Contracting
-
‘బ్లీడింగ్ ఐస్’ వ్యాధి అంటే..! సోకితే అంతేనా..!
కొన్ని రకాల వ్యాధులు చాపకింద నీరులా నెమ్మదిగా వస్తాయి. మనం కూడా పెద్ద సమస్య కాదని, లైట్‌గా తీసుకుంటాం. అది కాస్త మనం చూస్తుండగానే సీరియస్‌గా మారి ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి వ్యాధి బారినపడి ఇక్కడొక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..స్పెయిన్‌లో 74 ఏళ్ల వ్యక్తి ప్రాణాంతకమైన క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్) బారిన పడి మరణించాడు. దీనిని "బ్లీడింగ్ ఐస్ వ్యాధి" అని కూడా పిలుస్తారు. ఇది వైరల్ వ్యాధి. దీని కారణంగా మరణాల రేటు సుమారు 40% వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఆ వ్యక్తి మాడ్రిడ్‌కు నైరుతి దిశలో వంద మైళ్ల దూరంలో ఉన్న టోలెడోలో టిక్ కాటుకు గురవ్వడంతో జూలై 19న మోస్టోల్స్ ప్రాంతంలోని రే జువాన్ కార్లోస్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ వైద్యులు అతడి పరిస్థితిని గుర్తించిన తర్వాత హై-డిపెండెన్సీ ఐసోలేషన్ యూనిట్‌కు తరలించారు. మొదట్లో పరిస్థితి నిలకడగా ఉన్నా..తర్వాత.. తర్వాత అతడి పరిస్థితి క్షీణించి మరణించడం జరిగింది. దీన్ని క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్(సీసీహెచ్ఎఫ్) సంబంధిత మరణంగా పేర్కొన్నారు. అంతేగాదు వైద్యులు అప్రమత్తమై ఈ ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తిని అరికట్టేలా తదుపరి కేసుల్లో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు ఈ టిక్ బోర్న్ వ్యాధి ఎబోలా మాదిరిగా ఉంటుందని, డబ్ల్యూహెచ్ఓ జాబితా చేసిన తొమ్మిది వ్యాధికారక క్రిములకు సంబంధించినదని, అంటువ్యాధిలాంటిదని వెల్లడించారు. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అంటే..క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ (CCHF) అనేది టిక్ కాటు ద్వారా మానవులకు వ్యాపించే అరుదైన వైరల్ వ్యాధి. జంతువులను వధించిన వెంటనే, తక్షణమే వైరమిక్ జంతు కణజాలాలతో (వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించిన జంతు కణజాలం) సంపర్కం ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఇది అంటువ్యాధులకు కారణమవుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా ఆఫ్రికా, బాల్కన్లు, మధ్యప్రాచ్యం, ఆసియాలలో ఉంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధిని తొలిసారిగా 1944లోక్రిమియన్ ద్వీపకల్పంలో గుర్తించారు. అందువల్లే దీనికి క్రిమియన్ హెమరేజిక్ ఫీవర్ అని వైద్యులు నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ వ్యాధిని 1956లో కాంగో బేసిన్లో గుర్తించడం జరిగింది. దీంతో ఈ వ్యాధికి ఈ రెండు ప్రాంతాల మీదుగా క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ అనే పేరుని పెట్టారు నిపుణులు.ఈ వ్యాధి లక్షణాలు..తీవ్ర జ్వరంతీవ్రమైన తలనొప్పివెన్ను, కీళ్ల నొప్పులుకడుపు నొప్పి, వాంతులుఎర్రటి కళ్ళు , ఎర్రబడిన ముఖంనోటి పైకప్పు మీద ఎర్రటి మచ్చలుకామెర్లుమానసిక స్థితి, ఇంద్రియ అవగాహనలో మార్పులుఆందోళననిద్రమత్తురక్తస్రావం.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం..ఆస్పత్రిలో చేరిని వారిలో దాదాపు 50% మంది మరణిస్తారని పేర్కొంది. నివారణటిక్ కాటును నివారించడానికి డీఈఈటీ కలిగిన క్రిమి వికర్షకాన్ని ఉపయోగించండి.సీసీహెచ్ఎఫ్ ఉన్న జంతువులను నిర్వహించేటప్పుడు చేతి తొడుగులు, పొడవాటి చేతులు, ప్యాంటు ధరించండి.సోకిన జంతువులు లేదా వ్యక్తుల శరీర ద్రవాలు మీపై ప్రసరించకుండా జాగ్రత్త పడండి. (చదవండి: అక్కడ భర్త జీతం అంతా భార్య చేతిలో పెట్టాల్సిందేనట..!) -
ఇక... మన మండలం/జిల్లా
* ప్రణాళికలు రూపొందించాలంటూ ఆదేశాలు జారీ * మండల స్థాయిలో ఇలా... మండల స్థాయిలో 16 అంశాలకు సంబంధించిన వివరాలు పొందుపరచాలి. మండల పరిషత్ పరిధిలోని ప్రజాప్రతినిధుల వివరాలు, సిబ్బంది వివరాలు (రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్), వివిధ ప్రభుత్వ కార్యాలయాల మౌలిక సదుపాయాల వివరాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆస్తులు, నిధులు, వ్యయం, ఆదాయ వనరులు, స్వయం సహాయక సంఘాల వివరాలు, మండల పరిషత్‌లోని మొదటి పది ప్రాధాన్యత పనులు, మండల స్థాయిలో శాఖల వారీగా 2013-14, 2014-15 సంవత్సరంలో చేపట్టిన పనుల వివరాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలి. మండల స్థాయి సమావేశాలు 21వ తేదీన ప్రారంభించి, 24లోగా పూర్తి చేయాలి. ఇక్కడ రూపొందించిన ప్రణాళికలను మండల సర్వసభ్యసమావేశంలో ఆమోదించాలి. నీలగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘మనఊరు-మన ప్రణాళిక’’ గ్రామసభలు ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో ‘‘మన మండలం- మన జిల్లా’’ ప్రణాళికలు తయారు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మనఊరు-ప్రణాళిక గ్రామసభలు ఈ నెల 13వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ సభలు ఆదివారంతో ముగియనున్నాయి. రెండు, మూడు మండలాలు మినహా దాదాపు అన్ని గ్రామాల్లో గ్రామసభలు పూర్తిచేశారు. ఈ సభల్లో ప్రజల నుంచి పెద్దఎత్తున విన్నపాలు వెల్లువెత్తాయి. వీటిని అధికారులు క్రోడీకరించి అంచనాలు సిద్ధం చేస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రామస్థాయి ప్రణాళికలను రెండు, మూడురోజుల్లో ఆన్లైన్లో నమోదు చేస్తారు. కాగా గ్రామ ప్రణాళిక ముగింపు దశకు చేరుకోవడంతో ‘మన మండలం-మన జిల్లా ప్రణాళిక’ సిద్ధం చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి జిల్లాకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఓవైపు గ్రామ ప్రణాళికల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తూనే...మరోవైపు మండల, జిల్లా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి శనివారం రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల్లో, జిల్లా స్థాయిలో ఏవిధంగా వివరాలు సేకరించాలనే అంశంపై అన్ని మండలాలకు నమూనా (ఫార్మాట్) పత్రాలను పంపారు. ఇంటెలీజెన్స్ ఆరా... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై ఇంటెలీజెన్స్ సైతం ఆరా తీస్తోంది. ఇంటెలీజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, సిబ్బందితో ఫోన్లో మాట్లాడుతున్నారు. నేరుగా గ్రామసభలకు వెళ్లి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గ్రామసభలు ఏ విధంగా జరుతున్నాయి..? అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారా..? ప్రజల స్పందన ఏవిధంగా ఉంది..? ప్రణాళికలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారా..? అనే అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. -
చిరుద్యోగుల భవిష్యత్తుపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటుకానున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్ణయంపై రాష్ట్రంలోని సుమారు 3.84 లక్షల మంది చిరుద్యోగుల భవిష్యత్ ఆధారపడి ఉంది. విభజన పంపకాల నుంచి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు, హోంగార్డులు, ఎన్‌ఎంఆర్‌లను మినహాయింపు ఇచ్చారు. రెగ్యులర్ పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ.. ఆ పోస్టులను ఖాళీగానే చూపించనున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు, హోంగార్డులు కలిపి ఉమ్మడి రాష్ట్రంలో 3.84 లక్షల మంది పనిచేస్తున్నారు. వారి పదవీ కాలాన్ని మే నెలాఖరుకే ముగియనున్నా.. రెండు రాష్ట్రాలు విడిపోతున్నందున వారి పదవీ కాలాన్ని జూన్ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించారు. కానీ, వీరి భవిష్యత్ కొత్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు.hh జూన్ 2న రాష్ట్రం విడిపోరుు రెండు ప్రభుత్వాలు ఏర్పడనుండగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీ కాలం జూన్ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వాలు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాయూ లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.