cross fire
-
సింగర్ ఎల్లీ మంగట్ హత్యకు కుట్ర..అర్షదీప్ ముఠా సభ్యుల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మయూర్ విహార్‌లో సోమవారం ఉదయం జరిగిన స్వల్ప ఎదురుకాల్పుల అనంతరం గ్యాంగ్‌స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాకు చెందిన ఇద్దరు షార్ప్షూటర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని రాజ్‌ప్రీత్ సింగ్(25), వీరేంద్ర సింగ్(22)గా గుర్తించారు. పంజాబీ గాయకుడు ఎల్లీ మంగట్ను చంపేందుకు వీరు పథక రచన చేసినట్లు వెల్లడించారు. ఎన్కౌంటర్ సమయంలో అయిదు రౌండ్ల వరకు తుపాకీ కాల్పులు జరపగా, రెండు బుల్లెట్లు పోలీసు అధికారి బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను తాకాయన్నారు. ప్రతిగా పోలీసులు ఆరు రౌండ్ల వరకు జరిపిన కాల్పుల్లో వీరేంద్ర సింగ్ కుడి కాలికి గాయమైంది. ఎన్కౌంటర్ అనంతరం నిందితులిద్దరినీ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించామన్నారు. వీరి నుంచి రెండు రివాల్వర్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, చోరీ చేసిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
చిలీలో రూ.262 కోట్ల దోపిడీకి యత్నం
శాంటియాగో: చిలీ రాజధాని శాంటియాగోలో వందల కోట్ల నగదును దోచుకునేందుకు సాయుధ దుండగులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. అమెరికాలోని మియామి నుంచి శాంటియాగో విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న విమానంలో 32 మిలియన్ డాలర్ల (రూ.262 కోట్ల) నగదు ఉంది. బ్యాంకుల్లో పంపిణీ చేయాల్సిన ఆ నగదును ట్రక్కులోకి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, 10 మంది సాయుధ దుండగులు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించారు. పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న దుండగులు నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందితో కొద్దిసేపు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఒకరు, ఒక దుండగుడు చనిపోయారు. దుండగులు వెంటనే తమ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఆ ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన మరో రెండు వాహనాలు కనిపించాయి. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి ఈ భారీ దోపిడీని అడ్డుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నగదును తీసుకువచ్చిన లాతమ్ విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి అపాయం కలగలేదన్నారు. ఇదే శాంటియాగో ఎయిర్‌పోర్టులో గతంలో రెండుసార్లు దోపిడీ దొంగలు తెగబడి మొత్తం 25 మిలియన్ డాలర్ల నగదును ఎత్తుకెళ్లారు. -
పండుగకు ఫ్యామిలీతో షాపింగ్ చేస్తుండగా కాల్పులు.. టిక్ టాక్ స్టార్ మృతి
వాషింగ్టన్: ప్రముఖ అమెరికా టిక్ టాక్ స్టార్ బ్రండన్ బూగీ మాంట్రెల్ తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. క్రిస్మస్ పండుగకు షాపింగ్ చేసేందుకు కుటుంబసభ్యులతో వెళ్లిన అతనికి బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. న్యూఓర్లీన్స్‌లో డెసెంబర్ 23న ఈ ఘటన జరిగింది. బూగీ బీ షాపింగ్‌కు వెళ్లినప్పుడు కారు పార్కింగ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరుపుకొన్నారు. అయితే కారులో కూర్చున్న బూగీకి వారి కాల్చిన తూటాలు గురితప్పి తగిలాయి. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 43 ఏళ్ల బూగీ బీ.. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రాంలో తన వీడియోలతో నవ్వులు పూయిస్తూ అనతికాలంలోనే పాపులర్ అయ్యారు. మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నారు. న్యూయార్క్‌లో నివసిస్తున్న ఆయన క్రిస్మస్ సందర్భంగా సొంత నగరం న్యూ ఓర్లీన్కు వెళ్లారు. దురదృష్టవశాత్తు తుపాకి తూటాలు తగిలి కన్నుమూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే బూగీ బీ మృతి అనంతరం పోలీసుల తీరుపై ఆమె తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో తన కుమారుడే గాక చాలా మంది అమాయకులు మరణించారని, పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. న్యూ ఓర్లీన్స్ నగరంలో తరచూ తుపాకీ కాల్పుల ఘటనలు జరగుతున్నాయి. ఇక్కడి యువత దారితప్పి గన్ ఫైటింగ్‌కు దిగుతున్నారు. ఏ మాత్రం ప్రాణభయం లేకుండా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఇక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఫ్రెండ్స్‌తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని.. -
ఆ డ్రోన్లు జారవిడిచిన బాంబుల్లో ఆర్డీఎక్స్!
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో డ్రోన్ల సాయంతో ప్రయత్నించిన మరో ఉగ్రకుట్రను భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన కొన్ని గంటల్లోనే అదే తరహా ఘటన పునరావృతమవడం సంచలనం రేపింది. ఈసారి సైనిక స్థావరాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. రెండు డ్రోన్లతో దాడికి ప్రయత్నించారు. ఆర్మీ జవాన్లు అప్రమత్తమై ఎదురుదాడికి దిగడంతో డ్రోన్లు తోకముడిచాయి. జమ్మూకశ్మీర్‌లోని రత్నుచక్–కలుచక్ సైనిక స్థావరం వద్ద ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్,› సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు మరో డ్రోన్ సైనిక స్థావరం వైపు దూసుకొచ్చాయని తెలిపారు. వాటిని నేలకూల్చడానికి విధుల్లో ఉన్న సెంట్రీలు దాదాపు రెండు డజన్ల రౌండ్లు కాల్పులు జరపడంతో డ్రోన్లు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆర్మీ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ వివరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రత్నుచక్–కలుచక్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. డ్రోన్ల కోసం చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో భూభాగంపై అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని అన్నారు. మన సైనిక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. రత్నుచక్–కలుచక్ మిలటరీ స్టేషన్‌పై 2002లో ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ దాడిలో 31 మంది మరణించారు. వీరిలో ముగ్గురు సైనిక సిబ్బందితోపాటు వారికి కుటుంబ సభ్యులు, సాధారణ పౌరులు ఉన్నారు. అలాగే 48 మంది గాయపడ్డారు. ఈ దాడి జరిగినప్పటి నుంచి రత్నుచక్–కలుచక్ సైనిక స్థావరానికి ప్రత్యేక భద్రత కల్పిస్తున్నారు. కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నిషేధిత జైషే మొహమ్మద్(జేఈఎం) ముష్కరులు రెచ్చిపోయారు. ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీవో)తోపాటు ఆయన భార్య, కుమార్తె ప్రాణాలను బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపుర ప్రాంతంలో ఉన్న హరిపరిగామ్‌లో ఆదివారం రాత్రి 11 గంటలకు ఎస్పీవో ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య రజా బేగం, కుమార్తె రఫియా(22) ఇంట్లో ఉండగా, ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారు. వెంటనే తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య, కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఫయాజ్ అహ్మద్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భార్య ఆదివారం రాత్రి, కుమార్తె సోమవారం ఉదయం మృతి చెందారు. ఎస్పీవో కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్న ముష్కరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కశ్మీర్ రేంజి ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఘాతుకంలో పాలుపంచుకున్న ఇద్దరిలో ఒకడు విదేశీయుడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈ దారుణాన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ధ్వజమెత్తారు. బాధ్యులను వెంటనే పట్టుకొని, కఠిన శిక్ష విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నిషేధిత జైషే మొహమ్మద్(జేఈఎం) ముష్కరులు రెచ్చిపోయారు. ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్పీవో)తోపాటు ఆయన భార్య, కుమార్తె ప్రాణాలను బలిగొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపుర ప్రాంతంలో ఉన్న హరిపరిగామ్‌లో ఆదివారం రాత్రి 11 గంటలకు ఎస్పీవో ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య రజా బేగం, కుమార్తె రఫియా(22) ఇంట్లో ఉండగా, ఉగ్రవాదులు లోపలికి ప్రవేశించారు. వెంటనే తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య, కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. ఫయాజ్ అహ్మద్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భార్య ఆదివారం రాత్రి, కుమార్తె సోమవారం ఉదయం మృతి చెందారు. ఎస్పీవో కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్న ముష్కరుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కశ్మీర్ రేంజి ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఘాతుకంలో పాలుపంచుకున్న ఇద్దరిలో ఒకడు విదేశీయుడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఈ దారుణాన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ధ్వజమెత్తారు. బాధ్యులను వెంటనే పట్టుకొని, కఠిన శిక్ష విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. లష్కరే టాప్ కమాండర్ అరెస్ట్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్‌ను సోమవారం భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. భద్రతా సిబ్బందిపై, సాధారణ ప్రజలపై జరిగిన పలు ఉగ్రవాద దాడుల్లో, హత్యల్లో అతడి హస్తం ఉందని అధికారులు చెప్పారు. నదీమ్ అబ్రార్‌ను బలగాలు అదుపులోకి తీసుకోవడం తమకు పెద్ద విజయమని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. శ్రీనగర్ శివారులోని పరింపురా చెక్‌పాయింట్ వద్ద నదీమ్‌ను అరెస్ట్ చేశారు. అబ్రార్‌తోపాటు మరో అనుమానితుడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వారి నుంచి ఒక పిస్టల్, గ్రనేడ్ స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో లవాయ్పురాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి కేసులో నదీమ్ అబ్రార్ నిందితుడు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ డ్రోన్లు జారవిడిచిన బాంబుల్లో ఆర్డీఎక్స్! జమ్మూ ఎయిర్‌పోర్టు సమీపంలో భారత వాయుసేన(ఐఏఎఫ్) స్థావరంపై దాడికి ఉగ్రవాదులు ఆర్డీఎక్స్తో కూడిన పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ముష్కరులు ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్లతో బాంబులను జారవిడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన సిబ్బంది గాయపడ్డారు. ఈ బాంబుల్లో ఆర్డీఎక్స్తోపాటు మిశ్రమ రసాయనాలు ఉన్నట్లు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి. దీనిపై పూర్తి నివేదిక అందాల్సి ఉందన్నాయి. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నది దర్యాప్తు సంస్థలు నిర్ధారించలేదు. ఎన్ఐఏ ఘటనా స్థలం నుంచి సాక్ష్యాధారాలను సేకరిస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులే డ్రోన్లతో దాడికి దిగినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. -
నలుగురు లష్కరే ముష్కరులు హతం
శ్రీనగర్: సోమవారం జమ్ముకశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాదళాలు నలుగురు లష్కరే తోయిబా తీవ్రవాదులను మట్టుబెట్టాయి. జిల్లాలోని మనిహల్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి భద్రతాదళాలు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నాయని, మిలిటెంట్లను గుర్తించిన అనంతరం లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా కాల్పులు జరిపారని, దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపగా నలుగురు తీవ్రవాదులు మరణించారని ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వీరంతా తమను తాము లష్కరే ముస్తఫా వర్గంగా చెప్పుకుంటారని, కానీ పోలీసు రికార్డుల్లో వీరు లష్కరేతోయిబా తీవ్రవాదులనే ఉందని చెప్పారు. ఎన్కౌంటర్ స్థలంలో మూడు పిస్టల్స్, ఒక ఏకే 47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారన్నారు. మృతులను రాయిస్ అహ్మద్ భట్, అమిర్ షఫి మిర్, రఖిబ్ అహ్మద్ మాలిక్, అఫ్తాబ్ అహ్మద్ వనిగా గుర్తించారు. సంఘటనలో ఒక ఆర్మీ జవాను గాయపడగా ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఈ ఏడాది ంతవరకు 9 ఎన్కౌంటర్లు జరిగాయని, వీటిలో 19మంది తీవ్రవాదులు హతమయ్యారని ఐజీ వివరించారు. తిరిగి వచ్చేయండి ఈ సంవత్సరం 18 మంది యువకులు మిలిటెంట్లలో చేరారని, వీరిలో 5గురు ఎన్‌కౌంటరయ్యారని, ముగ్గురు అరెస్టయ్యారని, మిగిలిన వారు లొంగిపోయేలా చర్యలు తీసుకోవాలని వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇలా ఏడుగురు యువకులు మిలిటెంట్లనుంచి తిరిగి వచ్చారన్నారు. సెక్యూరిటీ దళాలపై లోయలో తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతోందన్నారు. స్థానిక యువతను తీవ్రవాదంవైపు మరల్చేందుకు పాకిస్థాన్ కుయుక్తులు పన్నుతోందని, సోషల్‌మీడియా ద్వారా రెచ్చగొడుతోందని విమర్శించారు. దీనికితోడు పాక్ డ్రగ్స్‌ను కూడా సరఫరా చేస్తోందని, ఇలా డ్రగ్స్‌కు బానిసైనవారు తమను సంప్రదిస్తే డీఅడిక్షన్ కేంద్రాలకు పంపుతామని చెప్పారు. యువతకు సాయం చేసేందుకు పోలీసులు సదా సిద్ధమన్నారు. లోయలో శాంతిస్థాపన తమ ధ్యేయమన్నారు. దళాలపై రాళ్లురువ్వే సంఘటనలు చాలా తగ్గిపోయాయని, గతంలోలాగా కాకుండా మిలిటెంట్లకు భయపడకుండా ప్రజా జీవనం కొనసాగుతోందని చెప్పారు. నిజానికి మిలిటెన్సీ కన్నా రాళ్లు రువ్వే ఘటనలు చాలా తీవ్రమైనవని, సామాజికంగా సీరియస్ సమస్యని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా పలువురిని ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేస్తున్నామని చెప్పారు. -
హిజ్బుల్ కమాండర్ హతం
శ్రీనగర్: ఎనిమిదేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్ నైకూ (32) చివరకు భద్రతా బలగాల చేతుల్లోనే హతమయ్యాడు. ఇతడు ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో కమాండర్‌గా పనిచేస్తున్నాడు. కశ్మీర్‌లోని అతడి సొంత గ్రామంలోనే నైకూను మట్టుబెట్టడం గమనార్హం. మంగళవారం రాత్రి నుంచి సాగిన ఈ ఆపరేషన్‌లో ప్రధానంగా రెండు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరగాయి. అందులో ఒకటి దక్షిణ కశ్మీర్‌లోని షార్షవల్లి కాగా, రెండోది అవంతిపొరలోని బీగ్ పొర. రెండు చోట్లా ఇద్దరు చొప్పున ఉగ్రవాదులు మరణించారు. అవంతిపొర ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నైకూను మట్టుబెట్టారు. నైకూ పోలీసుల నుంచి ఇప్పటికే మూడుసార్లు తప్పించుకున్నాడు. అయితే ఈసారి తప్పించుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అతన్ని హతం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సాగిందిలా.. నైకూ తన సొంత గ్రామంలో ఉన్నాడన్న సమాచారం మంగళవారం రాత్రే పోలీసులకు అందింది. అయితే పోలీసులు వెంటనే కాల్పులు జరపలేదు. నైకూ గతంలో ఇలాంటి పరిస్థితుల నుంచే తప్పించుకున్నందున, ఈసారి తప్పించుకోకుండా, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ తనిఖీ చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ గ్రూపును, జమ్మూకశ్మీర్ పోలీసులను ఈ ఆపరేషన్ కోసం వినియోగించుకున్నారు. మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలు నైకూ ఉన్న ప్రాంతం నుంచి ప్రజలను దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. ఈలోగా విషయం అర్థం చేసుకున్న ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో బయటకు వచ్చిన ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. అనంతరం లోపల ఉన్న ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు హతమార్చాయి. అయితే మరణించింది నైకూనా లేక మరొకరా అన్నది వెంటనే తెలియలేదు. తర్వాత పోలీసులు నైకూ మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. షర్షాలి అనే మరోగ్రామంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు ఎవరో గుర్తించాల్సి ఉంది. కశ్మీర్ వాలీలో శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని సెల్‌ఫోన్ టవర్లను మూసేసినట్లు తెలిపారు. నైకూ చరిత్ర ఇది.. మొదట్లో లెక్కల టీచర్‌గా పనిచేసిన నైకూ 2012లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థలో చేరాడు. అతనిపై మొదటిసారి 2012 జూన్ 6న పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇప్పటివరకూ అతనిపై 11 కేసులు ఉన్నాయి. భద్రతా బలగాల కన్నుగప్పి తిరుగుతున్న నైకూ తలపై ఇప్పటికే రూ. 12 లక్షల రివార్డు ఉంది. 2014 నుంచి అతడు యాక్టివ్‌గా ఉన్నాడు. 2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్ వని మరణించాక నైకూ డీ ఫాక్టో చీఫ్‌గా మారాడు. పలువురు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేశాడు. టెక్నాలజీపై పట్టున్న నైకూ ఎక్కడా ఆధారాలు వదిలేవాడు కాదు. నైకూ ఎన్‌కౌంటర్‌పై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. అతడి మరణం మరికొందరు చేసే అల్లర్లకు, నిరసనలకు కారణంగా మారేందుకు అంగీకరించరాదని ట్వీట్ చేశారు. -
దండకారణ్యంలో యుద్ధ మేఘాలు!
సాక్షి, చర్ల(ఖమ్మం): దండకారణ్యంలో యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. చర్ల మండల సరిహద్దున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గల పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టుతో పాటు ఇద్దరు జవాన్లు మృతి చెందిన విషయం విదితమే. కాగా, ఈ ఎదురుకాల్పుల్లో పాల్గొని తప్పించుకున్న మావోయిస్టులను పట్టుకోవాలన్న కృతనిశ్చయంతో ప్రత్యేక పోలీసు బలగాలు దండకారణ్యంలోకి పెద్దఎత్తున చొచ్చుకుపోతున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ, కోబ్రా, డీఆర్జీ, ఎస్టీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలు సరిహద్దుకు చేరుకొని దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. సరిహద్దున బీజాపూర్ జిల్లాలో ఉన్న ఎర్రపల్లి, డోకుపాడు, తెట్టెమడుగు, యాంపు రం, జారుపల్లి, గుండ్రాయి, పాలచలమ తది తర గ్రామాలకు చెందిన ఆదివాసీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎర్రపల్లి ఎదురుకాల్పుల నేపథ్యంలో సరిహద్దులో ఉన్న తోగ్గూడెం, తిప్పాపురం, ధర్మపేట, ఎలకనగూడెం, మారాయిగూడెం, పామేడు ప్రాంతాల్లో ఉన్న బేస్‌క్యాంపులతో పాటు డీఆర్జీ, ఎస్టీఎఫ్ క్యాంపుల్లో భద్రతను పెంచారు. ఆయా క్యాంపులకు అదనపు బలగాలను తరలిస్తున్నారు. ఆకు రాలే కాలం కావడంతో ఇక నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు ఆరంభం కానుండగా, ఎప్పుడు, ఎక్కడ ఏ ప్రమాదం వచ్చి పడుతుందోనని సరిహద్దు జనం భయకంపితులవుతున్నారు. -
ఐదుగురు మావోల ఎన్కౌంటర్
చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని అబూజ్మడ్ అడవుల్లో పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని దుర్వేదా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు రెండు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం తారసపడిన మావోయిస్టులు పోలీసు బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరిపాయి. సుమారు గంటన్నర పాటు ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ముగిసిన అనంతరం సంఘటన ప్రాంతంలో ఒక మహిళ సహా ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు డీఆర్జీ జవాన్లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా ప్రాంతం నుంచి పెద్దమొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతం నారాయణ్‌పూర్ జిల్లాలోని ఓర్చా పోలీస్ స్టేషన్‌కు సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలను తరలించి కూంబింగ్ ముమ్మరం చేశారు. -
మళ్లీ నెత్తురోడింది
కొలంబో/వాషింగ్టన్: ద్వీప దేశమైన శ్రీలంక మరోసారి నెత్తురోడింది. నిఘావర్గాల సమాచారంతో సోదాలు జరుపుతున్న భద్రతాబలగాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు, అనంతరం తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన తన అత్యవసర అధికారాలతో ఉగ్రసంస్థలు నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే), జమాతే మిల్లతూ ఇబ్రహీం(జేఎంఐ)లపై నిషేధం విధించారు. ఏప్రిల్ 21న ఈస్టర్ రోజు చర్చిలు, హోటళ్లలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 253 మంది చనిపోవడం తెల్సిందే. ఎన్టీజే స్థావరంలో తనిఖీలు.. ఉగ్రవాదుల విషయమై నిఘావర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్త బలగాలు శుక్రవారం రాత్రి కల్మునయ్ పట్టణంలోని సైంతమురుతు ప్రాంతంలో ఎన్టీజే స్థావరంగా భావిస్తున్న ఓ ఇంటిని చుట్టుముట్టాయి. సైన్యం కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు ఆయుధాలతో కాల్పులు ప్రారంభించారు. సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఇరువర్గాల కాల్పుల్లో ఓ పౌరుడు చనిపోయాడు. ఓవైపు ఇరువర్గాల మధ్య కాల్పులు భీకరంగా కొనసాగుతుండగానే, ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాబలగాలకు ప్రాణాలతో చిక్కకూడదన్న ఉద్దేశంతో తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే)కు స్థావరంగా ఉన్న ఈ ఇంటిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, ఆత్మాహుతి కిట్లు, ఐసిస్ జెండాలు, ఆర్మీ దుస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు చనిపోయినట్లు భావిస్తున్నామని పోలీస్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. గాయపడిన ముగ్గురు ఉగ్రవాదులకు ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఉగ్రదాడులపై విచారణలో శ్రీలంక అధికారులకు సహకరించేందుకు అమెరికా ముందుకొచ్చింది. తమ అధికారులతో ఓ బృందాన్ని కొలంబో పంపినట్లు ఎఫ్‌బీఐ చీఫ్ క్రిస్టోఫర్ రే తెలిపారు. తమ పౌరులకు భారత్, అమెరికా సూచన అత్యవసరమైతే తప్ప భారత పౌరులెవరూ శ్రీలంకకు ప్రయాణాలు పెట్టుకోవద్దని భారత విదేశాంగ శాఖ సూచించింది. ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సివస్తే కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం, జాఫ్నా, హంబన్తోటలోని కాన్సులేట్లు, కండిలోని అసిస్టెంట్ హైకమిషన్‌ను సంప్రదించాలని చెప్పింది. మరోవైపు శ్రీలంక పర్యటనకు వెళ్లాలనుకునే అమెరికా పౌరులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని అగ్రరాజ్యం కోరింది. శ్రీలంకలో ఉగ్రదాడుల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ శనివారం లెవల్–3 ప్రయాణ సూచికను జారీచేసింది. వారందరినీ చంపాలి శ్రీలంకలో వరుసబాంబు పేలుళ్లు జరిగిన కొన్ని గంటలకే ఈ దాడులకు సూత్రధారిగా భావిస్తున్న జహ్రన్ హషీమ్ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. ఇందులో శ్రీలంక యాసతో తమిళంలో హషీమ్ మాట్లాడుతూ.. ‘మతవిశ్వాసాలు, నమ్మకం ఆధారంగా మనుషులను మూడు రకాలుగా విభజించవచ్చు. వీరిలో ఒకరు ముస్లింలు. మరొకరు ముస్లింల అభిప్రాయాలను అంగీకరించేవారు. ఇక మూడోవర్గం ఉంది చూశారా.. వీళ్లందరిని చంపేయాలి. ఈ మాట చెప్పేందుకు చాలామంది భయపడతారు. ఈ వ్యాఖ్యలను ఉగ్రవాదంగా ముద్రవేస్తారు. ఇస్లాం సిద్ధాంతాలతో అంగీకరించని వాళ్లందరినీ చంపేయాలి’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు శ్రీలంక ఉగ్రదాడిని ఐసిస్ తమ పత్రికలో ‘ప్రత్యేక కథనం’గా ప్రచురించింది. కాగా, హషీమ్ విద్వేష ప్రసంగాలపై తాము ప్రభుత్వానికి 2015, 2018లో ఫిర్యాదు చేశామనీ, అయినా అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదని శ్రీలంక ముస్లిం మండలి ఉపాధ్యక్షుడు హిల్మే అహ్మద్ తెలిపారు. ఖురాన్ తరగతుల పేరుతో యువతకు విద్వేషం నూరిపోసిన హషీమ్, గౌతమబుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసేలా యువతను ప్రేరేపించాడని విమర్శించారు. తమిళనాడులోనే ఉగ్ర శిక్షణ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులంతా తమిళనాడులో శిక్షణ పొందినట్లు ఆ దేశానికి చెందిన పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎన్టీజేకు అధ్యక్షుడిగా ఉన్న జహ్రన్ హషీమ్ వీరందరికీ శిక్షణ ఇచ్చాడన్నారు. ఈస్టర్ రోజున జరిగిన ఆత్మాహుతి దాడిలో హషీమ్సహా 9 మంది బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారని వెల్లడించారు. హషీమ్ రూపొందించిన ఆత్మాహుతి దళంలో మహిళా బాంబర్ కూడా ఉందని పేర్కొన్నారు. హషీమ్ తొలుత శ్రీలంకలోని మట్టకళప్పు ప్రాంతం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నడిపేవాడనీ, కానీ ఇతని వ్యవహారశైలిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండేళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని చెప్పారు. ఘటనాస్థలిలో లభ్యమైన బాంబులు, బ్యానర్లు -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. 6గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శనివారం ఉదయం కశ్మీర్ పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా సిబ్బంది ఆరుగురు ఉగ్రవాదులను అంతమొందించారు. చనిపోయిన వారంతా మాజీ హిజ్బుల్ చీఫ్ జాకీర్ ముసా అన్సార్‌కు చెందిన ‘ఘజ్వత్ ఉల్ హింద్’ ముఠాకు చెందిన వారని తెలిసింది. మరణించిన వారిలో జాకీర్ ముసా ముఖ్య అనుచరుడు సోలిహా మహ్మద్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. వివరాల ప్రకారం దద్సారా ప్రాంతంలోని ఆరమ్‌పోరా కుగ్రామంలో ఉగ్రవాదుల ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దాంతో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అధికారులు తనిఖీలు చేస్తుండగా.. ఓ ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పుల జరిపిన భద్రతా సిబ్బంది ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి అధికారులు ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
ఒడిశాలో భారీ ఎన్కౌంటర్
మల్కన్‌గిరి/సీలేరు: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో సోమవారం ఉదయం భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు సహా ఐదుగురు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేత రణదేవ్ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)ల్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎస్పీ జగ్మోహన్ మీనా ఎస్ఓజీ, డీబీఎఫ్ జవాన్లతో కలిసి ఆదివారం అర్థరాత్రి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మావోయిస్టు అగ్రనేత రణదేవ్ పప్పులూరు పంచాయతీ అల్లూరికొట్ట గ్రామంలో ఆదివారం రాత్రి నుంచి ప్రజాకోర్టు నిర్వహిస్తున్నాడని తెలుసుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అప్రమత్తమైన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో బలగాలు కూడా కాల్పులు జరిపాయి. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అయితే, కాల్పులు కొనసాగుతుండగానే రణదేవ్ సహా పలువురు కీలక నేతలు తప్పించుకున్నారు. మృతులను కలిమెల దళ కమాండర్ ఉంగసోడి అలియాస్ కీర్తి, కలిమెల దళ సభ్యులు సీమ అలియాస్ రూప, మసీమడి అలియాస్ సునీతలుగా గుర్తించారు. మిగతా ఇద్దరినీ గ్రామస్తులుగా అనుమానిస్తున్నారు. మృతదేహాలను మల్కన్‌గిరి జిల్లా కేంద్రానికి తరలించారు. సంఘటన ప్రాంతంలో గ్రనేడ్‌తోపాటు రెండు ఎస్ఎల్ ఆర్, ఒక ఇన్సాస్, ఒక .303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో కలిమెల దళం అంతరించినట్లేనని ఎస్పీ మీనా తెలిపారు. తప్పించుకున్న అగ్రనేతల కోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. అల్లూరికొట్ట గ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో ఉంది. -
ఛత్తీస్‌లో ముగ్గురు మావోల ఎన్కౌంటర్
పర్ణశాల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుక్మా ఎస్పీ అభిషేక్‌మీనా కథనం ప్రకారం.. మావోలు సంచరిస్తున్నారనే సమాచారంతో ఫుల్బగ్డీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన డీఆర్జీ బలగాలు మల్కగూడ– ముల్లూరు అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. మావోలు, పోలీసులు ఒకరికొకరు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య గంటసేపు కాల్పులు జరిగాయి. ఘటనాస్థలం నుంచి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు, నాలుగు తుపాకులు, పైప్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన మావోలను ముల్లేర్‌కు చెందిన మడివి హిడ్మా, కర్తాటి మల్లా, హర్ది హరియాలుగా గుర్తించారు. పట్టుబడిన మావోయిస్టును రవ్వా భీమాగా గుర్తించారు. విద్యార్థి కిడ్నాప్?: సుక్మా జిల్లాలో మంగళవారం మావోయిస్టులు కళాశాల విద్యార్థిని అపహరించినట్లు తెలిసింది. కుంట సబ్ డివిజన్ పరిధిలోని ముర్లిగూడకు చెందిన పొడియం ముకేష్ స్థానిక ఆశ్రమ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. కుంటకు సమీపంలోని భెజ్జిలో ఉన్న బంధువుల ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలోని అటవీ ప్రాంతంలో కిడ్నాప్ చేసినట్టు సమాచారం. -
ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి
దుమ్ముగూడెం: ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో మావోలు, పోలీసులకు మధ్య బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మిలీషియా సభ్యులు మృతి చెందారు. వివరాలు.. మారాయిగూడెం-గొల్లపల్లి రోడ్డు నిర్మాణ పనుల వద్ద సోమవారం మావోలు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి జవాను మడకం జోగా మృతి చెందాడు. దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు(డీఆర్జీ) బలగాలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నాయి. అయితే బుధవారం కన్నాయిగూడెం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడగా.. ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ధర్మాంగు గ్రామానికి చెందిన తాటి చుక్కా, కన్నాయిగూడెం గ్రామానికి చెందిన పొడియం దేవా అనే మిలీషియా సభ్యులు మృతి చెందారు. కాల్పుల తర్వాత మావోయిస్టులు పారిపోగా.. ఆ ప్రదేశంలో పోలీసులకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని తాటి చుక్కా, పొడియం దేవాగా గుర్తించినట్లు డీఆర్జీ అమిత్, హెచ్‌సీ మడకం ముద్దరాజు తెలిపారు. కాగా, సంఘటనా ప్రదేశంలో రెండు తపంచాలు, డిటొనేటర్లు, బ్యాటరీలు, 150 మీటర్ల విద్యుత్ వైరు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. -
22 హత్య కేసుల్లో నిందితుడు హతం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో ఒక దారుణ హంతకుడు శుక్రవారం హత్యకు గురయ్యాడు. నలుగురు డాక్టర్లు, ఎనిమిది మంది పోలీసులు, కరాచీలోని కొంతమంది రాజకీయ నాయకుల హత్యకేసులో ఇతడు ప్రధాన నిందితుడని మీడియా సమావేశంలో పోలీసులు తెలిపారు. అతడు పోలీసులపై కాల్పులు జరిపి, అనంతరం ఒక పోలీసు నుంచి తుపాకి దొంగిలించి కస్టడీ నుంచి తప్పించుకొని పారిపోబోతుండగా అతనికి, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయని తెలిపారు. ఈ కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.