Comics books
-
సరికొత్తగా రాబోతున్న సూపర్‌మ్యాన్.. షాక్‌లో ఫ్యాన్స్
ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌మ్యాన్ సినిమాలకి, కామిక్స్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ప్రపంచం ప్రమాదపు అంచుల్లో ఉన్నప్పుడల్లా వచ్చి కాపాడుతుంటాడు. అతనికి, లూయిస్ లేన్‌కి పుట్టిన కొడుకే జాన్ కెంట్. ఇప్పుడు కొత్త సూపర్‌మ్యాన్‌గా అవతారం ఎత్తబోత్తున్నాడు. హీరోలకి వారసులు రావడం ఎక్కడైనా జరిగేదే. కానీ ఈ వారసుడు మాత్రం నార్మల్‌గా రావట్లేదు. అదే ఇక్కడ షాకింగ్ విషయం. ఇప్పటి వరకూ ఉన్న సూపర్ మేన్ క్లార్క్ కెంట్‌కి విరుద్ధంగా ఈ సారి అతని కొడుకు ‘బైసెక్సువల్’ సూపర్‌మ్యాన్‌గా రాబోతున్నాడు. అదే సంచలనానికి దారి తీసింది. ఈ సూపర్ హీరో ‘బైసెక్సువల్’గా రానున్నట్లు తెలుపుతూ డీసీ కామిక్స్ రైటర్స్ ‘సూపర్‌మ్యాన్: ది సన్ ఆఫ్ కాల్-ఎల్’ ఓ పిక్‌ని విడుదల చేశారు. అందులో జాన్, తన ప్రియుడైన రిపోర్టర్ జై నకమూరాను కిస్ చేస్తున్నాడు. ‘చాలా మంది ఫ్యాన్స్ తమ ఫేవరేట్ హీరోలో తమను చూసుకోవాలనుకుంటారు. సూపర్‌మేన్ సింబల్ హోప్‌కి, నిజానికి, న్యాయానికి ప్రతీక నిలుస్తుంటుంది. ఈ మార్పు ఇకపై ఎక్కువ విషయాలకి ప్రతీకగా నిలువబోతోంది. ఇకపై మోస్ట్ పవర్ఫుల్ హీరోలో తమని తాము చూసుకోబోతున్నారని’ డీసీ కామిక్స్ రైటర్ టామ్ టేలర్ తెలిపాడు. అయితే ఈ విషయమై సూపర్ హీరో అభిమానులు, గతంలో ఈ క్యారెక్టర్ చేసిన నటులు విమర్శలు చేస్తున్నారు. చదవండి: జేమ్స్ బాండ్ స్టార్ డేనియల్ క్రెగ్‌కి అరుదైన గౌరవం -
World Book Day 2021: చలో..‘బుక్’అయిపోదాం..
ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమట.. అప్పట్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పారు.. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఈ రోజు (ఏప్రిల్ 23) ప్రపంచపుస్తక దినోత్సవం.. పుస్తకం గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే.. అందుకే ఈసారి వాటికి నిలయమైన గ్రంథాలయాల గురించి తెలుసుకుందాం.. ఇవి ప్రపంచంలోనే డిఫరెంట్ లైబ్రరీలు.. చలో మరి.. దీని వయసు 1,162 ఏళ్లు ప్రపంచంలో ఇప్పటికీ నిలిచిఉన్న పురాతన లైబ్రరీ మొరాకోలోని ‘ది అల్ ఖారవియిన్ లైబ్రరీ’. క్రీస్తుశకం 859లో ఫాతిమా అల్ ఫిహ్రీ అనే సంపన్న మహిళ దీనిని కట్టించారు. ఇందులో ఎన్నో పురాతనమైన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి.. మొరాకో ప్రభుత్వం ఈ మధ్యే ఈ బిల్డింగ్‌ను పునరుద్ధరించి.. ప్రజల కోసం ఓపెన్ చేసింది. 470 భాషలు.. 3.2 కోట్ల పుస్తకాలు అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండే ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ ఇదే. 470 భాషలకు చెందిన 3.2 కోట్ల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి . అందమైన నగిషీలు, మార్బుల్ ఫినిషింగ్‌తో అందమైన లైబ్రరీగానూ పేరుపొందింది. ప్రతినిధుల సభకు అనుబంధంగా ఉన్నా అక్కడి పౌరులెవరైనా వెళ్లి పుస్తకాలు చదువుకోవచ్చు. నేచురల్ లైటింగ్.. చూడటానికి డిఫరెంట్‌గా కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఈజిప్ట్‌లోని బబ్లియోథెకా అలెగ్జాండ్రియా లైబ్రరీ. ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద లైబ్రరీల్లో ఇదీ ఒకటి. ఈ లైబ్రరీకి 2002లో కొత్త బిల్డింగ్ కట్టించారు. పూర్తిగా సౌర కాంతి పడి పుస్తకాలు చదువుకునేలా రూపొందించారు.ఎక్కువ సంఖ్యలో పురాతన గ్రంథాల ఫొటో కాపీలు ఇక్కడ ఉన్నాయి. చదువుతూ.. రిలాక్స్.. లైబ్రరీ అంటే అంతా సైలెంట్, ఓ పక్కన కూర్చుని మీ చదువేదో మీరు చదువుకుంటారు కదా.. కానీ ఫ్రాన్స్‌లో సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసిన ‘లైర్ అ లా ప్లాగ్ (బీచ్ దగ్గర చదువుకోండి)’ లైబ్రరీలు మాత్రం వెరీ స్పెషల్. నచ్చిన పుస్తకమో, నవలో, మేగజైనో తీసుకుని.. బీచ్ ఇసుకలో అలా రిలాక్స్డ్గా చదువుకోవచ్చు. బీచ్‌ల వెంట ఆరెంజ్ పైకప్పు, ఎరుపు రంగు కుర్చీలను ఏర్పాటు చేశారు. బొమ్మల పుస్తకాలు.. బొమ్మలతో ఉండే కథల పుస్తకాలు.. చిన్నప్పుడు ఇష్టంగా చదివేవాళ్లం.. వాటిని ఇప్పుడు కూడా చదవొచ్చు.. జపాన్‌లోని ఇవాకీ సిటీలో ఉన్న ఈ లైబ్రరీకి వెళ్తే.. ఇక్కడ వెయ్యికి పైగా ఇలాంటి పిక్చర్ బుక్స్ ఉన్నాయి. లోపల సెటప్ సూపర్‌గా ఉంటుంది.. అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. -
నవ్విస్తూనే చురకలేసే.. కార్టూనిస్ట్
అప్‌కమింగ్ కెరీర్ : మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పత్రికల్లో తనపై వచ్చిన కార్టూన్లను కత్తిరించి, దాచుకొనేవారట. ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్ కుంచె నుంచి జాలువారిన ‘కామన్ మ్యాన్’ విగ్రహంగా మారి, కార్టూనిస్ట్‌ల గౌరవం పెంచాడు. మనదేశంలో అన్ని భాషల్లో ప్రసార మాధ్యమాలు విస్తరిం చడంతో కార్టూనిస్ట్‌లకు గిరాకీ పెరిగింది. వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, టీవీ ఛానళ్లు వంటి వాటిలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. వార్తాపత్రికల్లో పనిచేసే కార్టూనిస్ట్ లు జర్నలిస్టుల కంటే ఎక్కువ పాపులర్ కావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం యానిమేషన్, గ్రాఫిక్స్, అడ్వర్టైజ్ మెంట్ రంగాలు, ఇంటర్నెట్, కామిక్స్ బుక్స్ ప్రచురణ సంస్థల్లోనూ కార్టూనిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. పాఠకులకు నాలుగు కాలాలపాటు గుర్తుండిపోయే కార్టూన్ వేయడం ఒక కళ. దీనికి ఎంతో ఊహా శక్తి, పరిశీలనా నైపుణ్యాలు ఉండాలి. నిత్య జీవితంలో జరిగే సంఘటనల నుంచి తనకు పనికొచ్చే అంశాన్ని గుర్తించగల నేర్పు ఉండాలి. కార్టూన్ల ప్రధాన ఉద్దేశం.. నవ్విస్తూనే సున్నితంగా చురకలేయడం. కాబట్టి హాస్యరసాన్ని కాచి వడబోసిన వారే మంచి కార్టూనిస్ట్‌గా త్వరగా గుర్తింపు పొందగలుగుతారు. మనదేశంలోని విద్యాసంస్థల్లో కార్టూన్ల కోసం ప్రత్యేకంగా కోర్సులు లేకపోయినా పెయింటింగ్‌లో భాగంగా వీటిపై శిక్షణ ఇస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్ సంస్థల్లో పెయింటింగ్ కోర్సులు ఉన్నాయి. అర్హతలు కార్టూనిస్ట్‌గా కెరీర్లో స్థిరపడాలనుకొనేవారికి పదో తరగతి, ఇంటర్మీయెట్ పూర్తిచేసిన తర్వాత పూర్తిస్థాయి డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి. కొన్ని సంస్థలు స్వల్పకాలిక కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేతనాలు ఫ్రీలాన్స్ వర్క్ చేస్తే ఒక్కో కార్టూన్‌కు రూ.250 నుంచి రూ.2000 వేల వరకు అందుకోవచ్చు. వార్తాపత్రిక లేదా మేగజైన్లో చేరితే ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా వేతనం లభిస్తుంది. కార్టూనిస్ట్(పెయింటింగ్) కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.jnafau.ac.in సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్: www.uohyd.ac.in పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వెబ్సైట్: http://teluguuniversity.ac.in సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్-ముంబై వెబ్సైట్: www.mu.ac.in కళ నిత్యనూతనం ‘‘కళాత్మకమైన కోర్సులన్నీ నిత్యనూతనమే. అయితే మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కావటంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఎంతబాగా సృజనాత్మకతను ప్రదర్శించగలిగితే కళాకారుడికి అంత గొప్ప పేరు, ప్రఖ్యాతులు వస్తాయి. చిత్రకళలో అవకాశాలకు కొదవలేదు. ఎప్పటికప్పుడు ప్రతిభను నిరూపించుకోవడం పైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. కార్టూనిస్ట్‌లు టీచర్స్‌గా, ఫ్రీలాన్సర్లుగా, మీడియా రంగంలో దేశ, విదేశాల్లో పనిచేయవచ్చు’’ - కప్పరి కిషన్, ఆర్ట్ ఇన్స్ట్రక్టర్, తెలుగు విశ్వవిద్యాలయం