the Council of Ministers
-
టార్గెట్ సిద్ధు
► వచ్చే ఎన్నికల్లో ఆయన ఓటమికి ప్రణాళికలు ► ఆ ఆరుగురి కనుసన్నల్లోనే మంత్రి మండలి పునర్విభజన ► మంత్రి మండలిలో పేమెంట్ సీట్లే ఎక్కువ ! ► హై కమాండ్‌కు డబ్బు మూటలు ► రాజీనామా అనంతరం శ్రీనివాస ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు బెంగళూరు : ‘సీఎం సిద్ధరామయ్య రాజకీయంగా ఎదుగుదల కోసం నా సహకారం తీసుకున్నారు. అయితే చేసిన సహాయాన్ని మరిచి అత్యంత అవమానకరంగా నన్ను మంత్రి మండలి నుంచి తొలగించారు. చాలా బాధగా ఉంది. సిద్ధును వచ్చే ఎన్నికల్లో ఓడించి నా పగను చల్లార్చుకుంటా. ఇందుకు జాగ్రత్తగా వ్యూహాలు రచిస్తా.’ అని నంజనగూడు ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన మంత్రి మండలి పునఃరచనలో భాగంగా శ్రీనివాస్ ప్రసాద్‌ను రెవెన్యూశాఖ మంత్రిగా తప్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సీఎం సిద్ధుపై గుర్రుగా ఉన్న ఆయన తన శాసనసభ సభ్యత్వానికి, పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. అన ంతరం తన మద్దతుదారులకు కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం సిద్ధరామయ్యే లక్ష్యంగా ఆయన ప్రసంగం సాగింది. రాజకీయంగా మునిగిపోయే టైటానిక్ పడవలో ప్రయాణిస్తున్న సిద్ధరామయ్యకు తాను సహాయ హస్తం అందించానని పేర్కొన్నారు. అయితే తనతో ఒక్కమాట కూడా చెప్పకుండానే మంత్రి మండలి నుంచి తొలగించడం ఎంత వరకూ సమంజసమన్నారు. పటిష్టమైన మంత్రి మండలి రచన అని చెబుతూ ఏమాత్రం రాజకీయ అనుభవం, ప్రజాభిమానం లేని నాయకులను మంత్రి మండలిలోకి తీసుకున్నారని విమర్శించారు. మంత్రి మండలి పునఃరచన అంతా ఆ ఆరుగురి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. ఇంతలో ఆ ఆరుగురు ఎవరో చెబుతారా అన్న మీడియా ప్రశ్నకు చెబుతాను నాకు భయం లేదు అంటూ ద్విగ్విజయ్సింగ్, సిద్ధరామయ్య, పరమేశ్వర్, కే.జే జార్జ్, డీ.కే శివకుమార్, మల్లికార్జున ఖర్గే’ అని తెలిపారు. మహదేవప్ప లేరా అన్న మరో ప్రశ్నకు ఆయన సిద్ధరామయ్య ‘జిరాక్స్’ అంటూ వ్యంగ్యంగా అన్నారు. ఇక మంత్రి మండలి మొత్తం పేమెంట్ సీట్లతో నిండిపోయిందని మరో సంచలనం వ్యాఖ్య చేశారు. అంతేకాకుండా హైకమాండ్‌కు ఇక్కడి నుంచి ‘కప్పాలు’ (డబ్బు మూటలు) వెలుతున్నాయని తన మాట తీవ్రతను పెంచారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క తప్పు కూడా చేయలేదన్నారు. ఇక రాజకీయాల నుంచి గౌరవ ప్రదంగా తప్పుకోవాలనుకున్న తరుణంలో తాను సహాయం చేసిన వ్యక్తి నుంచే అవమానం ఎదుర్కొనాల్సి వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ‘సిద్ధరామయ్య అండ్ కో’ను ఓడించినప్పుడే తనకు మనఃశాంతి కలుగుతుందని పురరుద్ఘాటించారు. ఇందుకు అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తున్నానని తెలిపారు. ఒంటరిగా పోటీ చేస్తానా? లేక ఏదైనాపార్టీతో కలిసి రాజకీయ రణరంగాన్ని ఎదుర్కొంటాన్న అన్న విషయం ఇప్పుడే చెప్పలేనని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏకపక్ష నిర్ణయాలు ! అంతకు ముందు తన మద్దతుదారులతో కలసి విధానసౌధలోని స్పీకర్ కోడివాళను కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తోందన్న స్పీకర్ కోడివాళ ప్రశ్నకు ‘సిద్ధరామయ్య ఏకపక్ష నిర్ణయాల వల్ల తన మనస్సుకు బాధ కలిగింది. అందువల్లే రాజీనామా చేస్తున్నాను. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి లేదు. సాధ్యమైన ంత త్వరగా అమోదించాలని కోరారు.’ అని పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసే సమయంలో మీడియా ముందు సదరు ప్రజాప్రతినిధిని స్పీకర్ ఎంటువంటి ప్రశ్నలు వేయరు. అయితే తాజా ఘటనలో మాత్రం అందుకు విరుద్ధంగా జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా నిబంధనలను అనుసరించి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటాను అని స్పీకర్ కోడివాళ మీడియాతో పేర్కొన్నారు. రాజీనామా చేసిన వారిని బహిరంగంగా ప్రశ్నించే సంప్రదాయం ఇప్పటి వరకూ లేదు కదా అన్న ప్రశ్నకు ఇక ముందు ఇదే సంప్రదాయమవుతుందని కోడివాళ సమాధానమిచ్చారు. -
కరువు అధ్యయనానికి ‘ఉప సంఘాలు’
ఈనెల 30న ప్రభుత్వానికి నివేదిక కాంట్రాక్ట్స్ కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ బెంగళూరులో రెయిన్వాటర్ హార్వెస్ట్ ఇక తప్పనిసరి మంత్రి మండలి నిర్ణయాలను వెల్లడించిన టీ.బీ జయచంద్ర బెంగళూరు: రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల అధ్యయనానికి నాలుగు మంత్రి మండలి ఉపసంఘాలను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన విధానసౌధలో బుధవారం ఉదయం జరిగిన మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నాలుగు మంత్రి మండలి ఉపసంఘాల్లోని సభ్యులు రాష్ట్ర మంతటా పర్యటించి ఈనెల 30న క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేయనున్నారు. బెంగళూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని జిల్లాల్లో పర్యటించే మంత్రి మండలి ఉపసంఘానికి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి వీ. శ్రీనివాస్ ప్రసాద్, మైసూరు రెవెన్యూ విభాగానికి ఉన్నతవిద్య శాఖ మంత్రి టీ.బీ జయచంద్ర, బెళగావి విభాగానికి పరిశ్రమలశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే, గుల్బర్గా రెవెన్యూ డివిజన్ పరిధిలో పర్యటించే మంత్రి మండలి ఉపసంఘానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్.కే పాటిల్ నేతృత్వం వహించనున్నారు. మంత్రి మండలి నిర్ణయాలను న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వివరించారు. అందులో కొన్ని ముఖ్యమైన కొన్ని నిర్ణయాలు... ⇒కరువు పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరాకు వెంటనే రూ.100 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే తాగునీటి కోసం విడుదల చేసిన రూ.50 కోట్లకు ఈ నిధులు అదనం. ⇒ బెంగళూరులో ఇకపై నూతనంగా నిర్మించే ప్రభుత్వ, ప్రైవేటు భవనాలతో పాటు వ్యక్తిగత ఇళ్లుకు రెయిన్వాటర్ హార్వెస్టింగ్ సిస్టం ఏర్పాటును ఖచ్చితం చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ⇒రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో జరిగే అభివృద్ధి పనుల కాంట్రాక్టుల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. రూ.50 లక్షల కంటే తక్కువ మొత్తం కాంట్రాక్టు పనుల్లో 17.1 శాతం ఎస్సీలకు, 6.95 శాతం ఎస్టీలకు (మొత్తం 24.05 శాతం) ఎటువంటి టెండర్ లేకుండా నేరుగా కేటాయించడానికి వీలుగా చట్టంలో మార్పులు తీసుకురావడానికి మంత్రి మండలి ఏకగ్రీవంగా అంగీకరించింది. ఒక వేళ ఒకే పనికి ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తులు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే లాటరీ రూపంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ⇒నాయిబ్రాహ్మణ, నాయింద, హజామ అనే పదాలను నిషేధిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ‘సవిత’ సమాజ వర్గం అని ఇకపై ఆ వర్గానికి చెందిన ప్రజలను పిలవాల్సి ఉంటుంది. సవిత సమాజ వర్గం పేరుతోనే జనన ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నారు. ⇒కరువు పరిస్థితుల నేపథ్యంలో వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలుకు మంత్రి మండలి నిర్ణయం. దీని వల్ల రాష్ట్రలోని 137 తాలూకాల్లోని విద్యార్థులకు 39 రోజుల పాటు మధ్యాహ్న భోజనం అందుతుంది. ⇒ రామనగర్‌లో నిర్మించనున్న రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సెన్సైస్ పనుల కోసం రూ.580 కోట్ల విడుదలకు మంత్రి మండలి అంగీకారం. ఈ పనులను నాగార్జున కంపెనీ చేజెక్కించుకుంది. ⇒ కలబుర్గిలో విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల పెంపునకు రూ.109 కోట్లను ప్రజాపనుల శాఖకు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ⇒ బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించిన జీవీకే సంస్థ తన షేర్లను అమ్మకానికి పెట్టిందని అయితే ఆ షేర్లను కొనకూడదని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో సదరు సంస్థ తమ షేర్లను ఇతర ప్రైవేటు సంస్థలకు కాని వ్యక్తులకు గాని అమ్ముకోవచ్చు. ప్రస్తుతం కెంపేగడ అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలా 13 శాతం షేర్లను కలిగి ఉన్నాయి. ⇒రాష్ట్రంలోని ఓపెన్ యూనివర్శిటీలు బయటి రాష్ట్రాల్లో నూతన కోర్సులు ప్రారంభించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. -
కొంత మందిని తప్పిస్తాం
సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంత మందిని మంత్రి మండలి నుంచి తప్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అదేవిధంగా మరి కొంత మంది మంత్రిత్వశాఖలను మారుస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో ఈ వాఖ్యలు చేశారు. -
త్వరలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ
పరమేశ్వర్‌కు మంత్రి పదవిపై దిగ్విజయ్ సింగ్ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన లాబీయింగ్ చేయలేదు ఆయన అనుచరులే హై కమాండ్‌పై ఒత్తిడి తెచ్చారు త్వరలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు చేపట్టాలన్నది సీఎం నిర్ణయిస్తారు సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి తప్పక చోటు సాక్షి,బెంగళూరు : కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్‌కు మంత్రి మండలిలో స్థానం కల్పించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాజకీయ వ్యవహరాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. ‘పరమేశ్వర్ విషయం ప్రత్యేకం. అందుకే ఆయనకు అమాత్య స్థానం ఇస్తున్నాం.’ అని స్పష్టం చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఆయన మీడియాతో గురువారం మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పరమేశ్వర్ ఎప్పుడు కూడా లాబీయింగ్ జరపలేదన్నారు. ఆయన అనుచరులు మాత్రం ఈ విషయంపై హై కమాండ్‌పై ఒత్తిడి తీసుకువచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. మరోవైపు పరమేశ్వర్ విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉండటం వల్ల ఆయనకు రాబోయే మంత్రి మండలి విస్తరణలో చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా త్వరలో మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ కూడా ఉంటుందన్నారు. అయితే ఈ విషయంలో హై కమాండ్ జోక్యం చేసుకోదన్నారు. ఈ విషయం ఎప్పుడు చేపట్టాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయానికే వదిలేస్తున్నామని వివరించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై గందరగోళానికి పూర్తిగా తెరపడిందన్నారు. సాధ్య మైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీకు సంబంధిచిన జాబితా హై కమాండ్‌కు పంపాల్సిందిగా సూచించామన్నారు. మార్గదర్శకాలను అనుసరించి ప్రస్తుత, మాజీ శాసనసభ్యులతోపాటు గత ఎన్నికల్లో పార్టీ టికెట్టు పొందిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోమని తెలిపారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో తప్పక స్థానం కల్పిస్తామని తెలిపారు. నెలాఖరుకల్లా ఈ ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టంచేశారు. సీఎం సిద్ధు, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వానాకి, పార్టీకి మధ్య ఎటువంటి బేధాభిప్రాయాలు లేవని స్పష్టంచేశారు. అంతకు ముందు సిద్ధరామయ్య, పరమేశ్వర్ ఒకటిగా దిగ్విజయ్ సింగ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈనెల 25లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తామని ఆయనకు భరోసా ఇచ్చారు. అనంతరం వారిరువురూ బెంగళూరులోని శివానందసర్కిల్ వద్ద ఉన్న ఓ హోటల్లో కలిసి టిఫిన్ తిన్నారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధు మీడియాతోమాట్లాడుతూ... ‘మేము ఇద్దరం ఫ్రెండ్స్. బయట ఎప్పుడు కలిసినా ఒకటిగా టిఫిన్ తింటాం. ఇందులో ప్రత్యేకత ఏమీలేదు.’ అని అన్నారు.