Cow slaughter prohibition Act
-
‘లష్కరే ఉగ్రవాదులను పిలిచే దాకా తేకండి’
బెంగళూరు: లష్కరే ఉగ్రవాదులు భారత వాణిజ్య రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించి నిన్నటికి 12 సంవత్సరాలు పూర్తయ్యింది. నాటి మారణకాండను తల్చుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు నివాళులర్పించగా.. కర్ణటకలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. బహిరంగ ప్రదేశాల్లోని గోడ మీద లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మద్దతిచ్చే రాతలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాతల వెనక ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. వివరాలు మంగళూరులోని బహిరంగ ప్రదేశంలోని ఓ గోడ మీద గుర్తు తెలియని వ్యక్తులు ‘సంఘీలు, మన్వేదిలను నియంత్రించడానికి లష్కరే తోయిబా ఉగ్రవాదులను, మిలిటెంట్లను రంగంలోకి దించే పరిస్థితులు తీసుకురాకండి’ అంటూ నలుపు రంగు పెయింట్‌తో గోడ మీద వివాదాస్పద రాతలు రాశారు. దీని గురించి తెలిసిన వెంటనే పోలీసుల అక్కడికి చేరుకున్నారు. పెయింటర్లను పిలిచి ఈ రాతలను కవర్ చేయించే పని ప్రారంభించారు. సమీప ప్రాంతంలోని సీసీటీవీ కెమరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక మత విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నం చేసినందుకు గాను ఈ గుర్తు తెలియని వ్యక్తుల మీద కేసు నమోదు చేశామన్నారు. ఇక గోడ మీద రాసిన సంఘీలు.. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని సూచిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో గో వధను నిషేధించే చట్టంతో పాటు వివాహం కోసం మాత్రమే జరిగే మత మార్పిడిలను నిషేధించే చట్టం తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు నిర్ణయాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోడల మీద ఇలాంటి రాతలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అది కూడా ముంబై ఉగ్రదాడి జరిగిన నాడే చోటు చేసుకోవడంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ( 26/11 ఉగ్రదాడి : రియల్ హీరోలు వీళ్లే..) ఇక 12 సంవత్సరాల క్రితం ముంబైలో ఉగ్రవాదుల మారణ కాండ కొనసాగించారు. దీనిలో ప్రధాన సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందినవాడు. నాటి ఘటనలో 166 మంది చనిపోయారు.. 300 మందికిపైగా గాయపడ్డారు. సముద్ర మార్గం ద్వారా భారత్‌లో ప్రవేశించిన ముష్కరులు తాజ్‌మహల్ హోటల్ సహా పలు చోట్ల దాడులకు తెగబడ్డారు. -
గోవును చంపిన కేసులో ఇద్దరు అరెస్ట్
లక్నో : తమ పొలంలో గడ్డివేస్తుందని ఆవును కొట్టి చంపిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రాహుల్, రవిగా గుర్తించిన పోలీసులు వారిపై సెక్షన్ 429 కింద కేసు నమోదు చేశారు. గోవధకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తామని తాజాగా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ పొలంలో ఉన్న ఓ దూడపై దాడిచేసి దాన్ని రక్షించడానికి వెళ్తే మాపై కూడా దాడి చేసిందని నిందితులు తెలిపారు. ఈ ప్రయత్నంలోనే దానిపై కర్రలతో కొట్టామని, ఆత్మ రక్షణలో భాగంగానే చేశాం తప్పా చంపడం మా ఉద్దేశం కాదని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆవు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. (హత్య చేసి, నెత్తురు తాగిన కిరాతకుడు ) గోవధ నివారణ చట్టం 2020 ప్రకారం గోవును వధించిన వారికి ఏడాది నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు జరిమానా విధిస్తామని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండవసారి నేరాలనికి పాల్పడితే శిక్షను రెట్టింపు చేస్తామని తెలిపింది. అంతేకాకుండా అనధికారికంగా మాంసం విక్రయాలు జరిపిన నిందితులకు కూడా ఇదే శిక్ష విధిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. (యూపీ ఆర్డినెన్స్ నేపథ్యంలో ఎంఐఎం వ్యాఖ్యలు ) -
సాధ్వి సరస్వతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జంషెడ్పూర్ : గోవధను నిరోధించేందుకు జీవితఖైదుతో కూడిన కఠిన చట్టాన్ని తీసుకురావాలని వీహెచ్‌పీ నేత సాధ్వి సరస్వతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోవధను నియంత్రిస్తూ పలు రాష్ట్రాలు చట్టాలు చేసినా జాతీయస్థాయిలో కేంద్రం సరైన చట్టాన్ని తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని ఆమె కోరారు. కేరళలో హిందూ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని తనపై ఏప్రిల్ 30న కేసు నమోదు చేసినా తాను తన కార్యకలాపాలను కొనసాగిస్తానని సాధ్వి సరస్వతి స్పష్టం చేశారు. కేరళలో జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హిందూ జాగరణ్ మంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సాధ్వి సరస్వతి తనపై కేసులున్నా తనను అవి నిరోధించలేవన్నారు. బీఫ్ తినడంపై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తన ఫేస్బుక్ పేజీలో 600 మందికి పైగా వ్యక్తులు తనను ట్రోల్ చేశారని చెప్పారు. జాప్యం నెలకొన్నా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. -
గోమాత వ్యథ..
ఖమ్మం అర్బన్ : ఎంతోమంది అతి పవిత్రంగా భావించే గోవులకు కొందరు దళారులు బతికి ఉండగానే నరకం చూపిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పశుగ్రాసం లేక కొందరు రైతులు పశువులను విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో పాటు తక్కువ ఖర్చుతోనే వాటిని కబేళాకు తరలించేదుకు ఒక్కో కంటెయినర్లో లెక్కకు మించి ఎక్కిస్తున్నారు. ఇలా తరలిస్తున్న మూగజీవాలను ఇటీవల అర్బన్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆరు పశువులను తరలించాల్సిన కంటెయినర్లో ఏకంగా 30 నుంచి 80 వరకు రవాణా చేస్తున్నారు. ఇలా శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం తదితర జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని గోవధ శాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఊపిరాడక కొన్ని పశువులు మృత్యువాత పడుతుండగా, ఒకదానికి ఒకటి తగలడంతో పలు ఆవులు, దూడలు తీవ్రంగా గాయపడుతున్నాయి. అయితే ఆరెస్సెస్ ప్రతినిధులు, మరికొందరు ఇచ్చిన సమాచారంతో జిల్లా పోలీసులు ఇటీవల పలు పశువులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించారు. గోశాలలోనూ ఇక్కట్లే... గత శుక్రవారం ఒక్క రోజే ఖమ్మం అర్బన్, ఏన్కూర్ తదితర మండలాల నుంచి కంటెయినర్ల ద్వారా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకుని నగరంలోని గొల్లగూడెం, ధంసలాపురం గోశాలలకు తరలించారు. గొల్లగూడెం గోశాలలో గతంలో ఉన్నవాటికి తోడు మరో 35 పశువులను చేరవేశారు. అయితే అన్నింటికి గ్రాసం సరిపోక అవి ఆకలితో అలమటిస్తున్నాయి. దాతలు ఇచ్చిన కొద్దో..గొప్పో గ్రాసంతోనే గోశాలను నిర్వహిస్తున్నామని, తాగునీరు, గ్రాసం అందించడం పెద్ద ప్రయాసగా మారిందని నిర్వాహకులు చెపుతున్నారు. మూడు పశువులతో ప్రారంభించిన గోశాలలో నేడు 370 పైగా ఉన్నాయని, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే వీటిని సంరక్షించగలమని చెపుతున్నారు. ప్రశ్నార్థకంగా గోవధ నిషేధ చట్టం.. పోలీసులు పట్టుకున్న పశువులను సమీపంలోని గోశాలలకు తరలిస్తున్నారు. అయితే వీటి సంరక్షణ భారంగా మారుతుండడంతో పలువురు నిర్వాహకులు ఆ పశువులను తమవద్ద ఉంచవద్దంటూ నిరాకరిస్తున్నారు. దీంతో గోవధ నిషేధ చట్టం ప్రశ్నార్థకంగా మారుతుందని జంతుప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఎస్పీ గోశాలలను సందర్శించి, అక్కడ నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని, గోశాలలో వందల సంఖ్యలో పశువులు ఉంటంతో వాటికి అవసరమైన వైద్యం అందించడానికి కూడా ప్రత్యేక వైద్యాధికారిని నియమించాలని కోరుతున్నారు.