counter affidavit
-
తిక్కతో లెక్కతప్పిన పవన్ !
-
కౌంటర్ దాఖలుకు 15 ఏళ్లా?
సాక్షి, హైదరాబాద్: జీవో 111పై దాఖలైన పిటిషన్లో రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఇదే చివరి అవకాశమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. 2007లో పిటిషన్ దాఖలు చేస్తే.. ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ పరీవాహక ప్రాంత పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరా బాద్(ఎన్జీవో), ఒమిమ్ మానెక్షా డెబారా పిటిషన్ దాఖలు చేశారు. జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల వరకు రక్షణ కల్పించాల్సి ఉండగా.. ఆక్రమణలు, నిర్మాణాలు చోటుచేసుకున్నాయన్నారు. ఇది జీవో 111ను, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటివ రకు నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులన్నింటినీ రద్దు చేసేలా, కాలుష్యం బారి నుంచి జలాశయాలను రక్షించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. జీవో 111 వివాదం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉండగానే ప్రభుత్వం ఆ జీవోను ఎత్తేస్తూ మరో జీవో 69 జారీ చేసిందని, దీనిని కొట్టేయాలని పిటిషనర్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. జీవో 111లోని నిబంధనలు, పరిమితులన్నీ జీవో 69లో పొందిపరిచినట్లు సర్కార్ చెబుతోందని.. అయితే జలాశయాల పరిరక్షణ కోసం నియమించిన కమిటీ సూచనలు అందులో చేర్చలే దన్నారు. ఈ సూచనలను జీవో 69లో చేర్చేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు కూడా జీవో 111లోని పరిమితులను మార్చవద్దని చెప్పిందని గుర్తు చేశారు. జీవో 69 తేవడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమేనని వెల్లడించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ, కౌంటర్ వేసేందుకు 3 వారాల గడువు కావాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. 15 ఏళ్లుగా కౌంటర్ దాఖలు చేయక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఖర్చుల కింద రూ.25,000 చెల్లిస్తేనే వాయిదాకు అనుమతిస్తామంది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది రామారావు కలుగజేసుకుని.. జీవో 111ను సవాల్ చేసిన రిట్లతో పాటు ఆ జీవోను రద్దు చేయాలని కోరుతూ కూడా రిట్లు దాఖలయ్యాయని చెప్పా రు. జీవో 69 విషయంలో దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్ కూడా ఉందన్నారు. కౌంటర్ వేసేందుకు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో 2 వారాల గడువు ఇస్తూ విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది. -
హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లోని కీలకాంశాలు ‘ రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రాలదే. అదే విషయాన్ని కేంద్రం తన అఫిడవిట్లో తెలిపింది. రాజధానితో సహా వివిధ అభివృద్ధి ప్రణాళికలు, ప్రాజెక్టులను సమీక్షించే విస్తృత అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల ప్రకారం రాజధాని తరలింపుపై పిటిషనర్ చెబుతున్న అభ్యంతరాలు పరిగణనలోకి రానివి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనంత కాలం విభజన ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నట్లే భావించాలి. హోదా గురించి ప్రతి సమావేశంలో అడుగుతున్నాం. ప్రత్యేక హోదా అంశం కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అపరిష్కృత అంశంగా ఉంది’ అని పేర్కొంది. (రాజధాని నిర్ణయం రాష్ట్రానిదే) కాగా ‘రాజధాని’ ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయమే అని, అందులో తమ పాత్రేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. రాజధాని నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. -
రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే: కేంద్రం
-
రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే: కేంద్రం
సాక్షి, అమరావతి : రాజధాని అంశంపై ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ గురువారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. రాజధాని నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. కాగా రిట్ పిటిషన్ 20622/2018కు ప్రతిగా కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం 2014లో శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ‘రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై శివరామకృష్ణన్ కమిటీ పరిశీలన జరిపింది. ఆగస్టు 30, 2014న ఈ కమిటీ రాజధాని విషయమై నివేదిక సమర్పించింది. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. జులై 31, 2020న ఏపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ చేసింది. పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి ఒక గెజిట్‌ను విడుదల చేసింది. గెజిట్ ప్రకారం ఏపీలో మూడు పాలనా కేంద్రాలుంటాయి. గెజిట్ ప్రకారం శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును పేర్కొన్నార’ని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది. (ప్రభుత్వంపై ఆరోపణలన్నీ ఉపసంహరించుకుంటున్నా) -
రమేష్ కుమార్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రమేష్ కుమార్ పిటిషన్లో ప్రభుత్వంపై తప్పుడు అభియోగాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. తనను తొలగించడానికే ఆర్డినెన్స్ తొలగించారన్న మాజీ ఈసీ ఆరోపణలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున పంచాయతీ రాజ్‌శాఖ కార్యదర్శి ద్వివేదీ 24 పేజీల అఫిడవిట్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్ తెచ్చామని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ చేసిన ఆరోపణలేవీ సరైనవి కావని వివరించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం పంచాయతీరాజ్ చట్టంలోనూ సవరణ చేశామని అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం నిర్ణయించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని హైకోర్టుకు విన్నివించారు. (రాజ్యాంగ బద్ధంగానే మూడేళ్లకు కుదింపు) అలాగే ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ‘ఈసీ పదవీ కాలం తగ్గింపు, పంచాయతీరాజ్ చట్టంలో మార్పులను గవర్నర్ ఆమోదించాకే ఆర్డినెన్స్ తెచ్చాం. గవర్నర్ నిర్ణయం అనంతరం ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు. ఎన్నికల కమిషనర్ సర్వీసు రూల్స్ అన్నీ హైకోర్టు జడ్జి స్ధాయిలో ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. 2000 సంవత్సరం తర్వాత అధికారులతో నిర్వహించిన ఎన్నికల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలం, సర్వీస్ రూల్స్ విడిగా చూడాల్సిందే. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకునే ముందు రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. స్ధానిక ఎన్నికల వాయిదా నిర్ణయం మీడియా తర్వాతే ప్రభుత్వానికి చేరింది. ఎన్నికలు వాయిదా పడినా కోడ్ కొనసాగుతుందని ఈసీ ప్రకటించడం సరికాదు’ అని అఫిడవిట్లో పేర్కొన్నారు. (రాష్ట్ర ఈసీగా హైకోర్టు రిటైర్డ్ జడ్జి) దీనితో పాటు ఒడిషా, మహారాష్ట్ర, బెంగాల్లో స్ధానిక ఎన్నికల వాయిదా పరిస్ధితులను ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. ఏపీ స్ధానిక ఎన్నికల వాయిదాతో మిగతా రాష్ట్రాలకు ఎలాంటి పోలికలేదని ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించింది. కాగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమించేలా చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టం–1994 సెక్షన్–200కు చేసిన సవరణల ఆర్డినెన్స్‌కు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోద ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఏపీ ప్రభుత్వం దానిపై కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై త్వరలోనే న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. -
ఉరిశిక్ష రద్దుపై పిటిషన్.. కీలక పరిణామాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉరి శిక్షకు ప్రత్యామ్నాయంపై సుప్రీం కోర్టులో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం నేడు కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఉరి శిక్ష రద్దును చేసి.. ఇతర మార్గాల ద్వారా మరణ శిక్షను అమలుపరచాలని, ఈ మేరకు చట్టంలో సవరణ చేయాలని అడ్వొకేట్ రోషి మల్హోత్రా.. అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఉరి ముమ్మాటికీ వ్యక్తి స్వేచ్ఛా హక్కులను అగౌరవపరిచినట్లేనని ఆయన వాదనలు వినిపించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించించి. దీనికి స్పందించిన కేంద్రం మంగళవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపటం, తుపాకులతో కాల్చి చంపటం కన్నా ఉరి శిక్ష చాలా సులువైన పద్ధతని.. సురక్షితంగా, త్వరగతిన అమలు చేసేందుకు వీలవుతుందని కౌంటర్ అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. దీనిని పరిశీలనకు స్వీకరించిన తదుపరి విచారణను వాయిదా వేసింది. కౌంటర్ అఫిడవిట్లో కేంద్రం పేర్కొన్న వివరాలు -
కౌంటర్ దాఖలు చేయండి
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. శాసనసభ కార్యదర్శి, ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. శాసనసభ నుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో ఎమ్మెల్యే రోజా పిటిషన్ దాఖలు చేశారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని ఆమె పిటిషన్లో కోరారు. తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని పేర్కొన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.