custom
-
1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!
దేశంలోకి విభిన్న మార్గాల ద్వారా అక్రమంగా రవాణా చేయాలని చూసిన 7,348.68 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. 2023-24లో స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) వివరాలు వెల్లడించింది. 67వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నివేదిక విడుదల చేసింది. బంగారంతోపాటు వెండి, డ్రగ్స్, విలువైన లోహాలను దేశంలోకి అక్రమంగా రవాణా చేయడానికి స్మగ్లర్లు తరచు వినూత్న మార్గాలను ఉపయోగిస్తున్నారని తెలిపింది.2023-24 లెక్కల ప్రకారం డీఆర్ఐ తెలిపిన వివరాల కింది విధంగా ఉన్నాయి.8,223.61 కిలోల మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించి 109 కేసులు నమోదయ్యాయి.రూ.974.78 కోట్ల విలువ చేసే 107.31 కిలోల కొకైన్రూ.365 కోట్ల విలువ చేసే 48.74 కిలోల హెరాయిన్రూ.275 కోట్ల విలువ చేసే 136 కిలోల మెథాంఫెటమైన్236 కిలోల మెఫెడ్రోన్రూ.21 కోట్ల విలువ చేసే 7,348.68 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ పేర్కొంది.విమాన మార్గం ద్వారా కొకైన్ అక్రమ రవాణా పెరుగుతోంది. కొకైన్కు సంబంధించి 2022-23లో 21 కేసుల నమోదవ్వగా 2023-24లో అది 47కు పెరిగింది.ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ సరఫరా అధికమవుతోంది.కస్టమ్స్ అధికారులకు సహకరిస్తూ..గతంలో కంటే బంగారం అక్రమ తరలింపు ఈసారి పెరిగిందని అధికారులు తెలిపారు. 2023-24లో డీఆర్ఐ 1,319 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అందులో భూమార్గం 55 శాతం, వాయుమార్గం 36 శాతం కట్టడి చేసినట్లు చెప్పింది. డీఆర్ఐ అధికారులు కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం అదనంగా 4,869.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: మూడేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు క్రీడారంగం!స్మగ్లింగ్ కోసం సిండికేట్లు‘ప్రధానంగా మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి ఇండియాకు వచ్చే సరిహద్దు మార్గాల్లో నిత్యం తనిఖీ నిర్వహించి బంగారం స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తున్నాం. ఇటీవల కొన్ని ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాల్లోని విమానాశ్రయాలు స్మగ్లింగ్ కార్యకలాపాలకు కీలక ప్రదేశాలుగా మారాయి. ఇండియాలో బంగారం స్మగ్లింగ్ కోసం సిండికేట్లను నియమించుకుంటున్నారు. విదేశీ పౌరులు, విదేశాలకు వెళ్లొస్తున్న కుటుంబాలు, ఇతర వ్యక్తులు ఇందులో భాగమవుతున్నారు. చాలాచోట్ల విమానాశ్రయాల్లో పని చేస్తున్న సిబ్బంది కూడా అక్రమ రవాణాలో సహకరిస్తున్నారు’ అని డీఆర్ఐ నివేదిక తెలిపింది. -
బియ్యం అమ్మకం..రూ.4 వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిధుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టి.. కస్టమ్‌మిల్లర్ల నోట్లో మట్టికొట్టే పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో నాలుగైదు రూపాయల తక్కువకు అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. ఒక్క ఆక్షన్‌కి రూ.1000 కోట్ల స్కామ్.. కోటిటన్నులు అమ్ముకునే ప్రణాళిక బీఆర్ఎస్ సర్కారుదని ఆరోపించారు. ఈ విధంగా వచ్చే రూ.4 వేల కోట్ల అవినీతి సొమ్ము 100 నియోజకవర్గాల్లో..ఒక్కో సెగ్మెంట్లో రూ.40 కోట్లు ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు సంధించారు. శనివారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ బియ్యం అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, దీనికి వెనుక అసలు ఉద్దేశం అదేనని ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని వేలం వేసేందుకు వెయ్యికోట్ల టర్నోవర్, రూ.100 కోట్ల ప్రాఫిట్ ఉండాలనే నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. మొదటిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారని, టెండర్లో పాల్గొనేందుకు పౌరసరఫరాలశాఖ నిర్ణయించిన విధివిధానాలతో రైస్ మిల్లర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎంఎస్పీకి బియ్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో మిల్లర్లు సిద్ధంగా ఉన్నా, టెండర్ల ద్వారా తమ మిల్లు సామర్థ్యం మేరకు ధాన్యం దక్కించుకుందామనుకున్న మధ్యతరగతి మిల్లర్లకు అసలు అందులో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో రైస్‌మిల్లర్లు బియ్యం ఆక్షన్‌లో కొనలేరన్నారు. రైస్‌మిల్లర్ల వ్యాపారం బంద్ అయితే రైతులు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీచేస్తే మూడో స్థానానికి పరిమితం అవుతుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను ఎంపీగా పోటీలో ఉండడం ఖాయమని ప్రకటించారు. -
ఒక ఊరి కథ: పిల్లా జెల్లా రోజంతా బయటే!
సాక్షి, బెంగళూరు: సుభిక్షంగా ఉండాలనుకుంటూ ఆ ఊరంతా ఖాళీ అయిపోతుంది. ఒక్కరోజంతా పిల్లా జెల్లా గోడ్డుతో బయటే గడుపుతుంది. వన భోజనాల సమయంలో మండలంలోనే ఆ ఊరు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంటుంది. రోళ్ల మండల పరిధిలోని దొమ్మరహట్టి గ్రామంలోని ప్రజలు ఏటా సంప్రదాయం ప్రకారం.. ఊరి నుంచి పిల్లాపాపలు, జంతువులతో ఊరిబయటకు తరలిపోతారు. సమీపాన గుడారాలు వేసుకున్నారు. ముందుగా ఊరి చుట్టు ముళ్ల కంపల కంచెను వేశారు. చెట్టు దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడాది ఒకసారి ఆషాఢ మాసంలో గ్రామాన్ని బహిష్కరించి చెట్టు దేవునికి వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పించడం అనవాయితీ. ఇలా చేయడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయని, ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉంటారని గ్రామస్తుల నమ్మకం. రకరకాల వంటకాలు చేసి బంధుమిత్రులతో ఆరగించారు. గురువారం నాడు వనభోజనం నిర్వహించి.. సాయంత్రం వరకు ఊరి బయటనే ఆటపాటలతో గడిపారు. -
ఎంత ఎదిగినా.. ఒదిగే ఉంటారు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ గ్రామంలో ఓ ఆచారం కొనసాగుతోంది. గతంలో ఉన్న పూరి గుడిసెల స్థానంలో ఊరంతా పక్కా ఇళ్లు వెలిసినా.. ఏ ఒక్కరూ మొదటి అంతస్తు (ఫస్ట్ ఫ్లోర్) నిర్మించరు. దేవుడి పాదాల కంటే తమ ఇళ్లు తక్కువ ఎత్తులో ఉంటే శుభకరమని అక్కడి వారి విశ్వాసం. ఆ గ్రామంలో చారిత్రక శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఏటా నిర్వహించే తిరునాళ్లలో గ్రామస్తులే మోత కాపులుగా ఉంటూ.. స్వామి వారి సేవల్లో పాల్గొంటారు. తమ కుల దైవమైన వరాహ లక్ష్మీనరసింహస్వామిపై భక్తితో ఎన్నో సంవత్సరాలుగా అంతా పాటిస్తున్నారు. గతంలో అన్నీ పూరి గుడిసెలే.. ఈ గ్రామంలో సుమారు 30 సంవత్సరాల క్రితం బ్రాహ్మణ కాలనీలో పక్కా భవనాలు ఉండగా.. మిగిలిన అన్నిచోట్లా పూరి గుడిసెలే ఉండేవి. క్రమంగా గ్రామస్తులంతా ఆర్థికంగా బలపడ్డారు. పూరి గుడిసెలన్నీ పక్కా గృహాలుగా మారాయి. ఎటు చూసినా పక్కా ఇళ్లే. వాస్తవానికి ఇక్కడి వారందరికీ 2, 3 అంతస్తుల భవనాలు నిర్మించుకునే స్తోమత ఉన్నా.. ఒక్కరు కూడా ఆలయంలోని స్వామి పాదాల కన్నా తక్కువ ఎత్తులోనే భవనాలు నిర్మించుకునే ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. గ్రామంలోని వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మొదటి అంతస్తు గల భవనం పాఠశాల ఒక్కటే.. గ్రామంలో మొదటి అంతస్తు గల భవనం పాఠశాల ఒక్కటే. పాఠశాల భవనంపై మొదటి అంతస్తు నిర్మించగా.. ఆ కాంట్రాక్టర్ ఇంట్లో ఒకరు మరణించారని గ్రామస్తులు చెబుతుంటారు. ఇటీవల సచివాలయ భవనం మంజూరైనప్పటికీ ప్రధాన గ్రామంలో కాకుండా శివారు గ్రామమైన అయ్యప్ప నగర్లో నిర్మాణం చేపట్టారు. రెండు తరాలుగా ఇదే ఆచారం వరాహ లక్ష్మీనరసింహాస్వామి ఆలయ సమీపంలో ఉన్న ప్రధాన గ్రామంలో రెండు తరాలుగా ఒకే అంతస్తు నిర్మిస్తున్నారు. స్వామి వారి పాదాల కన్నా ఇళ్లు ఎత్తు ఉండకూడదన్నదే ఇందుకు కారణం. – చిమట శ్రీను, పాత సింగరాయకొండ నమ్మకం ప్రకారమే నడుచుకుంటారు ఆలయంలో వంశపారంపర్య అర్చకుడిగా పని చేస్తున్నాను. ఇక్కడి వారంతా స్వామి పాదాల కింద ఉంటే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. వారి నమ్మకం ప్రకారం అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందారు. – ఉదయగిరి లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు అది మా నమ్మకం.. ఆచారం స్వామి పాదాలకు దిగువన ఉంటే మేలు జరుగుతుందన్న నమ్మకంతో ఆ ఆచారాన్నే కొనసాగిస్తున్నాం. మా నమ్మకం వమ్ము కాలేదు. – లక్ష్మీనరసింహం, గ్రామస్తుడు -
రైతుకు చేయూత
సాక్షి, రంగారెడ్డి: వ్యవసాయ యంత్రాలు, పరికరాలు స్వతహాగా కొనుగోలు చేయలేని రైతుల కోసం మండలానికో కస్టమ్ హైరింగ్ కేంద్రాలు (సీహెచ్‌సీ) అందుబాటులోకి వస్తున్నాయి. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు మార్కెట్ ధరలో దాదాపు 50 శాతానికి.. సన్న, చిన్న కారు రైతులకు మార్కెట్ ధరలో కొంచెం తక్కువ రేటుకు అద్దెకు ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్(ఎన్ఆర్ఎల్ఎం) నిధులతో కస్టమ్ హైరింగ్ కేంద్రాలను సెర్ప్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్రానికి 31 సీహెచ్‌సీలు రాగా.. 29 చోట్ల అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల చొప్పున గ్రాంట్ మంజూరయ్యాయి. హైదరాబాద్ మినహా జిల్లాకు ఒక మండలాన్ని చొప్పున పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. మహిళలే నిర్వాహకులు.. వ్యవసాయంపై ఆధారపడిన మహిళా సంఘాల్లోని సభ్యులే ఈ సీహెచ్‌సీల నిర్వాహకు లు. ఇలా ఒక మండలంలోని మహిళా రైతులంతా కలసి వ్యవసాయ ఉత్పత్తిదారుల గ్రూ ప్ (ఎఫ్‌పీజీ)గా ఏర్పడతారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన 31 మండలాల్లోని ఎఫ్పీజీలకు.. సీహెచ్‌సీ ఏర్పాటుకు కావాల్సిన కేంద్ర గ్రాంట్ అందింది. ఈ నిధులతో స్థానిక వ్యవసాయ పంటలకు కావాల్సిన పరికరాలు, పనిముట్లను కొనుగోలు చేసి కేంద్రాలను వినియోగంలోకి తెస్తున్నారు. అందుబాటులో ఉన్న పనిముట్లు.. ట్రాక్టర్, కల్టివేటర్, పవర్ వీడర్, పవర్ టిల్ల ర్, టార్పాలిన్లు, పవర్ స్ప్రేయర్స్, సోయింగ్ అండ్ ఫెర్టిలైజర్ డ్రిల్లర్ ట్రాక్టర్ ఆపరేటర్ తదితర పనిముట్లు, పరికరాలు కస్టమ్ హైరిం గ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా 29 జిల్లాల్లో ఈ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో మాత్రం మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నాయి. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడం శక్తికి మించి భారం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి రైతులే 80 శాతం మంది ఉన్నారు. వీరికి యాంత్రీకరణను చేరువ చేయడంలో సీహెచ్‌సీలు ప్రధానపాత్ర పోషించనున్నాయి. అలాగే పెట్టుబడులను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. అధిక విస్తీర్ణంలో పంటల సాగు కూడా సులభం కానుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున.. సీహెచ్‌సీలకు మంచి స్పందన లభిస్తుండటంతో వీటి సేవలు విస్తరించాలన్న డిమాండ్ వస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపుతున్నారు. పట్టణ ప్రాంత సెగ్మెంట్లు మినహా.. గ్రామీణంలో ఉన్న సుమారు 75 నియోజకవర్గాల్లో త్వరలో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు 31 సెగ్మెంట్ల నుంచి ప్రతిపాదనలు అందినట్లు చెబుతున్నారు. అయితే నియోజకవర్గాల వారీగా ఏర్పాటయ్యే సీహెచ్‌సీలకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ లభించదు. బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ పరికరాలు, పనిముట్లను అద్దెకు ఇవ్వడం ద్వారా సమకూరే ఆదాయంలోంచి రుణాలు చెల్లించడంతోపాటు కేంద్రాల నిర్వహణను చూసుకోవాలి. రైతులకు ఎంతో మేలు.. సీహెచ్‌సీలతో పేద, మధ్య తరగతి రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. మహిళా సంఘాల ద్వారా మా వంతు సహకారం అందించనున్నాం. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో అధికంగా వ్యవసాయం చేసే మూడు గ్రామాలను గుర్తించి యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచుతున్నాం. ఆరుగురు సభ్యులతో కూడిన ఎఫ్‌పీజీని ఏర్పాటు చేశాం. ఫోన్ నంబర్లు ఇచ్చి ఒక సీసీతో పాటు అకౌంటెంట్‌ను పర్యవేక్షణకు నియమిస్తున్నాం. బయటి కంటే తక్కువకే అద్దెకు ఇస్తున్నాం. – వట్నాల శ్యామల, రంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
అదృష్టం కలిసి వస్తుందని...
సంక్రాంతి అంటేనే ముఖ్యంగా రైతన్నల పండుగ. పంట చేతికి వచ్చిన తర్వాత జరుపుకొనే తొలి పండుగ కావడంతో అన్నదాతలు ఎంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకొంటారు. అందమైన రంగవల్లులు, డూడూ బసవన్నల ఆటలు, పతంగుల విహారాలు, హరిదాసుల గానామృతంతో పల్లెలు పరవశిస్తుంటాయి. పంటను పండించే క్రమంలో కర్షకుడికి చేదోడువాదోడుగా ఉండే ఎద్దులు, గోమాతలను అందంగా అలంకరించి పూజించుకుంటారు. అంతేకాకుండా ఎడ్ల బండ్లను తిప్పే కార్యక్రమంతో సందడి తెలుగు రాష్ట్రాల రైతన్నలు సందడి చేస్తే.. కోడి పందాలతో పందెం రాయుళ్లు హల్చల్ చేస్తుంటారు. ఇదే తరహాలో బెంగళూరులో కూడా మకర సంక్రాంతి రోజును ఘనంగా జరుపుకొంటారు. తమ పంటలకు, పశువులకు ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటూ తరతరాలుగా అగ్నిపై నుంచి పశువులను దాటించే ఆచారాన్ని పాటిస్తారు. ఇందులో భాగంగా గోమాతలకు పూలమాలలు అలంకరించి, మెడలో గంటలు కడతారు. ఆ తర్వాత కొంతమంది యువకులు కలిసి మంటలపై నుంచి వాటిని దాటిస్తారు. ఇలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందని, పంటలు బాగా పండుతాయని అదే విధంగా పశుపక్ష్యాదులు ఆరోగ్యంగా ఉంటాయని వారు నమ్ముతారు. ఇక పొంగల్ వేడుకల్లో భాగంగా సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టును తమిళ తంబీలు ఘనంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. -
ఇది సాధికారత శోధన
మధ్యభారతంలో ఓ కుగ్రామం పర్మినో. తరతరాలుగా వస్తున్న ఆచారంలో భాగంగా అక్కడంతా మగవాళ్ల పెత్తనమే. ఆడవాళ్లు తల బయట పెట్టాలంటే తల మీద గూంఘట్ను సవరించుకోవాలి. వాకిలి బయట తలపెట్టి తమను ఎవరూ చూడడం లేదని నిర్ధారించుకున్న తర్వాత కానీ అడుగు గడపదాటదు. అలాంటి కుగ్రామంలో ఊరి పెత్తందారు రతన్‌సింగ్. అతడి మాటకు తిరుగులేకుండా సాగిపోతోంది. అప్పుడు వచ్చిందో చట్టం. అది 73, 74 రాజ్యాంగ సవరణ. ఆ సవరణ ప్రకారం స్థానిక పరిపాలనలో మూడవ వంతు మహిళలు ఉండాలి. పదిమంది వార్డు సభ్యులు ఉండే పంచాయితీలో కనీసం ముగ్గురైనా మహిళలు ఉండాలి. అది చట్టం రూపం సంతరించుకుంది కాబట్టి గ్రామ పరిపాలనలో మూడవ వంతు మహిళలు ఉండి తీరాలి. చట్టాన్ని ఉల్లంఘించకూడదు. అలాగని ఊరి పెత్తనం తన చేతి నుంచి జారిపోవడానికి వీల్లేదు. పెత్తనం చేయి దాటుతుందనే ఆలోచననే భరించలేని స్థితిలో ఉంటాడు రతన్ సింగ్. ‘కర్ర విరగకూడదు, పాము చావాలి’ ఎలా... మన ఇంటి మహిళ అయితే! ఆ మూడవ వంతు మహిళలు తమవాళ్లే అయితే? గొప్ప ఆలోచన. తన తెలివి తానే మురిసిపోతూ మీసం మెలేసుకుంటాడు రతన్‌సింగ్. కొడుకు ఇందర్‌కు చెప్తాడు ఈ సారి పంచాయితీ ఎన్నికలలో కోడలు మంజు పోటీ చేయాలని. అది ఇంటి పెద్ద తీర్మానం. ఊరిపెత్తనం ఇల్లు దాటి పోకుండా ఉండడానికి చేసిన తీర్మానం. ‘మంజు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది’ నిర్ణయం జరిగిపోయింది. నామినేషన్ పేపర్లు ఇంటికే వచ్చేశాయి. మగవాళ్లు చూపించి చోట సంతకం పెట్టడమే మంజు చేయాల్సింది. మామగారు, భర్త చెప్పినట్లు సంతకం చేసింది మంజు. ఇక మిగిలిన ఇద్దరు మహిళలు? పైగా ఈ ముగ్గురిలో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ కూడా కవర్ అవ్వాలి. రతన్ సింగ్ మాటకు ఎదురు చెప్పని అనుచరులు గుర్తొచ్చారు. వారికి భార్యలున్నారు చాలు. పంచాయితీ ఎన్నికలు జరిగాయి. మగవారి నిర్ణయాలు అమలులోకి వచ్చేశాయి, వారు సూచించిన మహిళలే పంచాయితీ సభ్యులయ్యారు. పంచాయితీ సమావేశాల సమయంలో ఈ ముగ్గురు మహిళలూ గూంఘట్లు మరింత కిందకు లాక్కుంటూ భర్తల వెంట పంచాయితీ కార్యాలయాలకు వెళ్తుంటారు. మగవాళ్లంతా ఒక గదిలో కూర్చుని గ్రామ వ్యవహారాల మీద చర్చిస్తుంటారు. ఆడవాళ్లు మాత్రం మగవాళ్ల కంట పడకుండా మరొక గదిలో కూర్చుంటారు. పంచాయితీ గుమాస్తా రికార్డు బుక్ తీసుకుని ఆడవాళ్లున్న గదిలోకి వినయంగా వచ్చి సంతకాలు తీసుకుని వెళ్లిపోతుంటాడు. అది కూడా పంచాయితీ పెద్ద చెప్పినప్పుడు. ఆ క్లర్కు రికార్డు బుక్ తెచ్చినప్పుడు సంతకాలు పెట్టడానికా తాము సభ్యులైంది? మహిళా సభ్యులలో ఆలోచన రేకెత్తింది. వారిలో విద్య ఒక్కటే చదువుకున్న అమ్మాయి. ఎన్నికలకు కొద్ది ముందుగా పెళ్లయి ఆ ఊరికి వచ్చిన కొత్త కోడలు. ఆమె ఊరి పెద్ద పెత్తందారీ తనానికి తలొగ్గదామె. పంచాయితీకి విడుదలైన నిధులు ఏమవుతున్నాయి? బడి నిర్మాణం అసంపూర్తిగా ఎందుకు ఉంది? వంటి ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఆమెను నియంత్రించడానికి ఆమె భర్త మీద ఒత్తిడి తెస్తుంటాడు రతన్‌సింగ్. దాంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి. ఒత్తిడులకు భయపడి వెనుకడుగు వేయకుండా ముందడుగు వేయడానికి విద్య పోరాడుతుంది. మహిళలు సంఘటితమయ్యారు. తమకూ మెదడు ఉందని, దానికి ఆలోచనలు ఉన్నాయని, ఇంటిని దిద్దడమే కాదు ఊరిని బాగు చేయడం కూడా తమకు చేతనవుతుందని నిరూపిస్తారు గ్రామంలోని మహిళలు. ఎంపవర్మెంట్ ఒకరు ఇస్తే వచ్చేది కాదు, సాధికారత సాధించుకోవాలనే తపన మహిళలో ఉండాలి. ఒకసారి ఆ బీజం పడితే అది మొలకెత్తక మానదు, మహావృక్షంగా మారకా మానదు. – వాకా మంజులారెడ్డి ∙నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, యునిసెఫ్‌లు సంయుక్తంగా 1996లో నిర్మించిన సంశోధన్ సినిమాకు గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించారు. ∙73,74 రాజ్యాంగ సవరణ బిల్లును 1992లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా, అది 1993 ఏప్రిల్‌లో అమలులోకి వచ్చింది. ఈ సవరణల ఆధారంగా రూపొందిన చట్టం... స్థానిక పరిపాలనలో మూడవ వంతు మహిళల భాగస్వామ్యం ఉండాలని చెప్తోంది. -
గడపకు పసుపు రాసి బొట్టు పెడితే..?
ఆచారం వారానికి ఒకసారి ప్రధాన ద్వారపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టడం చాలా మంచిది. లేదంటే కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా చేయడం లక్ష్మీప్రదం. దుష్టశక్తులు ఇంటిలోనికి రావు. శుక్రవారం రోజున ఉదయం స్నానం చేసి ఇంటి గడపకు పైన నల్లటి తాడుతో పటిక కడితే దృష్టి దోషం తొలగిపోతుంది. పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టడం ఇంటికి సౌభాగ్యాన్నిస్తుంది. అలాగే ఇంట్లో వారానికి ఒకసారి శుక్రవారం పూట లేదంటే, శని, గురువారాల్లో తప్పకుండా దీపారాధన చేయాలి. ప్రతిరోజూ చేస్తే మంచిది. పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా, పవిత్రంగా వుంచుకోవాలి. స్నానం చేయకుండా, అపరిశుభ్రమైన దుస్తులతో కాళ్లు కడుక్కోకుండా పూజగదిని తెరవ రాదు. దేవుళ్ల ప్రతిమలను తాకరాదు. దీపారాధన చేసిన తర్వాత దేవుళ్ల ప్రతిమలకు లేదా పటాలకు పూలు అలంకరించాలి. పూజ గది ఎంత కళకళలాడితే అంతగా మన జీవితాలు కళకళలాడుతాయని పండితులు చెప్తున్నారు. వీలైనంతవరకు రెండు లేదా మూడు పటాలను మాత్రమే పూజ గదిలో ఉంచాలి. అంతేకానీ, సన్నిహితులు, బంధువులు ఇచ్చిన చిన్న దేవుళ్ళ ఫోటోలతో పూజామందిరాన్ని నింపడం మంచిది కాదని పెద్దల మాట. -
ఏ దేవుడికి... ఏ ప్రసాదం?
ఒక నిమిషం–ఒక విషయం షోడశోపచారాలతో దైవాన్ని పూజించడం మనం ఆచారం. అందులో పూజ పూర్తయ్యాక నైవేద్యం పెట్టడం ముఖ్యం. అయితే ఒక్కోదేవుడికి ఒక్కో ప్రసాదమంటే ప్రీతికరం. ఏ దేవుడికి లేదా దేవతకు ఏ ప్రసాదం అంటే ఇష్టమో తెలుసుకుని, దానిప్రకారం మన అవకాశాన్ని బట్టి అదే నైవేద్యం పెడితే మంచిది. వేంకటేశ్వర స్వామికి: వడపప్పు, పానకం; వినాయకుడికి: బెల్లం, ఉండ్రాళ్లు, జిల్లేడుకాయలు; ఆంజనేయుడికి: అప్పాలు, లడ్డూలు, శెనగలు; సూర్యుడికి: ఆవుపాలతో చేసిన పాయసం, మొలకెత్తిన పెసలు; లక్ష్మీదేవికి: క్షీరాన్నం, పండ్లు; సత్యనారాయణస్వామికి: ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి కలిపి చేసిన ప్రత్యేక ప్రసాదం; దుర్గాదేవికి: మినపగారెలు, అల్లం ముక్కలు; షిర్డీ సాయిబాబాకి: పాలు, గోధుమ రొట్టెలు, పాలకోవా; శ్రీకృష్ణుడికి: అటుకులతోకూడిన తీపి పదార్థాలు, వెన్న; శివుడికి: కొబ్బరికాయ, అరటిపండ్లు. సంతోషిమాతకు: పులుపులేని పిండివంటలు, తీపిపదార్థాలు; సరస్వతీదేవికి: రేగుపండ్లు, వెన్న, పేలాలు, కొబ్బరి, పాయసం. ఒక ఘటన సీతాదేవి అశోకవనంలో ఒక చెట్టుకింద కూర్చొని ఉంది. రావణుడు, అతడి అనుచరులూ పరుషపు మాటలతో పెట్టే హింసలకు ఆమె ఎంతగానో తల్లడిల్లిపోయింది. తన జాడ తన పతికి తెలిసే అవకాశం లేదు. వారు ఇక్కడకు వచ్చే వీలూ లేదు. తానేమి చేయాలో దిక్కు తోచలేదు. దాంతో ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడింది. సరిగ్గా అదే సమయంలో చెట్టుకొమ్మమీద మైనాక పక్షి కూత కూస్తోందట. ఆ కూత ఎలా ఉన్నదంటే, వేదాధ్యయనం చేసిన గురువు, తన శిష్యుని నిద్రలేపి, స్నాన సంధ్యావందనాలు, అగ్ని కార్యాన్ని, హోమాన్ని చేసుకోమని చెబుతున్నట్లు తోచిందట. ఆ కూత సీతాదేవికి ఓదార్పుగానూ, హితవచనంగానూ అనిపించిందట. అంతే! సీతాదేవికి మనసు మారిపోయింది. తాను మరణిస్తే తన పతి తట్టుకోలేడు. తాను తన నాథుని ఎప్పటికీ చూడలేదు. జీవించి ఉంటే, ఏదోవిధంగా తన జాడ తెలుస్తుంది. అప్పుడు అసుర సంహారం చేసి, తనను తీసుకొని వెళ్లగలడు... అనిపించింది. దాంతో తనకు వచ్చిన ఆత్మహత్యాలోచనను మనసు నుంచి తుడిచి వేసిందట. అంటే... అవతలి వారు తీవ్రమైన దుఃఖంలో ఉన్నప్పుడు... ఆ దుఃఖాన్ని మనం తీర్చలేమని తెలిసినప్పటికీ, అనునయపూర్వకంగా ఒక్కమాట మాట్లాడినా లేదా కనీసం ఓదార్పుగా చేతితో స్పృశించినా అవతలి వారికి ఎంతో ఊరట కలుగుతుందని వాల్మీకి మహర్షి ఈ సంఘటన ద్వారా తెలియజెబుతున్నాడు. -
జపాన్‌లో దేవరగట్టు
ఆచారం కర్నూలు జిల్లా దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి జాతరలో మూల విరాట్టును దక్కించుకోవడానికి కట్టెలతో కొట్టుకునే ఆచారం ఉందని మనకు తెలుసు. ఐదారు గ్రామాల ప్రజలు అర్ధరాత్రి కట్టెలు కాగడాలు చేతపట్టి బీభత్సంగా పరస్పరం దాడి చేసుకోవడం గురించి విన్నాం. ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. జపాన్‌లో కూడా సరిగ్గా ఇలాంటి ఉత్సవమే ఒకటి ఉంది. దీని పేరు ‘హడాకా మట్సురీ’. లేదా ‘బరిబిత్తల ఉత్సవం’ అని కూడా అంటారు. జపాన్‌లోని ఒకాయమా నగరంలోని ఒక గుడిలో ఈ ఉత్సవం ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. దాదాపు పదివేల మంది మగవాళ్లు ఈ ఉత్సవానికి హాజరవుతారు. మగపిల్లలు కూడా పాల్గొనవచ్చు. గుడిలోకి చేరిన వారందరూ బట్టలు విప్పేసి కేవలం గోచిపాతలు మాత్రమే కట్టుకుంటారు. ఫిబ్రవరి వారికి చలి సమయం. అలాంటి గడ్డ కట్టించే చలిలో కూడా ఒంటి మీద లేశమాత్రపు దుస్తులతో ఉత్సవానికి సిద్ధమవుతారు. అందరూ గుడిలోకి చేరాక ప్రధాన పూజారి వస్తాడు. తన చేతిలోని కొన్ని ‘అదృష్ట పుల్లల’ను వారికి చూపిస్తాడు. లైట్లు ఆఫ్ అవుతాయి. చీకట్లో పూజారి ఆ పుల్లలను గుంపులో విసురుతాడు. వెంటనే లైట్లు ఆన్ అవుతాయి. ఇక మగ వాళ్లందరూ ఆ పుల్లల కోసం ఒకరితో ఒకరు బాహాబాహీగా తలపడతారు. వాటిని దక్కించుకున్నవారికి అదృష్టం వరిస్తుందనీ మరుసటి సంవత్సరం పండగ వరకు సంతోషంగా గడిచిపోతుందని నమ్మకం. ఈ ఉత్సవం జపాన్‌లో 500 ఏళ్లుగా జరుగుతుంది. అయితే దేవరగట్టులో లాగా మరీ రక్తపాతం వచ్చేలా ఇక్కడ కొట్టుకోరు. బాహాబాహీకి దిగినా గాయాలు, ఎముకలు విరగ్గొట్టుకోవడాలు ఇప్పటి దాకా జరగలేదు. సరదా, పట్టుదల మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. ఈ సంవత్సరం ఈ ఉత్సవం ఇటీవల జరిగింది. అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కొందరికి మాత్రమే అదృష్టపుల్లలు దొరికినా ఇలా ఉత్సవాన్ని దర్శించే అదృష్టం మాత్రం మనందరికీ దక్కింది. -
కస్టమ్ మిల్లింగ్ లక్ష్యం 15 శాతం పెంపు
ఆకివీడు : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) లక్ష్యం మరో 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం స్థానిక రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సేకరణ లక్ష్యాన్ని 15 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు వారు తెలిపారు. ఖరీఫ్ దిగుబడి 13.50లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేసి జిల్లా యంత్రాంగానికి నివేదించారు. అయితే జిల్లాలో 10.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి మాత్రమే వచ్చింది. ఈ ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లర్లు సేకరించి కస్టమ్ మిల్లింగ్ చేసి బియాన్ని ప్రభుత్వానికి సరఫరా చేయాలి. ఆ విధంగా జిల్లా ధాన్యం దిగుబడిలో 9.50 లక్షలు మెట్రిక్ టన్నులకు మాత్రమే ఖరీఫ్‌లో బియ్యం సేకరించేందుకు మిల్లర్లకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆ ప్రకారంగా రైతుల వద్ద నుంచి 69 శాతం సీఎమ్మార్ సేకరించాలని నిర్ణయించారు. అయితే జిల్లాలో ధాన్యం నిల్వలు ఉన్నందున మరో 15 శాతం బియ్యం సేకరించాలని లక్ష్యాన్ని నిరే్ధశించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని రైస్ మిల్లుల వద్ద నుంచి అదనంగా 15 శాతం బియ్యం సీఎమ్మార్‌గా సేకరిస్తారని జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు సమావేశంలో చెప్పినట్టు స్థానిక మిల్లర్లు తెలిపారు. -
ఆర్డర్ చేసినా రావటం 'కస్టమ్'
శ్రీధర్‌కు అంతర్జాతీయ వెబ్సైట్లలో ఆన్లైన్ షాపింగ్ చేయటం మహా సరదా! అలాగే సెర్చ్ చేస్తుండగా... ఇండియాలో రూ.20 వేలకు దొరుకుతున్న ఫోన్... చైనా ఆన్లైన్ దిగ్గజం అలీబాబా వెబ్సైట్లో రూ.12 వేలకే కనిపించింది. ఇంకేం! 8 వేలు తక్కువకు వస్తోంది కదా అని ఆర్డర్ ఇచ్చాడు. దాదాపు 40 రోజుల తరవాత ప్యాకేజీ శ్రీధర్ ఇంటికొచ్చింది. కాకపోతే రూ.10 వేలు కస్టమ్స్ ఛార్జీలు చెల్లించాలని, అప్పుడే డెలివరీ ఇస్తానని చెప్పాడు పోస్ట్‌మ్యాన్. శ్రీధర్‌కు చుక్కలు కనిపించాయి. వద్దులే అని వెనక్కి పంపేశాడు. కాకపోతే సదరు వెబ్సైట్లో అమ్మేటపుడే ఓ కండిషన్ ఉంది. ‘‘మీ చేతుల్లో లేని కారణాల వల్ల పార్సిల్ మీకు అందకపోతే పూర్తి రిఫండ్ ఇస్తాం. కానీ మీ చేతుల్లో ఉన్న కారణాల వల్ల అయితే కొంత కోత వేస్తాం’’ అని. కస్టమ్స్ చార్జీలేమైనా ఉంటే కస్టమరే చెల్లించాలనే షరతు కూడా అందులో ఉంది. దీంతో శ్రీధర్‌కు మరో 30 రోజులు గడిచాక... రూ.4 వేలు కోత పడి, రూ.8 వేలు వెనక్కి వచ్చాయి. అవినాష్ ఉండేది అమెరికాలో. ఇండియాలో ఉన్న తన స్నేహితుడు ఆనంద్‌ను సంతోషపెట్టాలనుకున్నాడు. ఆనంద్ బర్త్‌డేకు... అమెరికా నుంచి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్‌ను పంపించాడు. కాకపోతే ఆనంద్ బర్త్‌డే అయిపోయినా అది తనకు అందలేదు. అనంద్ నుంచి సమాధానం లేకపోవటంతో... తను పంపిన గిఫ్ట్ ఎలా ఉందని అవినాషే అడిగాడు. ఏ గిఫ్టంటూ తెల్లమొహం వేశాడు ఆనంద్. చివరకు ట్రాకింగ్ నంబరు అదీ ఇవ్వటంతో... అది కస్టమ్స్ దగ్గర ఇరుక్కుపోయిందని తెలుసుకున్నాడు ఆనంద్. ఎందుకు ఇరుక్కుంది? ఎప్పుడొస్తుంది? అనే విషయాలు తెలియక సతమతమయ్యాడు. శ్రీధర్, ఆనంద్‌లే కాదు. విదేశాల నుంచి పార్శిళ్లు, వస్తువులు తెప్పించుకునే చాలామందిది ఇదే పరిస్థితి. ఎందుకంటే 120 కోట్ల మంది ఉన్న ఇండియాకు లక్షల కొద్దీ పార్శిళ్లు విదేశాల నుంచి వస్తుంటాయి. అందులో ఏం ఉంది? దాన్ని కస్టమ్స్ డ్యూటీ చెల్లించి తెస్తున్నారా? లేకుంటే అవి డ్యూటీ (సుంకాలు) చెల్లించాల్సిన అవసరం లేనివా? తక్కువ ధరవా? వాటిని ఇండియాలోకి ఉచితంగా అనుమతించటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందా? అవి ఇండియాలోని పర్యావరణాన్నో, మనుషుల్నో దెబ్బతీసే వస్తువులా?.. ఇలాంటివన్నీ క్షుణ్నంగా పరిశీలించటం కస్టమ్స్ విభాగం బాధ్యత. ఈ ప్రక్రియలో కొన్ని వస్తువులు నెలల పాటు కస్టమ్స్ వద్దే క్లియర్ కాకుండా ఉండిపోతుంటాయి. ఇంకొన్ని అక్కడి నుంచే వెనక్కి తిప్పి పంపేస్తుంటారు. మరికొన్నిటికి భారీ పెనాలిటీలు వేస్తుంటారు. ఇవన్నీ ముందే తెలుసుకోవటం ఎలా? అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవటమెలా? కస్టమ్స్ అధికారుల్ని సంప్రదించటమెలా? ..ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా కొనటానికి వీలు * అంతర్జాతీయ వస్తువులకు సుంకం తప్పనిసరి * కొన్ని డ్యూటీ ఫ్రీ వస్తువులు కూడా ఉంటాయ్... * గిఫ్ట్ అంటూ అబద్ధాలాడితే ఇరుక్కోవచ్చు * ట్రాక్ చేయటానికి; సంప్రదింపులకు ఎన్నో మార్గాలు సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం: ఉన్న ఊళ్లోనే ఏ వస్తువైనా కొనటానికి అలవాటు పడ్డ వ్యక్తుల్ని... ఏకంగా విదేశాల నుంచి కూడా కొని తెప్పించుకునేలా చేసింది ఈ-కామర్స్. అమెరికా, చైనా సహా ఏ దేశం నుంచైనా ఆర్డరు చేస్తే... కొన్ని రోజుల్లోనే మన రాష్ట్రాల్లోని మారుమూల పల్లెలక్కూడా పార్సిళ్లు వచ్చేస్తున్నాయి. కాకపోతే డ్యూటీ ఫ్రీ వస్తువులు మినహా... ఏ వస్తువును మనం విదేశాల నుంచి తెప్పించుకుంటున్నా కొంత సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అయితే డిజిటల్ కెమెరాలు, ఎల్సీడీ మానిటర్లు, ర్యామ్, ప్రాసెసర్ల వంటి కొన్ని ఐటీ సంబంధిత ఉత్పత్తుల్ని మాత్రం ‘డ్యూటీ ఫ్రీ’గా పరిగణిస్తుంటారు. వాటిపై సుంకాలుండవు. మిగిలిన వస్తువులన్నిటిపైనా కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. ఇక ఈ వస్తువుల్ని పెద్ద ఎత్తున ఇండియాకు తెచ్చి విక్రయించేవారికి ఐఈసీ (ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ కోడ్) తప్పనిసరి. వ్యక్తిగత అవసరాలకు తెచ్చుకునే వారికి మాత్రం ఈ కోడ్ అవసరం లేదు. దేనికి డ్యూటీ చెల్లించాలి? ఎంతవరకూ మినహాయింపులుంటాయి? అక్రమంగా తెచ్చుకుంటే పరిస్థితేంటి? ఒక్కసారి చూద్దాం.... ఆన్లైన్ కంపెనీలకు కస్టమర్లు ముఖ్యం. కొనుగోళ్లు ముఖ్యం. అందుకని అవి తమ కస్టమర్లు భారీ కస్టమ్స్ ఛార్జీలు చెల్లించకూడదన్న ఉద్దేశంతో వస్తువుల్ని పంపేటపుడు కొన్ని చర్యలు తీసుకుంటుంటాయి. అవేంటంటే... * ఐఈసీ లేకుండా భారీగా దిగుమతులు చేసుకుంటున్న పక్షంలో మీరు పూర్తిగా ఇరుక్కున్నట్టే. * ప్యాకేజ్‌కు సంబంధించిన కస్టమ్స్ డిక్లరేషన్ ఫారంలో దాన్ని బహుమతి ఇస్తున్నట్లుగా పేర్కొంటాయి. నిజానికి వేరొక వ్యక్తి కోసం ఒక వ్యక్తి ఆర్డర్ చేస్తే... అది బహుమతి. కానీ సొంతంగా ఆర్డర్ చేసుకుని తెప్పించుకునేదానికి కూడా విక్రేతలు గిఫ్ట్ ఇస్తున్నట్లుగా పేర్కొంటుంటారు. ఇది చట్ట విరుద్ధం. అయితే ఇది నిజంగా బహుమతేనా? కాదా? అనేది తెలుసుకోవటం కష్టం. ఒకవేళ ఆ గిఫ్ట్‌లో కూడా ఇన్వాయిస్ పెట్టారంటే... అప్పుడు పట్టుబడ్డట్టే. * గిఫ్ట్‌గా పేర్కొన్నా కూడా... సదరు వస్తువు ధర రూ.10 వేలు దాటితే కస్టమ్స్ అధికారులు సుంకం విధిస్తారు. అందుకని విక్రేతలు వస్తువుల ధరను తక్కువగా చూపిస్తారు. ఇదీ చట్ట విరుద్ధమే. ఒకవేళ ఆ వస్తువు పోయిన పక్షంలో మీకు బీమా పూర్తిగా రాదు. వస్తువు ధరను తక్కువగా చూపించారు కనక ఆ మేరకే వస్తుంది. * పైన పేర్కొన్న రెండు మార్గాలూ చట్టవిరుద్ధమైనవే. వాటి పరిణామాలు కూడా మీకు తెలిసి ఉండాలి. * ముఖ్యమైన విషయమేంటంటే... 4-5 రోజుల్లో షిప్పింగ్ చేస్తానన్నారు కదా అని చాలా మంది ఖరీదైన కొరియర్లను ఎంచుకుంటారు. కొరియర్ ఎంత ఖరీదైనదైతే నిఘా అంత ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఈఎంఎస్, డీహెచ్ఎల్ వంటి కొరియర్లను తక్కువ ధర వస్తువులకు వినియోగించరని, ఖరీ దైన వస్తువులకే వాడతారని కస్టమ్స్‌కు బాగా తెలుసు. అందుకని వీటిని మిగతా వాటికన్నా నిశితంగా స్కాన్ చేస్తారు. * అలాగని మామూలు రిజిస్టర్డ్ ఎయిర్ మెయిల్లో తెప్పిస్తే... భద్రతకు పూర్తి గ్యారంటీ ఉండదు. అది చేతికి వస్తుందన్న నమ్మక ం ఉండదు. ఒకవేళ చేతికి వచ్చినా భద్రంగా... ఎక్కడా డ్యామేజీ లేకుండా రావటం కూడా కష్టం. వీటన్నిటికీ తోడు షిప్పింగ్ సమయం బాగా ఎక్కువ. * దీన్నిబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి. నిజంగా వస్తువు కావాలనుకునేవారు కొంత డ్యూటీ చెల్లించటానికి వెనకాడరు. కొన్ని సందర్భాల్లో అన్నీ నిజం చెప్పినా కస్టమ్స్ ఇబ్బందులనేవి ఉంటుంటాయి. కస్టమ్స్ గుర్తిస్తే...? ఒకవేళ మీ వస్తువుపై సుంకం చెల్లించలేదని ది కస్టమ్స్ గుర్తిస్తే ఏమవుతుంది? మరీ మిమ్మల్ని అరెస్టు చేయటమో, కేసు పెట్టడమో చేయరు. అది కూడా మీరు తెచ్చిన వస్తువు స్థాయిని బట్టి ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఇలా గుర్తిస్తే కస్టమ్స్‌లో ఆ వస్తువును సీజ్ చేస్తారు. వివరాలడుగుతూ మీకు లెటర్ రాస్తారు. మీరు గనక నిజాయితీగా స్పందిస్తే... వారు సంతృప్తి చెందితే... కొంత సుంకం లెక్కించి చెల్లించమంటారు. చెల్లిస్తే మీ వస్తువు మీకు ఇచ్చేస్తారు. కొన్నిసార్లు ఏ లేఖా లేకుండానే పోస్ట్‌మ్యాన్‌తో నేరుగా పార్సిల్ మీ ఇంటికి పంపి సుంకం చెల్లించమంటారు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినందుకు కొంత పరిహారం కూడా తప్పదు. అయితే పదేపదే ఇలా చేస్తే మాత్రం ఇబ్బందులు ఖాయం. కస్టమ్స్ అడిగాక కూడా మీరు ఛార్జీలు చెల్లించకపోయినా... పోస్ట్‌మ్యాన్ తెచ్చినపుడు అందులో పేర్కొన్న మొత్తం చెల్లించకపోయినా ఆ వస్తువును వెనక్కి తిరిగి పంపేస్తారు. అయితే మీరు ఆన్లైన్లో కొన్నారు కనక... దాన్ని తిరిగి వెనక్కి పంపేస్తే ఆన్లైన్ కంపెనీ పూర్తి మొత్తాన్ని రిఫండ్ ఇవ్వదని గుర్తుంచుకోవాలి. పోస్టేజీ కింద కొంత మొత్తాన్ని అది మినహాయిస్తుంది. కస్టమ్స్ వివరాలు తెలుసుకోవటమెలా? సాధారణంగా మీరు ట్రాకింగ్ చేసినపుడు దాని పరిస్థితి ఏంటన్నది తెలుస్తుంది. అది కస్టమ్స్ వద్ద ఉందా? లేక అక్కడి నుంచి క్లియర్ అయ్యి మీ ప్రాంతానికి పంపించారా? లేక కస్టమ్స్ వద్దే అధికారి క్లియరెన్స్ కోసం నిలిపేశారా? ఇవన్నీ తెలుస్తాయి. ఒకవేళ మీ వస్తువు కనక ముంబైలోని కస్టమ్స్ వద్ద ఉండిపోయిన పక్షంలో అది ఎందుకు ఉంది? ఛార్జీలేమైనా చెల్లించాలా? వంటి వివరాలు తెలుసుకోవటానికి ముంబై పోస్టల్ విభాగం ఒక బ్లాగ్‌ను నిర్వహిస్తోంది. దాన్లో మీ ప్రశ్నను పోస్ట్ చేస్తే అధికారులు స్పందించే అవకాశమూ ఉంది. అయితే దీనికి కొంత సమయం పట్టొచ్చు. నేరుగా ముంబై వెళ్లి సంప్రదించే బదులు ఈ బ్లాగ్ ద్వారా సంప్రతించటం కొంత ఈజీ కదా? ప్రయివేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న ఆ బ్లాగ్ పేరు... http://mumbaiforeignpost.blogspot.in/p/mainpage.html అయితే ఇలాంటి బ్లాగ్‌లలో పూర్తి వివరాలిచ్చేటపుడు జాగ్రత్తగా ఉండాలి. మీ చిరునామా, మొబైల్ నంబరు ఎక్కడా పబ్లిక్ వెబ్సైట్లలో ఉండకపోవటమే ఉత్తమమనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ముంబయి కస్టమ్స్‌కు సంబంధించి మీకు అధికారిక సమాచారం కావాలంటే... టఞఛి.ఝఠఝఛ్చజీః జీఛీజ్చీఞౌట్ట.జౌఠి.జీ ద్వారామెయిల్లో సంప్రదించవచ్చు. వస్తువు ట్రాక్ చేయటం ఎలా? ఇప్పుడు ప్రతి కొరియర్కూ సొంత వెబ్సైట్ ఉంది. కన్సైన్మెంట్ నంబరో, ట్రాకింగ్ నంబరో ఉంటుంది కనక వాటి సాయంతో ఈజీగానే ట్రాక్ చేయొచ్చు. అలా కాకుండా ఏ కొరియర్ సంస్థకు చెందిన పార్శిల్నైనా ట్రాక్ చేయటానికి 17ట్రాక్స్, ఆఫ్టర్షిప్ వంటి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ విక్రేత తన దేశానికి చెందిన పోస్టల్ విభాగం ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్ పంపిస్తే... ఆయా దేశాల పోస్టల్ ట్రాకింగ్ కొంతవరకే పనికొస్తుంది. అంటే వస్తువు మన దేశానికి పంపేవరకూ ఆ సంస్థలు ట్రాక్ చేస్తాయి. అక్కడి నుంచి ట్రాకింగ్ ఉండదు. అయితే ఇలా ఏ దేశానికి చెందిన పోస్టల్ విభాగాన్నయినా... పంపిన దగ్గర్నుంచి డెలివరీ అయ్యేదాకా ట్రాక్ చేయటానికి ఇంటర్నేషనల్ పార్శిల్ సర్వీస్‌కు చెందిన ఐపీఎస్ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. అవన్నీ చూస్తే... ఏ కొరియర్నైనా ట్రాక్ చేయటానికి... https://www.17track.net/en https://www.aftership.com/ అంతర్జాతీయ పోస్టల్‌ను ట్రాక్ చేయటానికి... http://ipsweb.ptcmysore.gov.in/ipswebtracking/IPSWeb_submit.htm