cosmetic surgeon
-
తెగిన ముక్కు తిరిగొచ్చింది!
విజయవంతంగా అమర్చిన అపోలో వైద్యులు సాక్షి, హైదరాబాద్: కత్తిపోటు ఘటనలో ముక్కు తెగిన ఓ వ్యక్తికి అపోలో ఆస్పత్రిలో విజయవంతంగా చికిత్స చేశారు. టాంజానియాకు చెందిన సిలాహ్ క్వాహు (46)కు 2014 సెప్టెంబర్‌లో జరిగిన ప్రమాదంలో ముక్కు తెగిపోయింది. చికిత్స కోసం స్థానిక వైద్యులను ఆశ్రయించినా పోయిన ముక్కు తిరిగి రాలేదు. ముక్కు లేకపోవడంతో బయట తిరుగలేని పరిస్థితి. దీంతో సిలాహ్ ఇటీవల జూబ్లిహిల్స్ అపోలోకు చెందిన కన్సల్టెంట్ కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ సుధాకర్ప్రసాద్ను సంప్రదించాడు. ఇండియన్ రైనో ప్లాస్టీ పద్ధతిలో చికిత్స చేయాలని డాక్టర్ నిర్ణరుుంచారు. ఈ మేరకు తొలిదశలో కుడి మోచేతి నుంచి చర్మాన్ని, చెవి భాగంలోని మెత్తని ఎముకలను సేకరించారు. ఎడమ మోచేతిపై ముక్కు ఆకారాన్ని, రక్తనాళాలను వృద్ధి చేశారు. మోచేతిపై తయారైన ముక్కు ఆకారాన్ని తీసి కత్తిపోటు ఘటనలో పోయిన ముక్కు భాగంలో విజయవంతంగా అమర్చారు. వెంట్రుక కన్నా సన్నగా ఉండే దారంతో కుట్లు వేసి, రక్తనాళాలను ఉత్పత్తి చేశారు. ఆ తర్వాతి దశలో పక్కటెముకల నుంచి కొంత ఎముకను తీసి ముక్కు దూలాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సాధారణ ముక్కు ఏర్పడింది. బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు తెలిపారు. -
కళ్ల ముందరి కపట ప్రపంచాలు!
ఈ ఎన్నికల్లో మోడీ గనుక ప్రధానమంత్రి అయితే వస్తులౌల్యం, పిడివాదం రెండూ కూడా మరింత ప్రబలే ప్రమాదం లేకపోలేదు అని దర్శకురాలు పహూజా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె తన చిత్రాన్ని విడుదల చేయడం వెనుక ఉన్న కారణం కూడా మహిళల్లో చైతన్యం తేవాలనే. చైతన్యం అంటే ఆవిడ ఉద్దేశం... స్త్రీలకు వ్యతిరేకంగా స్త్రీలకు తెలియకుండా జరుగుతున్న ఈ పురుషాధిక్య సమాజపు అన్నిరకాల కుట్రలపై స్త్రీలను మేల్కొల్పడం. క్లినిక్‌లో తన ఎదురుగా కూర్చొని వున్న యువతివైపు సాలోచనగా చూశారు జమునా పాయ్. ముంబైలో ప్రముఖ కాస్మెటిక్ సర్జెన్ ఆవిడ. ఆమె పరీక్షిస్తున్నది మిస్ ఇండియా పోటీలలో పాల్గొననున్న ఒక అమ్మాయిని. ‘‘గుడ్. కుందనపు బొమ్మలా ఉన్నావు. చుబుకం మీద చిన్న బొటాక్స్ ఇంజక్షన్ ఇస్తే చాలు, ముఖంపై కనిపిస్తున్న ఆ సన్నటి గీతలు కూడా మటుమాయం అవుతాయి’’ అన్నారు జమున. ఆ మాటలకు ఆ అమ్మాయి ముఖం వికసించింది. అందాల పోటీలో తనదే గెలుపు అన్నంతగా సంబరపడింది. ఔరంగాబాద్‌లోని ఓ క్లాస్ రూమ్. నిండైన చీరకట్టులో ఉన్న ఒక నడి వయసు స్త్రీ, తన ముందున్న ఆడపిల్లలకు మన సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనం గురించి చెబుతున్నారు. నిజానికి అమె చెప్పవలసింది ఉపాధి అవకాశాల గురించి. అందులో భాగంగా ‘సంస్కృతి, సంప్రదాయం’ ప్రస్తావనకు వచ్చాయి. అంతకు ముందే ఓ అమ్మాయి ‘‘మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు ఉద్యోగాలు చేయలేరా? ఊళ్లు ఏలలేరా?’’ అని ఎంతో ఆవేదనగా ప్రశ్నించింది. ఆ ఆవేదనే టీచరు గారికి కోపం తెప్పించింది. ‘‘మగాడికి ఆడవాళ్లు ఎలా సమానం అవుతారు? గత ఐదువేల ఏళ్ల సంవత్సరాలుగా మనమేంటో మనకు తెలియదా? ఏనాడైనా పురుషుడికి దీటుగా స్త్రీ నిలబడగలిగిందా?’’ అని ఆమె గర్జించ పై రెండు సన్నివేశాలలోని పరస్పర విరుద్ధ సారాంశమే నిషా పహూజా లఘుచిత్రం (డాక్యుమెంటరీ) ‘ది వరల్డ్ బిఫోర్ హర్’లోని కథాంశం. వాస్తవానికి ఇది 2012 నాటి చిత్రం. అప్పట్లో ఇది చిత్రోత్సవాలలో తప్ప ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఈ మే నెలలో దేశంలోని కొన్ని థియేటర్లలో విడుదల కాబోతోంది. సందర్భం ఏమిటి? ఉంది. పై రెండూ... విశ్వహిందూ పరిషత్‌లోని పిడివాద విభాగం ‘దుర్గా వాహిని’ నేతృత్వంలో, ‘మిస్ ఇండియా’ అందాల పోటీల ఆధ్వర్యంలో జరిగిన శిక్షణా శిబిరాల్లోని సన్నివేశాలు. సిద్ధాంతాల పరంగా పైకి అవి వేర్వేరుగా కనిపించినా వాటి ఉద్దేశాలు, అంతరార్థాలు ఒకటేననీ; రెండూ కూడా మహిళలకు అలా చెయ్యాలనీ, ఇలా చెయ్యకూడదనీ చెప్పేవేననీ పహూజా అంటారు. వాళ్లని సొంత ఆలోచనలు చెయ్యనీయకుండా, సొంత నిర్ణయాలు తీసుకోనీయకుండా, తమ కాళ్లపై తాము నిలబడకుండా ఈ పితృస్వామ్య వ్యవస్థ రకరకాల రూపాలలో మహిళలపై ఆధిపత్యం చెలాయిస్తోందని పహూజా ఆరోపణ. ఇవి రెండూ కూడా ‘తిరోగమన ప్రగతి’ దృక్పథాలేనన్నది ఆమె వాదన. ‘దుర్గావాహిని’ మహిళల ఆలోచనలను నియంత్రిస్తే, అందాల పోటీలు మహిళల దేహాన్ని నియంత్రిస్తున్నాయని పహూజా ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ చిత్రంలో చూపించారు. పహూజా ఈ చిత్రాన్ని 2008లో మొదలు పెట్టినప్పటికీ, అది పూర్తవడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది! కెనడాలో జన్మించిన ఈ భారతీయ సంతతి మహిళ మొదట అందాలపోటీలపై ఒక డాక్యుమెంటరీ తీయాలనుకున్నారు. అయితే వాటిని వ్యతిరేకిస్తున్న (ముఖ్యంగా స్విమ్ సూట్ రౌండ్లను) విశ్వహిందూ పరిషత్ వైఖరిని కూడా పరిగణనలోకి తీసుకుని కథను విస్తృతం చేసుకున్నారు. రెండు ధోరణులనూ ఖండించారు. ‘‘దుర్గా వాహిని’ శిబిరంలోకి ప్రవేశం దొరకడానికే నాకు రెండేళ్లు పట్టింది. అక్కడ నేను ప్రాచి అనే శిక్షకురాలిని కలిశాను. ఆమె వయసు 24. తన జీవిత ధ్యేయం ఏమిటిని అడిగాను. ‘సాధ్వి’ స్థాయికి చేరుకోవడమేనని ఆ ఆమ్మాయి ఎంతో ఉత్సాహంగా చెప్పింది. సాధ్వి అంటే సాధ్వి ప్రజ్ఞాసింగ్. అతివాద కార్యకలాపాలు నెరిపిందంటూ ఆమెపై ఆరోపణలు ఉన్నాయి కదా అన్నప్పుడు, ప్రాచీ చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాను. ‘అయినా సరే నేనూ ఆమె స్థాయికి చేరుకోవాలి’ అని చాలా గట్టిగా చెప్పింది’’ అని పహూజా గుర్తుకు తెచ్చుకున్నారు. భారతదేశంలోని వినిమయ సంస్కృతిని, పిడివాద ధోరణులను అర్థవంతంగా, ఆవేశ రహితంగా చూపిన‘ది వరల్డ్ బిఫోర్ హర్’ 2012 ట్రిబెకా (న్యూయార్క్) చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం అవార్డును పొందింది. ఆ మాట అలా ఉంచితే, ‘‘ఈ ఎన్నికల్లో మోడీ గనుక ప్రధానమంత్రి అయితే వినిమయం, పిడివాదం రెండూ కూడా మరింత ప్రబలే ప్రమాదం లేకపోలేదు’’ అని పహూజా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె తన చిత్రాన్ని విడుదల చేయడం వెనుక ఉన్న కారణం కూడా మహిళల్లో చైతన్యం తేవాలనే. చైతన్యం అంటే ఆవిడ ఉద్దేశం... స్త్రీలకు వ్యతిరేకంగా స్త్రీలకు తెలియకుండా జరుగుతున్న ఈ పురుషాధిక్య సమాజపు అన్నిరకాల కుట్రలపై స్త్రీలను మేల్కొల్పడం. -
కొత్తందం కొనేద్దాం
- ముచ్చటైన ముఖాల కోసం నేతల తాపత్రయం - ఎన్నికలకు ముందు ప్లాస్టిక్ సర్జన్లకు పెరిగిన గిరాకీ ఎన్నికల బరిలోకి దిగిన నేతలు ప్రత్యర్థులపై సంధించే ఆరోపణాస్త్రాలను, విమర్శనాస్త్రాలను మాత్రమే నమ్ముకోవడం లేదు. టీవీ చానళ్ల హడావుడి పెరగడంతో బుల్లితెరపై ఆకర్షణీయంగా కనిపించే లక్ష్యంతో ముచ్చటైన ముఖ కవళికల కోసం ‘శస్త్ర’మార్గాన్ని ఆశ్రయించేందుకు సైతం వారు వెనుకాడటం లేదు. ఇదివరకు ఎక్కువగా సినీతారలు తమ అందచందాల కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించేవారు. వారికి పోటీగా రాజకీయ నేతలు సైతం ప్లాస్టిక్ సర్జన్ల వద్ద క్యూ కడుతుండటంతో శస్త్ర వైద్యులకు కాసుల పంట పండుతోంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తేదీలు వెలువడేందుకు కొద్దినెలల ముందే పలువురు నేతలు ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయించి, తమ ముఖ కవళికలకు మెరుగులు దిద్దుకున్నారు. ఈ ఎన్నికల సీజన్‌కు ముందు నిపుణులైన ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయించిన వారిలో కుర్ర నేతలతో పాటు వయసు మళ్లిన నేతలూ ఉన్నారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. ఎన్నికలకు కొద్ది నెలల కిందట ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఎంపీ ముంబై వెళ్లి, తన ముఖానికి మెరుగులు దిద్దించుకున్నారు. ప్రముఖ కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ మోహన్ థామస్ వద్ద శస్త్రచికిత్స చేయించుకున్నారు. తన బండ ముక్కును, లావాటి మెడను సరిచేయించుకునేందుకు ఆ ఎంపీ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆయన చెప్పారు. ‘దాదా మాదిరిగా కాదు, నేత మాదిరిగా కనిపించాలనుకుంటున్నాను’ అని ఆయన కోరుకున్నారని తెలిపారు. ముక్కును సరిచేసేందుకు రినోప్లాస్టీ, లావాటి మెడను సన్నగా తీర్చిదిద్దేందుకు లైపోసెక్షన్ చికిత్సలు చేసినట్లు వివరించారు. మహారాష్ట్రకు చెందిన ఒక మహిళా నేత తన లావాటి నడుమును తగ్గించుకునేందుకు లైపోసెక్షన్ చికిత్స చేయించుకున్నారు. ముఖంపైన మచ్చలు, పులిపిర్లు, పిగ్మెంటేషన్ వంటి సమస్యల పరిష్కారం కోసం డెర్మటాలజిస్టులను ఆశ్రయించే నేతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. దక్షిణ ముంబై, నాగపూర్, ముంబై పశ్చిమ శివారు ప్రాంతాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు ఎన్నికలకు ముందు తన వద్ద ఇలాంటి చికిత్సల కోసం వచ్చారని ముంబైకి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ రేఖా సేథ్ చెప్పారు. ఇలాంటి చికిత్సల కోసం వస్తున్న వారిలో మహిళా నేతల కంటే పురుష నేతల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు ఆమె తెలిపారు. కోపిష్టి ముఖాలతో కనిపించే నేతలను ఎవరూ చూడాలనుకోరని డాక్టర్ కల్పేశ్ అనే ప్లాస్టిక్ సర్జన్ వ్యాఖ్యానించారు. ముఖం జేవురించి, ఉబ్బిపోయి కోపిష్టుల్లా కనిపించే నేతలు, శస్త్రచికిత్సల ద్వారా తమ ముఖ కవళికలను సౌమ్యంగా మార్చుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల ఇలాంటి సమస్యలతో తన వద్దకు వచ్చిన ఇద్దరు ఎంపీలకు, ఒక స్థానిక మహిళా నేతలకు చికిత్స చేశానని తెలిపారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా వద్ద శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆస్పత్రులకు వెళితే, ప్రజలు, మీడియా తమను గుర్తిస్తే ఇబ్బందనే ఉద్దేశంతో వైద్యులనే ఇళ్ల వద్దకు రప్పించుకుంటున్న నేతలూ ఉంటున్నారని డాక్టర్ అప్రతిమ్ గోయల్ చెప్పారు.