ప్రముఖ నిర్మాత కన్నుమూత
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి (62) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో శనివారం ఉదయం ఆరున్నర గంటలకు కన్నుమూశారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. శివప్రసాద్ రెడ్డికి ఇద్దరు కుమారులు. 1985లో కామాక్షి మూవీస్ బ్యానర్‌ను స్థాపించి కార్తీక పౌర్ణమి, శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, ఆటోడ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, కేడీ, రగడ, దడ, గ్రీకువీరుడు సినిమాలను నిర్మించారు. శివప్రసాద్ రెడ్డి మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేసింది.
కేడీ చిత్రం సమయంలో నాగార్జునతో కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్రసాద్ రెడ్డి