Dalit welfare
-
నిరుపేదల ఉపాధిపై రాబందులు వాలిపోయే..'దళితబంధు విందాయే'!
తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన ఇటికాల లచ్చయ్యకు రూ.8.40 లక్షలతో 8 గేదెలు ఇచ్చినట్టు చూపి.. నాలుగు మాత్రమే ఇచ్చారు. మిగతా గేదెల కోసం ఆయన సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ..రాష్ట్రంలో దళిత బంధు పథకంలో జరుగుతున్న అక్రమాలకు చిన్న ఉదాహరణలివి. 2021 ఆగస్టులో మొదలైన ఈ పథకంలో కొందరు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కక్కుర్తితో భారీగా జరిగిన అవినీతి వెలుగుచూస్తోంది. కొన్నిచోట్ల సామగ్రి ఇప్పిస్తామంటూ, జీఎస్టీ అంటూ కొన్నిచోట్ల దోచేస్తే.. మరికొన్నిచోట్ల నేరుగానే అక్రమాలకు పాల్పడటం, కొందరు లబ్ధిదారుల విషయంలో అయితే పథకం సొమ్ములో ఏకంగా సగం దాకా కాజేయడం విస్మయం కలిగిస్తోంది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దళితబంధు.. రాష్ట్రంలో దళితుల సంక్షేమం, సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వినూత్న పథకం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో శాశ్వత ఉపాధి మార్గాన్ని చూపడం దీని లక్ష్యం. దళితుల స్థితిగతులను మార్చేందుకు వాసాలమర్రిలో పురుడుపోసుకున్న ఈ పథకం.. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికతో విస్తరించింది. రాష్ట్రవ్యాప్తంగా అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి (తుంగతుర్తి నియోజకవర్గం), చారకొండ (అచ్చంపేట), చింతకాని (మధిర), నిజాంసాగర్ (జుక్కల్) మండలాల్లో దళితులందరికీ.. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 మందికి చొప్పున తొలి విడతగా దళిత బంధును అమలు చేశారు. అయితే వాసాలమర్రి, హుజూరాబాద్ వరకుబాగానే సాగిన పథకం.. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి మండలాల్లో అడ్డదారులు తొక్కింది. విచ్చలవిడిగా అక్రమాలు.. దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన తిరుమలగిరి మండలంలో 2,223 కుటుంబాల కోసం రూ.230 కోట్లు వ్యయం చేశారు. కానీ ఇక్కడ నాయకులే అన్నీ తామై వ్యవహరించి భారీగా అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదులున్నాయి. ఉదాహరణకు ఒక్క తొండ (తిరుమలగిరి) గ్రామాన్నే తీసుకుంటే.. ఇక్కడ డెయిరీని ఉపాధిగా ఎంచుకున్న వారికి ఇప్పటికీ గేదెలు ఇవ్వలేదు. మొత్తం రూ.10 లక్షల సొమ్ములో.. రూ.1.50 లక్షలను గేదెల షెడ్డుకు వినియోగించినట్టు చూపారు. నిజానికి షెడ్డు వేసింది అధికార పార్టీ నాయకుడి అనుచరుడే. కేవలం రూ.50 వేలలో దాన్ని పూర్తిచేసి లక్షన్నర బిల్లు చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. మిగతా సొమ్ములో కనీసం ఏడు నుంచి తొమ్మిది గేదెలు ఇవ్వాల్సి ఉండగా.. లబ్ధిదారులను పశ్చిమగోదావరి జిల్లా తణుకు తీసుకువెళ్లి ఓ కాంట్రాక్టర్‌కు చెందిన షెడ్డులో గేదెలతో ఫొటోలు తీయించారు. వాటిని అప్లోడ్ చేసి చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. కానీ రైతులకు ఇచ్చినది ఒకట్రెండు గేదెలు మాత్రమే. మిగతా గేదెల కోసం నాయకులు, అధికారులను అడిగితే.. ఇంకెక్కడి గేదెలు అంటూ ఎదురుప్రశ్నలే వచ్చాయి. ఒకరిద్దరు కాదు చాలా మంది లబ్ధిదారులది ఇదే పరిస్థితి. తణుకు నుంచి 13 డీసీఎం వాహనాల నిండా గేదెలను రవాణా చేయాల్సి ఉండగా.. మూడే వాహనాల మేర మాత్రమే తెచ్చారు. కానీ నంబరు ప్లేట్లు మార్చి పదమూడు వాహనాలుగా చూపెట్టి దళితబంధు నిధులను పక్కదారి పట్టించారు. జీఎస్టీ పేరుతోనూ ముంచేశారు పలుచోట్ల అంతగా ప్రాచుర్యం కానీ నాసిరకం బ్రాండ్ల వాహనాలు, పనిముట్లు కొనుగోలు చేశారు. అదీగాక కొందరు నాయకులు, అధికారులు కుమ్మక్కై జీఎస్టీ పేరుతోనూ అక్రమాలకు తెరలేపారు. లబ్ధిదారులు పెట్టుకునే యూనిట్లకు సరుకులు, వస్తువులు తామే సరఫరా చేస్తామని చెప్పారు. కిరాణ, క్లాత్ స్టోర్, ఫుట్‌వేర్, స్టీల్ సామగ్రి, హార్డ్‌వేర్ పరికరాలను పంపిస్తామని చెప్పి.. ఆనక వస్తువులు ఇవ్వకుండా రూ.6 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకే సొమ్ము ఇచ్చినట్లు లబ్ధిదారులు చెప్తున్నారు. మిగతా సొమ్ములో కొంత జీఎస్టీ కింద కట్ అయిందని, మరికొంత కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులకు ముడుపులుగా ఇవ్వాల్సి ఉందని చెప్పారని వాపోయారు. కాంట్రాక్టర్ ఫోన్ ఎత్తడం లేదు నా భార్య పల్లెర్ల జానమ్మ పేరు మీద డెయిరీ యూనిట్ మంజూరైంది. కాంట్రాక్టర్ మొదట నాలుగు గేదెలు ఇచ్చాడు. మిగతా గేదెలు ఇవ్వకుండా.. మమ్మల్ని తణుకు తీసుకెళ్లి ఫొటోలు తీసుకొని పంపించాడు. మిగతా నాలుగు గేదెలకు డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వడం లేదు. కాంట్రాక్టర్ వర్మకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. మా గేదెలు మాకు ఇవ్వాలి. – పల్లెర్ల గోపాల్, తొండ గ్రామం, సూర్యాపేట జిల్లా ఇలా చేస్తే.. పక్కా నిర్వహణ! దళితబంధు మెరుగైన నిర్వహణ కోసం దళితుల అభివృద్ధి, సంక్షేమంపై పనిచేస్తున్న ఓ ఎన్జీఓ పలు సిఫారసులు చేసింది. ► లబ్ధిదారుల ఎంపిక రాజకీయ నిర్ణయం కాకుండా గ్రామం, మండలం యూనిట్‌గా జీవనోపాధి (లైవ్లీవుడ్) ప్రాజెక్టు రూపొందించినట్టుగా చేపట్టాలి. ► లబ్ధిదారుల ఇష్టం ప్రకారం కాకుండా అక్కడి అవసరాలు, మున్ముందు కొనసాగే అవకాశమున్న యూనిట్లను ఎంచుకునే దిశగా కృషి చేయాలి. ► సాంకేతిక నైపుణ్యమున్న వారికి అవే యూనిట్లు, లేని వారికి అక్కడ అవసరమైన యూనిట్లు కేటాయించి శిక్షణ ఇవ్వాలి. ► యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాక వారికి చేతి నిండా పనికల్పించే కార్యాచరణను రూపొందించాలి. దీని అమలు కోసం ప్రత్యేక యంత్రాంగం ఐదేళ్లపాటు కృషి చేయాలి. బహిరంగంగానే అవినీతి దళితబంధు పథకం రూపకల్పనే బాగా లేదు. సరైన విధివిధానాలు లేకే ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఆడింది ఆట, పాడింది పాటలా మారింది. అందుకే చాలాచోట్ల లబ్ధిదారుల ఎంపికలో అవినీతి చోటుచేసుకుంది. పైలట్ మండలాలు సహా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిన ఎంపికలో భారీగా ముడుపులు చేతులు మారాయి. అవినీతి అక్రమాలు, బహిరంగంగానే జరిగాయి. నిరుపేద దళితుల ఇళ్లలో సంపద సృష్టించాల్సిన పథకం చాలాచోట్ల దారి తప్పింది. – ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్ -
వినాశకాలే ‘విప్’రీత బుద్ధి
పశ్చిమగోదావరి , ఏలూరు టౌన్: ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులు, బీసీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జిల్లా వ్యాప్తంగా దళితులు, బీసీ వర్గాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ చింతమనేని వ్యవహార శైలిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చింతమనేనిని వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేయటంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలంటూ ఎస్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి. దళిత నేతలు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. చింతమనేని సిగ్గుసిగ్గు.. వినాశకాలే విపరీత బుద్ధి అంటూ నినాదాలు చేశారు. చింతమనేని దిష్టిబొమ్మలు దహనం చేయటంతోపాటు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో దళిత నేతలు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న చింతమనేని వర్గీయులు ఎదురుదాడికి దిగారు. ఇరువర్గాలూ పోటీపడుతూ నినాదాలు చేశాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలు, వైఎస్సార్ సీపీ దళిత నేతలను రెచ్చగొట్టేలా ప్రవర్తించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించినా ఫలితం లేకపోవటంతోముందుగా వైఎస్సార్ సీపీ దళిత నేతలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులన్నీ టూటౌన్ స్టేషన్‌కు చేరుకుని అక్కడ బైఠాయించాయి. తమ పార్టీ నేతలనే అరెస్టు చేయడంపై మండిపడ్డాయి. దీంతో పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను కూడా స్టేషన్‌కు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు జిల్లా వ్యాప్తంగా దళితులు, బీసీ వర్గాలు నిరసనలు చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. హౌస్ అరెస్టులపై అభ్యంతరం దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేయడం వివాదానికి దారితీసింది. బుధవారం ఉదయం వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరి ఏలూరులోని పార్టీ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనగా తన ఇంటి ముందు బైఠాయించారు. అనంతరం ప్రదర్శనగా ఏలూరు చేరుకుని అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి చింతమనేని దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు ఈ నెల 22 నుంచి బీసీ సంఘం తరపున నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. మాదిగ మహాసేన దళిత బహుజన రిసోర్సు సెంటర్ (డీబీఆర్సీ) సంఘాలు మద్దతు ప్రకటించాయి. కొవ్వలిలో మాలమహానాడు అధ్యక్షులు గొల్ల అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అక్కిరెడ్డిగూడెంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో నిరసనలు చేశారు. ♦ మార్టేరు సెంటర్లో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ æ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చింతమనేనిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. ♦ చింతమనేనిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ నూకపెయ్యి సుధీర్ బాబు, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్, ఎస్సీ సంఘాల నేతలు పళ్లెం ప్రసాద్, తేరా ఆనంద్, మున్నుల జాన్ గురునాథ్, మెండెం ఆనంద్ పాల్గొన్నారు. ♦ వైఎస్సార్ సీపీ గోపాలపురం సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ద్వారకాతిరుమలలో నిరసనలు నిర్వహించారు. ♦ చింతమనేనిని అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముళ్లగిరి జాన్సన్, మహిళా కన్వీనర్ పాము సునీత, బోడ సంసోనులు భీమడోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ♦ చింతలపూడి సమన్వయకర్త వీఆర్ ఎలీజా ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ, బోసు బొమ్మ సెంటరులో రాస్తారోకో చేసి, అనంతరం చింతమనేని దిష్టిబొమ్మను దహనం చేశారు. ♦ పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు గుమ్మాపు ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ♦ భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కులవివక్ష పోరాట సమితి, దళిత ఐక్యవేదిక నాయకులు చింతమనేనిపై ఫిర్యాదు చేశారు. వీరవాసరంలో జెడ్పీటీసీ సభ్యుడు మానుకొండ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ♦ ఆకివీడు, పాలకోడేరు మండలాల్లో మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రాజారావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ♦ బుట్టాయిగూడెంలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, ధర్నా నిర్వహించారు. ♦ ఉండ్రాజవరంలో వైఎస్సార్ సీపీ నిడదవోలు కన్వీనర్ జి.శ్రీనివాసనాయుడు ఆధ్వర్యం లో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ♦ నిడదవోలు చర్చిపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద కేవీపీఎస్ ఆందోళనలు చేపట్టింది. ♦ నిడదవోలు మండలం మునిపల్లి గ్రామంలో బీజేపీ ఎస్సీ మండల అధ్యక్షుడు మందపాటి కిషోర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. -
చంద్రబాబు చుట్టూ శిఖండులు..!
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో దళిత సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచిందని, దళితుల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో నిబంధనలు ఉల్లంఘించి.. కోట్ల రూపాయల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మేరుగ నాగార్జున విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తన చుట్టూ కొందరు శిఖండులను పెట్టుకుని పాలిస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా సబ్‌ప్లాన్ నిధులు దళితులకే రావాలని అన్నారు. చంద్రబాబు కుయుక్తులను దళితులెవరూ నమ్మరాదని, వైఎస్ జగన్ సీఎం అయితేనే దళితుల జీవితాల్లో వెలుగులు వస్తాయని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
భూపంపిణీలో అనర్హులు
19 మందిలో ఏడుగురు అనర్హులని తేల్చిన ఆర్డీవో కాటారం : ప్రభుత్వం నిరుపేద దళితుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన భూ పంపిణీ కార్యక్రమంలో పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మండలంలోని చిద్నెపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రెండవ విడతగా చేపట్టిన భూ పంపిణీ లబ్ధిదారుల ఎంపికలో అనర్హులకు చోటు కల్పించినట్లు అధికారులపై విమర్శలు వస్తున్నారుు. మండలంలో మొదటగా ఇదే గ్రామపంచాయతీ పరిధిలో భూ పంపిణీ కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన అధికారులు... తిరిగి ఇదే గ్రామపంచాయతీలో రెండవ విడతగా దళితులకు భూమి పంపిణీ చేయడం కోసం చర్యలు వేగవంతం చేశారు. చిద్నెపల్లితోపాటు ఒడిపిలవంచ, గుమ్మాళ్లపల్లి గ్రామపంచాయతీల పరిధిలో భూపంపిణీ కోసం భూమిని కొనుగోలు చేశారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఒడిపిలవంచ, గుమ్మాళ్లపల్లిల్లో ఈ ప్రక్రియ సజావుగానే కొనసాగినప్పటికీ చిద్నెపల్లిలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు తేలింది. గతంలో గ్రామసభ నిర్వహించి లబ్ధిదారుల నుంచి రెవన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి గ్రామసభ నిర్వహించి 19 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఇందులో కొంతమంది అనర్హులని గతంలోనే పలువురు గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోలేదు. లబ్ధిదారుల ఎంపికలో మండల రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు కొంతమంది స్థానికులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ నీతూప్రసాద్ విచారణ కోసం మంథని ఆర్డీఓను ఆదేశించారు. శుక్రవారం ఆర్డీఓ బాల శ్రీనివాస్ లబ్ధిదారులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలు సేకరించి, రెవెన్యూ రికార్డుల ప్రకారం పరిశీలించి 19 మందిలో ఏడుగురిని అనర్హులుగా తేల్చారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్డీఓ పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు..? భూపంపిణీలో అనర్హులకు చోటు కల్పించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏవైనా ఒత్తిళ్ల మేరకు అనర్హులకు చోటు కల్పించాల్సి వచ్చిందా? లేక క్షేత్రస్థాయిలో పరిశీలన లోపం వల్ల జరిగిందా? అని చర్చ జరుగుతోంది. ఆర్డీఓ స్థాయి అధికారి విచారణ జరిపి అనర్హులను గుర్తించే వరకు మండల రెవెన్యూ అధికారులు గుర్తించలేకపోవడం, అంతకముందు పలు ఆరోపణలు వచ్చినా స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. దీనికితోడు లబ్ధిదారుల ఎంపికలో పలువురు రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు విశ్వసనీయ సమాచారం. అటు భూ విక్రయదారులతోపాటు ఇటు లబ్ధిదారుల నుంచి ముడుపులు అందుకున్నట్లు తెలిసింది. ముందస్తు ఒప్పందం మేరకే సదరు అధికారులు, సిబ్బంది అనర్హులకు సైతం జాబితాలో చోటు కల్పించడానికి కృషి చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి సైతం వెళ్లిందని, తమ శాఖ పరుపుపోతుందని భావించి వదిలేసినట్లు సమాచారం. ఈ అవినీతి, అక్రమాల వ్యవహారంలో గత కొంతకాలంగా మండలంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ముఖ్య రెవెన్యూ అధికారి చక్రం తిప్పు తూ అన్ని తానై వ్యవహరిస్తున్నట్లు ఆరోణలున్నారుు. ఉన్నతధికారులకు నివేదిస్తాం చిద్నెపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టిన భూ పంపిణీ లబ్ధిదారుల జాబితాలో కొంత మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించాం. విచారణ జరిపి ఏగుడుగురిని అనర్హులుగా తేల్చాం. వీరి వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తాం. వారి ఆదేశాల మేరకు తిరిగి లబ్ధిదారుల ఎంపిక చేపడుతాం. - బాల శ్రీనివాస్, ఆర్డీఓ, మంథని -
నేతల్లారా...సమస్యలివిగో..
కరీంనగర్ : తరతరాలుగా అణిచివేతకు గురవుతూ.. సామాజిక న్యాయూనికి దూరమవుతున్న దళితుల సంక్షేమం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఎంతగానో తపిం చారు. అణగారిన వర్గాలకు ఆసరాగా ఉండేం దుకు రాజ్యంగంలో హక్కులు కల్పించాడు. ఇది జరిగి ఆరున్నర దశాబ్దాలు అవుతున్నా ఆ ఫలాలు మాత్రం దళిత వర్గాలకు అందడం లేదు. మహానేతల జయంతి, వర్ధంతి రోజుల్లో తప్పితే దళితుల గురించి పట్టని పాలకులు ఆ వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారనే ఆరోపణలున్నారుు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తెచ్చామని ఓవైపు గొప్పలు చెప్పుకుంటూనే.. మరోవైపు ఆ నిధులను పక్కదారి పట్టించి ఎక్కడి సమస్యలను అక్కడే వదిలేశారు. ఫలితంగా దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మంగళవారం అంబేద్కర్ జయంతి. తమ సమస్యలపై ప్రజాప్రతినిధులను, అధికారులను ప్రశ్నించేందుకు దళితులు సిద్ధమయ్యూరు. ఈ సందర్భంగా జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం. నత్తనడకన భూ పంపిణీ పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూపంపిణీ పథకం ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. వెయ్యి ఎకరాలను కోనుగోలు చేసి దళితులకు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 58 మంది లబ్దిదారులకు 155 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. జిల్లాలో 33 మండలాల నుంచి ఇంతవరకు భూమి కోనుగోలు ప్రతిపాదనలే అధికారులకు రాకపోవడం గమనార్హం. అందని రుణాలు.. ఇబ్బందుల్లో నిరుద్యోగులు గత ప్రభుత్వ హయూంలో స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు పెట్టుకున్న నిరుద్యోగుల ఆశలు కలలుగానే మిగిలాయి. ఈ సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ఉపాధి అవకాశాలను పది శాతానికి తగ్గించింది. 2013-14 సంవత్సరానికి 3,175 యూనిట్లకు రూ.32.15 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 2818 మంది యుతకు రూ.25.30 కోట్ల సబ్సిడీ మంజూరు చేసింది. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో 357 మందికి మంజూరు కాలేదు. మంజూరైన యూనిట్లలో 2249 మందికి సబ్సిడీ విడుదల చేశారు. మూతపడ్డ అంబేద్కర్ స్టడీసర్కిల్ దళిత విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా జిల్లా కేంద్రంలో నెలకొల్పిన అంబేద్కర్ స్టడీసర్కిల్ మూతపడింది. స్టడీసర్కిల్ రెండేళ్లు కూడా నడువకుండానే నిధులు లేవనే సాకుతో అధికారులు మూసివేశారు. దీంతో గత ఏడు సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ పొందాలనుకునే దళిత విద్యార్థులు ఆశలు అడియాశలుగానే మారాయి. స్టడీసర్కిల్ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సందర్శించడానికి మాత్రమే పరిమితమైంది. తెగని లీడ్‌క్యాప్ లొల్లి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయూం లో మలుపు పథకం ద్వారా లీడ్‌క్యాప్ పరిశ్రమను పెట్టి నిరుద్యోగ దళిత యువతకు, చర్మకారులకు ఉపాధి చూపిస్తామని ప్రకటించారు. ఇందుకోసం చొప్పదండి మండలం రుక్మాపూర్‌లో సర్వే నెంబర్ 513, 514, 516లో 135 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాన్ని నాలుగేళ్ల క్రితం పోలీస్ బెటాలియన్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో లీడ్‌క్యాప్ లొల్లి హైదరాబాద్ దాకా చేరి నేటికీ తెగని పంచారుుతీగా మిగిలిపోరుుంది. జిల్లాలో మినీ లెదర్‌పార్కుల కోసం జమ్మికుంటలో 25 ఎకరాలు, రామగుండం మండలంలో 25 ఎకరాలు కేటాయించి నేటికీ నిధులు కేటాయించకుండా చుట్టూ ఫెన్సింగ్ సైతం ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ విషయంలో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ నాటి సీఎం చంద్రబాబు నుంచి మొన్నటి వరకు ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించినా ఫలితం లేకపోరుుంది. అనర్హులకు పట్టాలు... అర్హులకు మొండిచేయి ఇరవై ఏళ్ల క్రితం ఎల్ఎండీలో ముంపుకు గురైన హస్నాపూర్ గ్రామ దళితులకు ఎస్సారెస్పీ భూమిని నివేశన స్థలాల కోసం కేటాయిస్తూ పట్టాలు ఇచ్చారు. పట్టాలు అందుకున్న వారిలో అనర్హులే చాలా మంది ఉన్నారు. నిజమైన అర్హులకు కొందరికి పట్టాలిచ్చినప్పటికీ హద్దులు చూపకోపవడంతో ఇప్పటికీ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అంబేద్కర్, బాబుజగ్జీవన్‌రాం జయంతి వేడుకల్లో వినతిపత్రాలు సమర్పించడమే కాకుండా కలెక్టరేట్ ముందు దీక్షలు చేపట్టినా స్థలాల సమస్య కొలిక్కి రాలేదు. కమ్యూనిటీ భవనం స్థలం కబ్జా కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అంబేద్కర్ భవన సముదాయానికి కేటాయిస్తూ అప్పటి కలెక్టర్ సుమితాడావ్రా హయంలో సర్వేనెంబర్ 11404/22లో 19 గుంటలకు పత్రాలు అందజేశారు. సదరు స్థలం తమదేనంటూ ఇతరులు అక్రమణ నిర్మాణాలకు పూనుకున్నారు. ఈ గొడవ పదేళ్లుగా దళిత సంఘాల నేతలకు, భూ అక్రమణదారులకు మధ్య రగులుతూనే ఉంది. ఆరు గుంటలు హాంఫట్ కోర్టు చౌరస్తా వద్ద ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం కోసం అప్పటి కలెక్టర్ 1986లో ఆరు గుంటల స్థలాన్ని కేటాయించి పట్టా కాగితాలు దళిత సంఘ నాయకులకు అందజేశారు. కానీ కొందరు ఎరుకుల కులస్థులు ఆ భూమి తమదేని గుడిసెలు వేసుకున్నారు. పదిహేనేళ్లుగా ఈ స్థలం సమస్యను ఎటూ తేల్చకపోవడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది. తేలని సరిహద్దు వివాదాలు... ఎస్సీ కార్పొరేషన్ నుంచి భూమి కొనుగోలు పథకం కింద జిల్లాలో నిరుపేద దళితులకు భూములు కేటాయించిన ప్రభుత్వం పట్టా కాగితాలు ఇవ్వడంలో అలసత్వం వహిస్తోంది. హుస్నాబాద్ మండలం అక్కన్నపేటలో దళితులకు భూమి కేటాయించి పట్టా కాగితాలు ఇచ్చింది. అక్కన్నపేట సరిహద్దు గ్రామాలైన వరంగల్ జిల్లా ప్రజలు ఆ భూమి తమదని గొడవలకు దిగుతున్నారు. గొడవ తారాస్థారుుకి చేరడంతో రెండు జిల్లాల కలెక్టర్లు, డీఆర్ఓలు, కొలతల అధికారులు స్పందించి భూముల వివరాలు సేకరించినానేటికీ సరిహద్దు సమస్య అలాగే ఉంది. మంథని నియోజకవర్గంలోని ధన్వాడ, మహదేవపూర్ మండలం పెద్దంపేట, లెంకలగడ్డ, కాటారం మండలం అంకుషాపూర్, చింతకానీ, ఈరాపూర్, పోతుల వాయి, ఇబ్రహీంపేట, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో వందలాది ఎకరాల భూములు ఎస్సీలకు భూమి కోనుగోలు కింద పట్టాలు ఇచ్చారు. వాటికి నేటికి హద్దులు చూపలేదు. అందని వివాహ ప్రోత్సాహకాలు ఎస్సీలను ఇతర కులాల వారు వివాహమాడితే అందించాల్సిన వివాహ ప్రోత్సాహక పారితోషికాలు అందించడంలో సైతం జాప్యం జరుగుతోంది. పారితోషకం కోసం 212 జంటలు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారుు. జిల్లాలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు వంద ఉండగా, అందులో 65కు మాత్రమే పక్కా భవనాలున్నారుు. మిగిలిన హాస్టళ్లు అరకొర వసతులు మధ్య అద్దె భవనాల్లో కొనసాగుతున్నారుు. తేలని అట్రాసిటీ నూతన కమిటీ దళితుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకోసారి జరగాల్సిన ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సమావేశం తూతుమంత్రంగా సాగుతూ వినతులు ఇవ్వడానికే పరిమితమవుతోంది. మూడేళ్ల క్రితం అప్పటి మంత్రి నూతన కమిటీ వేయాలని అధికారులకు సూచించగా కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికి నూతన కమిటీ ఎంపిక ప్రక్రియ అతీగతీ లేకుండా పోయింది. బాధ్యతాయుతమైన కమిటీ సమావేశాలు సైతం సక్రమంగా నిర్వహించకపోవడమే కాకుండా కీలకమైన నిర్ణయాలు తీసుకోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు అధికారులకు, నేతలకు దాసోహమై సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారని దళితుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. విగ్రహాలకు తొలగని ముసుగులు బీఆర్.అంబేద్కర్, బాబుజగ్జీవన్‌రాం విగ్రహాలను ఆయా కుల సంఘాలు, దళిత సంఘాల నాయకులు ఏర్పాటు చేసుకున్నారు. నిధుల లేమితో జిల్లాలో దాదాపు 60పైగా విగ్రహాలు ముసుగులు తొడిగే ఉన్నాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాయకులు, అధికారులు ముసుగేసిన అంబేద్కర్ విగ్రహాలను చూస్తున్నారే తప్ప నిధులు కేటాయించి ముసుగులు తొలగించిన దాఖాలాలు లేవు. -
దళితుల దరిచేరని పథకాలు
* ముందుకు కదలని భూపంపిణీ * లక్ష్యం చేరని స్వయం ఉపాధి * మొండికేస్తున్న బ్యాంకులు * నేడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి రాక * సంక్షేమ పథకాలపై సమీక్ష కరీంనగర్ : దళితుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఆచరణకు నోచుకోవడం లేదు. లక్ష్యం ఘనంగా ఉన్నా క్షేత్రస్థాయిలో అమలుకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఫలితంగా పథకాలు దళితుల దరికి చేరడం లేదు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూపంపిణీ ఒక అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్న చందంగా తయారు కాగా, స్వయం ఉపాధి రుణాలదీ అదే బాట. దళితులకు ప్రభుత్వ పథకాలు ఆమడదూరంలో ఉంటున్నాయి. హడావుడి చేసి ప్రారంభించిన కుటుంబానికి మూడెకరాల భూ పంపిణీకి మళ్లీ మోక్షం కలగడం లేదు. పథకాన్ని ప్రారంభించి ఐదు నెలలవుతుండగా ప్రభుత్వ భూముల కొరతతో ఇప్పటివరకు 216 మందికి మాత్రమే పత్రాలు అందించారు. జిల్లాలో 1.77 లక్షల ఎస్సీ కుటుంబాలుండగా, ఇందులో అసలు భూమిలేని కుటుంబాలు 1.50 లక్షలు. పథకం ప్రారంభానికి ముందు మండలానికో గ్రామం ఎంపిక చేసి పంచాలని నిర్ణయించినా... భూముల కొరతతో నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంపిక చేశారు. 12 నియోజకవర్గాల్లో 16 గ్రామాలను ఎంపిక చేసి మొదటా 122 మంది లబ్ధిదారులను గుర్తించి ఆగస్టు 15న 307.57 ఎకరాల భూపంపిణీ పత్రాలు అందించారు. అనంతరం మరో 94 మంది లబ్ధిదారులను గుర్తించారు. మొత్తంగా ఇప్పటివరకు 216 మందికి 558 ఎకరాల 29 గుంటలు పంచారు. ఇందులో ప్రభుత్వ భూములు 119 ఎకరాలు కాగా 53 మందికి, 129 ఎకరాల ప్రైవేట్ భూమిని 163 మందికి పంపిణీ చేశారు. రిజిస్ట్రేషన్ చేసింది కొంతే... భూపంపిణీ కింద జిల్లాకు రూ.24 కోట్లు విడుదల కాగా, భూముల కొనుగోలుకు రూ.12.75 కోట్లు వెచ్చించారు. ఈ మొత్తం ఆర్డీవో ఖాతాల్లో చేరాయి. ఆర్భాటంగా పత్రాలిచ్చిన్పటికీ పలు చోట్ల ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించిన భూమికి డబ్బులు ఇవ్వకపోగా... లబ్ధిదారులకు ఇంకా భూములు అప్పగించలేదు. హద్దులు నిర్ణయించలేదు. ఫలితంగా సాగుభూమి బీడుగా ఉంటోంది. మొత్తంగా జిల్లాలో 248 ఎకరాల భూమి 111 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అంటే పంపిణీ చేసిన వారిలోనే ఇంకా 52 మందికి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. జిల్లాలో మార్చి నెలాఖరులోగా ఆరు వేల ఎకరాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా పరిస్థితులు ఇలాగే ఉంటే కార్యరూపం దాల్చడం అనుమానమే. స్వయం ఉపాధిదీ అదే తీరు గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా గత జనవరిలో పెద్ద ఎత్తున స్వయం ఉపాధి రుణాల కోసం స్వీకరించిన దరఖాస్తులకు ఏడాది గడిచినా మోక్షం లేదు. అప్పటి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకమైన జిల్లా వాసి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ రెండు సార్లు అధికారులతో సమావేశమై రుణాలకు బ్యాంకు అనుమతి పత్రాలు కొర్రీలు పెట్టకుండా ఇవ్వాలని ఆదేశించారు. అంతలోనే గవర్నర్ పాలన వచ్చి... వరుస ఎన్నికలతో రుణాల ప్రక్రియ నిలిచిపోయింది. బ్యాంకు అనుమతి పత్రాలు పొందిన నిరుద్యోగులు రుణాల కోసం ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2380 యూనిట్లకు రూ.32.16 కోట్లు మంజూరు చేసింది. 3225 దరఖాస్తులు రాగా 2682 మందికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకారం తెలిపాయి. లక్ష్యానికి మించి 299 మందికి కూడా రుణాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు అధికారులు ప్రకటించినా... ఇప్పటివరకు 35 శాతం యూనిట్లు కూడా గ్రౌండింగ్ కాలేదు. తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.15.6 కోట్లతో 1514 యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో రూ. 8.78 కోట్లు సబ్సిడీ ఉండా రూ.6.29 కోట్లు బ్యాంకులు రుణంగా ఇవ్వాల్సి ఉంది. ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.310 కోట్లతో 316 మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. 352 దరఖాస్తులు రాగా 45 శాతం గ్రౌండింగ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. బ్యాంకులదీ అదేబాట నిరుద్యోగులకు రుణాల మంజూరుకు అనుమతి పత్రాలు ఇవ్వడంలో బ్యాంకులు పాత బాటనే పయనిస్తున్నాయి. స్వయం ఉపాధి కింద ఇచ్చిన రుణాలు తిరిగి చెల్లించడం లేదని, బకాయిలు పేరుకుపోయాయని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. రుణాల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన విధానాలు రూపొందిస్తే రుణాలిచ్చేందుకు సిద్ధమేనని చెబుతున్నారు. ఓవైపు జిల్లా యంత్రాంగం జనవరి 26న యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని నిర్ణయించగా... లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలి. నేడు జిల్లాకు చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలపై అధికారులతో ఆయన సమీక్షించనున్నారు. పథకాల వేగవంతంపై దళితులంతా ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారు.