complete fast
-
డిసెంబరు నాటికి రామాలయ నిర్మాణం పూర్తి!
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను సమీక్షించారు. 2024 డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తికానున్నదని వెల్లడించారు. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజున ఉదయం 12:16 గంటలకు సూర్యుని కిరణాలు ఐదు నిమిషాల పాటు బాలరాముణ్ణి తాకుతాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రామనవమి నాడు ఉదయం 3:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రామ్‌లల్లాను భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు. ఆరోజున బ్రహ్మ ముహూర్తంలో మంగళ హారతి, అభిషేకం తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారని తెలిపారు. అయోధ్యలోని సుగ్రీవ కోట, బిర్లా ధర్మశాల, శ్రీరామ జన్మభూమి ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వంద ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, ఆలయంలో నిర్వహించే అన్ని పూజాది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామన్నారు. -
సందేశంతో హెచ్చరిక
అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, గిడ్డేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మిస్తున్నారు. ‘‘సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో చిక్కు కుని అనాథలు నేరస్థులుగా మారే ప్రమాదం ఉందనే సందేశానికి కమర్షియల్ హంగులు మేళవించి ఈ సినిమా తీస్తున్నాం. 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. మూడు పాటలు, రెండు ఫైట్స్‌ను చిత్రీకరించాం. డిసెంబరు కల్లా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేశాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
పుష్కర పనులు త్వరగా చేపట్టండి
మక్తల్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్ పనులను వెంటనే పూర్తిచేయాలని మండల ప్రత్యేక అధికారి శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పంపదేవ్పాడులో మంగళవారం పల్లెవికాసం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో కృష్ణానదికి సమీపంలో నిర్మించిన పుష్కరఘాట్ పనులను త్వరగా చేయాలని సిబ్బందిపై అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు గ్రామంలో పర్యటించి డ్రెయినేజీలు, పాఠశాల, రేషన్‌షాపు, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. తమ పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయనిర్మల, సూపరింటెండెంట్ జయశంకర్ ప్రసాద్, తహసీల్దార్ ఓంప్రకాష్, ఏఓ సుబ్బారెడ్డి, ఆర్ఐ కాలప్ప, ఎంఈఓ లక్ష్మినారాయణ, వీఆర్ఓ బాలప్ప, ఏపీఎం నారాయణ, సర్పంచ్ సుశీలమ్మ, ఎంపీటీసీ రాములు తదితరులు పాల్గొన్నారు.