Cyber experts
-
ఉద్యోగం ఎర వేస్తారు...క్లిక్ చేస్తే ఊడ్చేస్తారు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను బలహీనతగా చేసుకుని కొంతమంది సైబర్‌నేరాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో ఆకర్షణీ యమైన వేతనం, తక్కువ శ్రమ అంటూ ఇంటర్నె ట్లో ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ నోటిఫికే షన్లు ఒకటి. ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ ప్రకటనలతో ఎంతోమందిని ఆకర్షించి వారి నుంచి తెలివిగా డబ్బులు గుంజడం, ఆపై కనిపించకుండా తప్పుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. అటువంటి ఊదరగొట్టే ఉద్యోగ ప్రకటనల వెనుక మోసం దాగి ఉన్నట్లు గ్రహించాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. భారీగా ఆదాయం అంటూ ప్రకటనలు ఇస్తున్నారంటే దాని వెనుక సైబర్ నేరగాళ్లు మన వ్యక్తి గత, బ్యాంకు సమాచారం కోసం మాటు వేసి ఉన్నారని పసిగట్టాలని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నా రు. ఎక్కువగా ఉద్యోగావకాశాల కోసం, ఆన్లైన్ జాబ్స్ కోసం ఇంటర్నెట్లో వెదికేవారిని సైతం సైబ ర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసు కుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఉద్యోగం పేరిట మెయిల్స్ లేదా మొబైల్స్‌కు లింక్స్ పంపిస్తా రని, వాటిని ఏమాత్రం క్లిక్ చేసినా మన సమాచార మంతా వారు తెలుసుకుని అకౌంట్లలోని డబ్బుల్ని ఊడ్చేస్తారని చెబుతున్నారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటం పెద్ద కష్టమేమీ కాదని వారు సూచిస్తున్నారు. ఇవీ సూచనలు.. ► ఆన్లైన్ జాబ్ ఆఫర్లో మనం చేసే పనికి సాధారణం కంటే ఎక్కువ లబ్ధి వచ్చేలా, అత్యధిక సంపాదన ఉండేలా సమాచారం ఉంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్ ఉద్యోగాల పేరిట వచ్చే ఈమెయిల్స్‌లో అక్షర దోషాలు ఉన్నా, ఎలాంటి ఫోన్ నంబర్లు లేకుండా ఉన్నా కచ్చితంగా అది మోసపూరితమైన లింక్ అని పసిగట్టాలి. ► ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తామంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దు. ► ఆన్లైన్ జాబ్ ఇవ్వాలంటే వ్యక్తిగత సమాచారంతోపాటు పాన్, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు షేర్ చేయాలని కోరుతున్నారంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్లో జాబ్ ఇస్తామని ప్రకటనల రూపంలో వచ్చే వెబ్‌లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దు. -
‘లొకేషన్’తో ప్రైవసీ చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: ‘లొకేషన్ పంపు.. నేను వచ్చేస్తా..’ ఎవరినైనా కలవడానికి వెళ్తేనో, కొత్త ప్రదేశానికి వెళ్తేనో ఈ మాట తప్పకుండా వినిపిస్తుంది. ఎవరికైనా మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పాలన్నా.. కొత్త ప్రాంతంలో నిర్దిష్టమైన ప్రాంతానికి వెళ్లాలన్నా ఈ లొకేషన్ ఫీచర్ ఎంతో ప్రయోజనకరం. పెద్దగా తికమక పడాల్సిన అవసరం లేకుండానే అవసరమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. కానీ ఇది ఎంత సౌకర్యవంతమో అంతే స్థాయిలో ఇబ్బందికరం కూడా అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మన ప్రైవసీని దెబ్బతీస్తుందని.. మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఎంత సేపు ఉన్నామనే ప్రతి అంశం ఈ లొకేషన్‌తో తెలిసిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు మనం ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లామా? సినిమా థియేటర్లో ఉన్నామా? ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లామా? అన్న వివరాలు గూగుల్‌తో పాటు మన ఫోన్లోని వివిధ యాప్ సంస్థలకు చేరిపోతాయి. ఇది మన వ్యక్తిగత అంశాలను బహిరంగం చేయడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే మన మొబైల్ ఫోన్లలోని లొకేషన్‌ను ఆన్ చేసుకోవాలని.. తర్వాత ఆఫ్ చేసి పెట్టడం వల్ల మనపై ఎవరూ నిఘా పెట్టకుండా ఉంటుందని వివరిస్తున్నారు. నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివీ.. మొబైల్ ఫోన్లలోని అన్ని అప్లికేషన్స్ (యాప్‌ల)కు లొకేషన్ సర్వీసెస్ అనుమతులు (పర్మిషన్) ఇవ్వొద్దు. అపరిచిత, అనుమానాస్పద యాప్‌లకు మన లొకేషన్ యాక్సెస్ ఇస్తే.. అది మన వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారుతుంది. కొన్ని యాప్‌లకు మనం ఇచ్చే పర్మిషన్లతో.. మన లొకేషన్ వివరాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం, మన కదలికలపై నిఘా పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. లొకేషన్ ఆన్‌లో ఉండటంతో మనం ఎప్పుడు ఎక్కడ ఉంటున్నామన్న సమాచారం ఇతరులకు సులువుగా తెలిసే అవకాశం ఉంది. లొకేషన్‌ను ఆధారంగా చేసుకుని కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. మొబైల్లో ఎప్పుడూ లొకేషన్ ఆన్‌లో ఉండటం వల్ల బ్యాగ్రౌండ్లో ఈ యాప్ పనిచేస్తూ, బ్యాటరీలో చార్జింగ్ త్వరగా తగ్గుతుంది. మొబైల్లో డేటా కూడా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. -
ఈ కాల్స్‌తో జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ వాడకం పరిపాటిగా మారింది. ఇప్పుడు వాట్సప్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. అంతర్జాతీయ ఫోన్ నంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్‌లు చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. ప్రధానంగా +254, +84, +63, +374 , +1(218), +1(803) ...తో ప్రారంభయ్యే నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్, మెజేస్‌లు నమ్మవద్దంటున్న సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నంబర్ల నుంచి వచ్చే మిస్డ్కాల్స్కు సైతం స్పందించవద్దని వారు సూచిస్తున్నారు. స్పామ్ కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారని, తర్వాత మోసాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. అదేవిధంగా విదేశీ కోడ్‌తో ఉంటున్న ఈ నంబర్ల నుంచి వస్తున్న వాట్సాప్ సందేశాల్లో లింక్‌లను పంపుతున్న సైబర్ కేటుగాళ్లు వాటిపై క్లిక్ చేస్తే మన ఫోన్లోకి మాల్వేర్ను పంపించి, మన ఫోన్‌ను వారి కంట్రోల్‌కి తీసుకుంటున్నారు. దాని నుంచి మన బ్యాంకు లావాదేవీల వివరాలు, పాస్వర్డ్లు చోరీ చేసి డబ్బులు కొల్లగొడుతున్నట్టు వారు హెచ్చరించారు. ఇలాంటి కోడ్ నంబర్‌తో వచ్చే వాట్సాప్ కాల్స్‌ను లిఫ్ట్ చేయవద్దని, అలాంటి నంబర్లను బ్లాక్ చేయడంతోపాటు పోలీసులకు సమాచారం అందించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) సూచించింది. సింగపూర్,వియత్నాంలనుంచి ఆ ఫోన్లు ప్రధానంగా ఈ ఫోన్ కాల్స్ సింగపూర్,వియత్నాం, మలేషియా ప్రాంతాల నుంచి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తరహా నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ ఎక్కువగా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య, లేదంటే తెల్లవారుజామున వస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ తరహా స్పామ్‌కాల్స్ బెడద నుంచి కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే బయటపడొచ్చని సైబర్ఇంటెలిజెన్స్ నిపుణుడు ప్రసాద్ తెలిపారు. ఈ జాగ్రత్తలు మరవొద్దు.. ♦ కొత్త కొత్త కోడ్ నంబర్లలో వచ్చే అంతర్జాతీయ ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించవద్దు. ♦ అనుమానాస్పదంగా ఉండే అంతర్జాతీయ ఫోన్ నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలి. ♦ ఫోన్‌కాల్, లేదా చాటింగ్‌లో మన వ్యక్తిగత, బ్యాంకు ఖాతా సమాచారాన్ని అడిగితే పంచుకోవద్దు. ♦ సైబర్ క్రైం పోలీసులకు లేదా సైబర్ క్రైం వెబ్సైట్లో సంబంధిత నంబర్లపై ఫిర్యాదు చేయాలి. ♦ మొబైల్‌ఫోన్, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, యాంటి వైరస్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాటినిబ్లాక్ చేయాలి.. మనకు కొత్త కొత్త కోడ్ నంబర్లతో వచ్చే స్పామ్ కాల్స్‌ను ఎప్పటికప్పుడు బ్లాక్ చేయాలి. పదేపదే ఇలాంటి కాల్స్ వస్తుంటే ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైం సిబ్బంది దృష్టికి తేవాలి. అదేవిధంగా వాట్సాప్‌లో ఇతర దేశాల కోడ్ నంబర్లతో మొదలయ్యే నంబర్ల నుంచి వచ్చే వీడియో, ఆడియోకాల్స్కి ఆన్సర్ చేయవద్దు. ఆ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లో ఉండే లింక్‌లను ఓపెన్ చేయవద్దు. – శ్రీనివాస్ , ఇన్స్పెక్టర్ -
వాట్సాప్ యూజర్లకు భారీ అలర్ట్.. ఆ యాప్ వెంటనే డిలీట్ చేయండి!
ప్రముఖ ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్‌లో మనం ఇతరులకు పంపిన సందేశాలు కొన్ని సార్లు డిలీట్ అయినప్పుడు మనం కంగారూ పడుతుంటాం. అయితే, ఇలా డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం కోసం ఎక్కువ శాతం మంది ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో లభించే థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు. ఇలాంటి, వాట్సాప్ డేటా రికవరీ చేసే థర్డ్ పార్టీ యాప్స్‌లలో డబ్ల్యుఏఎమ్ఆర్ అనేది చాలా ఫేమస్. అయితే, ఇప్పుడు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న యూజర్లు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ యాప్‌ని 50 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ వల్ల మీ డేటా బయటకు వెళ్లే ప్రమాదం ఉన్నట్లు భద్రత నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ యాప్ వినియోగదారుల ఇంటర్నెట్ గోప్యతను దెబ్బతీస్తుంది అని నిపుణులు అన్నారు. వాట్సాప్ నియమ & నిబంధనల ప్రకారం సందేశాలన్నీ ఎన్ క్రిప్ట్ చేయబడతాయి. అయితే, ఈ ఎన్ క్రిప్ట్ చేసిన సందేశాలను ఇతరులు చదవడం అసాధ్యం. ఈ డబ్ల్యుఏఎమ్ఆర్ అనేది మీరు చాట్ చేసిన మెసేజ్‌లను తన కంపెనీకి చెందిన సర్వర్లలో నిలువ చేసే అవకాశం ఉంది. దీని వల్ల మీ డేటా ఇతరుల చేతికి చిక్కే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ(ఐఐసీఎస్)కు చెందిన సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ యాప్ విభిన్న సెట్టింగ్స్ అనుమతి అవసరం కనుక, ఈ యాప్ సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. వినియోగదారులు గ్యాలరీ, నెట్ వర్క్, నోటిఫికేషన్ సెట్టింగ్స్ కి అనుమతి ఇవ్వడం వల్ల డేటా లీకేజీ ప్రమాదం జరగనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో మరో అదిరిపోయే సేల్.. వాటిపై భారీగా డిస్కౌంట్!) -
‘చోరీ డేటా’ అంతా ఎన్‌క్రిప్షన్‌లోనే..!
సాక్షి, హైదరాబాద్: ‘సేవామిత్ర’యాప్... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూసిన డేటా స్కాం మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ యాప్, దాన్ని తయారు చేసిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చుట్టూనే తిరుగుతోంది. ఈ యాప్ తయారీలో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరపు అశోక్ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అందులో ప్రధానమైంది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం. తాము చేస్తున్న భారీ స్కాం భవిష్యత్తులో వెలుగులోకి వచ్చినా దర్యాప్తు సంస్థలకు ఆధారాలు లభించకుండా ఉండేందుకే అశోక్ ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. యాప్స్ ద్వారా జరిగే సమాచార మార్పిడికి సంబంధించి ఉపయోగించే పరిజ్ఞానమే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ విధానం. వాట్సాప్ ద్వారా ఓ కాంటాక్ట్‌కు తొలిసారి ఎవరైనా సందేశం పంపినప్పుడు ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్’అంటూ ప్రత్యేక సూచన వస్తుంది. అంటే ఓ సెండర్ పంపిన మెసేజ్ రిసీవర్‌కు వెళ్లే వరకు అది ఎన్‌క్రిప్షిన్ విధానంలో ఉంటుంది. మెసేజ్‌లో పదాలను టైప్ చేస్తే అది ఎన్‌క్రిప్ట్ అయ్యే సరికి ‘కీ’లుగా మారిపోతుంది. ఉదాహరణకు ‘టీడీపీ’అనే పదాన్ని ‘ఎండీ5 ఆన్లైన్’అనే ఎన్‌క్రిప్టర్ వెబ్సైట్లో టైప్ చేస్తే (5ec7c4ede4cb6 c64289a5ed105285945) అనే ‘కీ’గా మారిపోయింది. దీంతో ఇది ఎన్‌క్రిప్ట్ అయినట్లు లెక్క. ఈ సందేశం రీసీవ్ చేసుకునే వ్యక్తి ఫోన్లోకి వచ్చిన తర్వాత డిక్రిప్షన్ ప్రక్రియ పూర్తై మళ్లీ ‘టీడీపీ’అనే పదంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్ల డేటాను దుర్వినియోగం చేయడానికి ఐటీ గ్రిడ్స్ సంస్థ ఇదే విధానాన్నే వినియోగించింది. ట్యాబ్‌లలో వాడిన సాఫ్ట్వేర్ అదే... తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సేవామిత్ర సర్వేయర్లకు ఐటీ గ్రిడ్స్ సంస్థ ద్వారా జారీ చేసిన ట్యాబ్స్‌ను ఆ సంస్థకు సంబంధించిన సర్వర్‌తో అనుసంధానించారు. ఈ ట్యాబ్స్‌లో ఉండే ‘సేవామిత్ర’యాప్‌లో ఎన్‌క్రిప్షన్‌తోపాటు డిక్రిప్షన్ సాఫ్ట్వేర్ సైతం అంతర్భాగంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సర్వర్ నుంచి ట్యాబ్ వరకు డేటా మార్పిడి మొత్తం ఎన్క్రిప్షన్ విధానంలోనే జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎన్‌క్రిప్షన్‌లో ఉన్న డేటాను డిక్రిప్షన్లోకి మార్చి పదాలుగా చూపించడంలో ఆ యాప్‌లో ఉన్న ‘కీ’ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ‘కీ’లలోనూ రెండు రకాలు ఉంటాయి. పబ్లిక్ ‘కీ’తో కూడిన ఎన్క్రిప్టెడ్ సందేశాన్ని సర్వర్ నుంచి తీసినా సాధారణ పదాలుగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఈ డేటాను ప్రైవేట్ ‘కీ’తో ఎన్‌క్రిప్ట్ చేసింది. దీంతో ఎవరైనా సర్వర్‌ను స్వాధీనం చేసుకున్నా... అమెజాన్ వంటి సంస్థల నుంచి డేటా పొందినా డిక్రిప్ట్ చేయడం సాధ్యం కాదు. ఈ ‘క్రిప్షన్స్’డేటాను రాసే ‘అల్గోరిథమ్’ను బట్టి మారిపోతుంది. ఓ సంస్థ రూపొందించిన ‘అల్గోరిథమ్’మరొకరి దానితో ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోలదు. తమ వ్యవహారం గుట్టురట్టైనా ఆధారాలు చిక్కకూడదనే ఐటీ గ్రిడ్స్ ఈ జాగ్రత్త తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తమ డేటాను ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో ఉండేలా చేస్తే భవిష్యత్తులో ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చినా దర్యాప్తు సంస్థలు ఐటీ గ్రిడ్స్‌తోపాటు అమెజాన్ నుంచి సమాచారం తీసుకున్నా అది ఆధారంగా పనికి రాకూడదనే ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రూపంలో ఉన్న డేటాతో కేవలం ‘కీ’తెలుసుకోవడం తప్ప అందులోని పదాలను గుర్తించలేదు. డేటాకు సంబంధించిన ప్రైవేట్ ‘కీ’అందుబాటులో ఉంటే తప్ప ఆ ‘కీ’లను పదాలుగా మార్చి అందులోని అంశాలను తెలుసుకోలేరు. ఈ విషయం గుర్తించిన తెలంగాణ సిట్ అధికారులు... సైబర్ నిపుణుల సాయంతో దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ప్రాథమికంగా డేటా మొత్తం క్రోడీకరిస్తే ఆపై డిక్రిప్ట్ చేయవచ్చని యోచిస్తున్నారు. -
2014 ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాకయ్యాయి
-
అబద్ధం చెప్పని ఓ అద్దం కథ!
అద్దమెప్పుడూ అబద్ధం చెప్పదంటారు..మిగతావాటి సంగతి తెలియదుగానీ..ఈ అద్దం మాత్రం చెప్పదట..సత్యహరిశ్చంద్రుడిలా ఎప్పుడూ నిజమే చెబుతుందట.. కావాలంటే.. ‘స్నోవైట్’ కథలో అడిగినట్లు.. ‘మిర్రర్ మిర్రర్ ఆన్ ద వాల్..’ అంటూ అడగండి.. నిజమే చెబుతుంది. ఇంతకీ దేని గురించి నిజం చెబుతుంది అని అడిగితే.. మీ గురించే అంటారు దీన్ని తయారుచేసిన సిలికాన్ వ్యాలీ స్టార్టప్ కంపెనీ ‘నేక్డ్ ల్యాబ్స్’ ప్రతినిధులు.. ఇంతకీ మన గురించి ఇది చెప్పే ఆ నిజమేంటి? రోజూ పేపర్ తిరగేస్తే.. భారతీయులు బరువెక్కువున్నారు.. కొవ్వు శాతం ఎక్కువైంది.. దీనివల్ల ఆ జబ్బు వస్తుంది.. ఈ రోగం రావచ్చు అని వార్తలే వార్తలు.. కదా.. అందుకే ఓసారి మన శరీరం పరిస్థితేమిటి? ఎక్కడ కొవ్వు శాతం ఎక్కువైంది? ఒకవేళ తగ్గించుకోవడానికి మనం కసరత్తులు వంటివి చేస్తుంటే.. డైట్లు వంటివి పాటిస్తుంటే.. అవి నిజంగా పనిచేస్తున్నాయా? శరీరంలో నిజంగానే కొవ్వుతగ్గుతుందా లేదా పెరుగుతుందా? పెరిగితే.. ఎక్కడ పెరిగింది.. ఎక్కడ తగ్గింది వంటి విషయాలకు సంబంధించిన ‘నగ్న’సత్యాన్ని ‘నేక్డ్’ అనే ఈ మ్యాజిక్ మిర్రర్ మన ముందుంచుతుందట. అదెలా? ముందుగా మనం అద్దానికి ఎదురుగా ఉండే పీటలాంటి దాని మీద నిల్చోవాలి. అది మనల్ని చుట్టూ తిప్పుతుంది.. ఇలా 20 సెకన్లపాటు చేస్తుంది. అంతలోనే ఆ అద్దం మన శరీరాన్ని స్కాన్ చేసేస్తుంది. త్రీడీ మ్యాప్స్ తీసేస్తుంది. ఇందుకోసం ఇందులో ఇంటెల్ రియల్ సెన్స్ సెన్సర్లు పెట్టారు. ఆ సమయంలో నగ్నంగా నిల్చుంటే.. మరింత కచ్చితంగా త్రీడీ మోడల్ తయారవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అనంతరం ఈ మ్యాజిక్ మిర్రర్‌తో అనుసంధానించి ఉండే స్మార్ట్‌ఫోన్ యాప్‌లోకి వివరాలు స్టోర్ అయిపోతాయి. వెంటనే విశ్లేషణ ప్రారంభమవుతుంది. శరీరంలోని కొవ్వు శాతం.. బరువు, లీన్మాస్, ఫ్యాట్మాస్ వంటి వివరాలు వచ్చేస్తాయి. అప్పట్నుంచి ఈ అద్దం ఎప్పటికప్పుడు మన శరీరంలో వచ్చిన మార్పులను విశ్లేషించి.. సమాచారాన్ని అందిస్తుంది. అంటే వారాలు, నెలలు లెక్కన విశ్లేషణ చేసి.. ఆ నిర్ణీత కాలంలో కొవ్వు తగ్గిందా పెరిగిందా అన్న వివరాలను తెలుపుతుంది. ముఖ్యంగా మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ పరికరం తోడ్పడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. కండల వీరులకూ ఉపయోగపడుతుందని.. ఎక్కడ మజిల్ పెరిగింది.. ఎక్కడ తగ్గింది వంటి వివరాలనూ అందిస్తుందని అంటున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి హోం బాడీ స్కానర్ అని చెబుతున్నారు. సురక్షితమేనా? యాప్‌లో స్టోర్ అయ్యే మన వ్యక్తిగత చిత్రాలు, సమాచారం హ్యాక్ అయ్యే ప్రమాదముందని సైబర్ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. అలాంటి చాన్సే లేదని కంపెనీ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. డాటా హ్యాక్ అయ్యే పరిస్థితి లేదని.. పూర్తిస్థాయిలో భద్రతాచర్యలు చేపట్టామని.. పైగా.. ఆ అద్దాలు తీసేవి ఫొటోలు కావని.. త్రీడీ మోడల్ మాత్రమేనని.. అది ఎక్స్రేలాగ ఉంటుందని చెబుతున్నారు.. సంబంధిత యూజర్‌కు మాత్రమే ఆ సమాచారం అందుబాటులో ఉంటుందని.. భయపడాల్సిన పనేలేదని భరోసా ఇస్తున్నారు. దీని ధర రూ. లక్ష. వచ్చే నెల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయట.. ఇదండీ.. అబద్ధమే ఎరుగని ఓ అద్దం కథ.. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
'ఎస్' అన్నారో.. మీ జేబు గుల్ల!
ఫోన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్లు అడిగిన ప్రశ్నలకు 'ఎస్' అని చెబుతున్నారా.. కాస్త జాగ్రత్త పడండి. ఎందుకంటే, అలా చెప్పారంటే త్వరలోనే మీ జేబు గుల్ల అయిపోయే ప్రమాదం ఉందట. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద ఫోన్ స్కాం జరుగుతోందట. అందులో భాగంగా అవతలి వాళ్లు ముందు ఏదో ఒకటి మాట్లాడి, 'నేను మాట్లాడేది మీకు బాగానే వినిపిస్తోందా' అని అడుగుతున్నారు. అలా అడిగినప్పుడు మనం 'ఎస్' అని సమాధానం ఇస్తే, ఆ ఒక్క మాటను జాగ్రత్తగా వాళ్లు రికార్డు చేసి పెట్టుకుని, కావల్సిన చోట కట్ పేస్ట్ చేసుకుని వాడేసుకుంటున్నారట. దాని ఆధారంగా మన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు నొక్కేయడానికి కావల్సినన్ని ప్లాన్లు అమలుచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో వెలుగు చూశాయి. వాళ్లు తమ వస్తువులు లేదా సేవలను మనకు ఇచ్చినట్లుగా వాయిస్ రికార్డు చేసి, అవి మనకు అందినట్లు, దానికి గాను డబ్బు చెల్లించడానికి మన అంగీకారం కోరినట్లుగా ముందు వాయిస్ రికార్డులో ఉంటుంది. ఆ తర్వాత మనం ఎప్పుడో చెప్పిన 'ఎస్' అనే సమాధానాన్ని ఇక్కడ వాడుకుంటారు. ఒకవేళ మనం ఆ తర్వాత మనకు ఆ వస్తువులు గానీ, సేవలు గానీ అందలేదని.. అందువల్ల డబ్బు చెల్లించబోమని చెప్పినా, ముందు చెప్పిన సమాధానం తాలూకు ఆడియో క్లిప్ ఆధారంగా.. మన మీద కేసులు వేసి మరీ డబ్బు దండుకుంటున్నారట. చాలావరకు కంపెనీలు తమ వ్యాపారాల కోసం ఫోన్లోనే వాయిస్ సిగ్నేచర్లు తీసుకుంటున్నాయి. అలాంటి వాటికి ఇప్పుడు ఈ స్కాంస్టర్లతో పెద్ద ముప్పే పొంచి ఉందని చెబుతున్నారు. కాబట్టి, అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాత్రం 'ఎస్' అనే సమాధానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చెప్పొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
యాప్‌లకు భద్రత ఏదీ?
వీటి నుంచి లావాదేవీలతో మోసాలు అధికం ∙యాప్‌లకు భద్రతా సర్టిఫికెట్లు కావాల్సిందే.. జాతీయ స్థాయిలో ఏజెన్సీ ఏర్పాటు చేయాలి ∙సైబర్ నేరాలపై నిపుణుల అభిప్రాయాలు (తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : క్యాష్తో పనేంటి?.. నగదు రహిత లావాదేవీలకు ఎన్ని మార్గాలు లేవు... ఒక్క క్లిక్‌తో క్షణంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేయొచ్చు.. పెద్దనోట్ల రద్దు తర్వాత తెరమీదకొచ్చిన కొత్త మంత్రమిది. కేంద్రంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే జపం చేస్తున్నాయి. గల్లీ షాపు మొదలుకొని ఢిల్లీ వరకూ ప్రతీ షాపులోనూ రకరకాల యాప్‌లు కన్పిస్తున్నాయి. వాటి ముందు మొబైల్ పెడితే ఇట్టే కోడ్ తీసుకుని లావాదేవీ జరిగిపోతుంది. సౌకర్యం బాగానే ఉంది. కానీ దీనివల్ల ఎదరయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కాదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం భద్రత ప్రమాణాలే లేని వీటి నుంచి లావాదేవీలు చేస్తే రకరకాల మోసాలు జరగొచ్చని చెబుతున్నారు. వ్యక్తిగత సమాచారమే హరించుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు. మనిషి జన్మించినా.. మరణించినా సర్టిఫికెట్ తప్పనిసరి. కానీ లక్షల కోట్ల లావాదేవీలు చేస్తూ.. కోట్లాది మంది ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు, యాప్‌లకు ఎందుకు భద్రత సర్టిఫికేట్లు అక్కర్లేదని ప్రశ్నిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న సైబర్ నేరాలపై యువ శాస్త్రవేత్తలు విరుచుకుపడాలని, సైబర్ ఉగ్రవాదాన్ని కట్టడి చేసే దిశగా పరిశోధనలు జరగాలని సూచిస్తున్నారు. సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా ‘సైబర్ సెక్యూరిటీ’ అనే అంశంపై శనివారం ఓ సెమినార్ జరిగింది. పెద్దనోట్ల రద్దు తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ సదస్సు అందరినీ ఆకట్టుకుంది. సెమినార్లో ఎవరేం మాట్లాడారంటే... సెక్యూరిటీ ఏదీ? మొబైల్ ఫోన్లు కొంటాం. దానికి రేడియేషన్ లేదని సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఆ ఫోన్ సేఫ్ అని మాత్రం తయారీ సంస్థగానీ, మరే ఇతర ఏజెన్సీగానీ గ్యారెంటీ ఇవ్వదు. ఆ మొబైల్ నుంచి జరిగే లావాదేవీలు, పాస్వర్డ్స్ వేరే వాళ్ల చేతికి వెళ్లవన్న భరోసా ఇవ్వరు. కానీ అమెరికాలో ఈ సిస్టమ్ లేదు. కచ్చితంగా సెక్యూరిటీ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. సెక్యూరిటీ ప్రమాణాల కోసం జాతీయ స్థాయిలో ఓ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. – నరేంద్రనాథ్, టెలీ కమ్యూనికేషన్ డిప్యూటీ డైరెక్టర్ సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరగాలి పెద్దనోట్ల రద్దు తర్వాత అనేక యాప్స్, వాలెట్స్ ప్రజల్లో విస్తృత ప్రచారం పొందాయి. వ్యక్తిగత సమాచారం ఎవరైనా దొంగిలించరని నమ్మకం ఏమిటి? అందుకే ప్రభుత్వ పరంగానే ఓ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇలాంటి వాటి నుంచి వినియోగదారులకు భద్రత కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు జరగాలి. – ఎన్ బాలకృష్ణన్, ఐఐటీ కంప్యూటర్ శాస్త్రవేత్త నెట్వర్క్ ట్రాఫిక్ పెరిగింది.. సదుపాయాలేవీ? ఒక చిన్న రోడ్డులోకి జాతీయ రహదారి నుంచి వెళ్లే వాహనాలను దారి మరలిస్తే ఎలా ఉంటుంది? ఇండియాలో పరిస్థితి ఇదే. లావాదేవీలు విపరీతంగా పెరిగినా... నెట్‌వర్క్‌లో మౌలిక సదుపాయాలు లేవు. మరో 20 ఏళ్లకు సరిపడా నెట్‌వర్క్‌ను అంచనా వేసి, అందుకు తగ్గట్టు నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి విస్తృత పరిశోధనలు జరగాలి. – ఎస్వీ రాఘవన్, చీఫ్ సైబర్ సెక్యూరిటీ ఆర్కియాలజిస్ట్, చెన్నై