delhi university graduate
-
ఆ వేస్టుగాడిని పట్టిస్తే పాతిక వేలు
సాక్షి, న్యూఢిల్లీ : బస్సులో వెళుతున్నప్పుడు ఓ అమ్మాయిపక్కన కూర్చొని అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పట్టించిన వారికి రూ.25,000 బహుబతిగా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కనీసం ఎవరు సమాచారం అందించినా వారికి రూ.25వేలు ఇస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలోని డీటీసీ బస్సులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని ఒకరు ప్రయాణిస్తున్నప్పుడు తన పక్కన కూర్చున్న వ్యక్తి అసభ్య చేష్టలకు దిగాడు. ఆమెను తడిమేందుకు కూడా ప్రయత్నించాడు. ఫిబ్రవరి 7న చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఆమె వీడియోను కూడా రికార్డు చేసింది. ఆ సమయంలో బస్సులో ఏ ఒక్కరూ అతడిని పట్టించుకోలేదు. ఆమెకు సహాయం కూడా చేసేందుకు కూడా ముందుకు రాలేదు. దీంతో ఈ విషయంపై గత సోమవారం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి వసంత విహార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు అతడికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
రెండు వారాల్లో చోరీలు గ్యారంటీ!
‘రెండు వారాల్లో ఇంగ్లిష్ గ్యారంటీ’ అంటూ ఢిల్లీలోని ఆ కోచింగ్ సెంటర్ కూడా ప్రకటనలు ఇస్తుంది. కానీ అందులో చేరేవారు రాంగ్ రూట్లోకి మళ్లినట్లే! అక్కడ ఇంగ్లిష్ మాత్రమే కాదు.. చోరీలూ నేర్పిస్తారు! ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ రాజీవ్ సహానీయే ఆ కోచింగ్ సెంటర్ యజమాని. వివరాల్లోకెళితే.. యూపీలోని గోరఖ్‌పూర్‌కు చెందిన రాజీవ్ నిరుద్యోగి. ఇంగ్లిష్ కోచింగ్ ముసుగులో.. ఏటీఎం చోరీలకు పెద్ద ప్లాన్ వేశాడు. చురుకైన విద్యార్థులను ఎంచుకుని వారిని ప్రలోభపెట్టి చోరీలవైపు మళ్లించడం మొదలుపెట్టాడు. తొలుత థియరీ క్లాస్‌లు బోధించి, తర్వాత ఏటీఎం కేంద్రాలకు తీసుకెళ్లి మరీ ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చేవాడు. మహిళలు, వృద్ధులకు సహాయం చేస్తున్నట్లు నటించి.. వారు పిన్ ఎంటర్ చేయగానే ఓ మైక్రోచిప్‌ను లేదా పిన్నును కీప్యాడ్లోపలికి చొప్పిస్తే స్క్రీన్ బ్లాంక్ అయిపోతుంది. దీంతో యంత్రం పనిచేయడం లేదు. వేరే చోటికి వెళ్లండని చెప్పి.. వారు వెళ్లిపోగానే మైక్రోచిప్‌ను తీసేసి డబ్బులు డ్రా చేసుకుంటారు. ఇదీ ప్లాన్. ఈ పద్ధతిలోనే చోరీలు చే యిస్తూ.. టీమ్ సభ్యులకు కొన్నాళ్లు నెలజీతం ఇచ్చాడు. చోరీలు పెరగడంతో వారికి వాటాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు చిల్లిగవ్వ లేకుండా రోడ్లపై తిరిగిన రాజీవ్ కొద్దిరోజులకే హోండా సిటీ కారులో తిరిగేంతగా ఎదిగాడు. ఇంటికి వేలకు వేలు పంపేవాడు. కానీ.. ఎక్కడైతే ప్లాన్ వేసుకున్నాడో.. ఇప్పుడు అక్కడికే చేరాడు. 2011లో దొంగతనం కేసులో కొన్నాళ్లు జైలులో ఉన్నప్పుడు తోటి ఖైదీ ద్వారా ఏటీఎం చోరీల గురించి తెలుసుకున్నాడు. తాజాగా ఎంత పక్కాగా పనికానిచ్చినా.. పోలీసులకు దొరికిపోవడంతో మరోసారి కటకటాల వెనక్కి చేరాడు. -
రెండు వారాల్లో ఇంగ్లీష్ గ్యారంటీ అంటూ...
న్యూ ఢిల్లీ: 'రెండు వారాల్లో ఇంగ్లీష్ గ్యారంటీ' అంటూ కోచింగ్ ఇచ్చే సెంటర్లను చూశాం. అయితే... ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో మాత్రం చోరీలు ఎలా చేయాలో నేర్పిస్తుంది. అది కూడా జస్ట్ రెండు వారాల్లోపేనట. కాగా ఆ కోచింగ్ సెంటర్ ఇంగ్లీష్ నేర్పిస్తామని... ప్రకటనలు ఇస్తుంది. అయితే అందులో చేరేవారు రాంగ్ రూట్లోకి మళ్లినట్లే! అక్కడ ఇంగ్లిష్ మాత్రమే కాదు.. చోరీలూ నేర్పిస్తారు! ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే దొంగలకు కూడా కోచింగ్ సెంటర్ లు ఉండటం చూశాం. కానీ, ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ రాజీవ్ సహానీ అలాంటి ఓ కోచింగ్ సెంటర్ ని నిజంగానే ప్రారంభించాడు. వివరాల్లోకెళితే.. యూపీలోని ఖరగ్‌పూర్‌కు చెందిన రాజీవ్ నిరుద్యోగి. ఇంగ్లిష్ కోచింగ్ ముసుగులో.. ఏటీఎం చోరీలకు పెద్ద ప్లాన్ వేశాడు. చురుకైన విద్యార్థులను ఎంచుకుని వారిని ప్రలోభపెట్టి చోరీలవైపు మళ్లించడం మొదలుపెట్టాడు. తొలుత థియరీ క్లాస్‌లు బోధించి, తర్వాత ఏటీఎం కేంద్రాలకు తీసుకెళ్లి మరీ ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చేవాడు. మహిళలు, వద్ధులకు సహాయం చేస్తున్నట్లు నటించి.. వారు పిన్ ఎంటర్ చేయగానే ఓ మైక్రోచిప్‌ను లేదా పిన్నును కీప్యాడ్లోపలికి చొప్పిస్తే స్క్రీన్ బ్లాంక్ అయిపోతుంది. దీంతో యంత్రం పనిచేయడం లేదు. వేరే చోటికి వెళ్లండని చెప్పి.. వారు వెళ్లిపోగానే మైక్రోచిప్‌ను తీసేసి డబ్బులు డ్రా చేసుకుంటారు. ఇదీ ప్లాన్. ఈ పద్ధతిలోనే చోరీలు చేయిస్తూ.. టీమ్ సభ్యులకు కొన్నాళ్లు నెల జీతం ఇచ్చాడు. చోరీలు పెరగడంతో వారికి వాటాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు చిల్లిగవ్వ లేకుండా రోడ్లపై తిరిగిన రాజీవ్ కొద్దిరోజులకే హోండా సిటీ కారులో తిరిగేంతగా ఎదిగాడు. ఇంటికి వేలకు వేలు పంపేవాడు. కానీ.. ఎక్కడైతే ప్లాన్ వేసుకున్నాడో.. ఇప్పుడు అక్కడికే చేరాడు. 2011లో దొంగతనం కేసులో కొన్నాళ్లు జైలులో ఉన్నప్పుడు తోటి ఖైదీ ద్వారా ఏటీఎం చోరీల గురించి తెలుసుకున్నాడు. తాజాగా ఎంత పక్కాగా పనికానిచ్చినా.. పోలీసులకు దొరికిపోవడంతో మరోసారి కటకటాల వెనక్కి చేరాడు.