'హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులు విజయవాడకు వెళ్లాలి' | cs krishna rao meets ap empolyees | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులు విజయవాడకు వెళ్లాలి'

Published Fri, May 29 2015 2:57 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

'హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులు విజయవాడకు వెళ్లాలి' - Sakshi

'హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగులు విజయవాడకు వెళ్లాలి'

హైదరాబాద్:నగరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు విజయవాడకు వెళ్లి నవనిర్మాణ దీక్షలో పాల్గొనాలని ఏపీ సీఎస్ కృష్ణారావు స్పష్టం చేశారు. ఉద్యోగులంతా జూన్ 2 వ తేదీన విజయవాడలో నిర్వహించే నవ నిర్మాణ దీక్షలో పాల్గొనాలని సూచించారు. ఉద్యోగ సంఘాలతో శుక్రవారం కృష్ణారావు సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడతూ.. హైదరాబాద్ లోని ఉద్యోగులు విజయవాడకు వెళ్లాలన్నారు. ఉద్యోగులంతా  ఏపీ నవనిర్మాణ దీక్షలో పాల్గొనడానికి సిద్ధం కావాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు.

 

ఒకవేళ విజయవాడ వెళ్లడానికి ఇబ్బంది ఉంటే.. సచివాలయం వద్ద దీక్షలో పాల్గొనవచ్చన్నారు.దీంతో పాటు ఉద్యోగుల బదిలీలను పొడిగించొద్దని సీఎస్ ను కోరినట్లు అశోక్ బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement