Control system
-
Hyderabad Metro: ప్రయాణికుల సంఖ్య పెరిగినా అవే సాంకేతిక ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా రైళ్లలో రద్దీ నాలుగు లక్షల మార్కును దాటి.. ప్రస్తుతం దాదాపు అదే స్థాయిలో కొనసాగుతోంది. కానీ.. మెట్రో రైళ్లు తరచూ మందగిస్తున్నాయి. కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపాలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా నాంపల్లి– లక్డీకాపూల్ మార్గంలో ట్రాక్‌కు సంబంధించి సాధారణ నిర్వహణ, మరమ్మతులో భాగంగా గ్రౌటింగ్ పనులు జరుగుతుండడంతో రైళ్ల వేగం అకస్మాత్తుగా 15 కేఎంపీహెచ్‌కు పడిపోవడం గమనార్హం. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. సాంకేతిక చిక్కులు.. ► సాధారణంగా మెట్రో రైళ్ల వేగం 50–60 కేఎంపీహెచ్ మధ్యన ఉంటుంది. ఒక్కసారిగా రైళ్ల మందగమనంతో సమయానికి గమ్యస్థానానికి చేరుకుందామన్న ప్రయాణికుల అంచనాలు తప్పుతున్నాయి. రైళ్లు కిక్కిరిసి ఉంటున్న నేపథ్యంలో అకస్మాత్తుగా రైళ్ల వేగం పడిపోయిన ప్రతిసారీ ఏం జరిగిందోనని ప్రయాణికుల్లో ఆందోళన, గందరగోళం నెలకొంటోంది. ► నగర మెట్రో రైళ్లలో డ్రైవర్ అవసరం అంతగా లేని కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. వాతావరణ మార్పులు, ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిన సమయంలో ఈ టెక్నాలజీలో తరచూ లోపాలు తలెత్తుతున్నాయి. ఉన్నపళంగా రైళ్లు పట్టాలపై నిలిచిపోవడం, వేగం తగ్గడం తదితర సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సాంకేతికతను మన నగర పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రద్దీ పెరుగుతోంది.. ప్రస్తుతం నగరంలో అన్నిరకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పుంజుకోవడంతో రైళ్లలో రద్దీ కోవిడ్‌కు ముందున్న స్థాయిలో నాలుగు లక్షలకు చేరువైంది. అత్యధికంగా ఎల్బీనగర్– మియాపూర్ రూట్లో నిత్యం రెండు లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ఐటీ కంపెనీల్లో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో నాగోల్– రాయదుర్గం రూట్లోనూ రద్దీ 1.75 లక్షల మేర ఉంది. జేబీఎస్– ఎంజీబీఎస్ రూట్లో రద్దీ నిత్యం సరాసరిన 25 వేల మేర ఉంది. పండగలు, సెలవురోజుల్లో మూడు మార్గాల్లో కలిపి ప్రయాణికుల రద్దీ అదనంగా మరో 30 వేల 50 వేల వరకు ఉంటుందని మెట్రో వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: ఫార్ములా– ఈ పనులు రయ్..రయ్) -
స్పీడ్ కంట్రోల్‌కు.. ఫోర్డ్ జియోఫెన్సింగ్ టెక్నాలజీ!
-
ఈ వెలుగులు ఆ ప్రస్థానానికే...
అక్కడ స్విచ్ వేస్తేనే... ఇక పల్లెకు వెలుగులు. అదెలాఅనుకుంటున్నారా? కమాండ్ కంట్రోల్ సిస్టమ్ద్వారానేజిల్లా కేంద్రం నుంచి నియంత్రణ మొదలవుతుంది.ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రిసిటీ ఎఫీషియెన్సీ లిమిటెడ్ సిద్ధమవుతోంది. జిల్లాలోని ప్రతి పల్లెలోనూ ఇక ఎల్ఈడీల ఏర్పాటు ముమ్మరమవుతోంది.ఎక్కడ దీపం వెలగకున్నా... కమాండ్ కంట్రోల్ సిస్టమ్గుర్తిస్తుంది. తక్షణం దాని పునరుద్ధరణకు తగు సూచనలిస్తుంది. అంతేనా... బిల్లులు చెల్లించని పంచాయతీలకుసరఫరా నిలిపివేసేందుకు కూడా ఈ విధానం దోహదపడనుంది. విద్యుత్‌బిల్లులు సకాలంలో వసూలు కావాలంటేఇలాంటి నియంత్రణ ఇక అనివార్యమేమో... సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలోని పంచాయతీల్లో వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. మూడేళ్లుగా వరుసగా 14వ ఆర్థిక సంఘం, ఎంపీల్యాడ్స్ నిధులతో జిల్లాలోని 594గ్రామాల్లో ఇప్పటికే ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. మరో 326 గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు ఎలక్ట్రిసిటీ ఎఫీషియెన్సీ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సిద్ధమవుతోంది. ఈ దీపాలను నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రమైన విజయనగరంలో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల విద్యుత్ బకాయిల వసూళ్లకు కూడా అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన దీపాల్లో చాలా వరకూ పనిచేయడం లేదు. వాటిని మరమ్మతు చేయడానికి కూడా ఎవరూ ప్రయత్నించడం లేదు. కమాండ్ కంట్రోల్ విధానం అమలులోకి వస్తే ఈ పరిస్థితిలోనూ మార్పు వచ్చే అవకాశం ఉంది. నగరం నుంచే వీధిలైట్ల నియంత్రణ జిల్లాలో 920 పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి లైట్లు ఏర్పాటు పూర్తి చేసిన తర్వాత వాటిని జిల్లా పరిషత్, కలెక్టరేట్లో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానిస్తారు. వాటిని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ఏయే లైట్లు వెలుగుతున్నాయి. ఏయే లైట్లు వెలగడం లేదు. గ్రామాల్లోని వీధి లైట్ల సంఖ్యను అనుసరించి కమాండ్ కంట్రోల్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమయిన టీసీఎంఎస్ బాక్సులను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్రామంలో తక్కువగా ఉంటే ఓ టీసీఎంఎస్ బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. అదే పెద్ద గ్రామమయితే అక్కడి అవసరాన్ని బట్టి రెండు నుంచి నాలుగు బాక్సులు అవసరమవుతాయని చెబుతున్నారు. ఫ్రీక్వెన్సీని గ్రహించే దూరాన్ని బట్టి ఈ టీసీఎంఎస్ బాక్సులను ఏర్పాటు చేస్తారు. ఎన్ని మార్చాల్సి ఉందన్న విషయాలు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సిబ్బంది తెలుసుకుని ఆయా ఏజెన్సీలను అప్రమత్తం చేస్తారు. వెంటనే ఆయా గ్రామాల పరిధిలో ఉండే సిబ్బంది వెళ్లి లైట్లకు మరమ్మతులు చేయడం లేదా కొత్తవి ఏర్పాటు చేయడం చేస్తారు. బిల్లులు చెల్లించకుంటే కట్! పంచాయతీల్లో ఉన్న వీధి లైట్లకు అయ్యే విద్యుత్ చార్జీలను చెల్లించేందుకు సర్పంచ్‌లు, విద్యుత్ శాఖాధికారుల మధ్య గతంలో వివాదాలు నడిచేవి. గతంలో ప్రభుత్వం చెల్లించే వీధిలైట్ల విద్యుత్ బిల్లులను ఇప్పుడు నిధుల్లేని గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిందేనని టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూల్స్ మార్చింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 83,013 విద్యుత్ స్తంభాలుంటే వాటిలో 75,047 స్తంభాలకు వీధిలైట్లను నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. విద్యుత్ శాఖకు జిల్లాలోని మైనర్ పంచాయతీలు రూ.21.29 కోట్లు, మేజర్ పంచాయతీలు రూ. 2.50 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2017–18 బకాయిలే రూ.10.35 కోట్లు కాగా వాటిలో కేవలం రూ.5.43 కోట్లు వసూలు చేయగలిగారు. ఇలా ఏటా సగానికిపైగా బకాయిలు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. -
విమానచార్జీలు నియంత్రించాలి: రాజ్యసభలో చర్చ
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్న అంశం గురువారం రాజ్యసభలో దుమారం రేపింది. చార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులు ఉండేలా ప్రభుత్వం నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ పార్టీలకతీతంగా ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే, చార్జీలపై పరిమితులను విధించడం ఏవియేషన్ రంగ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వివరించారు. అయితే ఈ సమస్యకు తగు పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారించగలమని ఆయన చెప్పారు. కానీ, దీనిపై సంతృప్తి చెందని కాంగ్రెస్, ఎస్పీ తదితర పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. -
విమానయాన చార్జీలను నియంత్రించాలి
న్యూఢిల్లీ: విమాన ప్రయాణ చార్జీల్లో భారీ మార్పులు ఉంటున్న నేపథ్యంలో వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని విమానయానంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది. ఇష్టారీతిగా చార్జీలు వసూలు చేస్తున్న ఎయిర్‌లైన్స్.. విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు తగ్గినా ఆ ప్రయోజనాన్ని ప్రయాణికులకు బదలాయించడం లేదని పేర్కొంది. ప్రస్తుతం చార్జీలను నియంత్రించేందుకు పారదర్శకమైన వ్యవస్థేమీ లేని నేపథ్యంలో పౌర విమానయాన శాఖ తక్షణమే నియంత్రణ వ్యవస్థని ఏర్పాటు చేయాలని సూచించింది. తద్వారా చార్జీలు సముచిత శ్రేణిలో ఉండేలా చూడాలని తెలిపింది. 80 ఏళ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టాన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే, వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి, మృతదేహాన్ని తీసుకెడుతున్న వారికి ఆఖరు నిమిషంలోనైనా సరే తగినన్ని సీట్లు, అందుబాటు చార్జీలో ఉంచాలని స్థాయీ సంఘం పేర్కొంది.