Criticising
-
యుద్ధంపై విమర్శ... రష్యాన్ రాజకీయవేత్తపై వేటు..
మాస్కో: ఉక్రెయిన్ పై యుద్ధం చేయడం గురించి రష్యన్ రాజకీయవేత్త ఒకరు విమర్శించారు. ఇలా ఉక్రెయిన్ పై అమానుషంగా యుద్ధం చేసి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకోవడం తప్పు అంటూ పలు విమర్శలు చేశారు. అంతే సదరు రాజకీయవేత్త, మాజీ మేయర్ యెవ్జెనీ రోయిజ్ మాన్ పై రష్యాన్ అధికారులు సీరియస్ అవ్వడమే కాకుండా అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటి చర్యలు రష్యా బలగాలను అప్రతిష్టపాలు చేసేలా చేయడమేనంటూ మండిపడ్డారు. అతను ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశాడని కూలంకషంగా రష్యా అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అతను రష్యాలో ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థి, పైగా పలు మేయర్ పదువులను అలంకరించిన ప్రముఖ వ్యక్తి. వాస్తవానికి రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ప్రత్యేక సైనిక చర్యగా అభివర్ణించుకుంటోంది. ఈ తరుణంలో ఎవరైన క్రెమ్లిన్‌ని తప్పుపట్టేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కన్నెరజేస్తోంది రష్యా. ఆయా వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అరెస్టు చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. గతంలో ఒక యాంకర్ కూడా ఇలానే యుద్ధం వద్దంటూ ప్లకార్డులు పట్టుకున్నందుకు ఆమెను రష్యా భధ్రతా బలగాలు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉక్రెయిన్ దళాలు కూడా ఈ దాడిని ప్రతిఘటించడమే కాకుండా రష్యా తన బలగాలను ఉపసంహరించుకునేలా పశ్చిమ దేశాలు రష్యా పై కఠిన ఆంక్షలు విధించాయి కూడా. ఆఖరికి ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తిని తోసిపుచ్చి తనదైన శైలిలో ఉక్రెయిన్ పట్ల దురుసుగా వ్యవహరిస్తోంది. (చదవండి: ఉక్రెయిన్‌ని విడిచిపెట్టి వచ్చేయండి!... హెచ్చరించిన యూఎస్) -
‘జై భీమ్’ సినిమాలో చూపింది సత్యమేనా?
జైభీమ్ సినిమా కలిగించిన సంచలనం సరే.. కానీ ఒక నిర్మాతగా తనకున్న స్వేచ్చని హీరో సూర్య దుర్వినియోగ పరచారు. డీఎంకే పార్టీ మద్దతు దారుడు, జైభీమ్ నిర్మాత, హీరో సూర్య అగ్ని(వన్ని) కులక్షత్రియుల భుజంపై గన్ పెట్టి, హిందూ మతంపై ఎక్కుపెట్టిన, మతపర వ్యాపారాత్మకమైన మూలకాన్ని నింపిన తూటాను పేల్చాడు. విలన్ పాత్రధారుడైన పోలీస్ అధికారి ఇంట్లో ఒక సన్నివేశంలో అగ్ని(వన్ని)కులక్షత్రియుల లోగో ఉన్న క్యాలండర్‌ను ప్రత్యేకించి కనిపించేటట్లు పెట్టడం సదుద్దేశం ఎలా అవుతుంది? (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో వహ్నికుల క్షత్రియులుగానూ, ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో అగ్నికుల క్షత్రియులుగానూ జీవో నంబర్ 297/తేదీ.13–06–1921 అనుసరించి అధికారికంగా ధ్రువీకరించబడుతున్న అగ్ని, వన్ని కులక్షత్రియులు, పవిత్రమైనదిగా ఆరాధించే తమ జాతి లోగోను ప్రతినాయకుడి ఇంట్లో పెట్టడం ద్వారా జాతి వివక్షదారులు వన్నియర్స్ అన్న అవాస్తవాన్ని చిత్రీకరించారు. ఈ అగ్ని, వన్ని కులక్షత్రియుల అగ్నికుండం లోగో ఉన్న క్యాలండర్ ప్రతినాయకుడి ఇంట్లోకి గాల్లో కొట్టుకు వచ్చి రాలేదు అన్నది వాస్తవం. ఇది తప్పు అని గొడవ చేస్తే, ఆ సన్నివేశంలో అగ్ని(వన్ని) కులక్షత్రియుల లోగో ఉన్న క్యాలండర్‌ను తొలగించి, జై భీమ్ సినిమాలో నిజ జీవితంలో గిరిజన రాజన్నను కొట్టి చంపిన పోలీస్ అధికారి పేరు వాస్తవానికి ఆంథోనిరాజు. కానీ, జై భీమ్ సినిమాలో రాజన్నను కొట్టి చంపిన పోలీస్ అధికారి పేరుని గురుమూర్తిగా మార్చారు. (చదవండి: జైభీమ్.. నాటి పోరాటం గుర్తొచ్చింది!) యధార్థ చరిత్ర అని చెప్పిన జై భీమ్ సినిమాలో హీరో తదితర కొన్ని ముఖ్యమైన పాత్రలకు నిజ జీవితంలోని పేర్లే పెట్టారు. కానీ, విలన్ పాత్రధారి పేరుని మాత్రం హిందూ పేరుగా మార్చి పెట్టారు. సినిమా కలెక్షన్స్ పెంచుకోవడానికి, పూర్తి వ్యాపారాత్మక కోణంలో ఆలోచించి సినిమా టైటిల్‌ను జైభీమ్ అని పెట్టిన చిత్ర నిర్మాణ బృందం, అదే వ్యాపారాత్మక కోణంలో ప్రతి నాయకుడిని హిందువుగా చూపించాలన్న అనైతిక చర్యకు పాల్పడింది. ఒక పవర్ఫుల్ సందేశాన్ని అందించే అవకాశాన్ని చిత్ర నిర్మాణ బృందం ముఖ్యంగా నిర్మాత, హీరో సూర్య స్వార్థానికి వాడుకోవడం సమర్థనీయం కాదు. (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...) – చింతా శ్రీకృష్ణ బాబు వ్యవస్థాపక అధ్యక్షులు దక్షిణ భారత అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధనా సంస్థ -
చదివించిన తనను కాదంటూ.. వేరే యువకుడిని పెళ్లి చేసుకుంటావా..
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్): చదివించిన తనను గాకుండా ఇతరులను పెళ్లి చేసుకుంటే హత్య చేస్తానంటూ ఓ వ్యక్తి యువతిపై కత్తితో దాడికి యత్నించిన సంఘటన పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ అభిషేక్‌రెడ్డి కథనం మేరకు.. మిడ్జిల్ మండలం కొత్తపల్లికి చెందిన మానసను మేనమామ కుమారుడు లింగం పెళ్లి చేసుకుంటానంటూ మానస, ఆమె తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి వారు ఒప్పుకోకపోవడంతో ఆదివారం లింగం జడ్చర్లలో మానస టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ల్యాబ్‌కు చేరుకొని తనను పెళ్లి చేసుకోవాంటూ బలవంతం చేశాడు. దీనికి అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న సంచిలో నుంచి కొబ్బరి బొండాల కొట్టే కత్తి తీసి హత్య చేసేందుకు యత్నించాడు. అతడి నుంచి తప్పించుకొని పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసింది. దాడికి సంబంధించిన చిత్రాలు ల్యాబ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు వివరించింది. యువతి ఫిర్యాదు మేరకు లింగంపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. -
అవి చెత్త ర్యాంకులు: మాజీ కెప్టెన్
లండన్ : ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాకింగ్స్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లు రెండు, నాలుగు స్థానాలు పొందడంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తప్పుబట్టాడు. 'నేను నిజాయితీగా ఐసీసీ ర్యాంకులను తప్పుబడుతున్నా. నా దృష్టిలో అవొక చెత్త ర్యాంకింగ్స్ అనుకుంటున్నా' అంటూ వాన్ విమర్శించాడు. 'ప్రసుత్తం రెండో స్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్ గత రెండేళ్లలో ఎన్ని సిరీస్‌లు గెలిచిందో నాకు ఐడియా లేదు. కానీ ఈ ఏడాది వారి ప్రదర్శన చూసుకుంటే మాత్రం 2వస్థానం వారికి కరెక్టు కాదని నా అభిప్రాయం. ఇక 4 స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ప్రదర్శన ఏడాదిగా కాస్త మెరుగుపడింది. గత మూడు, నాలుగేళ్లుగా ఇంగ్లండ్ జట్టు టెస్టు క్రికెట్లో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నించింది. విదేశాల్లో మా జట్టు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఈ ఏడాది ప్రదర్శన చేసుకుంటే అందులో స్వదేశంలో ఐర్లాండ్ జట్టుపై మాత్రమే సిరీస్ గెలుచుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్‌ను డ్రాతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రకటించిన ర్యాంకులు కాస్త గందరగోళంగా ఉన్నాయంటూ' వాన్ చెప్పుకొచ్చాడు. అయితే వాన్ ఆస్ట్రేలియాను మాత్రం పొగడ్తలతో ముంచెత్తాడు. ప్రసుత్తం 5వ స్థానంలో కొనసాగుతున్న ఆసీస్ ఆ స్థానంలో ఉండడం కరెక్టు కాదని వాన్ అభిప్రాయపడ్డాడు. 'నా దృష్టిలో ప్రసుత్త టెస్టు క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియాలు మాత్రమే ఉత్తమ జట్లని, సరిగ్గా 12 నెలల క్రితం ఆసీస్‌ను వారి సొంత గడ్డపై ఓడించిన ఘనత టీమిండియా సొంతం చేసుకుందని' వాన్ పేర్కొన్నాడు. అయితే అప్పటి సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లైన వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్‌ను జట్టులో లేకపోవడంతో ఆసీస్ టీమిండియాకు సిరీస్ అప్పగించిందని గుర్తుచేశాడు. వచ్చే ఏడాది చివరిలో భారత్ ఆసీస్‌లో అడుగుపెట్టేసరికి ఆసీస్ జట్టు అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉంటుందనే తాను కోరుకుంటున్నట్లు వాన్ పేర్కొన్నాడు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన బౌలింగ్, బ్యాటింగ్ వనరులు కలిగిన టీమిండియాను ప్రతిఘటించగల శక్తి ఒక్క ఆసీస్‌కు మాత్రమే ఉందంటూ వాన్ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. (చదవండి : బుమ్రాకు ఫిట్నెస్ టెస్ట్ అవసరం లేదు) -
బాబు.. డబ్బు లెక్కల డప్పు
సాక్షి , నెల్లూరు: సీఎం చంద్రబాబు చందమామ కథలు మళ్లీ వల్లించారు. జిల్లాలో ఇంత ఖర్చు చేశానంటూ డబ్బుల లెక్కల డప్పు కొట్టుకున్నారు. కృష్ణపట్నం పోర్టు తన వల్లే వచ్చిందన్నారు. నెల్లూరు నగరంలో 45 వేల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చానన్నారు. ఇక ప్రతి చోట పెన్షన్ నుంచి రుణమాఫీ వరకు అన్ని ఈ వారంలో చేస్తానన్నాడు. చివరగా ఎప్పుడూ లేనంతగా వంగి వంగి ఓటర్లకు దండం పెట్టి ఆశీర్వదించమని అభ్యర్థించాడు. వీటన్నింటితో పాటు ప్రతి చోట వైఎస్సార్సీపీ అభ్యర్థుల్ని లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు. ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా ఎన్నికల సభలు, రోడ్ షో ఇలా కొనసాగింది. మంగళవారం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో రోడ్‌షో, ఎన్నికల సభలను చంద్రబాబు నిర్వహించారు. షెడ్యూల్ సమయం కన్నా రెండు గంటలు ఆలస్యంగా చంద్రబాబు పర్యటన జిల్లాలో మొదలైంది. నెల్లూరు రూరల్, నగరంలో జరిగిన రోడ్‌షో పూర్తి పేలవంగా సాగింది. పార్టీ కార్యకర్తలు జనాలను సమీకరించినా ఎక్కడా జనాలు అంతగా కనిపించని పరిస్థితి. ఇక అధికార పార్టీ నేతలు, మంత్రుల ఒత్తిడితో రవాణా శాఖ అధికారులు పోలీస్ చెక్‌పోస్ట్‌ల వద్ద ప్రత్యేకంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను తనిఖీల పేరుతో ట్రావెల్స్ కార్లను వందల సంఖ్యలో కాన్వాయ్ పేరుతో తీసుకున్నారు. కాన్వాయ్‌లో వాహనాలు పెట్టకుండా నేతలకు అప్పగించారు. ఇక ప్రసంగంలో అయితే ముఖ్యంగా జిల్లాలో చేసిన పనుల గురించి పెద్దగా ప్రస్తావించకుండానే చేయని పనులు అన్ని యథావిధిగా చేసేశానని చెప్పి కార్యకర్తలతో బలవంతంగా చప్పట్లు కొట్టించుకున్నారు. కృష్ణపట్నం పోర్టు తన కృషి వల్లే వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా దూషిస్తూ, అదే సమయంలో తమ పార్టీ నేతలు అత్యంత మంచి వారని పట్టువదలని విక్రమార్కులు మాదిరిగా తనతో పనులు చేయించుకున్నారని ఆత్మస్తుతి పరనింద కార్యక్రమం కొనసాగించారు. నెల్లూరు నగరంలో 45 వేల ఇళ్లు కట్టించి ఇచ్చానని కూడా డప్పు కొట్టుకున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో వందల సంఖ్యలో ఇళ్లు మాత్రమే పూర్తి కాగా మిగిలిన కొన్ని పునాదుల దశ కూడా దాటలేదు. ప్రతి నియోజకవర్గాన్ని వేల రూ.కోట్లతో అభివృద్ధి చేశామని చెప్పారు. వీటితో పాటు పసుపు–కుంకమ, పెన్షన్, రుణమాఫీ, పంట పెట్టుబడి అన్ని నేను ఇస్తున్నాని ఈ వారంలో అన్ని చేస్తానని మళ్లీ ఎన్నికల హమీలు గుప్పించారు. నెల్లూరు రూరల్ పరిధిలో డైకస్‌రోడ్డు, నెల్లూరు సిటీలోని ఎన్టీఆర్ సెంటర్లో సభ ముగించుకొని కస్తూరి గార్డెన్స్‌కు రాత్రి బసకు చేరుకున్నారు. జిల్లాలో బరిలో ఉన్న అభ్యర్థులందర్ని కస్తూరి గార్డెన్స్‌కు రావాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. రెండు రోజుల కిత్రం సుజానా చౌదరి నగరానికి వచ్చి 10 మంది అభ్యర్థులు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులతో సమావేశం అయి లెక్కల వ్యవహారాలు ప్రాథమికంగా ఖరారు చేసి వెళ్లారు. వీటిని చంద్రబాబు ఖరారు చేస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. బుధవారం జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరిలో చంద్రబాబు ఎన్నికల సబలు నిర్వహించనున్నారు. విద్యుత్ కొరత లేకుండా చేశా.. ముత్తుకూరు: రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేసింది తానేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముత్తుకూరులో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు రూ.1.50 లక్షల చొప్పున రుణమాఫీ చేశామన్నారు. త్వరలో కోటి మంది మహిళలకు స్మార్ట్ఫోన్లు ఇస్తామన్నారు. 5 లక్షల మంది నిరుద్యోగులకు రూ.2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తున్నామన్నారు. ఈ ఏడు వరుణ దేవుడు కరుణించలేదన్నారు. నెల్లూరుకు గోదావరి నీళ్లు ఇస్తామన్నారు. -
'నమ్మించి మోసం చేసిన మమత'
కోల్ కతా: 'ఐదేళ్ల క్రితం 70 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, శాంతిభద్రతలను కాపాడుతామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నారు. ఒక వేళ మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారి కూడా ఆమెకు హామీలు గుర్తుండవు' అంటూ టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. 'మమత మాటలు నమ్మి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమెకు మద్దతు ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చాక హామీలకు నీళ్లొదిలారు' అని రాహుల్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రఘునాథ్ గంజ్ లో ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో ఆద్యాంతం టీఎంసీపై విమర్శలు గుప్పించారు. బెంగాల్ కు పరిశ్రమలు రాలేదని, యువతకు ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు నిరుద్యోగులు తరలివెళుతున్నారన్న ఆయన వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని మమతను ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్రమోది, రాష్ట్రంలో మమతా బెనర్జీ రైతులకు చేసిందేమీలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే శారదా కుంభకోణం నిందితులను శిక్షిస్తామని చెప్పారు.