CS krishna rao
-
'హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులు విజయవాడకు వెళ్లాలి'
హైదరాబాద్:నగరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు విజయవాడకు వెళ్లి నవనిర్మాణ దీక్షలో పాల్గొనాలని ఏపీ సీఎస్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఉద్యోగులంతా జూన్ 2 వ తేదీన విజయవాడలో నిర్వహించే నవ నిర్మాణ దీక్షలో పాల్గొనాలని సూచించారు. ఉద్యోగ సంఘాలతో శుక్రవారం కృష్ణారావు సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడతూ.. హైదరాబాద్ లోని ఉద్యోగులు విజయవాడకు వెళ్లాలన్నారు. ఉద్యోగులంతా ఏపీ నవనిర్మాణ దీక్షలో పాల్గొనడానికి సిద్ధం కావాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఒకవేళ విజయవాడ వెళ్లడానికి ఇబ్బంది ఉంటే.. సచివాలయం వద్ద దీక్షలో పాల్గొనవచ్చన్నారు.దీంతో పాటు ఉద్యోగుల బదిలీలను పొడిగించొద్దని సీఎస్ ను కోరినట్లు అశోక్ బాబు తెలిపారు. -
విభజన హామీలు అమలు చేయండి
కేంద్ర కార్యదర్శులతో సీఎస్ కృష్ణారావు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణచట్టం-2014లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన అన్ని హామీలను వీలైనంత త్వరగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గురువారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని కోరారు. ఆయనతో పాటు ఢిల్లీలో పలుశాఖల కార్యదర్శులతో సీఎస్ వరుసగా భేటీ అయ్యారు. సాయంత్రం ఏపీభవన్‌లో కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రాతో సమావేశమై వీలైనంత త్వరగా ఉద్యోగుల విభజన చేపట్టాలని కోరినట్లు తెలిపారు. హుద్‌హుద్ తుపాను సాయం కింద ప్రధాని ప్రకటించిన మొత్తంలో రావాల్సిన మిగిలిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు. నేడు ఏపీ, తెలంగాణ సీఎస్ల భేటీ: విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను త్వరితగతిన అమలు చేయడంతోపాటు, ఏపీ, తెలంగాణల మధ్య తలెత్తిన పలు వివాదాలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల సీఎస్‌లు కృష్ణారావు, రాజీవ్‌శర్మలు శుక్రవారం ఇక్కడ భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో మధ్యాహ్నం 12 గంటలకు నార్త్‌బ్లాక్‌లో ఈ సమావేశం జరగనుంది. -
వివాదాలపై ఢిల్లీలో 28న భేటీ
హాజరుకానున్న రెండు రాష్ట్రాల సీఎస్‌లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు అంశాల్లో నెలకొన్న వివాదాలను పరిష్కరించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మతో పాటు సంబంధిత కేంద్ర శాఖల ఉన్నతాధికారులతో.. హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం, కృష్ణా నదీ యాజమాన్య మండలి ఆదేశాలను అమలు చేయకపోవడం తదితర అంశాలను ఈ భేటీలో కేంద్రం దృష్టికి తీసుకురానున్నట్లు ఏపీ సీఎస్ కృష్ణారావు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. సాగర్ నుంచి కృష్ణా జలాలను డెల్టాకు విడుదల చేయడంలో టీ సర్కారు అవలంబించిన వైఖరిని కూడా వివరించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా.. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ సంస్థకు చెందిన ఉమ్మడి నిధులు రూ.35 కోట్లను ఏపీకి చెప్పకుండా బదిలీ చేసుకుందని, ఇది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనల స్ఫూర్తికి విరుద్ధమని వివరించనున్నారు. అదే సమయంలో.. కార్మిక సంక్షేమ నిధికి సంబంధించిన నిధులను ఏపీ ప్రభుత్వం జనాభా నిష్పత్తి మేరకే బదలాయింపు చేసిందని, అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో అనుచితంగా వ్యవహరించడమే కాకుండా కార్మిక శాఖ కమిషనర్‌ను పోలీసులతో ప్రశ్నింపజేసి కేసు కూడా నమోదు చేయించడాన్ని గోస్వామి దృష్టికి తేనున్నారు. అలాగే ఉమ్మడి సంస్థలకు చెందిన నిధులను స్తంభింపజేయాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయడాన్నీ, హైదరాబాద్‌లో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని ప్రస్తావించనున్నారు. విడిగా హక్కుల కమిషన్, లోకాయుక్త.. ఇలా ఉండగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏ షెడ్యూల్లోనూ లేని మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త, ఉప లోకాయుక్త, సమాచార హక్కు కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘంను విడిగా ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. -
ఆ టీచర్లను తెలంగాణలోనే ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ఏపీలో కలి పేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల టీచర్లను తెలంగాణలోనే ఉంచాలని పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్ డిమాండ్ చేశారు. సచివాలయంలో వారు గురువారం కమలనాథన్‌ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. అనంతరం వారు ఏపీ సీఎస్ కృష్ణారావును కూడా కలిశారు.