్తోంది. 82 ఏళ్ళనాటి మాట. ‘‘గత సాహితి ఆవేశం ఉన్మాదం లాంటిది. ఫలితం మాత్రం ఇంకొకరిది. కాని మన సాహిత్య ఉద్దేశం వేరు. మన గీటురాయి మీద సాహిత్యానికి మెరుగుపెట్టాలి. ఉన్నత భావాలు, స్వతంత్ర ఆలోచనలు, సౌందర్యారాధన, ఆత్మవికాసం జీవిత యదార్థ ఘటనలు, అందులో ఉంటాయి. అవే మనలో ఉత్తేజాన్ని సంఘర్షణల్ని, ఆదర్శాల్ని సృష్టిస్తాయి. అవి నిద్రపుచ్చడానికి ప్రయత్నించకూడదు. అధిక నిద్ర మృత్యువుతో సమానం కదా?’’ మనుషులపట్ల ప్రేమ, జాతి పట్ల బాధ్యత, రచనల్లో నిబద్ధత ఉన్న ఒక మహా రచయిత సమకాలీన రచయితలకు చేసిన కర్తవ్య బోధ ఇది. సర్వకాలాలకూ వర్తించే అక్షర సత్యాలు ఇవి. 1936 ఏప్రిల్ 9, 10 తేదీల్లో లక్నోలో ఒక మహా సభ జరిగింది. ప్రగతి లేఖక్ సంఘ్ (అభ్యుదయ రచయితల సంఘం) తొలి మహాసభ అది. ఆ సభకు అధ్యక్షులు సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రేమ్‌చంద్. ఆ అధ్యక్ష ప్రసంగంలోని అంశాలే పైన పేర్కొన్నవి. యుద్ధోన్మాదానికి, ఫాసిజానికీ వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్‌తో అరసం సంబంధాలు పెట్టుకుంది. అవే అంశాలపై పనిచేస్తున్న కమ్యూనిస్టులు ఈ రచయితల సంఘానికి మద్దతుగా నిలిచారు. దాని ప్రభావం తెలుగు నాటకూడా పడింది. అప్పటికే శ్రీశ్రీ మరోప్రపంచపు మహాప్రస్థాన సింహ గర్జనలు ప్రారంభం అయ్యాయి. సంప్రదాయ సాహిత్య సంకెళ్ళు, భావకవిత్వ పరిష్వంగనలను జగన్నాథ రథచక్రాలు పటాపంచలు చేశాయి, చెల్లాచెదురు చేశాయి. అంతకు ముందు వీరేశలింగం, గిడుగు, గురజాడల సంఘసంస్కరణ ఉద్యమం, వాడుకభాషా ఉద్యమం, ఆధునిక సాహిత్య ఉద్యమాలు నూతన ఆలోచనాధోరణులకు బాటలు వేశాయి. ఆంధ్రలో అభ్యుదయ సాహిత్యం పురుడుపోసుకోవడానికి అవి దోహదపడ్డాయి. అభ్యుదయ సాహిత్యం సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలన్నింటినీ ప్రభావితం చేసింది. ఉద్యమ రూపం ధరించింది. ‘‘ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం’’గా సంస్థాగత రూపం తీసుకొంది. 1943 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో గుంటూరు జిల్లా తెనాలిలో ప్రథమ మహాసభలు జరిగాయి. ఉపన్యాసాలకే పరిమితం కాకుండా అరసం కార్మికవర్గ అస్తిత్వాన్ని బలంగా ఆవిష్కరించింది. అణగారిన వర్గాల వాణి అయింది. స్వాతంత్య్రోద్యమంలోనే గాక జమీందారీ వ్యతిరేక పోరాటాలకు, నిజాం నిరంకుశ పాలనకు, వ్యతిరేకంగా జరిగిన రైతాంగ సాయుధ పోరాటాలకు ఉద్యమ గేయం అయింది. నిషేధాలు నిర్బంధాలకు గురైంది. తిరగబడింది. తిప్పికొట్టింది. బలహీనపడింది. తిరిగి నిలదొక్కుకుంది. ఇది 75 ఏళ్ల ‘‘అరసం ఘనమైన గతం’’. ఆత్మగౌరవాన్ని పిడికిలెత్తి చాటుకుంటున్న వారి సొంత గొంతుకలే అస్తిత్వవాదాలు అయ్యాయి. స్త్రీవాదం, దళితవాదం వంటి ఉద్యమాల పరిణామాన్ని అరసం నిండుమనస్సుతో ఆహ్వానించింది. తొలినాళ్లలో అందర్నీ తోసిరాజన్న అస్తిత్వవాదులు అభ్యుదయ రచయితలు తమ సహజ మిత్రులని విశ్వసిస్తున్నారు. ప్రజాస్వామ్యం ముసుగులో భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు ఐక్యఉద్యమాల అనివార్యతను అంగీకరిస్తున్నారు. అందుకోసం సోదర సాహితీ సంస్థలకు అరసం స్నేహ హస్తాన్ని అందిస్తోంది. తిరిగి మరో బలమైన సాహిత్య సాంస్కృతిక ఉద్యమ అవసరాన్ని ఎలుగెత్తి చాటుతోంది. ఒక దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం 18వ రాష్ట్ర మహాసభలు గుంటూరులో డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్నాయి. ఆ వేదిక నుండే వజ్రోత్సవాలు జరుగుతాయి. ఇవి కేవలం ‘అరసం’ మహాసభలే కాదు, తెలుగువారి సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు. కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ వ్యాసకర్త, సీనియర్ పాత్రికేయుడు మొబైల్ : 94911 28554 -
సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై స్పందించిన నగ్మా
రేప్ పై సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఒక వైపు ట్విట్టర్ లో దుమారం రేపుతుండగా.. మరో వైపు కొంతమంది ప్రముఖులు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. తన సినిమా ‘సుల్తాన్’ నిర్మాణం పూర్తయిన తర్వాత తమ పరిస్థితి రేప్ కు గురైన మహిళలా ఉందంటూ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను సినీనటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మా ఖండించారు. సంప్రదాయబద్దమైన కుటుంబం నుంచి వచ్చిన సల్మాన్ ఖాన్ మహిళలపై చిన్నచూపు చూడటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సల్మాన్ ఖాన్ చేసిన పని తప్పే అయినా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అతని క్యారెక్టర్ ను శకించడం తగదని అన్నారు. బహుశా రేప్ బాధిత మహిళల జీవితం గురించి చెప్తూ ఇలా అని ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఇక రేప్ అనేది చిన్న విషయం అనే భావనను సల్మాన్ ప్రజల్లోకి పంపారని దీనిపై ఆయన క్షమాపణలు చెప్పినా ఉపయోగం ఉండదని ప్రముఖ కాలమిస్ట్ అన్నా ఎమ్. వెట్టికడ్ పేర్కొన్నారు. సల్మాన్ పై తనకు ఎలాంటి దురాభిప్రాయం లేదని కానీ, ఇలాంటి సంఘటనల్లో పురుషులకు వెన్నుదన్నుగా నిలబడటం ములాయం లాంటి వాళ్లకు సాయం చేసినట్లేనని, వాళ్లు అబ్బాయిలు వాళ్లు తప్పులు చేస్తూనే ఉంటారని అన్నావెట్టికాడ్ అన్నారు. మహిళలపై సల్మాన్ వ్యాఖ్యలు అతని మైండ్ సెట్ ను తెలియజేస్తున్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ లలిత కుమారమంగళం అన్నారు. సల్మాన్ లాంటి సెలబ్రిటీలు పబ్లిక్ లో మాట్లాడే ముందు ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవాలని హితబోధ చేశారు. రేప్ అనే విషయాన్ని సల్మాన్ చిన్నవిషయంగా భావించలేదని, అయితే ఈ విషయంపై దేశమంతా ఇప్పుడు ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదని పూజా బేడీ వ్యాఖ్యానించారు. -
సంజయ్ @సినీపీడియా
తెలుగు సినీ చరిత్రకారునిగా, విశ్లేషకునిగా, విమర్శకుడిగా, కాలమిస్ట్‌గా సంజయ్ కిషోర్‌ది దశాబ్దాల అనుభవం. తెలుగు సినిమాపై అభిమానం అతన్ని సినీపీడియాగా మార్చేసింది. సినిమాలకు సంబంధించి ఏ ఫొటో కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా అందరికీ తన పేరే గుర్తొచ్చేంతగా ఎదిగారు సంజయ్ కిషోర్. ఈ సినీ నిధికి రాగరాగిణి ఆర్ట్ అసోసియేషన్ ఆదివారం ‘సినీ పరిజ్ఞాన ప్రవీణ’ బిరుదును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సంజయ్ కిషోర్‌తో సిటీప్లస్ మాటామంతి. నా చిన్నప్పుడు మా కుటుంబం గుంటూరులో ఉండేది. మా అమ్మ ధనలక్ష్మి నాయుడు మహానటి సావిత్రికి ఉత్తరాలు రాసేది. ఆ మహానటి తన ఫొటో జత చేసి ప్రత్యుత్తరాలు పంపేది. అలా పంపిన ఒక ఫొటోను అమ్మ నాకు చూపించింది. అప్పుడు నా మనసులో కలిగిన ఆలోచన ఇప్పటికీ ఒక యజ్ఞంలా సాగుతోంది. తొమ్మిదో తరగతి నుంచి స్టిల్ ఫొటోల కోసం ఎన్నో ఏళ్లు, ఎన్నో ఊళ్లు తిరిగాను. ఎంతో ఖర్చు పెట్టి వాటిని సేకరించాను. నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులు, జర్నలిస్ట్‌లు ఇలా అందరి నుంచి దాదాపు 70 వేలకుపైగా ఫొటోలను సేకరించి భద్రపరిచాను. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే సావిత్రి తొలి స్టిల్ ఫొటో నా ఒక్కని దగ్గరే ఉంది. జీవితమే సినిమా రంగం.. నా జీవితం సినిమాతోనే ముడిపడి ఉంది. పాత్రికేయుడిగా ఎందరో సినీప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. ఎన్నో కాలమ్స్, రివ్యూలు రాశాను. ప్రింట్ మీడియాతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సినీ నేపథ్యం ఉన్న కార్యక్రమాలు నిర్వహించాను. నాలుగేళ్లు సెన్సార్ బోర్డులో సభ్యుడిగా, సినిమా నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్‌గా కూడా చేశాను. ‘సంగమం’ సంస్థ ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. సినిమాలతో ముడిపడి ఉన్న ప్రతి క్షణం నేను ఎప్పటికీ మరచిపోలేను. నా దగ్గర ఉన్న ఫొటోలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఉంది. -కోన సుధాకర్‌రెడ్డి