daily labour
-
‘అక్షర’ భారతికి ఏపీ ప్రభుత్వ సాయం
సాక్షి, అనంతపురం: కూలిపనులు చేసుకుంటూ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన సాకే భారతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయం ప్రకటించింది. రెండు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తూ సంబంధిత పత్రాలకు సోమవారం ఆమెకు అందజేశారు. అలాగే.. ఆమెకు జూనియర్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగం ఆఫర్ చేశారు జిల్లా కలెక్టర్ గౌతమి. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామంలో పేదరికాన్ని జయించి మరీ ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసిందామె. డాక్టర్ భారతి సక్సెస్ స్టోరీ ఎంతో మందిని కదిలించింది కూడా. ఈమె డాక్టర్ భారతి.. కష్టాల్ని ఈది గెలుపు తీరాన్ని చేరింది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగమనల నాగుల గుడ్డం గూడేనినికి చెందిన భారతి.. ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, పీజీ చేసింది. పదో తరగతి దాకా శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ పామిడి జూనియర్ కాలేజీలో చదివింది. శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ నుంచి కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసింది. సాయం ఎప్పుడూ ఉంటుంది ఎల్లప్పుడూ ప్రభుత్వ సహకారం ఉంటుందని సాకేభారతికి కలెక్టర్ గౌతమి హామీ ఇచ్చారు. కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో రెండు ఎకరాల పొలం పట్టా అందజేసి.. భారతి విజయంపై సంతోషం వ్యక్తం చేశారామె. భారతి ఎన్ని అవాంతరాలు ఎదురైన వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించిన ఆమె ఎందరికో స్పూర్తిగా నిలిచారన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం తరఫున భారతికి శింగనమల మండలం సోదనపల్లి గ్రామ పొలం సర్వేనెంబరు 9–12లో వ్యవసాయ యోగ్యమైన రెండు ఎకరాల భూమి భారతికి అందింఆం. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని నిర్మించి ఇస్తాం. ఎస్కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జేఎల్ పోస్టు (కెమిస్ట్రీ) ఖాళీగా ఉంది. ఆమె అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి ఆమెకు అన్నివిధాలుగా అవసరమై ప్రొత్సాహం అందిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమెకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, శింగనమల తహసీల్దారు ఈశ్వరమ్మ, సాకేభారతి భర్త శివప్రసాద్, కుమార్తె ప్రసూన, తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగురాలైన కూతురి కోసం రోబో
పనజి: ఆయన పేరు బిపిన్ కదమ్. వయసు 40 ఏళ్లు. ఉండేది గోవాలో. పని చేసేది దినసరి కూలీగా. కదమ్‌కు ఓ 14 ఏళ్ల కూతురు. దివ్యాంగురాలు. చేతులు కదపలేదు. తినిపించడం మొదలుకుని అన్ని పనులూ దగ్గరుండి చూసుకునే తల్లేమో దీర్ఘకాలిక వ్యాధితో రెండేళ్ల క్రితం పూర్తిగా మంచాన పడింది. కదమ్ సాయంత్రం పని నుంచి ఇంటికొచ్చాక తినిపిస్తేనే పాపకు భోజనం. భార్య నిస్సహాయత, కూతురి కోసం ఏమీ చేయలేక ఆమె పడుతున్న వేదన ఆయన్ను బాగా ఆలోచింపజేశాయి. దాంతో కూతురికి వేళకు తిండి తినిపించేందుకు ఏకంగా ఓ రోబోనే తయారు చేసేశాడు కదమ్! ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఎవరి సాయమూ తీసుకోకుండా ఏడాది పాటు తదేకంగా శ్రమించాడు. ఆన్లైన్ సమాచారం ఆధారంగా చివరికి సాధించాడు. ఈ రోబో వాయిస్ కమాండ్‌కు అనుగుణంగా పని చేస్తుంది. పాప కోరిన మేరకు పండ్లు, దాల్ రైస్ వంటివి తినిపిస్తుంది. అమ్మలా ఆకలి తీరుస్తోంది గనుక దీనికి ‘మా రోబో’ అని పేరు పెట్టాడు కదమ్. ఇప్పుడు రోజంతా కష్టపడి సాయంత్రం ఇంటికి రాగానే కూతురి నవ్వు ముఖం చూస్తే ఎనలేని శక్తి వస్తోందని చెబుతున్నాడు. కదమ్ ఘనతను గోవా ఇన్నొవేషన్ కౌన్సిల్ ఎంతో మెచ్చుకుంది. కమర్షియల్‌గా మార్కెటింగ్ చేసేందుకు వీలుగా రోబోను మరింత మెరుగుపరచాలని సూచించింది. అందుకు ఆర్థిక సాయం కూడా చేస్తోంది. ‘‘ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహిస్తున్నారు. అదే మాదిరిగా నా కూతురు కూడా నాతోపాటు ఎవరి మీదా ఆధారపడకుండా ఆత్మనిర్భర్‌గా ఉండాలన్న తపనే నాతో ఈ పని చేయించింది’’ అంటున్నాడు కదమ్. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
-
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అనంతపురం: జిల్లాలో 9 కిలోమీటర్ల పరిధిలో రెండు ఘెర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. పామిడి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆటోను లారీ ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. గార్లదిన్నె నుంచి పెద్దవడగూరుకు వ్యవసాయ పనులకు వెళ్తుండగా కూలీలు ఈ ప్రమాదానికి గురయ్యారు. పెద్దవడగూరు క్రాస్‌కు వెళ్లేందుకు రాంగ్ రూట్లో ఆటో రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులను శంకరమ్మ(48), నాగవేణ(40), సావిత్రి(41), చౌడమ్మ(35), సుబ్బమ్మ(45)గా గుర్తించారు. మృతులంతా గార్లదిన్నె మండలం కొప్పలకొండ వాసులుగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ప్రమాదం పామిడి వద్ద జరిగిన ప్రమాదంలో గాయాలపాలైన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగానే మరో ప్రమాదం జరిగింది. మిడుతూరు హైవేపై ఉన్న బాటసారుల పైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. -
పొట్ట కూటి కోసం చేసే పనే పొట్టన పెట్టుకుంది..
సాక్షి,మంచిర్యాల: పొట్టకూటి కోసం ట్రాక్టర్ డ్రైవర్ పనిచేస్తున్న ఓ దినసరి కూలీని రాళ్లవాగు మింగేసింది. ఇసుక తోడేందుకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన కనుకుంట్ల దుర్గయ్య తన ట్రాక్టర్ ద్వారా ఇసుక సరఫరా చేస్తుంటాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు ఇసుక తరలించేందుకు బొంతల శంకర్ (27)తోపాటు మరో ఇద్దరు కూలీలను తీసుకెళ్లాడు. ఉదయం 9 గంటల సమయంలో శంకర్ నీటిలో మునిగి మృతి చెందాడని, వెంట వెళ్లిన కూలీలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శంకర్ అనారోగ్యంతో ఉన్నా ట్రాక్టర్ యజమాని బలవంతంగా పనిలోకి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ట్రాక్టర్ యజమాని దుర్గయ్య ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన దిగారు. సమాచారం అందుకున్న ఎస్సై ప్రవీణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య పప్పి, ఇద్దరు కుమార్తెలు హేమలత, యేసుమణి, కుమారుడు ఏసుమంత్ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే.. రాళ్లవాగు నీటి నుంచి అక్రమంగా ఇసుక తోడుతున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు కూలీలతో ప్ర మాదకరంగా నీటి అడుగుభాగం నుంచి ఇసుక ను వెలికితీస్తున్నారని వారు పేర్కొంటున్నారు. రోజుకు వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ప్రమాదకరంగా వాగుల నుంచి ఇసు క తోడుతున్న ట్రాక్టర్ యజమానులపై కఠిన చ ర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: -
పరిశ్రమలు కుదేల్: ఇం‘డల్’స్ట్రియల్
పటాన్చెరులో ఉన్న ఓ పరిశ్రమ బయోమాస్క్ బ్రికెట్ (బొగ్గుకు ప్రత్యామ్నాయం) తయారు చేసి టైల్స్ ఉత్పత్తి చేసే ఓ భారీ పరిశ్రమ (కొత్తూరు)కు సరఫరా చేస్తోంది. ఈ టైల్స్ ఎక్కువగా ఉత్తర భారత దేశానికి రవాణా అవుతాయి. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ కారణంగా నిర్మాణ రంగం కుదేలవడంతో టైల్స్ పరిశ్రమకు ఆర్డర్లు తగ్గాయి. దీంతో ఈ టైల్స్ పరిశ్రమ పటాన్‌చెరులోని బ్రికెట్ల ఆర్డర్లను తగ్గించింది. చేసేదేమీ లేక పటాన్‌చెరులోని బ్రికెట్ పరిశ్రమ ఉత్పత్తిని దాదాపు సగానికి తగ్గించింది. ఈ పరిశ్రమలో పనిచేసే సుమారు 200 మందిలో 80 నుంచి 100 మంది కారి్మకులకు పనిలేకుండా పోయింది. ఈ పరిస్థితి ఒక్క పటాన్‌చెరులోని బయోమాస్క్ బ్రికెట్ ఫ్యాక్టరీదే కాదు.. జిల్లాలోని పాశమైలారం, బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి, హత్నూర, సంగారెడ్డి, జహీరాబాద్ వంటి ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లోని అనేక పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఫార్మా సంబంధిత కేటగిరీలకు చెందిన పరిశ్రమలను మినహాయించి మిగిలిన అన్ని కేటగిరీలకు చెందిన పరిశ్రమలపైనా లాక్డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సరైన ఆర్డర్లు లేక ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతోంది. పారిశ్రామిక ప్రగతి చక్రం ఆగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు అన్ని రకాల పరిశ్రమల కార్యకలాపాలను లాక్డౌన్ నిబంధనలకు మినహాయింపు ఇచి్చంది. మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటిస్తూనే ఉత్పత్తిని కొనసాగించుకోవచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ రాష్ట్రంలో ఇతర వ్యాపార, వాణిజ్య రంగాలపై ఉన్న లాక్‌డౌన్‌తో పాటు, ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్డౌన్ ప్రభావంతో పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గుతోంది. దీని ప్రభావం పారిశ్రామిక రంగంలోని కార్మికులపై పడుతోంది. కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి దెబ్బ లాక్డౌన్ కారణంగా పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గడంతో కారి్మకుల ఉపాధిపై దెబ్బ పడుతోంది. అనేక పరిశ్రమలు కాంట్రాక్ట్ కారి్మకులు, రోజువారీ వేతనాలపై పనిచేసే కారి్మకులకు పని ఇవ్వడం లేదు. కేవలం పరి్మనెంట్ కారి్మకులకు మాత్రమే పని కల్పిస్తున్నాయని కారి్మక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. పరి్మనెంట్ కారి్మకుల్లో కూడా కొందరిని సెలవులపై వెళ్లాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని చెబుతున్నారు. దీంతో రోజువారీ వేతనాలు, కాంట్రాక్ట్ కారి్మకులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్, జార్కండ్ వంటి రాష్ట్రాల నుంచి వచి్చన వలస కూలీలు చాలామంది నెల రోజుల క్రితం నుంచి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానిక కారి్మకులు పని దొరక్క, చేతిలో చిల్లిగవ్వ లేక పడరాని పాట్లు పడుతున్నారు. ఫార్మా పరిశ్రమల్లో నిరాటంకంగా ఉత్పత్తి కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రకాల మందులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కోవిడ్–19కు చికిత్స అందించే మందుల కొరత ఏర్పడింది. దీంతో జిల్లాలోని ఫార్మా కంపెనీలు ఉత్పత్తి నిరాటంకంగా కొసాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో కంటే ఎక్కువే ఉత్పత్తి చేస్తున్నాయి. రోజుకు మూడు షిఫ్టులతో పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఫార్మా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కూడా కరోనా సోకుతుండటంతో ఉత్పత్తికి విఘాతం కలుగుతోందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. కారి్మకులను ఆదుకోవాలి లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. నిత్యావసరాలతో పాటు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలి. యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కరోనా బారిన పడిన కారి్మకులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలి. వ్యాక్సినేషన్ చేయించడంతో పాటు ఇంట్లో ఉండలేని బాధితులకు హోం ఐసోలేషన్ సౌకర్యం కల్పించాలి. - కొల్కూరి నర్సింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్డర్లు తగ్గాయి.. లాక్డౌన్ నిబంధనలతో పరిశ్రమల్లో ఉత్పత్తిని కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ఆయా రంగాల ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయింది. ముఖ్యంగా నిర్మాణ, ఆటోమొబైల్ వంటి రంగాల నుంచి ఆర్డర్లు తగ్గాయి. దీంతో సంబంధిత పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తోంది. - కాల రమేశ్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) చైర్మన్ -
పంట చేనులో కోటి విలువైన వజ్రం!
సాక్షి, కర్నూలు: జిల్లాలో విలువైన వజ్రం దొరికింది. తుగ్గలి మండలానికి చెందిన ఓ మహిళకు పొలంలో వేరుశెనగ తీస్తుండగా కోటి రూపాయలు విలువ చేసే వజ్రం దొరికింది. అయితే వజ్రాన్ని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగులు చేశారు. 11 లక్షల రూపాయల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి సదురు వ్యాపారి వజ్రాన్ని కొన్నట్లు సమాచారం. కాగా.. ఈ వజ్రం కోటి రూపాయలకు పైగా ధర పలుకుతుందని స్థానికులు భావిస్తున్నారు. -
'కూలి'న బతుకుకు సాయం
ములుగు: భూపాలపల్లి, ములుగు ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ శనివారం దినసరి కూలీ అవతారం ఎత్తారు. సెలవు రోజు కావడంతో తన స్వగ్రామం ములుగు మండలం రామచంద్రాపురం వెళ్లారు. కౌలు రైతు రాఘవరెడ్డి–నీలమ్మ దంపతులకు చెందిన పొలంలో ఉదయం నుంచి కూలీలతో కలసి వరినాట్లు వేశారు. అనంతరం పొలం గట్లపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. కూలీలు భోజనంలో తీసుకవచ్చే ఆవకాయ పచ్చడితో తిన్నారు. సాయంత్రానికి మధ్య మధ్యలో బురద జంబు తోలారు. పని ముగించుకున్న అనంతరం రైతు రాఘవరెడ్డి నుంచి రూ.250 కూలిగా తీసుకున్నారు. కూలీ డబ్బుకు మరింత కలిపి ఆర్థిక సాయం గ్రామానికి చెందిన చాకలి సారమ్మ వృద్ధాప్యంలోనూ మరుగుజ్జుగా ఉన్న తన ముగ్గురు పిల్లలను కష్టపడి పోషిస్తోంది. విషయం తెలుసుకున్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా తనకు వచ్చిన కూలీ డబ్బులకు మరికొంత కలిపి ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా తస్లీమా మాట్లాడుతూ తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, గడిచిన ఐదేళ్లలో ఏడాదిలో ఒకరోజు గ్రామాలకు వెళ్లిన సందర్భంగా రైతులతో కలసి వరి నాటు పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తస్లీమా తనలో ఉన్న మరో కోణంతో ఆదర్శంగా నిలిచారు. -
వ్యవసాయ కూలీ అనుమానాస్పద మృతి
కర్నూలు: ఓ వ్యవసాయ కూలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కర్నూలు జిల్లా నందవరం మండలం సోమలగూడానికి చెందిన మద్దిలేటి బతుకు దెరువుకోసం మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లాడు. జిల్లాలోని మందకల్ మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయ పనిచేస్తూ బావిలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఆటో ఢీకొని వలస కూలీ మృతి
అనంతపురం: రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న ఆటో ఢీకొని అనంతపురం జిల్లాకు చెందిన వలసకూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం బెంగళూరులో జరిగింది. వివరాలు.. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం చెరుగండ్లపల్లి గ్రామానికి చెందిన చెరువు గంగిరెడ్డి బెంగళూరులో వలస కూలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం సొంతగ్రామం నుంచి తిరిగి బెంగళూరు వెళ్లాడు. కాగా, బెంగళూరులో రోడ్డు దాటుతుండగా ఆటో ఢీ కొని తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం గంగిరెడ్డిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, చికిత్స పొందుతూ గంగిరెడ్డి మంగళవారం మృతి చెందాడు. అతని మృతదేహన్ని బెంగళూరు నుంచి స్వగ్రామానికి తరలిస్తున్నట్లు బంధువులు తెలిపారు. -
బతుకుదెరువు కోసం వెళ్లి సౌదీలో మృతి
మెదక్(దుబ్బాక): చేసిన అప్పులు తీర్చేందుకు సౌదీ వెళ్లిన ఓ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో ప్రాణాలొదిలాడు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన చుక్క రాములు(55) తనకున్న నాలుగున్నర ఎకరాల్లో బోరు కోసం రూ.లక్ష అప్పు చేశాడు. బోర్లు వేసినా వాటిలో చుక్క నీరు పడలేదు. ఇక వ్యవసాయంతో లాభం లేదని భావించిన రాములు... ఉన్న ఊరు, కుటుంబాన్ని వదిలేసి మూడు రోజుల కిందట సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఆ ఖర్చుల కోసం మరో రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. సౌదీలో పనిచేసి ఈ అప్పులన్నింటినీ తీర్చేద్దామనుకున్న రాములు... అక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం రాత్రి గుండె నొప్పితో బాధపడుతున్న రాములుని అతని మిత్రులు ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు వదిలాడు. కుటుంబసభ్యుల రోదనలతో ఆకారం గ్రామంలో విషాదం నిండుకుంది. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని వెంటనే తమకు అందించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
కలెక్టరేట్ వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం
ఏలూరు: కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించలేదని ఓ యువకుడు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. లింగంపాలెం మండలంలోని బుల్లావారిగూడెం నుంచి కొత్తపల్లి తూరలు వరకు 1.5 కిలోమీటరు మేర రోడ్డు లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని, రోడ్డు నిర్మాణాన్ని కోరుతూ ఉపాధి కూలీ కాట్రు వెంకన్న(22) వినతి పత్రం ఇచ్చేందుకు ఏలూరు కలెక్టరేట్‌కు వచ్చాడు. అయితే, ప్రజావాణి కార్యక్రమం ఉన్నందున అతన్ని లోపలికి అనుమతించలేదు. దీంతో తనను ఆపుతారా అంటూ వెంకన్న అక్కడే ఎత్తయిన గోడ ఎక్కి దూకే ప్రయత్నం చేయబోగా స్పందించిన గన్మెన్లు అతన్ని పట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
అదిలాబాద్ (గుడిహత్నూరు): ఉపాధికూలి పనికి వెళ్లిన వ్యక్తి తిరిగొచ్చిన కొద్ది క్షణాలకే మృతిచెందాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన భరత్(43) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు వారీలాగే.. సోమవారం ఉపాధిహామి కూలికి వెళ్లి వచ్చిన భరత్ హటాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు వల్లే మరణించాడని తెలుస్తోంది. -
ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఉపాధి కూలీల ఆందోళన
డీ.హీరేహాళ్(అనంతపురం): డీ.హీరేహాళ్ మండలంలోని మురిడి గ్రామంలోని ఉపాధి కూలీలు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఉపాధి హామీ కూలీలకు గత మే నెల నుంచి కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. డబ్బులు ఇచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని డిమాండ్ చేశారు. దీంతో స్థానిక ఏపీఓ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
కూలీ డబ్బుల కోసం తాతను పొడిచాడు
సంతనూతలపాడు : తనకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు చెల్లించలేదన్న కోపంతో వరుసకు తాతైన వ్యక్తిని మనవడు కత్తిలో పొడి చాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మైనంపాడులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మైనంపాడులో గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తన్నీరు సింగయ్య(50) బేల్దారి పనిచేస్తుంటాడు. వరుసకు మనవడు అయిన తన్నీరు కోటేశ్వరరావును పనికి తీసుకెళ్తుంటాడు. ఈక్రమంలో కోటేశ్వరరావుకు రావాల్సిన వెయ్యి రూపాయల కూలి డబ్బులు సింగయ్య ఇవ్వలేదు. మెయిన్ రోడ్డుపై సింగయ్యను నిలదీయడంతో నేను నీకు ఇవ్వాల్సింది కేవలం వంద రూపాయలేనన్నాడు. దీంతో కోటేశ్వరరావు కత్తి తీసుకుని సింగయ్య కడుపులో పొడిచి పరారయ్యాడు. సింగయ్యను ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.