cyanide mallika
-
సైనైడ్ మల్లిక ఉరి శిక్ష రద్దు
సాక్షి, బెంగళూరు: పలు హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సైనైడ్ మల్లికకు కింది కోర్టు విధించిన ఉరి శిక్షను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తులు రవి మళిమఠ్, జాన్ మైకేల్ డి.కున్హాలతో కూడిన బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పదేళ్ల క్రితం దొడ్డబళ్లాపురలో నివాసం ఉంటున్న నాగలక్ష్మి అనే మహిళను హత్య చేసి నగలు, నగదు దోచుకున్న కేసులో సైనేడ్ మల్లిక నిందితురాలు. బెంగళూరు గ్రామీణ కోర్టు మల్లికను దోషిగా తేల్చి ఆమెకు ఉరి శిక్షను విధిస్తూ తీర్పును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో సైనైడ్ మల్లికకు ఉరి శిక్షను ఖరారు చేయాల్సిందిగా రిజిస్టార్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. పరిశీలించిన హైకోర్టు ఉరిశిక్షను రద్దు చేయడంతో పాటు ఈ కేసును పునర్విచారించాలని బెంగళూరు గ్రామీణ కోర్టును హైకోర్టు పీఠం సూచించింది. ఆరుగురిని ఆమె హతమార్చినట్టు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మల్లిక ప్రస్తుతం పరప్పణ అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్నారు. అన్నాడీఎంకే నాయకురాలు శశికళ పక్క సెల్లోనే ఆమె ఉంటున్నారు. -
ఎవరీ సైనైడ్ మల్లిక!
వారం పది రోజుల క్రితం వరకు ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతానని కలలు గన్నారు. గురువారం నాడు కొత్త ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి ప్రమాణస్వీకారం చేస్తుంటే ఆనందబాష్పాలతో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లోని టీవీలో లైవ్ షో చూశారు. అంతకుముందు తాను చిల్లర దొంగను కానని, అందువల్ల పోలీసు జీపు ఎక్కేది లేదని కూడా పోలీసులతో హుంకరించారు. కానీ.. తన పక్క సెల్లో ఎవరున్నారన్న విషయం ఆమెకు ఇంకా తెలుసో లేదో తెలియదు. శశికళ పక్కనే ఉన్న సెల్లో ఉన్నది అలాంటి ఇలాంటి వాళ్లు కారు.. సైనైడ్ మల్లిక!! దేవాలయాలకు వచ్చిన మహిళలను సైనైడ్తో చంపేసి, వాళ్ల దగ్గర ఉన్న బంగారు నగలు తీసుకుని పారిపోయిన చరిత్ర ఆమెది. అలా ఒకరు, ఇద్దరు కారు.. ఏకంగా ఆరుగురిని ఆమె హతమార్చింది. ఈ కేసులో ఆమెకు కోర్టు ఉరిశిక్ష విధించగా.. అది ఇటీవలే జీవితఖైదుగా మారింది. ఒకరకంగా సైనైడ్ మల్లికతో పోలిస్తే శశికళ అంత పెద్ద నేరస్థురాలు ఏమీ కారు. ఖైదీ నెంబర్ 9234 అయిన శశికళ... ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవాలనుకున్నారు గానీ కుదరలేదు. సర్వసాధారణంగా అందరు ఖైదీలకు ఇచ్చే 10/8 సెల్లోనే మామూలు చాప, దిండు, దుప్పటితో ఆమె పడుకోవాల్సి వస్తోంది. చివరకు పరుపు కావాలని అడిగినా కూడా ఇవ్వలేదు. రెండు రొట్టెలు, ఒక రాగి ముద్ద, 200 గ్రాముల అన్నం, 150 గ్రాముల సాంబారుతో కూడిన సాధారణ భోజనమే ఆమెకు కూడా పెట్టారు. కొంచెం భోజనం చేస్తే తప్ప ఓపిక ఉండదని, అందువల్ల ఎలాగోలా సర్దుకుని తినాలని శశికళతో పాటే అదే సెల్లో ఉన్న మరదలు ఇళవరసి ఆమెకు నచ్చజెప్పినట్లు తెలిసింది. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! బలపరీక్షకు కరుణానిధి దూరం! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
శశికళ పక్క సెల్లో ఆరుహత్యల హంతకురాలు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవిని ఆశించి అక్రమాస్తుల కేసు కారణంగా భంగపడి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ జైలు విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఆమె ఉంటున్న సెల్ పక్కనే ఓ హంతకురాలు ఉంటోంది. ఆమె పలుమార్లు శశికళతో మాట్లాడేందుకు తెగ ప్రయత్నించిందంట. అయినప్పటికీ కనీసం ఒక్క మాట కూడా శశికళ మాట్లాడలేదని బెంగళూరు మిర్రర్ చెప్పింది. అక్రమాస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరులోని పరిప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆమె అక్కడే ఉండి తన విశ్వసనీయుడు పళనిస్వామి సీఎంగా చేస్తున్న ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. అదే, సమయంలో ఆమె పక్క గదిలో ఉంటున్న సియానిడే మల్లికా అనే మహిళా హంతకురాలు శశికళతో మాట్లాడే ప్రయత్నం చేసిందట. ఈమెపై ఆరు హత్యా కేసులు ఉన్నాయి. ఆలయాల వద్దకు వచ్చిన వారి బంగారం కోసం ఆరుగురిపై విష ప్రయోగానికి దిగిన కేసులో ఉరిశిక్ష పడగా ఇటీవలె జీవితకారాగార శిక్షగా మారింది. ప్రస్తుతం శశికళ గది పక్క గదిలోనే మల్లిక ఉంటోంది. ఈ నేపథ్యంలోనే శశికళతోనే మాట్లాడేందుకు ప్రయత్నించగా తొలిరోజు ఆమె అస్సలు స్పందించలేదంట. గురువారం మాత్రం ఆమె మరో జైలు సహచరిని చూసి నవ్వారని బెంగళూరు మిర్రర్ పేర్కొంది.