Comprehensive investigation
-
Shashi Tharoor: కర్కరే మృతిపై దర్యాప్తు జరపాలి
న్యూఢిల్లీ: మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి హేమంత్ కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ డిమాండ్‌చేశారు. పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ షూట్ చేయడం వల్ల యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ కర్కరే చనిపోలేదని, ఆర్ఆర్ఎస్ భావజాలమున్న ఒక పోలీస్ అధికారి బుల్లెట్ తగలడం వల్లే కర్కరే మరణించారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ఆరోపించడంతో శశిథరూర్ సోమవారం స్పందించారు. ‘‘ ఇది నిజంగా తీవ్రమైన అంశం. విజయ్ ఆరోపణల్లో నిజం ఉందని నేను అనట్లేను. కానీ దర్యాప్తు చేస్తే నిజాలు బయటికొస్తాయి. 2008 ముంబై దాడుల ఘటన రాత్రి అసలేం జరిగిందనేది యావత్భారతానికి తెలియాలి. మాజీ పోలీస్ ఐజీ ముష్రిఫ్ రాసిన పుస్తకంలోని అంశాలనే విపక్షనేత విజయ్ ప్రస్తావించారు. కసబ్ షూట్చేసిన గన్‌లోని బుల్లెట్‌తో కర్కరే శరీరంలోని బుల్లెట్ సరిపోలలేదని పుస్తకంలో రాశారు. శరీరంలోని బుల్లెట్ పోలీస్ రివాల్వర్‌లో వాడేదానిలా ఉందని పేర్కొన్నారు. అందుకే కర్కరే మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి’’ అని థరూర్ డిమాండ్ చేశారు. బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగిన మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ మీదా థరూర్ ఆరోపణలు గుప్పించారు. ‘‘నాడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు కసబ్‌కు జైలులో బిర్యానీ పెట్టారని నికమ్ చెప్పారు. అది అబద్ధమని తేలింది. ఇప్పుడు బీజేపీ తరఫున బరిలో దిగడం చూస్తుంటే ఆనాడే ఆయన తన పక్షపాత వైఖరిని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ముంబై దాడుల కేసులో మాత్రమే ఈయన ఇలా పక్షపాతంగా వ్యవహరించారా లేదంటే ఇతరకేసుల్లోనూ ఇలాగే చేశారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి’’ అని అన్నారు. మరోవైపు కర్కరేపై ఆర్ఎస్ఎస్ రగిలిపోయేదని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మాలేగావ్ పేలుడు కేసులో ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్న సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్, కల్నల్ పురోహిత్‌లను కర్కరే పోలీస్ టీం అరెస్ట్‌చేయడంతో ఆయనపై ఆర్ఎస్ఎస్ ద్వేషం పెంచుకుందని రౌత్ అన్నారు. -
అవినీతి అధికారులకు ఇక హడలే!
సాక్షి, అమరావతి: ‘సాధారణంగా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితేనే ఏసీబీ అరెస్టు చేస్తుంది. మధ్యవర్తుల ద్వారానో ఇతర మార్గాల్లోనో లంచం తీసుకుంటే ఏం కాదు’.. ఇదీ దశాబ్దాలుగా రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో నెలకొన్న ధీమా. దాంతో ఏసీబీకి దొరక్కుండా వారు అవినీతికి పాల్పడుతున్నారు. కానీ, అవినీతిపరుల ఈ ధీమాకు ఏసీబీ చెక్ పెడుతోంది. సరికొత్త పంథాతో అవినీతి అధికారులను హడలెత్తిస్తోంది. మూడో కంటికి తెలీకుండా లంచాలు తీసుకున్నా సరే సమగ్ర దర్యాప్తుతో ఆటకట్టిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రెడ్‌హ్యాండెడ్‌గా దొరకనప్పటికీ.. సమగ్ర దర్యాప్తుతో ఆధారాలు సేకరించి అక్రమార్కులను ఏసీబీ అరెస్టుచేస్తోంది. బురిడీ కొట్టిస్తున్న అవినీతి అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రధానంగా మూడు కేటగిరీల ఆధారంగానే విధులు నిర్వహిస్తోంది. ఎవరైనా లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే అరెస్టుచేసి కేసు నమోదు చేస్తోంది.. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఆధారాలు లభిస్తే కేసు నమోదు చేస్తుంది.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అనధికారిక డబ్బులు దొరికినా.. ఇతరత్రా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆధారాలు లభించినా కేసు నమోదు చేస్తుంది. కానీ, ఈ మూడు విధానాల నుంచీ అవినీతి అధికారులు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. తాము నేరుగా కాకుండా మధ్యవర్తుల ద్వారా లంచాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, చెక్‌పోస్టులు, రెవెన్యూ తదితర కార్యాలయాల్లో ఇదే విధానం కొనసాగిస్తున్నారు. ఆదాయనికి మించి ఉన్న ఆస్తుల కేసుల్లో కూడా తమ ఆస్తులకు కాకి లెక్కలు చెబుతున్నారు. ఇక ఆకస్మిక తనిఖీల్లో డబ్బులు లభించినా అవి ఎవరివో అన్నది చెప్పలేరు. కాబట్టి ఏసీబీ అధికారులు తాము చేసిన తనిఖీలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చి సరిపెట్టుకునేవి. ఇక నుంచి ఒక లెక్క.. కానీ, అవినీతి అధికారుల్లో ధీమా.. మితిమీరిన అవినీతికి చెక్ పెడుతూ ఏసీబీ సరికొత్త కార్యాచరణను చేపట్టింది. ప్రధానంగా అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏసీబీ ప్రవేశపెట్టిన 14400 మొబైల్ యాప్ దోహదపడుతోంది. గతంలో కేవలం 14400 కాల్ సెంటర్‌కు ఫోన్ ద్వారానే బాధితులు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ యాప్ వినూత్న ఫీచర్లతో బాధితులకు అండగా నిలుస్తోంది. అవినీతికి సంబంధించి పత్రాలు, ఆడియో, వీడియో రికార్డింగులు కూడా 14400 యాప్ ద్వారా ఏసీబీ అధికారులకు సమర్పించేందకు అవకాశం ఏర్పడింది. దీంతో ఆధారాల సేకరణకు మార్గం సుగమమైంది. బ్యాంకు ఖాతాలు, కాల్ డేటాలు, ఇతరత్రా ఆధారాలతో అవినీతిని నిరూపించే రీతిలో ఆధారాలు సేకరించి సంబంధిత అధికారులను అరెస్టుచేస్తోంది. ఉదా.. లంచం తీసుకున్న రెండునెలల తర్వాత.. కృష్ణాజిల్లా తోట్లవల్లేరుకు చెందిన గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, మిథునలను పోలీసులు ఈ ఏడాది జులై 26న అరెస్టుచేశారు. ఈ హత్య కేసులో శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు సీఐ ముక్తేశ్వరరావు రూ.15లక్షలు, ఎస్సై అర్జున్ రూ.2లక్షలు లంచం డిమాండ్ చేశారు. శ్రీకాంత్‌రెడ్డి బంధువు జొన్నల నరేంద్రరెడ్డి ద్వారా ఈ వ్యవహారం నడిపారు. శ్రీకాంత్‌రెడ్డి తల్లిదండ్రులు నరేంద్రరెడ్డికి రూ.19.36 లక్షలిచ్చారు. ఆ మొత్తం నుంచి నరేంద్రరెడ్డి సీఐ ముక్తేశ్వరరావుకు రూ.12.50 లక్షలు, ఎస్సై అర్జున్‌కు రూ.1.50 లక్షలు లంచం ఇచ్చారు. పోలీసుల పేరుచెప్పి నరేంద్రరెడ్డి ఎక్కువ మొత్తం తీసుకున్నాడని శ్రీకాంత్‌రెడ్డి బంధువు పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి తెలిసింది. ఆ విషయం ఆయన శ్రీకాంత్‌రెడ్డి తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో నరేంద్రరెడ్డి ఆగ్రహించి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డిని హత్యచేశారు. ఈ కేసు విచారించిన ఆత్కూరు పోలీసులు నరేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంతో సీఐ, ఎస్సైల అవినీతి బండారం కూడా బయటపడింది. కానీ.. సీఐ, ఎస్సై లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరకలేదు. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. బ్యాంకు లావాదేవీల వ్యవహారాలు, కాల్‌డేటా, ఇతర ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించి బాధితుల వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం సీఐ, ఎస్సైలను ఏసీబీ అక్టోబర్ 14న అరెస్టుచేసింది. ఆకస్మిక తనిఖీల అనంతరం దర్యాప్తుచేసి మరీ.. అలాగే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆకస్మిక తనిఖీల్లో కర్నూలు కల్లూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మధ్యవర్తుల వద్ద రూ.59,300లు జప్తుచేశారు. కానీ, ఆ డబ్బులు ఎవరివన్నది ఆ రోజు నిరూపించలేకపోయారు. ఏసీబీ మాత్రం సమగ్రంగా విచారించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వారంరోజులపాటు జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. సంబంధిత వ్యక్తులను విచారించారు. మధ్యవర్తుల బ్యాంకు ఖాతాలు, సబ్ రిజిస్ట్రార్, ఆయన కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల లావాదేవీలు అన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్‌ను అరెస్టుచేశారు. -
తెలుగు అకాడమీ స్కాం: మరింత లోతుగా..
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంపై మరింత లోతైన విచారణ అవసరమని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. అకౌంట్స్ ఆఫీసర్ మొదలుకొని తెలుగు అకాడమీ ఉన్నతాధికారుల వరకు ఇందులో పాత్ర ఉందని, బ్యాంకు సిబ్బందితోనూ లాలూచీ వ్యవహారం కొనసాగిందన్న అనుమానం వ్యక్తం చేసింది. అన్ని కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు చేయాలని భావించింది. అకాడమీలో రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు గల్లంతవ్వడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై ప్రభుత్వం విద్యాశాఖకు చెందిన ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసింది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరితో కూడిన ఈ కమిటీ మంగళవారం ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. వాస్తవానికి ఈ నెల 2వ తేదీనే కమిటీ రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. కానీ అవసరమైన కొన్ని డాక్యుమెంట్లు, మరికొన్ని వివరాల కోసం గడువు పొడిగించారు. వీటి ఆధారంగా ప్రాథమిక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. సీఐడీకి బదలాయింపు? మొత్తం మీద బ్యాంకు అధికారులు, అకాడమీ సిబ్బంది, బయట వ్యక్తుల ప్రమేయం ఇందులో కన్పిస్తోందని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. విభిన్న కోణాల్లో, శాస్త్రీయంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని భావించింది. మరికొన్ని లోతైన అంశాలకు ఆధారాలు వెలికితీయాల్సి ఉందని పేర్కొంది. దీన్నిబట్టి కేసును సీఐడీకి అప్పగించే వీలుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. నివేదికలోని వివరాలు ఇవి..! గోల్మాల్ గుర్తించకపోవడానికి కారణాలేమిటి? ‘ఏపీ, తెలంగాణ ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీకి చెందిన రూ.43 కోట్లను యూబీఐ బ్యాంకులో కొన్నేళ్ళ క్రితం డిపాజిట్ చేశారు. ఈ నిధులను ఏపీకి పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో అకాడమీ అధికా రులు భవనాలు, నగదు వివరాలను లెక్కించారు. పలు బ్యాంకులు సహా యూబీఐ కార్వాన్, సంతోష్‌నగర్ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయని గుర్తించారు. వీటిని తీసుకునేందుకు డిపాజిట్పత్రాలను ఈ నెల 21న బ్యాంకుకు పంపినా అక్కడి నుంచి సమాధానం రాలేదు. దీన్ని అకాడమీ అధికారులు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు? ఉన్నతాధికా రుల దృష్టికి ఈ విషయం వచ్చిందా? లావాదేవీలను పర్యవేక్షించే బాధ్యత ఉన్న అకౌంటింగ్ విభాగం డిపాజిట్ల విత్ డ్రా వ్యవహారం గుర్తించకపోవడానికి కారణా లేంటి?’ అని కమిటీ అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుత అధికారుల బాధ్యతారాహిత్యం ‘అసలు డిపాజిట్‌ను ఆగస్టులోనే విత్‌డ్రా చేసుకున్నట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. దీనిపై అంతర్గతంగా ఏం జరిగిందనేది ఇప్పటికీ తెలుగు అకాడమీ స్పష్టంగా చెప్పడం లేదు. రికార్డుల పరిశీలనకు సంబంధించి గానీ, ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే విషయాలను స్పష్టంగా అధికారులు చెప్పలేకపోతున్నారు. తమ హయాంలో ఏమీ జరగలేదని ప్రస్తుత అధికారులు చెప్పడాన్ని బాధ్యతారాహిత్యంగా భావిస్తున్నాం..’ అని పేర్కొంది. ఉన్నతాధికారుల ఆమోదంతోనే.. ‘గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూలై వరకు అకాడమీ అధికారులు వివిధ దశల్లో రూ.43 కోట్లు డిపాజిట్ చేసినట్టు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఆగస్టులో యూబీఐ శాఖల నుంచి విత్‌డ్రా చేసుకుని ఆ సొమ్మును హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల్లో రూ.11.37 కోట్లు డిపాజిట్ చేశారు. ఎస్బీఐ తెలుగు అకాడమీ ఖాతాకు రూ. 5.70 కోట్లు బదిలీ అయ్యాయి. మిగిలిన రూ. 26 కోట్లు అకాడమీ అధికారులే విత్‌డ్రా చేశారని బ్యాంకు వర్గాల వాదన. అయితే ఈ మొత్తం వ్యవహారం అకౌంట్స్ అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. ఉన్నతాధికారులు అనుమతించిన తర్వాతే వ్యవహారం ముందు కెళ్తుంది. కాబట్టి ఉన్నతాధికారుల ఆమోదంతోనే ఇదంతా జరిగిందనేది మా దర్యాప్తులో వెల్లడైంది..’ అని కమిటీ తెలిపింది. అయితే ఎందుకు? ఎవరు? అనే అంశాలపై స్పష్టత లేదని దీనిపై ఆరా తీసినప్పుడు అకాడమీ ఉన్నతాధికారులు విభిన్న వాదనలు విన్పించినట్టు కమిటీ సభ్యుడొకరు తెలిపారు. స్వాహా సూత్రధారుల పట్టివేత హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల స్వాహా కేసులో సూత్రధారులను హైదరాబాద్ సెం ట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు పట్టుకు న్నారు. అకాడమీ ఏఓ రమేష్ సహా మొత్తం ఆరు గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరిలో ఎవరిని అరెస్టు చేయాలి? ఎవరికి నోటీసులు ఇవ్వాలో బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీని ఈ నెల 12 వరకు సీసీఎస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కామ్‌పై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీ సులు గత వారమే నలుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా మిగతా నిందితుల కస్టడీపై కోర్టు గురువారం నిర్ణయం తీసుకోనుంది. కాజేసిన సొమ్ముతో నిందితులు కొన్ని స్థిరాస్తులు ఖరీదు చేశారని, పాత అప్పులు తీర్చడం, కొత్తగా అప్పులు ఇవ్వడం చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిందితుల వద్ద కొంత మొత్తం నగదు అధికారులు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. -
శ్రీశైలంలో డ్రోన్ల సంచారంపై సమగ్ర దర్యాప్తు
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలో డ్రోన్ల సంచారంపై పోలీస్ శాఖ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఎస్పీ ఫక్కీరప్ప సోమవారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రుతితో ఇప్పటివరకు జరిగిన పరిణామాలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. పోలీసులు సున్నిపెంటలో అనుమానిత వ్యక్తుల ఇళ్లను తనిఖీ చేశారు. లంబాడీ కాలనీలో నివాసం ఉంటున్న గుంటె బాలకృష్ణ అలియాస్ బాలును అదుపులోకి తీసుకున్నారు. గతంలో తాను ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంకు చెందిన వెంకట్ అనే వ్యక్తి నుంచి డ్రోన్‌ను అద్దెకు తీసుకుని డ్యాం పరిసర ప్రాంతాలను వీడియో తీసినట్టు బాలకృష్ణ పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం తాను డ్రోన్‌ను వినియోగించడం లేదన్నాడు. అతడికి చెందిన కంప్యూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా సోమవారం రాత్రి మరోసారి శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ తిరగడం కలకలం రేపింది. ఔటర్ రింగ్ రోడ్డులో డీఎస్పీ శ్రుతి పోలీస్ సిబ్బందితో వెళుతుండగా ఇది కనిపించింది. -
విద్యుత్ సంస్థల్లో ‘బినామీ’ ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లోని కొంద రు అధికారులు తమ బంధువులు, మిత్రుల పేర్లతో బినామీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి కాంట్రాక్టు వ్యాపారం చేస్తున్న వైనం రాష్ట్ర ప్రభుత్వం, అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘పనీ మాదే.. పైసా మాదే’శీర్షికతో ప్రచురించిన కథనం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తక్షణమే స్పం దించిన తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు.. బినామీ పేర్లతో కాంట్రా క్టు వ్యాపారం చేస్తున్న విద్యుత్ అధికారులపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డిని ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగులుగా పని చేస్తూ సంస్థతోనే కాంట్రా క్టు వ్యాపారాలు చేయడం సరికాదని ప్రభాకర్‌రావు తప్పుబట్టారు. టెండర్ నిబంధనల ప్రకారం ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో కాంట్రాక్టు పనులు చేపట్టడం అక్రమమని పేర్కొన్నారు. ‘సాక్షి’ ప్రచురించిన పరిశోధన్మాతక కథనం బాగుందని, ఎంతో మంది విద్యుత్ ఉద్యోగులకు కనువిప్పు కలిగించిందని ప్రశంసించారు. బినామీల పేర్లతో కాంట్రాక్టులు నిర్వహిస్తున్నారని దర్యాప్తులో తేలితే నిబంధనల ప్రకారం సంబంధిత పనులను రద్దు చేసి బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. -
డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలిస్తాం
-
తీవ్రమైన అంశాలున్నాయి!
న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతికి సంబంధించి పిటిషన్లలో లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని, అన్ని పత్రాల్ని చాలా క్షుణ్నంగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. లోయా మృతిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ ప్రారంభించింది. ఈ కేసులో బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్, ముంబై ధర్మాసనాలు విచారిస్తోన్న మరో రెండు పిటిషన్లను సుప్రీంకోర్టుకు ధర్మాసనం బదిలీ చేసింది. లోయా మృతిపై ఇకపై ఎలాంటి పిటిషన్లు దాఖలైనా వాటిని విచారణకు స్వీకరించవద్దని అన్ని హైకోర్టుల్ని ఆదేశించింది. ఇంతవరకూ కోర్టుకు సమర్పించని పత్రాలను ఫిబ్రవరి 2లోగా తమ ముందుంచాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేరును తెరపైకి తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీరును కోర్టు తప్పుపట్టింది. షాపై ఆరోపణల పట్ల సాల్వే అభ్యంతరం లోయా మృతిపై కాంగ్రెస్ నేత తెహ్సీన్ పూనావాల్లా, జర్నలిస్టు బీఎస్ లోనే దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. కిక్కిరిసిన కోర్టు గదిలో దాదాపు గంటపాటు న్యాయవాదుల మధ్య వాడీవేడిగా వాదనలు సాగాయి. బాంబే న్యాయవాదుల విభాగం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పేరును ప్రస్తావించారు. షాను రక్షించే క్రమంలోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం జోక్యం చేసుకుని.. ‘ఇప్పటివరకైతే ఇది సహజ మరణమే. ఇప్పుడు ఆ విధమైన ఆరోపణలు చేయొద్దు’ అని దవేకు సూచించింది. వెంటనే దవే లేచి.. ఈ కేసులో అమిత్ షా తరఫున గతంలో సాల్వే హాజరయ్యారని, ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన వాదించడం సరికాదని అన్నారు. ‘ఎవరి తరఫున ఎవరు హాజరవ్వాలనేది న్యాయవాదుల విచక్షణకే వదిలేస్తున్నాం. మేం బార్ కౌన్సిల్ కాదు. మిమ్మల్ని మేం ఆపలేము. కేసుకు సంబంధించిన అన్ని రికార్డుల్ని సంబంధిత పార్టీలు కోర్టుకు సమర్పించాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో స్వతంత్ర విచారణ జరిపించాలని లోయా తండ్రి, సోదరిలు కోరారని దవే వెల్లడించారు. ఈ కేసులో తాను ఎలాంటి విచారణ కోరడం లేదని లోయా కుమారుడి ప్రకటనకు ముందు.. అప్పటి బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అతన్ని తన చాంబర్‌కు పిలిపించుకోవడాన్ని దవే ప్రశ్నించారు. మహారాష్ట్ర ప్రభుత్వ పత్రాల్ని పిటిషనర్ల న్యాయవాదులకు మాత్రమే అందుబాటులో ఉంచాలని సాల్వే కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జైసింగ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం ఈ కేసులో మీడియా కవరేజీని కోర్టు అడ్డుకోవచ్చేమోనని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సందేహం వ్యక్తం చేయగా.. ఆ వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యలు సరికాదని.. వెంటనే వాటిని వెనక్కి తీసుకుని, క్షమాపణలు చెప్పాలని సీజేఐ మిశ్రా ఆదేశించారు. దాంతో ఇందిరా జైసింగ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు. ‘ఇది చాలా అనుచితం. మీడియాను అడ్డుకునే విషయంపై కనీసం నేను ఒక్క మాటైనా మాట్లాడానా? మీడియా కవరేజీని నిరోధిస్తూ ఏదైనా ఆదేశాన్ని జారీ చేశానా?’ అని జస్టిస్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసు చాలా తీవ్రమైందని, అందువల్ల విచారణ సమయంలో మీడియా నివేదికల ఆధారంగా కోర్టు వ్యవహరించదని బెంచ్ పేర్కొంది. నిష్పాక్షిక దృష్టితో పరిశీలిస్తాం వాదనలు ముగిశాక ధర్మాసనం స్పందిస్తూ.. లోయా మృతికి సంబంధించిన అన్ని పత్రాల్ని నిష్పాక్షిక దృష్టితో మరింత లోతుగా పరిశీలిస్తామని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. సున్నితమైన సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తోన్న లోయా.. డిసెంబర్ 1, 2014న స్నేహితుడి కుమార్తె పెళ్లి కోసం నాగ్‌పూర్ వెళ్లిన సమయంలో గుండెపోటుతో మరణించారు. సోహ్రబుద్దీన్ కేసులో అమిత్‌షాతోపాటు రాజస్తాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా, గుజరాత్ పోలీసు మాజీ చీఫ్ పీసీ పాండే తదితరులు కేసు ప్రారంభ దశలో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. -
భూ బాగోతంపై విచారణ జరిపించండి
విజిలెన్స్ కమిషనర్‌కు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో ఎవరివో తెలియని భూముల(అన్ నోన్)ను అధికార పార్టీ నేతలు, సీఆర్డీఏలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కలసి పంచుకున్నారని, ఈ భూ బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విజిలెన్స్ కమిషనర్ ఎస్వీ ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఎస్వీ ప్రసాద్‌కు ఆర్కే ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతంలో కుంటలు, శ్మశానాలు, హక్కుదారులు ఎవరో తెలియని భూములు మొత్తం 500 ఎకరాల వరకు ఉన్నాయని ఆర్కే తెలిపారు. కమిషనర్ స్పందిస్తూ సమగ్ర విచారణ జరిగేలా చూస్తానని హామీనిచ్చారు. ఫిర్యాదు కాపీని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డీజీకి కూడా ఆర్కే పంపించారు. కాగా, సమస్యల నుంచి అవకాశాలు వెతుక్కుంటానని చెప్పే చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడంలో అవకాశాలు వెదుకుతున్నారని ఆర్కే విమర్శించారు. సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాటాడారు. రాజధాని వ్యవహారాలపై శ్వేతపత్రాలు విడుదల చేసే దమ్ముందా? అని సూటిగా ప్రశ్నించారు. -
రికవరీ సొత్తులో హస్తలాఘవం ?
విజయనగరం : చోరీ సొత్తు రికవరీలో పోలీసులు చేతివాటం ప్రదర్శించారా? రికవరీ సొత్తును బాధితుడికి అందజేసినప్పుడు చిలక్కొట్టుడికి పాల్పడ్డారా? జిల్లా ఎస్పీని కింది స్థాయి అధికారులు తప్పుదోవ పట్టించా రా? చోరీ సొత్తు రికవరీలో నిత్యం ఇదే తంతు నడుస్తుందా? అంటే కుసుమగజపతినగర్‌లో జరిగిన చోరీ సొత్తు రికవరీ, బాధితునికి అందజేసే విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే అవుననే అనుమానాలు కల్గిస్తున్నాయి. ఇప్పుడా పోలీసులపై డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీకి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. సొత్తు రికవరీ, ఆభరణాల తూకంలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిగి న్యాయం చేయాల్సిందిగా ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. ఇప్పుడిది పోలీసు శాఖలో చర్చనీయాంశమయింది. వివరాల్లోకి వెళ్లితే... విజయనగరం కంటోన్మెంట్లో గల కుసుమ గజపతినగర్లో నివాసముం టున్న పి.ఎస్.ఎన్.రాజు(సాంబరాజు) ఇం ట్లో గత ఏడాది నవంబర్ ఒకటో తేదీన అర్ధరాత్రి సమయంలో దొంగలు చొరబడి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలతో పాటు వెండి ఆభరణాలు దొంగిలించారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసును విచారించారు. మొత్తానికి ఈ కేసులోని నిందితుల్ని పోలీసులు పట్టుటున్నారు. నిందితులు నేరాన్ని అంగీకరించారు. దీనిపై ఎస్పీ నవదీప్ సింగ్గ్రేవాల్ డిసెంబర్ 22వ తేదీన ప్రెస్‌మీట్ పెట్టి నిందితుల వివరాలను తెలియజేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బమ్మిడి సంతోష్, రౌతు దివాకర్‌తో పాటు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొర్లకోటకు చెందిన పంచాది కాళీ ప్రసాద్ దొంగతనానికి పాల్పడ్డారని, వీరిపైన తొమ్మిది పాత కేసులు పెండింగ్ కేసులున్నాయని తెలిపారు. వారి వద్ద నుంచి ఆయా కేసులకు సంబంధించి రికవరీ వివరాల్ని తెలియజేశారు. ముఖ్యంగా కుసుమ గజపతినగర్‌లోని సాంబరాజుకు సంబంధించి 530.27గ్రాములు( 45.87తులాల) బంగారు ఆభరణాలు, 12కిలోల వెండి ఆభరణాలను రికవరీ చేసినట్టు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. రికవరీ చేసిన వాటిలో 12.45తులాల రోల్డ్ గోల్డ్ ఆభరణం కూడా ఉందని వివరించారు. అయితే, ఆ రికవరీ సొత్తును ఎస్పీ ప్రెస్‌మీట్ పెట్టి 45 రోజులు గడిచినా అప్పగించకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చి, పోలీసు అధికారులను గట్టిగా అడిగారు. దీంతో మొదటిగా బంగారు మొలతాడు, పలు వెండి ఆభరణాలు ఇంటికి తీసుకువచ్చి ఇచ్చినట్టు బాధితుడు చెబుతున్నాడు. అనంతరం కోర్టు ఆర్డర్ తీసుకుని వన్ టౌన్ పోలీసులకు చూపగా మిగతా బంగారం. వెండి అభరణాలను ఈనెల 2వ తేదీన అందజేశారు. ఇక్కడే గమ్మత్తు చోటు చేసుకుంది. ఎస్పీ ప్రెస్మీట్లో 530.27(45.87తులాలు)గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్టు చెప్పగా స్టేషన్ అధికారులు 439.6గ్రాముల బంగారు ఆభరణాల్ని, 12 కిలోల వెండి ఆభరణాలను మాత్రమే అందించారు. వీటిని తీసుకెళ్లి తనిఖీ చేసేసరికి పోలీసులిచ్చిన చిన్న నల్లపూసలదండ(9.5గ్రాములు), బంగారం లాం టి పట్టీలు(12.4గ్రాములు), 8 పేటల చైను(16.9గ్రాములు) రోల్డ్‌గోల్డ్ ఉంది. వీటిని తీసిస్తే నికర బంగారం 400.8(34.67తులాలు)గ్రాములున్నట్టు అయింది. అంటే దాదాపు రికవరీ చేసిన సొత్తులో దాదాపు 130గ్రాములు బాధితుడికి చే రలేదు. ఈ సొత్తు ఎక్కడికెళ్లింది? రికవరీ సొత్తులో ఎవరైనా చేతివాటం ప్రదర్శిం చారా? లేదంటే బాధితుడికి అందజేసిన సమయంలో కొంత పక్కన పెట్టారా? అన్న అనుమానం కల్గిస్తోంది. ఇదిలాఉండగా, బాధితుడు తన ఇంట్లో పోయిన సొత్తు సుమారు 60 తులాల వరకు ఉంటుందని, తొలిసారి ఫిర్యాదులో అన్నీ చెప్పలేకపోయానని మరో వాదన విన్పిస్తున్నాడు. అయితే, తర్వాత చెప్పిన విషయాల్ని ఫిర్యాదులో పేర్కొనలేదని, తొలి ఫిర్యాదులో లేని ఆభరణాలను కూడా నిందితుల్ని నుంచి రికవరీ చేసి తమకివ్వలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఒకవేళ తొలి ఫిర్యాదు చేసినవాటికి మించి లేవని పోలీసు అధికారులు భావిస్తే అందులో పేర్కొనని బంగారు మొలతాడును ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయమై సంబంధిత పోలీసు అధికారుల్ని ఎన్ని మార్లు అడిగినా స్పందన లేకపోవడంతో సదరు బాధితుడు సాంబరాజు ఇప్పుడేకంగా డీజీపీ, ఐజీ,డీఐజీ, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో క్షేత్రస్థాయి అధికారులు, పోలీసు కానిస్టేబుళ్లపైన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, పోయిన సొత్తు అంతా తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏదేమైనప్పటికీ వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో వాస్తవమేంటో తేల్చాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైన ఉంది. ఈ కేసులోనే జరిగిందా, ఇదే తరహాలో మిగతా రికవరీ కేసుల్లోనూ జరుగుతున్నాయా అనే అనుమానాల్ని నివృత్తి చేయవల్సిన అవసరం ఉంది. -
ఇక తెల్లకార్డులకు కత్తెర ...?
* ఏరివేతకు రంగం సిద్ధం * జనవరిలో కొత్త కార్డులు * రాజకీయ జోక్యం ఉంటే అర్హులకు అన్యాయం... విజయనగరం కంటోన్మెంట్: ఇక రేషన్‌కార్డుల కోత ప్రారంభం కానుంది. ఇటీవల ఆధార్, సమగ్ర విచారణ వంటి వంకతో వేలాది మంది నిరుపేద పింఛనర్లను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులపై దృష్టి సారించింది. అర్హత లేని వారికి కూడా తెల్ల రేషన్ కార్డులున్నాయనే నెపంతో భారీగా తెల్ల రేషన్‌కార్డులను తగ్గించుకోనుంది. పింఛన్ల ఏరివేతకు అనుసరించిన విధానంలాగే సర్వే చేపట్టనున్నారు. ప్రస్తుతం అధికారుల బదిలీల పర్వం నడుస్తుండడంతో అది పూర్తయ్యాక అనర్హుల ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహించి, జనవరిలో కొత్త కార్డులను ఇవ్వనున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్లో సర్వే నిర్వహించి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జనవరిలో పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 7,05,592 రేషన్ కార్డులున్నాయి. ఇందులో 44,296 పింక్ రేషన్ కార్డులు కాగా, మిగతా 6,61,296 తెల్ల రేషన్ కార్డులు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న తెల్ల రేషన్ కార్డుదారుల్లో చాలా మంది అనర్హులున్నారని ప్రభుత్వం భావిస్తోంది. 10 నుంచి 30 ఎకరాల సాగు భూములున్నవారు, నెలకు రూ.20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ లావాదేవీలు నిర్వహిస్తున్న వ్యాపారులు, వేలాది రూపాయల జీతాలు పొందుతున్న ప్రైవేటు ఉద్యోగులతో పాటు వేలాది మంది ధనిక వర్గీయులు తెల్ల రేషన్ కార్డులు పొందారని, వారందరికీ కార్డులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందని భోగట్టా! ఇప్పటికే గతంలో నిర్వహించిన రచ్చబండలోనూ, ప్రస్తుతం నిర్వహించిన జన్మభూమిలోనూ వేలాది మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా పెళ్లయిన వారు, త ల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారు దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారు. అసలు జిల్లాలో ఉన్న జనాభాకు, రేషన్ కార్డులకూ పొంతన లేకుండా ఉంది. జనాభాకూ, రేషన్ కార్డుల్లోని యూనిట్లతో(రేషన్ కార్డుల్లోని కుటుంబ సభ్యుల సంఖ్య) పోలిస్తే ఎక్కువగా ఉండడంతో అప్పట్లో యంత్రాంగం కలవరపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో దాదాపు 17వేల కార్డులు రద్దయ్యాయి. ఇంకా డీలర్ల వద్ద, ఇతర వ్యాపారుల వద్ద వేలాది కార్డులు బోగస్‌వి, తనఖా కార్డులు కూడా ఉన్నాయని అంటున్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా సాధ్యమా? జిల్లాలో కొత్త రేషన్ కార్డులకు తెర లేచినా, పాత కార్డులను రద్దు చేసినా రాజకీయ నాయకుల పైరవీలు, పెత్తనాలు తప్పవు. రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా ఉన్నవారి కార్డులను ఉంచేసి అనుకూలం కాని వారి కార్డులను రద్దు చేసే పరిస్థితులున్నాయి. ఇటీవల పింఛన్ల విషయంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అదే జరిగే మళ్లీ పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. -
పోలీస్ శాఖలో ఇద్దరు సస్పెన్షన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కానిస్టేబుళ్లు, జిల్లా పోలీస్ కార్యాలయ ఉద్యోగులు కలసికట్టుగా సాగించిన మెడికల్ లీవుల కుంభకోణంపై జిల్లా ఎస్పీ డాక్టర్ కె.రఘురామిరెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. ‘లీవుల స్వాహా’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఉద్యోగుల మెడికల్ లీవులను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయకుండా అవకతవకలకు పాల్పడిన జిల్లా పోలీస్ కార్యాలయంలోని ‘ఏ సెక్షన్’ విభాగం జూని యర్ అసిస్టెంట్లు లంకా కిషోర్, హలీమ్‌ను సస్పెండ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ మెడికల్ లీవుల అవకతవకలపై ఇప్పటికే తమకు సమాచారం ఉందన్నారు. సమగ్ర వివరాలతో వచ్చిన ‘సాక్షి’ కథనం ఆధారంగా లోతైన విచారణ చేస్తామని చెప్పారు. మెడికల్ లీవులను సర్వీసు రిజిస్టర్లో నమోదు చేయించకుండా జీతాలు పొందిన కానిస్టేబుళ్ల వేతనాల్లో కోత విధించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు, రాష్ట్ర ఖజానా విభాగానికి లేఖ రాస్తామని చెప్పారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో మరోసారి ఇటువంటి అవకతవకలకు పాల్పడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాథమికంగా ఆ ఇద్దరు ఉద్యోగులదే తప్పని తేలడంతో వారిని సస్పెండ్ చేశామని, వీరితోపాటు ఆ విభాగంలో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయమై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.